For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

నిద్రలో పల్లు కొరుకుట: నిద్రలో మీరు పళ్ళను కొరుకుతున్నారా?

By Super
|

పళ్ళు కొరకడం అనేది గురక వంటిది. ఇది మీరు నిద్రలో ఉన్నప్పుడు జరుగుతుంది. అందువలన మీకు దాని గురించి ఏమి తెలియదు. కానీ మీ భాగస్వామి యొక్క నిద్రకు ఆటంకం కలుగుతుంది. మీ భాగస్వామి ఈ విషయం గురించి ముందుగా మీకు చెప్పుతారు.

నిద్రలో పల్లు కొరుకుట అనేది స్వంతముగా ఆగుతుందని అనుకోవటం తప్పు. ఇది గురక మాదిరిగా,మీరు దీనిని అధిగమించడానికి సహాయం అవసరం.పళ్ళు కొరుకుట అనేది ప్రధాన దంత సమస్యలకు ఒక ఉత్ప్రేరకంగా ఉంటుంది. పళ్ళు కొరుకుట వలన దంతాలు గట్టిగా బిగించడం వలన మీ ముత్యాలాంటి పళ్ళు విచ్చిన్నం అవటాన్ని పరిశీలించండి.

పిల్లలు నిద్రలో పల్లు కొరుకుట

సాదారణంగా పిల్లలు రెండు సార్లు పళ్ళు కోరుకుతారు. వారు చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు మరియు దంతాలు వచ్చే సమయంలోను పళ్ళు కోరుకుతారు. తలనొప్పి,బాధాకరమైన దవడలు మరియు అలసిపోయిన దంతాల దాడుల మినహాయించి ఇది పిల్లల మీద శాశ్వత ప్రభావం ఉండదు.

కొంత మంది పిల్లలు వారు పెరిగి మరియు వారి శాశ్వత దంతాల అభివృద్ధి చెందినా కూడా పళ్ళు కోరికే అలవాటు ఉండవచ్చు. దీని వలన ఎగువ మరియు దిగువ దవడకు సక్రమంగా పళ్ళు విచ్చుకోవని నమ్మకం ఉంది. అంతేకాకుండా అలెర్జీలు, ఎండోక్రైన్ వ్యాధులు మరియు ఒత్తిడి వంటి వ్యాధులకు కారణం అవుతుంది.

Bruxism: Do you grind your teeth when asleep?

నిద్రలో పల్లు కొరుకుట సంకేతాలు

పళ్ళు కొరుకుట,గాయపరచుకోవడం,అసహ్యకరముగా లేదా దంతాలు గట్టిగా బిగించడం వలన వచ్చే శబ్దాలు వంటివి అన్ని ప్రముఖ సంకేతాలు అని చెప్పవచ్చు. మీరు మీ పళ్ళను కొరుకుట వలన మరుసటి రోజు ఉదయం తలనొప్పి మరియు గొంతు దవడ నొప్పి అనుభవించడానికి ఖచ్చితంగా సిద్దంగా ఉండాలి.

నిద్రలో పల్లు కొరుకుట వెనుక కారణాలు

నిద్రలో పల్లు కొరుకుటను వైద్యపరంగా బ్రక్సిజం అని పిలుస్తారు. అలాగే దీనికి గల కారణాలు చర్చనీయాంశంగా ఉంటాయి. ప్రదానంగా ఒత్తిడి ఉంటుంది. అలాగే వంకర పళ్ళు లేదా ఒక మిస్సింగ్ పన్ను వంటివి కూడా కారణంగా ఉంటాయి.

పరిష్కారాలు

దంత వైద్యుడు మీకు ఒక పళ్ళ గార్డ్ ను ఉపయోగిస్తారు. తీవ్రమైన సందర్భాలలో,మీరు రూట్ కెనాల్, క్రౌన్,బ్రిడ్జి,ఇంప్లాంట్స్ లేదా పూర్తి కట్టుడు పళ్ళు అవసరం. మీ భాగస్వామి నుండి మీకు పళ్ళు కోరుకుతున్నారని పిర్యాదు ఉంటే,అప్పుడు మీరు మొదట దంతవైద్యుడు ని సంప్రదించాలి.

నివారణ

మీరు ముందుగా ఒత్తిడిని నివారించేందుకు వ్యాయామం లేదా ధ్యానంను ప్రయత్నించండి. మీ జీవనశైలిలో మార్పు చేసుకోవాలి. బబుల్ గమ్ వంటివి నమలటం ఆపివేయాలి. అనారోగ్య నోటి అలవాటును ఆపడానికి ఒక ఉద్దేశపూర్వకమైన ప్రయత్నం చేయండి.

English summary

Bruxism: Do you grind your teeth when asleep?

Teeth grinding or bruxism is like snoring, it occurs while you are asleep; for the most part, you are unaware about it, but your partner's sleep is disturbed and your partner is the first one to tell you.
Story first published: Saturday, May 24, 2014, 17:26 [IST]
Desktop Bottom Promotion