For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అజీర్ణంనకు ఖచ్చితమైన ఇంటి పరిష్కారం - అల్లం

By Super
|

మీరు జీర్ణ సమస్యలు,అపానవాయువు మరియు పొట్టలో గ్యాస్ తో తరచుగా బాధపడుతూ ఉంటే అల్లంను తీసుకోవటానికి ప్రయత్నించండి.

అల్లం జీర్ణక్రియలో సహాయపడుతుంది. శరీరానికి అవసరమైన పోషకాల శోషణ మరియు విలీనంను మెరుగుపరుస్తుంది. అలాగే మీ ఆహారంలో ప్రోటీన్ల విచ్ఛిన్నం కొరకు సహాయపడుతుంది. అల్లం శ్లేష్మం ఊటను ప్రోత్సహిస్తుంది. మీ కడుపు పూతలకు వ్యతిరేకంగా రక్షిస్తుంది. అంతేకాక పొట్ట ఉబ్బరం మరియు గ్యాస్ నుండి ఉపశమనం అందించి అపానవాయువును తగ్గిస్తుంది.ఇక్కడ అపానవాయువును దూరంగా ఉంచడానికి కొన్ని చిట్కాలు ఉన్నాయి.

వీటితో పాటు అల్లంలో శోథ నిరోధక,అనాల్జేసిక్,యాంటి ఆక్సిడెంట్,వాంతులను కట్టడి చేసే లక్షణాలు ఉన్నాయి. ఇది మంట తగ్గించడానికి సహాయం చేస్తుంది. ప్రొస్టాగ్లాడిన్ మరియు లేకోత్రెన్ సంశ్లేషణ నియంత్రణ కారణంగా వాపు మరియు నొప్పి తగ్గించే సామర్ధ్యంను కలిగి ఉంటుంది. అల్లం సెరోటోనిన్ గ్రాహకాలను కూడా నిరోధిస్తుంది. వాంతులను కట్టడి చేయటానికి మంచి ఏజెంట్ గా పనిచేస్తుంది. అలాగే ప్రేగు సంబంధిత గ్యాస్ (పొట్ట ఉబ్బరం ప్రభావం) తొలగించే సామర్ధ్యాన్ని కూడా కలిగి ఉంటుంది. ఇది యాంటి ఆక్సిడెంట్ గా పనిచేస్తుంది. దీనిలో కణాల మరణాన్ని(అపోప్టోసిస్) ప్రేరేపించే సామర్థ్యం మరియు కొంత ప్రోటీన్ అణచివేసే సామర్థ్యం కలిగి యాంటి క్యాన్సర్ లక్షణాలను కలిగి ఉంటుంది. అంతేకాకుండా అల్లంలో కనిపించే కొన్ని కాంపౌండ్స్ అలెర్జీ ప్రభావాలను అణచివేయడానికి సహాయపడతాయి. అల్లంలో ఇన్ని లక్షణాలు ఉండుట వలన ఆరోగ్య ప్రయోజనాలకు ఒక పవర్ హౌస్ అని చెప్పవచ్చు.

Ginger, the perfect home remedy for indigestion

కాబట్టి అజీర్ణంతో బాధపడేవారు క్రింద ఉన్న ఇంటి పరిష్కారాలను ప్రయత్నించవచ్చు.

చిట్కా # 1: చిన్న తాజా అల్లం ముక్కను తీసుకోని తొక్క తీసివేయాలి. దానిని క్రష్ చేసి రసం తీయాలి. ఈ రసాన్ని ఒక చిన్న కప్పులో సేకరించి రోజులో ఒకసారి త్రాగాలి. మీకు ఖచ్చితంగా తక్షణ ఉపశమనం కలుగుతుంది.

చిట్కా # 2: తాజా అల్లంను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయాలి. ఈ ముక్కలను నోటిలో ఉంచుకోవాలి. వీటిని మ్రింగకుండా నెమ్మదిగా నములుతూ అల్లం రసంను మాత్రమే మింగాలి. ఈ పరిష్కారం కూడా అజీర్ణం నుండి ఉపశమనం కొరకు సహాయపడుతుంది.

చిట్కా # 3: ఈ పరిష్కారం వికారంతో పాటు అజీర్ణంతో బాధపడుతున్న వారికీ చాలా ఉపయోగకరముగా ఉంటుంది. అల్లం యొక్క ఒక సన్నని ముక్క తీసుకోని దాని మీద కొంచెం ఉప్పు జల్లి నెమ్మదిగా నములుతూ అల్లం రసంను మాత్రమే మింగాలి.ఇది వికారం మరియు అజీర్ణం తగ్గించేందుకు సహాయం చేస్తుంది.

English summary

Ginger, the perfect home remedy for indigestion

Ginger helps in digestion and improves absorption and assimilation of essential nutrients. It also helps break down the proteins in your food. Ginger promotes mucus secretion and protects your stomach against ulcers.
Desktop Bottom Promotion