For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఊపిరితిత్తుల క్యాన్సర్ : ప్రారంభ లక్షణాలు

By Mallikarjuna
|

ప్రపంచవ్యాప్తంగా సంభవిస్తున్న క్యాన్సర్ మరణాల్లో మూడోవంతు ఊపిరితిత్తుల క్యాన్సర్ కారణంగానే కలుగుతున్నాయి. రొమ్ము, పెద్దపేగు, ప్రోస్టేట్ క్యాన్సర్‌లు.. ఈ మొత్తాన్ని కలుపుకున్నా, వాటన్నిటికంటే ఊపిరితిత్తుల క్యాన్సర్‌తో సంభవించే మరణాలే ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ అంటే దీని తీవ్రత ఏమిటో అర్థం చేసుకోవచ్చు.

ఊపిరితిత్తుల క్యాన్సర్‌కు అనేక అంశాలు దోహదపడతాయి. మన దేశంలో 90 శాతం కేసుల్లో క్యాన్సర్ వ్యాప్తికి పొగాకు వాడకమే ప్రధాన కారణం. సాధారణ వ్యక్తితో పోలిస్తే పొగతాగేవారిలో ఈ వ్యాధి రావడానికి అవకాశాలు 2.5 రెట్లు ఎక్కువ. అయితే పొగతాగడం అలవాటు లేని ఊపిరితిత్తుల క్యాన్సర్ పేషెంట్లలో 65 శాతం మహిళలు కాగా... కేవలం 35 శాతం మంది మాత్రమే పురుషులున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంటున్న వివరాల మేరకు వాతావరణ కాలుష్యం ఊపిరితిత్తుల క్యాన్సర్‌కు ప్రధాన కారణం.

క్యాన్సర్ నివారణకు మనం తీసుకోగల జాగ్రత్తలు: క్లిక్ చేయండి

ఊపిరితిత్తుల క్యాన్సర్ కు లక్షణాలు ముందుగా గుర్తించినట్లైతే ప్రజలను రక్షించవచ్చు మరియు వారు ఆరోగ్యంగా మరియు సురక్షితంగా ఉండేలా చేయవచ్చు . వారు ధూమపానం త్రాగినా , త్రాగకపోయినా లక్షణాల తెలుసుకొన్నట్లైతే వెంటనే డయాగ్నసిస్ చేయవచ్చు . ఊపిరితిత్తలు క్యాన్సర్ చాలా వరకూ లక్షణాలు ఒకే రంగా ఉంటాయి . మరి ఊపిరితిత్తుల క్యాన్సర్ లక్షణాలు క్రింది విధంగా ఉన్నాయి..

పురుషుల్లో డార్క్ లిప్స్(పెదాల నలుపు)నివారించే టిప్స్: క్లిక్ చేయండి

దగ్గను నిర్లక్ష్యం చేయకండి

దగ్గను నిర్లక్ష్యం చేయకండి

ఎవరైన దీర్ఘకాలం పాటు దగ్గుతుంటే అదీ చలికి, వాతావరణంలో మార్పులతో మరింత తీవ్రమైతే అది లంగ్ క్యాన్సర్ లక్షణాల్లో ఒకటిగా గుర్తించాలి .

శ్వాసపీల్చుకోవడం కష్టం అవుతుంది

శ్వాసపీల్చుకోవడం కష్టం అవుతుంది

అనేక కారణాల వల్ల శ్వాసపీల్చుకోవడంలో కష్టం అవుతుంది, కానీ, ఇది తరచూ ఇబ్బంది పెడుతుంటే, అప్పుడు అది ప్రమాధ స్థితిగా గుర్తించాలి . ఇది క్యాన్సర్ కు మరో లక్షణంగా గుర్తించాలి.

ఒళ్ళు నొప్పులు

ఒళ్ళు నొప్పులు

శరీరంలో వ్యాధినిరోధక శక్తి తగ్గినప్పుడు ఒళ్ళు నొప్పులు రావడం సహాజం , కానీ తరచు పరిస్థితి ఇలా ఉంటే లంగ్ క్యాన్సర్ లక్షణాల్లో ఒకటిగా గుర్గించాలి. ముఖ్యంగా, ఛాతీ, భుజాలు, వెన్నెముక, నొప్పులు ఎక్కువగా కలిగి ఉంటి, ఇది లంగ్ క్యాన్సర్ కు దారీతీస్తుంది. శ్వాసపీల్చుకోవడంలో ఇబ్బంది కలిగిస్తుంది . నాడీవ్యవస్థమీద ఒత్తిడి పెంచుతుంది.

తరచూ అనారోగ్యం

తరచూ అనారోగ్యం

పొగత్రాగడం వల్ల తరచూ అనారోగ్యానికి గురి అవుతుంటే అది లంగ్ క్యాన్సర్ లక్షణంగా గుర్తించాలి. మీరు రెగ్యులర్ గా స్మోక్ చేస్తే , దాని వల్ల అలసట, డిప్రెషన్, హాఠాత్తుగా బరువు తగ్గడం, మోకాళ్ళ నొప్పులు లక్షణాలు కనిపించినప్పుడు వెంటనే ఫిజిషియన్ ను సంప్రదించండి.

న్యుమోనియా /బ్రాంకైటిస్

న్యుమోనియా /బ్రాంకైటిస్

పొగత్రాగడం వల్ల లంగ్ క్యాన్సర్ వల్ల ఇది ఒక లక్షణం , కానీ ఇది అసాధారణమైనది. తరచూ పదేపదే మీరు అనారోగ్యానికి గురి అవుతుంటే, ట్రీట్మెంట్ తీసుకొన్న సమస్య అలాగే ఉన్నా,అప్పుడు లంగ్ క్యాన్సర్ సోకే అవకాశం ఉన్నట్లు గుర్తించాలి.

శ్వాసలో ఇబ్బంది

శ్వాసలో ఇబ్బంది

నిద్రపోయే సమయంలో శ్వాస ద్వారా ఈల వేసే సౌండ్ రావడం. ఇది లంగ్ క్యాన్సర్ లక్షణాల్లో ఒకటిగా నిద్రలేమి సమస్యకు గురిచేస్తుంది. అయితే, ఈ పరిస్థితిని వెంటనే చికిత్స చేయించుకోకుంటే, తర్వాత కూడా అలాగే ఉంటే, వెంటనే డాక్టర్ నుసంప్రధించడం అవసరం.

వాయిస్ లో మార్పు

వాయిస్ లో మార్పు

లంగ్ క్యాన్సర్ లక్షణాల్లో ఇది ఒకటి. తరచూ గొంతు బొంగురు పోవడం మరియు ఇది అసహ్యకరమైనదిగా పరిణమించవచ్చు. తరచూ మీరు మాట్లాడేటప్పుడు ఇలా వాయిస్ బ్రేక్ చేస్తుంటే ఊపిరితిత్తుల క్యాన్సర్ యొక్క ప్రారంభ సంకేతాలలో ఒకటిగా గుర్తించాలి . ఊపిరితిత్తుల క్యాన్సర్ శరీరం యొక్క నరములు దాని ప్రభావం ప్రోత్సహిస్తుంది. ఇది సాధారణంగా జరగుతుంది.

English summary

Early Signs of Lung Cancer

Taking care of our health is our top priority. However, there are reasons such as lack of time, busy lifestyle, etc., that are eating away our concerns and leaving behind health conditions that are hard to treat.
Desktop Bottom Promotion