For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఎక్కిళ్ళు ఆగిపోవాలంటే చాలా సింపుల్ టిప్స్

|

సాధారణంగా గబగబా భోజనం చేసేటప్పుడు కొన్ని సందర్భాల్లో ఎక్కిళ్ళు రావడం మనం గమనిస్తూనే ఉంటాం. ఇలా వేగంగా తినడం వల్ల లేదా తినేటప్పుడు పీల్చుకొనే గాలి వేగంలో తేడా రావడం వల్ల డయాఫ్రమ్(గుండెను, పొత్తికపడును వేరుచేసే సన్నని పొర)సంకోచిస్తుంది. దీని వల్ల గాలి లోపలికి పీల్చుకొనేటప్పుడు గొంతులోని నాళాలు మూసుకుపోయి ‘హిక్...హిక్' అనే శబ్దం వస్తుంది. అందుకే దీన్ని ఆంగ్లంలో hiccups అంటారు.

ఇవి వస్తున్నంత సేపు సరిగా మాట్లాడలేకపోవడం, పనిపై మనసు లగ్నం చేయలేకపోవడం వంటివి జరగుతుంటాయి. కాబట్టి, వీటిని తగ్గించుకోవడానికి కొందరు నీళ్ళు త్రాగుతుంటారు. దీని వల్ల శ్వాసక్రియ రేటులో తిరిగి మార్పు రావడం వల్ల ఎక్కిళ్ళు ఆగిపోయితాయి. ఈ క్రమంలో అదే పనిగా ఎక్కిళ్ళు వస్తున్నప్పుడు ఆగిపోవడానికి కొన్ని సహజసిద్ధమైన మార్గాలున్నాయి. అవేంటో తెలుసుకుందాం.....

చిన్న పిల్లల్లో ఎక్కిళ్ళు తగ్గించేందుకు చక్కటి మార్గాలు:క్లిక్ చేయండి

ఎక్కిళ్ళకు రావడానికి కొన్ని కారణాలు: ఎక్కిళ్ళు రావడానికి కేవలం వేగంగా తినడం మాత్ురమే కాదు...మరికొన్ని కారణాలు కూడా ఉన్నాయి....
1. మనం తీసుకొనే ఆహారం మరీ వేడిగా లేదా మరీ చల్లగా ఉండటం.
2. ఎక్కువ భావోధ్వేగాలకు గురవడం.
3. మితిమీరన మద్యపానం, ధూమపానం.
4. ఏదైనా తిన్నప్పుడు లేదా తాగినప్పుడు పొట్టపై ఒత్తిడి పడడం.
5. గుండెలో మంట లేదా ఎసిడి వల్ల కూడా ఎక్కిళ్ళు వస్తాయి. ఈ ఎక్కిళ్ళు నివారించడం కోసం కొన్ని హోం రెమెడీస్ ఈ క్రింది విధంగా ఉన్నాయి...

అల్లం:

అల్లం:

చాలా మంది అల్లం వంటల్లో వేస్తేనే తినడానికి ఇష్టపడరు. మిర నేరుగా తినడానికైతే అస్సలు ఇష్టపడరు. కానీ దీనిలో ఉండే ఔషధ గుణాల వల్ల అన్ని రకాలుగా ఆరోగ్యంగా ఉండవచ్చు. అలాగే ఎక్కిళ్ళను కూడా తగ్గించుకోవచ్చు. దీనికోసం ఒక చిన్న అల్లం ముక్కను నోట్లో వేసుకొని నిమ్మదిగా నమలాలి. ఫలితంగా ఎక్కిళ్ళు తగ్గిపోతాయి.

యాలకుల పొడి:

యాలకుల పొడి:

ఎక్కిళ్లు తగ్గడానికి మరో పద్దతుంది. ఒకటిన్నర కప్పు నీటిలో ఒక చెంచా యాలకుల పొడి వేసి మరిగించాలి. ఈ మిశ్రమాన్ని చల్లారనిచ్చి వడకట్టి తాగాలి. దీనివల్ల డయాఫ్రమ్ రిలాక్సయి తద్వారా క్రమంగా ఎక్కిళ్ళు తగ్గే అవకాశం ఉంటుంది.

పెరుగు :

పెరుగు :

ఆరోగ్యానికి మేలు చేసే పెరుగు వల్ల ఎక్కిళ్ళు కూడా తగ్గుముఖం పడతాయి. మరి అదెలాగంటే..ఒక కప్పు పెరుగులో కాస్త ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని నెమ్మదిగా తింటే ఎక్కిళ్లు తగ్గిపోతాయి.

ఆవాలు:

ఆవాలు:

అరచెంచా ఆవాలు, అరచెంచా నెయ్యి తీసుకొని బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని గొంతులో వేసుకొని మింగాలి. ఇలా చేయడం వల్ల ఎక్కిళ్లు ఆడిపోయే అవకాశం ఉంటుంది.

పీనట్ బటర్:

పీనట్ బటర్:

అదే పనిగా ఎక్కిళ్లు వస్తున్నప్పుడు ఈ చిన్ని చిట్కా ప్రయత్నించి చూడండి. ఒక చెంచా పీనట్ బటర్ తినండి. క్రమంగా ఎక్కిళ్లు ఆగిపోతాయి.

తీపి పదార్థం:

తీపి పదార్థం:

ఎక్కిళ్ళు వచ్చినప్పుడు ఒక చెంచా పంచదార నోట్లో వేసుకొని నెమ్మదిగా చప్పరించాలి. దీని వల్ల శ్వాసక్రియ రేటులో మార్పు వచ్చి ఎక్కిళ్ళు ఆగిపోయే అవకాశం ఉంటుంది. చక్కెరకు బదులుగా తేనెను కూడా ఉపయోగించవచ్చు. ముఖ్యంగా చిన్న పిల్లలకైతే ఈ చిట్కా బాగా ఉపయోగపబడుతుంది.

గాలి పీల్చాలి:

గాలి పీల్చాలి:

కేవలం ఆహార పదార్థాలతోనే కాకుండా ఎక్కిళ్లు తగ్గడానికి ఇలా కూడా చేయవచ్చు. గట్టిగా గాలి పీల్చి మీకు సాధ్యమైనంత సేపు అలాగే బిగపట్టి ఉంచండి. తర్వాత వదలండి. ఇలా పదే పదే కొన్ని సార్లు చేయడం వల్ల ఎక్కిళ్ళు తగ్గే అవకాశం ఉంటుంది.

వెనిగర్:

వెనిగర్:

ఎక్కిళ్ళు ఇబ్బంది పెడుతుంటే వెనిగర్ ను త్రాగాలి. దీనికి ఉండే పులదనం వల్ల ఎక్కిళ్లు ఆగిపోతాయి.

వేడి నీళ్ళు:

వేడి నీళ్ళు:

కొన్ని గోరువెచ్చని నీటిలో ఒక చెంచా తేనె వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని గొంతులో పోసుకొని మింగితే ఫలితం ఉంటుంది.

గొంతులో నీళ్లు పోసుకొని

గొంతులో నీళ్లు పోసుకొని

గొంతులో నీళ్లు పోసుకొని మింగడం లేదా పుక్కిలించడం, ఉమ్మివేయడం వల్ల కూడా ఎక్కిళ్లు ఆగిపోయే అవకాశం ఉంటుంది.

English summary

Get Rid Of Hiccups In Ten Easy Ways

Hiccups are the most irritating and embarrassing thing to happen to anyone. It can happen at any time, suddenly and when it starts it just does not want to stop. Have you faced hiccups at a meeting or in a social gathering? If you have it might have been very embarrassing and funny.
Desktop Bottom Promotion