For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పరీక్షల వేళ పిల్లల్లో ఏకాగ్రతను పంచే పవర్ ఫుడ్స్

|

సాధారణంగా మార్చి నెల ఆరంభం నుండి పిల్లలు ఆందోళనగానూ, మానసిక ఒత్తిడితోనూ, మానసిక అలజడికి గురవుతారు. సంవత్సరమంతా చదివిన చదువుకు పరీక్ష జరుగుతుంది. ప్రశ్నాపత్రాలను చేతితో అందుకుని, వాటికి జవాబులు రాసేంత వరకూ పిల్లలేకాక, పెద్దలూ 'టెన్షన్‌'కు గురవుతారు. పరీక్షలకు ఒకనెల ముందు నుంచే ప్రతిరోజూ కొంత సమయం చదువుకు కేటాయించి, ఏకాగ్రతతో చదువుతూ తాము చదివిన విషయాలను మెదడులో పదిలపరచుకోవటానికి రివిజన్‌ చేసుకోవాలి. పిల్లలు పరీక్షలు చక్కగా రాసి, మంచి మార్కులు తెచ్చుకోవాలని కోరుకునే పెద్దలు, వారి చదువుకు అంత రాయం కలగకుండా జాగ్రత్తపడాలి.

పరీక్షల సమయంలో చదువుకునే పిల్లలకు మంచి పోషకాహారాన్ని ఇవ్వాలి. వారు తీసుకునే ఆహారం వారికి శక్తిని, ఏకాగ్రతను, జ్ఞాపకశక్తిని పెంపొందించేలా వుండాలి. పరీక్షలంటే కంగారుపడే పిల్లలు సరిగ్గా ఆహారం తీసుకోలేకపోతారు. వారికి ఇష్టమయిన బలవర్ధకమైన ఆహారాన్ని దగ్గరుండి తినిపించాలి. పరీక్షలు జరుగు తున్న రోజుల్లో మెదడుకు చురుకుదనాన్ని కలిగించే ఆహారాన్ని వారికి ఇవ్వాలి. పిల్లలు ఎక్కువగా ఆహారం రోజుకు మూడు సార్లు తినకుండా, మూడుసార్లుగా శరీరానికి అందించే ఆహారాన్ని రోజుకు 5, 6 సార్లు తింటూ, ఆహారం తీసుకున్న తర్వాత ఒక పండును తినడం మంచిది. ఒకేసారి ఎక్కువ ఆహారాన్ని తీసుకుంటే బద్ధకం అనిపిస్తుంది, సరిగా చదవలేరు.

మీలో ఏకాగ్రత మెరుగుపర్చేందుకు సహాయపడే 20 టిప్స్: క్లిక్ చేయండి

అందువల్ల పోషక విలువలు పుష్కలంగా లభించే ఆహారాన్ని కొంత తక్కువగా తీసుకున్నప్పటికీ వారికి నీరసం ఏర్పడదు. పీచుపదార్ధాలు, ప్రోటీన్స్‌, విటమిన్స్‌ లభించే పదార్ధాలు వుండాలి, పిల్లలు తీసుకునే ఆహారంలో పండ్లరసాలు త్రాగేకంటే, పండు తినడమే మంచిది. కొంతమంది పిల్లలకు గట్టిగా చదివే అలవాటు వుంటుంది. అటువంటి వారికి గొంతు పొడారిపోకుండా కొబ్బరినీళ్ళు, వెన్న తీసేసిన పలుచని మజ్జిగ, గ్లూకోజ్‌ కలిపిన నీళ్ళు లాంటివి ఇవ్వడం మంచిది. కాఫీ, టీలు త్రాగకుండా పాలు త్రాగడం వల్ల ప్రయోజనం వుంటుంది.

పిల్లల్లో ఏకాగ్రత మరియు జ్ఞాపకశక్తిని ఎలా పెంచవచ్చు?:క్లిక్ చేయండి

కాబట్టి, పిల్లల్లో ఏకాగ్రతను, జ్ఞాపకశక్తిని మెరుగుపరచడానికి, చదివినవి గుర్తుంచుకోవడానికి, నాడీకణాలను ప్రశాంతంగా ఉంచి, మరింత చురుగా ఆలోచనా శక్తిని పెంచడానికి ఈ క్రింది ఆహారాలు బాగా సహాయపడుతాయి. ఈ క్రింది ఆహారాలను తీసుకొన్న తర్వాత చదువుకొనే పిల్లల్లో మొత్తం శరీరం యొక్క ఆరోగ్యానికి మేలు చేస్తుంది. మరియు ఈ సూపర్ ఫుడ్స్ మెదడు చురుగా పనిచేయడానికి, ఏకాగ్రత పెంచడానికి, జ్ఞాపకశక్తిని పెంచడానికి సహాయపడుతుంది. మరి ఏకాగ్రతను పెంచే ఆ సూపర్ ఫుడ్స్ ఏంటో ఒక సారి చూద్దాం....

వాల్ నట్స్:

వాల్ నట్స్:

వాల్ నట్స్ ను క్షుణ్నంగా పరిశీలిస్తే, చిన్న మొదడ పోలికలను పోలి ఉంటుంది. ఈ సూపర్ బ్రెయిన్ ఫుడ్లో యాంటీఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి ఫ్రీరాడికల్ డ్యామేజ్ కారణం అయ్యే బ్రెయిన్ సెల్స్ కు వ్యతిరేకంగా పోరాడుతుంది. దాంతో ఏకాగ్రత క్రమంగా పెరుగుతుంది.

చాక్లెట్:

చాక్లెట్:

చదువుకొనే పిల్లలకు చాక్లెట్ ఒక బెస్ట్ ఫుడ్. డార్క్ చాక్లెట్స్ లో కెఫిన్ ఉండటం వల్ల ఇది ఒత్తిడి తగ్గించే ఒక బ్రెయిన్ ప్రొటెక్టింగ్ యాంటీయాక్సిడెంట్ ఫుడ్ గా ఉంది.

బెర్రీస్:

బెర్రీస్:

బ్లూ బెర్రీస్ ఒక ఉత్తమ బ్రెయిన్ ఫుడ్. ముఖ్యంగా ఎగ్జామ్స్ కు ప్రిపేర్ అయ్యే విద్యార్థులు వీటిని తీసుకోవడం చాలా మంచిది. బ్లూ బెర్రీస్ ఆక్సిడేటివ్ స్ట్రెస్ నుండి మనకు రక్షణ కల్పిస్తుంది. మరియు పిల్లల్ల లర్నింగ్ కెపాజిటిని మరియు మోటార్ స్కిల్స్ ను పెంచుతుంది.

ఆకు కూరలు:

ఆకు కూరలు:

గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ చదువుకునే పిల్లలకు అంధివ్వడం ద్వారా చాలా సహాయపడుతుంది. ఆకు కూరల్లో విటమిన్ ఇ పుష్కలంగా ఉండి, ఇది అభిజ్ఞా ప్రక్రియను మరియు బ్రెయిన్ టిష్యూలను ఏర్పరుస్తుంది.

క్యారెట్స్:

క్యారెట్స్:

క్యారెట్ కంటి ఆరోగ్యానికి మాత్రమే కాదు ఇది మెదడు ఆరోగ్యానికి కూడా చాలా మేలు చేస్తుంది. తాజాగా ఉండే క్యారెట్స్ తీసుకోవడం ద్వారా ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది మరియు మెమరీని రీస్టోర్ చేస్తుంది. క్యారెట్ లో ఉండే లూటియోలిన్ మెమరీ లాస్ ను తగ్గిస్తుంది మరియు మొత్తం ఆరోగ్యానికి బూస్ట్ వంటిది.

చేపలు:

చేపలు:

చేపల్లో ఒమేగా 3 ఫ్యాటీ ఆసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి మన మెదడకు కావల్సినంత శక్తిని అందివ్వడంలో గొప్పగా సహాయపడుతాయి. మరియు వీటిలో ఉండే అనేక విటమిన్స్ మెమరీని షార్ప్ గా ఉంచుతాయి.

తృణధాన్యాలు:

తృణధాన్యాలు:

ఎగ్జామ్స్ సమయంలో బ్రేక్ ఫాస్ట్ ను ఎట్టిపరిస్థితుల్లోనూ మిస్ చేయకూడదు. చదువుకునే పిల్లలో రోజంతా అవసరం అయ్యే మెంటల్ హెల్త్ కు ఉదయం తీసుకొనే బ్రేక్ ఫాప్ట్ చాలా గ్రేట్ గా సహాయపడుతుంది. కాబట్టి, ఉదయం బ్రేక్ ఫాస్ట్ కు తృణధాన్యాలతో తయారుచేసినవి చాలా ఉత్తమం.

సన్ ఫ్లవర్ సీడ్స్:

సన్ ఫ్లవర్ సీడ్స్:

సన్ ఫ్లవర్ సీడ్స్ లో డొపమైన్ ఎక్కువగా ఉంటుంది. ఇందులోని బ్రెయిన్ కెమికల్స్ మోటివేషన్ మరియు ఏకాగ్రతను పెంచడానికి సహాయపడుతాయి.

బీన్స్:

బీన్స్:

పరీక్షల సమయంలో పిల్లల ఏకాగ్రతను పెంచడంలో బీన్స్ ఒక అత్యుత్తమమైన ఆహారం. బీన్స్ తీసుకోవడం వల్ల పిల్లల్లో ప్రేరణ కలిగిస్తుంది. మరియు ఇవి పిల్లలకు రెగ్యులర్ లెవల్ ఎనర్జీని అంధిస్తుంది.

ఫ్లాక్స్ సీడ్స్:

ఫ్లాక్స్ సీడ్స్:

సన్ ఫ్లవర్ సీడ్స్ లాగే, ఫ్లాక్స్ సీడ్స్ కూడా ఏకాగ్రతను పెంచడంలో చాలా సహాయకారిగా ఉన్నాయి. అందుకే చదువుకునే పిల్లలు వీటిని రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల మెగ్నీషియం, విటమిన్ బి, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, ఫైబర్ వంటివి పిల్లల్లో మెంటల్ క్లారిటీని మెరుగుపరుస్తుంది.

అరటిపండ్లు:

అరటిపండ్లు:

అరటిపండ్లలో బి6 మరియు పొటాషియం అధికంగా ఉండి, ఇవి శరీరంలో సెరోటినిన్, న్యూరోపైన్ప్రిన్ మరియు డొపమైన్ ను ఉత్పత్తికి సహాయపడుతాయి . ఈ మూడు అంశాలు పిల్లల్లో ఏకాగ్రతను పెంచుతాయి.

కాఫీ:

కాఫీ:

ఎక్కువగా కెఫిన్ తీసుకోవడం ఆరోగ్యానికి అంత ఆరోగ్యకరం కాదు, అయితే ఒక కప్పు వేడి కాఫీ ఏకాగ్రతను, ఇన్ స్టాంట్ ఎనర్జీని అంధిస్తుంది.

గ్రీన్ టీ:

గ్రీన్ టీ:

ఏకాగ్రతను పెంచుకోవాలంటే, మీ రెగ్యులర్ డైట్ లో గ్రీన్ టీని చేర్చుకోవడం ఒక ఉత్తమ ఎంపిక. ఈ గ్రీన్ టీలోని సప్లిమెంట్స్, ఫ్లెవనాయిడ్స్ ఏకాగ్రతను మరియు మెమరీని పెంచడానికి సహాయపడుతాయి.

English summary

Foods That Help In Concentration While Studying

With the exams around the corner, kids in the city are getting restless as to what to eat in order for them to concentrate better. There have been a lot of research which states that food is the only solution that can help you concentrate better and also help in storage of memory.
Desktop Bottom Promotion