For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

చిన్న వయస్సు మహిళలు చేయించుకోవలసిన ప్రాథమిక పరీక్షలు

By Super
|

ఈ రోజుల్లో 35 ప్లస్ మహిళలు జీవనశైలి వ్యాధులతో మినహాయింపు లేకుండా ప్రమాణం కంటే ఎక్కువగా ప్రభావితం అవుతున్నారు.

అయినప్పటికీ చాలా చిన్న వయస్సులోనే ఈ వ్యాదుల బారిన పడుతున్నారు. ప్రారంభ గుర్తింపు,రోగ నిర్ధారణ మరియు చికిత్స వారి ప్రారంభం పోరాటంలో చాలా కీలకమైనది.

ఇక్కడ కొన్ని ప్రాథమిక పరీక్షలు ఉన్నాయి. వీటిని ప్రతి మహిళ 18 సంవత్సరాలు మరియు తరువాతి కాలంలో తప్పనిసరిగా చేయించుకోవాలి.

విటమిన్ డి

విటమిన్ డి

కీళ్ళ సర్జన్ డాక్టర్ తేజాస్ ఉపసిని చెప్పిన ప్రకారం ఎముక నొప్పి,వెన్నునొప్పి మరియు కాలి నొప్పి వంటి లక్షణాలు కనిపించినప్పుడు విటమిన్ డి పరీక్ష చేయించుకోవాలి.

ఎందుకు:ఇది చిన్న వయస్సులో ఉన్న మహిళలకు ఒక ముఖ్యమైన పరీక్ష. విటమిన్ D లోపం అనేది చిన్న వయస్సులో ఉన్న మహిళలలో 80-90% శాతం ఉన్నది. అయితే అన్ని వయస్సుల వారు ఈ పరీక్షకు ప్రాధాన్యత ఇవ్వాలి. ఈ వ్యాధి వృద్ధ మహిళలలో ప్రభావితం చేసే విధానం భిన్నంగా ఉంటుంది.

ఎలా: రక్తం పరీక్ష

విటమిన్ బి 12

విటమిన్ బి 12

చేతులు మరియు కాళ్ళు తిమ్మిరి లేదా ఒక జలదరింపు అనుభూతి,బలహీనత,సమతుల్యత మరియు రక్తహీనత వంటి లక్షణాలు కనిపించినప్పుడు విటమిన్ బి 12 పరీక్ష చేయించుకోవాలి.

ఎందుకు: ఇది సాధారణంగా శాఖాహారులలో కనిపించే ఒక లోపంగా చెప్పవచ్చు. ఈ పరీక్ష వలన మీ రక్తంలో విటమిన్ ఎంత మొత్తంలో ఉందో తెలుస్తుంది.

ఎలా: రక్తం పరీక్ష చేయటానికి 10-12 గంటల ముందు ఏమీ తినకూడదు.

రొమ్ము పరీక్ష

రొమ్ము పరీక్ష

రొమ్ముల మీద గడ్డలూ మరియు అసమానతల ఉండటం అనేది మొదటి లక్షణం. ఒకసారి స్వీయ పరీక్ష చేస్తే గడ్డల గురించి తెలుస్తుంది. మహిళలు మమోగ్రామ్ పరీక్షను తప్పనిసరిగా చేయించుకోవాలి.

ఎందుకు:దీనిని తరచుగా తక్కువ వయస్సు ఉన్న మహిళలు నిర్లక్ష్యం చేస్తున్న ఒక ముఖ్యమైన పరీక్ష. 25 సంవత్సరాలు ఉన్న మహిళలు తప్పనిసరిగా ఈ పరీక్ష చేయించుకోవాలి.

ఎలా: ఈ పరీక్ష స్వయంగా నిర్వహించబడుతుంది. రొమ్ము మీద గడ్డలూ,వాపు,పెరుగుదలను తనిఖీ చేయాలి.

షుగర్

షుగర్

ఈ వ్యాధికి నిరంతరం ఎక్కువ ఆకలి అనుభూతి, తరచుగా ఆకలి పెరిగిపోవటం,తీవ్రమైన అలసట,మైకము, అస్పష్టమైన దృష్టి,వికారం మూత్రవిసర్జన అవసరం వంటి ఇండికేటర్లు ఉన్నాయి.

ఎందుకు: చిన్న వయస్సు మహిళలు బరువు మరియు ఊబకాయం కోల్పోవడం కొరకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పుడు కూడా పెరుగుతుంది. ఈ రెండు కారణాల వలన 20 సంవత్సరాల పైన మహిళలు రెగ్యులర్ చక్కెర పరీక్షలు చేయించుకోవాలి. కొన్నిసార్లు తక్కువగా కూడా ఉండవచ్చు.

ఎలా: ఒక సాధారణ వేలు నుంచి ఒక చుక్క రక్త నమూనా అవసరం. దీని ఫలితంను నిమిషంలోనే తెలుసుకోవచ్చు.

థైరాయిడ్

థైరాయిడ్

బరువు పెరుగుట,బద్ధకం,సక్రమంగా లేని పీరియడ్స్,మెడ వాపు వంటి లక్షణాలు ఉంటాయి.

ఎందుకు: హైపర్ థైరాయిడ్ లేదా హైపో థైరాయిడిజం కోసం తనిఖీ చేయాలి. నగరంలో ఈ రెండు చాలా ప్రబలంగా విస్తరించి ఉన్నాయి. 18 సంవత్సరాల వయస్సు గల అమ్మాయిలలో ఆయాసం ఉంటే వైద్యులు నిర్ధారణ చేస్తారు.

ఎలా: రక్తం పరీక్ష.

పాప్ స్మెర్

పాప్ స్మెర్

ఏ విధమైన లక్షణాలు బయటకు కనపడవు. ఈ పరీక్షను 25 సంవత్సరాలకు పైబడిన ప్రతి మహిళ చేయించుకోవాలని నిపుణులు అంటున్నారు. 65 సంవత్సరాలు పైబడిన మహిళలు గత 10 సంవత్సరాలు సాధారణ పరీక్షలు మరియు గర్భాశయం లేనివారికి(సాధారణంగా గర్భాశయం తొలగింపు శస్త్రచికిత్స జరిగితే) ఈ పరీక్షలను విడిచిపెట్టవచ్చు.

ఎందుకు: ఇది స్త్రీ జననేంద్రియ వ్యవస్థలో క్యాన్సర్ ప్రక్రియలను వెతుకటానికి ఒక నివారణ పరీక్ష.

ఎలా: ఈ సరళమైన ప్రక్రియ ఒక నర్సు గర్భాశయద్వారం నుండి కణాలను సేకరించి ప్రయోగశాలలో విశ్లేషిస్తారు.

English summary

Basic tests young women should take

Lifestyle diseases are more the norm than the exception these days. And they no longer affect 35-plus women.
Story first published: Sunday, March 30, 2014, 14:08 [IST]
Desktop Bottom Promotion