For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

నేచురల్ గా గ్యాస్ట్రిక్ ను క్యూర్ చేయడం ఎలా..!

By Derangula Mallikarjuna
|

గ్యాస్టిక్ సమస్య. ప్రస్తుత రోజుల్లో ఎదుర్కొంటున్న ఒక సాధారణ సమస్య. కొన్ని బహిర్గత మరియు అంతర్గత కారణాల వల్ల ఈ గ్యాస్ట్రిక్ సమస్య ఏర్పడుతుంది. గ్యాస్ట్రిక్ శ్లేష్మం యొక్క అంతర్గత లైనింగ్ ఉదరంలో ఆమ్ల అనియంత్రిత స్రావం పెరిగి గ్యాస్ట్రిక్ కు దారితీస్తుంది , కొన్ని బాహ్య లేదా అంతర్గత అంశం ఆటంకం ఉన్నప్పుడు కడుపు యొక్క సమస్యలు ఎదురవుతాయి . హైడ్రోక్లోరిక్ ఆమ్లం గ్యాస్ట్రిక్ శ్లేష్మం ఉత్పత్తి చేస్తుంది. దాంతో మానవ శరీరంలో విషతుల్య ప్రభావాలు ఏర్పడుతాయి. ఈ సమస్యను నివారించుకోవడానిక తప్పనిసరిగా చికిత్సను తీసుకోవాలి.

గ్యాస్ట్రిక్ సమస్య నివారణ:
గ్యాస్ట్రిక్ సమస్యను నివారించుకోవడానికి కొన్ని అలవాట్లు మార్చుకోవడం వల్ల, ఆహార షెడ్యూల్లో సరిగా నియంత్రణ కలిగి ఉండటం వల్ల , నెమ్మదిగా తినడం, మరియు బాగా నమిలి తినడం, ఒకే సారి ఎక్కువగా తినడకుండా అప్పుడప్పుడు కొద్దికొద్దిగా తినడం, ఎక్కువగా నీరు త్రాగడం మరియు డైటరీ ఫుడ్స్ ఎక్కువగా తీసుకోవడం వల్ల సమస్యను సాధ్యమైనంత వరకూ తగ్గించుకోవచ్చు . తక్షణ ఉపశమనం కోసం మరియు త్వరగా కోలుకోవడం కోసం కారం కలిగిన ఆహారాలకు దూరంగా ఉండటం స్ట్రాంగ్ గా ఉన్న టీలను తగ్గించడం, మాంసాహరం, కేక్స్, ఆల్కహాల్, పుల్లని పదార్థాలుకు దూరంగా ఉండటం మంచిది.

Cure Gastric Problem Naturally

ఎసిడిటి-కడుపుమంటను తగ్గించే 14 సులువైన మార్గాలు:క్లిక్ చేయండి

గ్యాస్ట్రిక్ సమస్యలకు ప్రధాన కారణం:
ఈ సమస్యకు వివిధ రకాలా కారణాలున్నాయి. ఇది అతి సాధారణ భౌతిక లేదా మానసిక ఒత్తిడితో కలిగి ఉంటుంది. ఒత్తిడి వల్ల గ్యాస్ట్రిక్ శ్లేష్మం యొక్క వ్రణోత్పత్తికి దారితీస్తుంది. ఇది ఎసిడిక్ ఆహారాలు తినడం, మందులు, ధూమపానం మరియు మద్యపానం తీసుకోవడం వల్ల గ్యాస్ట్రిక్ లైనింగ్ దీర్ఘకాల నొప్పికి దారి తీస్తుంది. గ్యాస్ట్రిక్ సమస్య వల్ల తరుచుగా గుండెల్లో ఆమ్లత్వం, అజీర్తి, కడుపు ఉబ్బరం, కలుగుతుంది. ట్యూమర్స్, మూత్రపిండాల్లో రాళ్ళు, మలబద్ధకం, ఆహారం కలుషితం, బాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అల్సర్ మరియు ప్రాంక్రియాటైటిస్ మరియు పూతలు గుండెల్లో ఆమ్లత్వాన్ని పెంచి గ్యాస్టిక్ సమస్యలకు దారితీస్తుంది.

నిమ్మకాయ ఉపయోగం:
ఒక కప్పు నీటిలో , నిమ్మరసం పిండి, అందులో అరచెంచా బేకింగ్ సోడా మిక్స్ చేయాలి. బేకింగ్ సోడా నీటిలో బాగా కరిగిపోయి, నీటితో బాగా మిళితం అయ్యేంత వరకూ మిక్స్ చేయాలి . ఇది గ్యాస్ట్రిక్ సమస్య నుండి తక్షణ ఉపశమనం కలిగిస్తుంది . దీన్ని ఉదయం పరగడుపుతో తీసుకొని, తక్షణం గ్యాస్ట్రిక్ నొప్పి నుండి ఉపశమనం పొందవచ్చు.

సాధారణ పద్దతులతోనే గ్యాస్టిక్ అల్సర్ మాయం...!

హెర్బల్ టీ:
హెర్బల్ టీ మిశ్రమం చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. ఇది చాలా వేగవతంగా మరియు జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. దీన్ని చాలా సాధారణంగా చమోమిలే, మేడిపండు, బ్లాక్ బెర్రీ మరియు పుదీనాతో తయారుచేస్తారు.

Desktop Bottom Promotion