For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఎసిడిటి సమస్యా?ఈ ఆహారాలకు దూరంగా ఉండండి

|

మీరు ఎప్పుడైన తీవ్రమైన ఛాతీ నొప్పి, లేదా హార్ట్ బర్న్ వంటి ఆరోగ్య సమస్యలను ఎదుర్కొన్నారా? ఇటువంటి సమస్యలను అకశ్మికంగా ఎదుర్కొని బాధకు లోనైనారా? అయితే మీకు ఖచ్చితంగా ఎసిడిటి ఉన్నట్లే.

ఈ హార్ట్ బర్న్ అనేది పొట్టలో విడుదల అయ్యే ఓయిసోపాగస్ అనే యాసిడ్ వల్ల ఈ ఎసిడిటి సమస్య ఎదుర్కోవల్సి వస్తుంది. అయితే ఈ సమస్య ఎప్పుడూ ఉంటుందనుకోకూడదు. ఈ సమస్యను గుర్తించిన వెంటనే, మీరు తీసుకొనే ఆహారంలో మార్పలు చేసుకొని, వ్యత్యాసంను కూడా గుర్తించవచ్చు.

ఎసిడిటి-కడుపుమంటను తగ్గించే 14 సులువైన మార్గాలు: క్లిక్ చేయండి

ఎసిడిటికి కారణం అయ్యే అనేక ఆహరాలు, ఎసిడిటికి కారణం అయ్యే యాసిడ్ రిఫ్లెక్షన్ ను విడుదల చేసే ఆహారాలు అనేకం ఉన్నాయి. మీలో జీర్ణక్రియ ఆరోగ్యంగా ఉండాలంటే ఇటువంటి ఆహారాలను నివారించడం చాలా అవసరం ఉంది. వీటితో పాటు, తగినంత శ్రద్ద మరియు ఆరోగ్యం గురించి తగిన జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం. అలాగే మీరు ఎంత ఆహారం తీసుకుంటారు, మరియు ఏ సమయంలో తీసుకుంటారు అనేదాని మీద కూడా ఆధారపడి ఉంటుంది.

పొట్ట ఉబ్బరం..గ్యాస్..ఎసిడిటిని తగ్గించే ఆహారాలు: క్లిక్ చేయండి

ఎసిడికి కారణం అయ్యే ఆహారాల గురించి అడిగితో ఒక్కోక్కరి దగ్గర నుండి ఒక్కోవిధంగా సమాధానం వస్తుంది. ఎందుకంటే వ్యక్తిగత అనుభవం మీద ఒక్కోక్కరు ఒక్కో కారణం చెబుతారు. కాబట్టి, ఒక డైరీ మెయింటైన్ చేస్తూ, మీలో ఎసిడిటికి కారణం అయ్యే ఆహారాలను లిస్ట్ రాసుకోవడం చాలా అవసరం. అటువంటి ఆహారాలను కొన్నింటిని ఇక్కడ లిస్ట్ చేయబడింది. ఎసిడిటితో బాధపడే వారు, లేదా ఎసిడిటి సమస్య రాకుండా ఉండాలంటే, ముందు జాగ్రత్తగా ఈ ఆహారాలకు దూరంగా ఉండాలి...

సిట్రస్ ఫ్రూట్స్:

సిట్రస్ ఫ్రూట్స్:

కొన్ని పరిశోధనల ప్రకారం సిట్రస్ పండ్లు ఎసిడిటికి కారణం అవుతుంది. సిట్రస్ యాసిడ్ కలిగిన నిమ్మ, ఆరెంజ్ వంటివి ఎక్కువ అసిడిక్ కలిగి ఉండి, ఎసిడిటికి కారణం అవుతాయి. ముఖ్యంగా ఈ సిట్రస్ పండ్లను తీసుకొన్నప్పుడు, మరియు కాలీ కపుడుతో ఈ జ్యూస్ లను తీసుకొన్నప్పుడు ఎసిడిటకి ప్రధానకారణం అవుతుంది.

టమోటో:

టమోటో:

మీరు టమోటో ప్రియులైతే, ఇక్కడ మీకు ఒక చెడు వార్తే. ఎసిడిటికి కారణం అయ్యే ఆహారాల్లో టమోటో కూడా ఒక ముఖ్యమైన ఆహారమే. మీరు ఇప్పటికే ఎసిడిటితో బాధపడుతున్నట్లైతే మీ రెగ్యులర్ డైట్ నుండి టమోటోలను నివారించండి.

స్పైసీ ఫుడ్స్:

స్పైసీ ఫుడ్స్:

ఎసిడిటికి మరో ప్రధాన కారణం కారంగా ఉండే ఆహారాలు. మెక్సికన్ ఫుడ్స్, చిల్లీస్, మరియు ఇతర పెప్పర్ ఫుడ్స్ ఎసిడిక్ రిఫ్లెక్షన్ కు దారితీస్తుంది. ఒక వేళ మీరు ఈ ఆహారాలను నివారించడం కష్టంగా భావిస్తుంటే, వీటి మోతాదును తీసుకోవడం తగ్గించండి.

బంగాళదుంప:

బంగాళదుంప:

యాసిడ్ రిఫ్లెక్షన్ కు మరో ప్రధాన ఆహారం బంగాళదుంప. కాబట్టి, మీరు తీసుకొనే ఆహారాల్లో బంగాళదుంపను మితంగా వినియోగించండి. ఎసిడిటితో ఇప్పటికే బాధపడుతున్నట్లైతే, పూర్తిగా నివారించండి.

ఆల్కహాల్:

ఆల్కహాల్:

మీలో ఎసిడిటికి సమస్యలకు మరో ప్రధాన కారణం ఆల్కహాల్. ఎసిడిటితో బాధపడే వారు ఆల్కహాల్ తీసుకోవడం నివారించి, వాటి స్థానంలో ఇతర హెల్తీ డ్రింక్స్ ను చేర్చుకోండి.

కెఫిన్:

కెఫిన్:

మీరు కనుక కాఫీ లవర్ అయితే, ఇది మీకు ఒక చెడు వార్తే. కానీ ఇది నిజం!కెఫిన్ సంబంధిత ఆహారాలు ఏవైనా సరే ఎసిడిటికి ప్రధాన కారణం అవుతాయి. ఎసిడిటి సమస్యలున్నప్పుడు మీ కెఫిన్ సంబంధిత ఆహారాలకు పూర్తిగా దూరంగా ఉండాలి.

చాక్లెట్:

చాక్లెట్:

చాక్లెట్ లో కూడా కొంత మొత్తంలో కెఫిన్ చేర్చబడి ఉంటుంది. ఇది ఎసిడిటికి కారణం అవుతుంది. కాబట్టి, చాక్లెట్స్ నివారించి ఎసిడిటికి దూరంగా ఉండాలి.

పప్పులు:

పప్పులు:

పప్పు ధాన్యాలు రెగ్యులర్ గా తీసుకొనే వారు ఎసిడిటికి దూరంగా ఉండలేరు . ఖచ్చితంగా ఎసిడిటితో ఏదో ఒక సమయంలో ఎసిడిటికి గురి అవుతారు. మీరు ఎంత తీసుకుంటారన్నది కాకుండ, ఎప్పుడు తీసుకుంటారన్నదాని మీద కూడా ఆధారపడి ఉంటుంది.

హై ఫ్యాట్ డైరీ ప్రొడక్ట్స్:

హై ఫ్యాట్ డైరీ ప్రొడక్ట్స్:

అత్యధిక ఫ్యాట్ కలిగిన డైరీ ప్రొడక్ట్స్ ఇవి రిఫ్లెక్షన్ కు దారితీస్తుంది. డైరీ ప్రొడక్ట్స్ ఎంపిక చేసుకొనేటప్పుడు అదనపు జాగ్రత్తలు తీసుకోవాలి. ఎల్లప్పుడూ లోఫ్యాట్ డైరీ ప్రొడక్ట్ఎంపిక చేసుకోవాలి.

English summary

Avoid These Foods That Cause Acidity

Have you ever experienced that annoying heartburn, which may even make you even worried that you're having a heart attack? Then, probably you have acidity! The heartburn that you experience is due to the splashing of stomach acid to the oesophagus, especially if you have a weak lower esophageal sphincter muscle.
Desktop Bottom Promotion