For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

గుడ్డు పచ్చసొనలోకూడా ఆరోగ్యప్రయోజనాలు ఎక్కువే

|

గుడ్డులో ఉన్న ఆరోగ్య ప్రయోజనాలు కొంతమంది తమను తమూ ఎగ్ టేరియన్స్ గా చెప్పకుంటుంటారు. అందుకు కారణం వారు మాంసాహారం తీసుకోకపోయినా గుడ్డులో అధిక పోషకాలు ఉన్నందు వల్ల, గుడ్డును తినడానికి ఎక్కువగా ఇష్టపడటం వల్ల ఎగేటేరియన్లుగా ఫిక్స్ అయిపోతారు. అంతే కాకుండా గుడ్డును మాసాంహరం అంటారు. కానీ చాలా మంది శాకాహారంగా నే భావిస్తున్నారు కాబట్టే శాకాహారులు కూడా గుడ్డును తినడం మొదలు పెట్టేసారు. గుడ్డులో చెప్పుకోలేనన్ని ఆరోగ్యప్రయోజనాలు మొండుగా ఉన్నాయి. గుడ్డు మంచి పౌష్టికాహారం. చిన్నపిల్లలు మొదలుకొని, ముసలివారి వరకు డాక్టర్లు గుడ్డు తినమని చెబుతారు. కోడిగుడ్డు ఎదిగే పిల్లలకు చాలినన్ని ప్రొటీన్లను అందజేస్తుంది. పోష కాహారలేమితో బాధపడేవారిని రోజుకో గుడ్డు తినాల్సిందిగా వైద్యులు సలహాలిస్తుంటారు. గుడ్డులో పలురకాల లవణాలు, అరుదైన లవణాలతో పాటు ఫాస్పరస్‌, అయోడిన్‌, సెలీనియం, ఐరన్‌, జింక్‌లు ఉన్నాయి. ఇవన్నీ శరీరానికి మేలుచేసేవే.

గుడ్డు వైట్ తో పోల్చితే గుడ్డులోని పచ్చసొన కొవ్వు కలిగి ఉన్నదని తెలిసిన విషయమే . గుడ్డులోని తెల్లని పదార్థంలో ప్రోటీన్స్, అల్బునీయం రెండు కూడా గుండె ఆరోగ్యానికి చాలా మంచిది. అయితే గుడ్డులోని పచ్చసొనలో కూడా గొప్ప ఆరోగ్యప్రయోజనాలున్నాయి. కోడిగుడ్డు, మరియు బాతుగుడ్డులోని పచ్చసొనలో పుష్కలమైన పోషకాంశాలు ఉన్నాయి. అందువల్ల, గుడ్డు పచ్చసొన ప్రమాదమైనప్పటికీ, పచ్చసొనలో ఆరోగ్యానికి మేలు చేసే కొన్ని సుగుణాలున్నాయి. గుడ్డులోని కొన్ని ప్రధానమైన ఆరోగ్యప్రయోజనాలు:

టెస్టోస్టిరాల్ లెవల్స్ పెంచుతుంది:

టెస్టోస్టిరాల్ లెవల్స్ పెంచుతుంది:

గుడ్డు పచ్చసొనలో జింక్ పుష్కలంగా ఉంటుంది. గుడ్డులో పుష్కలమైన మినిరల్స్ ఉంటాయి. ఈ మినిరల్స్ ఇతర ఆహార పదార్థాల్లో లభ్యం కావు. కాబట్టి, గుడ్డు పచ్చ సొన తినడం వల్ల పురుషుల్లో మేల్ హార్మోన్స్ పెరుగుతాయి.

రక్తం గడ్డకట్టడం తగ్గుతుంది:

రక్తం గడ్డకట్టడం తగ్గుతుంది:

చాలా రోజుల నుండి మీరు గుడ్డు అధిక కొలెస్ట్రాల్ కలిగినినదని, ఇది గుండె ఆరోగ్యానికి మంచిది కాదని మీరు వింటూనే ఉంటారు. అయితే, గుడ్డు పచ్చసొనలోని, ప్రోటీన్స్ రక్తం గడ్డకట్టడాన్ని నివారిస్తుంది.

యాంటీఇన్ఫ్లమేటరీ:

యాంటీఇన్ఫ్లమేటరీ:

ఇది అధికంగా యాంటీఇన్ఫ్లమేటరీ లక్షణాలు కలిగి ఉంది. అంటే, ఎవరైతే నొప్పులు మరియు ఇన్ఫ్లమేటరీ వ్యాధులు ఓస్టిపోరియోసి, లేదా ఆర్ధరైటిస్ వంటి లక్షణాలు కలిగి ఉంటారో వారికి, గుడ్డులోని పచ్చసొన నొప్పులను నివారిస్తుంది.

కంటి ఆరోగ్యానికి:

కంటి ఆరోగ్యానికి:

కోడి గుడ్డు తింటే దృష్టికి ఎంతో మేలు కలుగుతుంది. రోజు గుడ్డు తినేవారికి ఐ సైట్ మరియు శుక్లాలు వచ్చే అవకాశం బాగా తగ్గుతుంది. గుడ్డులో విటమిన్‌-ఎ ప్రధానమైన జీవపోషకం. ఇది గుడ్డులోని పచ్చసోనలోనే అధికం. కంటి దోషాలు లేకుండా ఉండాలంటే జింక్‌, సెలీనియం, విటమిన్‌-ఇ ఇందులో అధికంగా ఉన్నాయి.

బరువు తగ్గడానికి:

బరువు తగ్గడానికి:

బరువు తగ్గేందుకు గుడ్డు పనికొస్తుంది. అందులో ఉన్న నాణ్యమైన ప్రోటీన్ల వల్ల గుడ్డు తీసుకోగానే కడుపు నిండినట్టుగా అవుతుంది. ఎక్కువ ఆహారం తీసుకోనివ్వదు... అందువల్ల పరిమిత ఆహారం తీసుకొని బరువును నియంత్రించుకోగలుగుతారు. గుడ్డు తక్కువ క్యాలరీలు శక్తిని ఇస్తుంది సాధారణ సైజు గుడ్డు 80 క్యాలరీలు శక్తిని అందిస్తుంది కాబట్టి డైటింగ్‌లో ఉన్నవారు కూడా గుడ్డును తీసుకోవచ్చు.

విటమిన్ బి12 అధికంగా ఉంటుంది:

విటమిన్ బి12 అధికంగా ఉంటుంది:

గుడ్డు పచ్చసొనలో విటమిన్ బి12పుష్కలంగా ఉంటుంది. కండరాల పునరుత్పత్తిని పెంచుతుంది. పచ్చసొనలోని పోషకాంశాలు. కండాలు విశ్రాంతికి బాగా సహాయపడుతాయి.

ఐరన్ రిచ్ :

ఐరన్ రిచ్ :

గుడ్డులోని పచ్చసొనలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. ఇది గర్భిణీ స్త్రీలకు చాలా ఆరోగ్యకరం. అలాగే సాధరన వ్యక్తుల్లో ఎవరైతే రక్తహీనతతో బాధపడుతుంటారో అటువంటి వారికి కూడా గుడ్డు పచ్చసొన బాగా సహాయపడుతుంది.

మెదడు మీద ప్రభావం:

మెదడు మీద ప్రభావం:

గుడ్డుసొనలో 300 మైక్రోగ్రాములు కోలిన్‌ అనే పోషక పదార్థం ఉంది. ఇది మెదడు కణాల ఆరోగ్యాన్ని కాపాడుతుంది. మెదడులో సమాచార రవాణాన్ని మెరుగుపరుస్తుంది, మెదడు నుండి సంకేతాలు వేగంగా చేరవేయడంలో కూడా కోలిన్‌ ప్రాత్ర వహిస్తుసంది.

కేశ సంరక్షణకు:

కేశ సంరక్షణకు:

గుడ్డు పచ్చసొన వలన శిరోజాల ఆరోగ్యం మెరు గవుతుంది. గుడ్డులో ఉన్న సల్ఫర్‌, పలురకాల విటమిన్లు, లవణాల వల్ల శిరోజాలకు మంచి పోషణ లభిస్తుంది. మనుషుల గోళ్ళకు మంచి ఆరోగ్యాన్ని గుడ్డు అందిస్తుంది.

English summary

Do Egg Yolks Have Health Benefits?

The situation of egg yolks when related to health is like disputed property. Some medical experts hail egg yolks as healthy while others prohibit people from having yolks because they are very fattening.
Story first published: Wednesday, January 1, 2014, 15:23 [IST]
Desktop Bottom Promotion