For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కొలెస్ట్రాల్ బ్యాలెన్స్ చేసే ఫిట్ నెస్ చిట్కాలు

By Mallikajuna
|

ప్రస్తుత రోజుల్లో ఒత్తిడితో కూడిన జీవనశైలిలో ప్రతి ఒక్కరూ జీవిస్తున్నారు . ప్రస్తుత జనరేషన్ లో అంది అనేక మంది ఆరోగ్యం మీద చెడు ప్రభావాన్ని చూపెడుతోంది. ఫలితంగా డయాబెటిస్, ఊబకా మరియు బ్లడ్ ప్రెజ్ వంటి పెద్దపెద్ద అనారోగ్యసమస్యలు చాలా చిన్న వయస్సులోనే వేధిస్తున్నాయి. ఒక నిశ్చలమైన జీవనశైలి, ఆఫీసులో నిరంతరం కూర్చిలో కూర్చొని పనిచేసే ఉద్యోగాలు, ఆరోగ్యానికి అంత మంచివి కాదు. పిల్లలు మరియు యవ్వనంలో ఉన్న పెద్దలు, ఖచ్చితంగా వారి ఫిజికల్ యాక్టివిటీస్ ఆటలు ఆడటం మరియు ఇతర క్రీడలు చురుగ్గా పాల్గొనాలి. అందుకు కొంత సమయాన్ని ప్రత్యేకంగా కేటాయించాలి. అలాగే రెగ్యులర్ గా తీసుకొనే ఆహారాల నుండి బంగాళదుంపలు, ఫ్రైడ్ ఫుడ్స్ ను తినడం నివారించాలి. టీవి ముందు గంటల తరబడి కూర్చోవడం, కంప్యూటర్ గేమ్స్ ఆడటం, లేదా సోషియల్ నెట్ వర్కింగ్ సౌట్స్ మీద ఎక్కువ సమయం గడంపడం వంటి వాటికి సాధ్యమైనంతవరకూ తక్కువ సమయాన్ని గడపాలి.

ఇలా చేయగలిగినపప్పుడు మన శరీరంలో కొంత వరకూ హై కొలెస్ట్రాల్ ను కంట్రలో చేయవచ్చు. వీటితో పాటు మీ శరీరంలో అధనంగా చేరిన హైకొలెస్ట్రాలన్ ను తగ్గించుకొని మరియు గుండె సంబంధి సమస్యలను తగ్గించుకోవడానికి కొన్ని చిట్కాలు మీకోసం క్రింది విధంగా ఉన్నాయి...

బరువు తగ్గాలి:

బరువు తగ్గాలి:

కొలెస్ట్రాల్ స్థాయిలను నేచురల్ గా కంట్రోల్ చేయడానికి ముందుగా బరువు తగ్గించుకోవాలి. ప్రతి రోజూ తీసుకొనే ఆహారాల మీద ప్రత్యేక శ్రద్ద ఉండాలి. టీ, కాఫీ మరియు ఫాస్ట్ ఫుడ్స్ వంటివాటిని సాధ్యమైనంత వరకూ తగ్గించాలి . దాంతో పాటు నేచురల్ గా మరియు యాంటీఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉన్నటువంటి ఆహారాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి . మీ రెగ్యులర్ డైట్ లో పండ్లు, బీన్స్, మరియు గ్రీన్ లీఫ్ వెజిటేబుల్స్ జోడించాలి దాంతో కొద్ది రోజుల్లోనే మీ బరువు తగ్గడం మరియు కొలెస్ట్రాల్ స్థాయిలు నార్మల్ స్థాయి రావడం మీరు గమనించవచ్చు.

వ్యాయామం:

వ్యాయామం:

కొలెస్ట్రాల్ స్థాయిలను నేచురల్ గా తగ్గించుకోవడానికి మరో ఈజీ మార్గం వ్యాయామం. ప్రతి రోజూ రెగ్యులర్ గా అరగంట నడక వల్ల కొలెస్ట్రాల్ స్థాయిలను గణనీయంగా తగ్గించుకోవచ్చు. మెట్లు ఎక్కడానికి ఎలివేటర్లు మరియు లిఫ్ట్ లను ఉపయోగించడం మానుకోవాలి. మొట్లు ఎక్కడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. మీ రెగ్యులర్ కార్యక్రమాల్లో శారీరక వ్యాయామాలకు ప్రాధాన్యత ఇవ్వాలి. ఈ చిన్నపద్దతులే కొలెస్ట్రాల్ లెవల్స్ తగ్గించడాకి అద్భుతంగా సహాయపడుతాయి.

ఓమేగా 3 రిచ్ ఫుడ్స్:

ఓమేగా 3 రిచ్ ఫుడ్స్:

బ్యాడ్ కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించుకోవడానికి ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉన్న ఆహారాలు , చేపలు, సాల్మన్, తున మరియు మక్కరెల్ వంటివి మీ రెగ్యులర్ డైట్ లో ఎక్కువగా చేర్చుకోవాలి. వీటిలో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అధికంగా ఉంటాయి. అలాగే బాదం, పాలు మరియు వాల్ నట్స్ వంటి వాటిలో కూడా ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి.

ఫ్యాటీ పుడ్స్:

ఫ్యాటీ పుడ్స్:

ట్రాన్స్ ఫ్యాట్స్ కలిగినటువంటి ప్యాటీ పుడ్స్ కుక్కీస్, ఫ్రైస్ వంటివి మీ శరీరంలో కొలెస్ట్రాల్ లెవల్స్ ను పెంచుతాయి. కాబట్టి, వీటిని తీసుకోవడం కట్ చేయండి. వీటిని కొనడానికి ముందు కొన్ని సెకట్లు ఆలోచించండి. వాటి లేబుల్స్ మీద ట్రాన్స్ ఫ్యాట్స్ అని రాసుంటే వెంటనే వాటని తినడం మానుకోండి.

ఉల్లిపాయలు:

ఉల్లిపాయలు:

ఉల్లిపాయల్లో వివిధ రకాలైన స్పింగ్ ఆనియన్స్, వెల్లుల్లి, మరియు సాధారణ ఉల్లిపాయలు గుండె ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. వీటిని మీ భోజనాల్లో మరియు సలాడ్స్ లో జోడించుకోవాలి. వెల్లుల్లిని రెగ్యులర్ గా తినడం వల్ల కొలెస్ట్రాల్ లెవల్స్ ను నేచురల్ గా తగ్గించుకోవచ్చు.

సాధారణ నూనెలు

సాధారణ నూనెలు

సాధారణ నూనెలు కంటే వేజిటేబుల్, నెయ్యి, బటర్ మరియు మార్గరైన్ వంటి హెల్తీ ఆయిల్: ఆలివ్ ఆయిల్ , కానోలా ఆయిల్ కు ఎక్కు ప్రాధాన్యత ఇవ్వండి. మీ వంటల తయారీలో, సలాడ్స్ లో వీటిని వినియోగించడం వల్ల గుండెకు అనేక ప్రయోజనాలు కలిగిస్తాయి.

స్మోకింగ్:

స్మోకింగ్:

గుండె మరియు ఊపిరితిత్తుల ఆరోగ్యానికి స్మోకింగ్ వల్ల చాలా హాని కలుగుతుంది. మరియు శరీరంలో కొలెస్ట్రాల్ అధికంగా చేరడానికి కారణం అవుతుంది. కాబట్టి, స్మోకింగ్ ను మానుకోవాలి.

Desktop Bottom Promotion