For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఉడికించిన గుడ్డులోని టాప్ 10 గ్రేట్ హెల్త్ బెనిఫిట్స్

|

ఉడికించిన గుడ్లు చూడటానికి మరీ చిన్నవిగా అనిపించవచ్చు, కానీ ఇది అనేక విటమిన్స్ మరియు మినిరల్స్ తో నిండినటువంటి ఒక సూపర్ ఫుడ్. ఈ ఉడికించిన గుడ్డులో పొటాషియం, ఐరన్, జింక్, విటమిన్ ఇ మరియు ఫొల్లేట్ పుష్కలంగా ఉన్నాయి . అధ్యనాలు, పరిశోధనల ప్రకారం,ఉడికించిన గుడ్డులో 6. 29గ్రాముల ప్రోటీన్స్ మరియు 78 క్యాలరీలు కలిగి ఉంటాయి. ప్రతి రోజూ ఒక ఉడికించిన గుడ్డును తీసుకోవడం వల్ల మీ శరీరానికి కావల్సినంత ఎనర్జీని అందించడంలో అద్భుతంగా సహాయపడుతుంది. మరియు మీ ఆకలిని కంట్రోల్లో ఉంచుతుంది . ఫిట్ నెస్ నిపుణుల ఉడికించిన గుడ్డును తినమని సలహా ఇవ్వడానికి ఇది ఒక ప్రధాన కారణం కావచ్చు . కాబట్టి, ప్రతి రోజూ ఉడికించిన గుడ్డును వర్కౌట్ చేయడానికి ముందు ఒకటి తినడం వల్ల తగినంత ఎనర్జీని పొందవచ్చు.

మీరు ఉడికించన గుడ్డును ఉదయం బ్రేక్ ఫాస్ట్ గా తీసుకొన్నప్పుడు, అది మీకు ఆరోజుకు కావల్సినంత న్యూట్రీషియన్స్ ను మీ శరీరానికి అందజేస్తుంది . అంతే కాదు, ఉడికించిన గుడ్డులో మీకు తెలియని మరిన్ని ఆరోగ్యప్రయోజనాలు దాగి ఉన్నాయి.

హార్డ్ గా మరియు సాఫ్ట్ ఉడికిచిన గుడ్డు లో కొన్ని ఆరోగ్యప్రయోజనాలను మీకోసం బోల్డ్ స్కై లిస్ట్ చేసి అందిస్తోంది. వాటిని తెలుసుకోవాలంటే క్రింది స్లైడ్ ను క్లిక్ చేసి చూడాల్సిందే. గుడ్డు తిననివారికి కూడా ఈ ఆర్టికల్స్ ను షేర్ చేస్తే , వారు గుడ్డు ప్రయోజనాలను తెలుసుకొని, ఉడికించిన గుడ్డు తినడానికి ప్రయత్నిస్తారు ...మరి ఆ ముఖ్యమైన హెల్త్ బెనిఫిట్స్ ఏంటో ఒక సారి చూద్దాం....

ఉడికించిన గుడ్లు: గొప్ప ఆరోగ్యప్రయోజనాలు

ఉడికించిన గుడ్లు: గొప్ప ఆరోగ్యప్రయోజనాలు

కోడి గుడ్డు తింటే దృష్టికి ఎంతో మేలు కలుగుతుంది. రోజు గుడ్డు తినేవారికి ఐ సైట్ మరియు శుక్లాలు వచ్చే అవకాశం బాగా తగ్గుతుంది. గుడ్డులో విటమిన్‌-ఎ ప్రధానమైన జీవపోషకం. ఇది గుడ్డులోని పచ్చసోనలోనే అధికం. కంటి దోషాలు లేకుండా ఉండాలంటే జింక్‌, సెలీనియం, విటమిన్‌-ఇ ఇందులో అధికంగా ఉన్నాయి.

ఉడికించిన గుడ్లు: గొప్ప ఆరోగ్యప్రయోజనాలు

ఉడికించిన గుడ్లు: గొప్ప ఆరోగ్యప్రయోజనాలు

గోళ్ళ ఆరోగ్యానికి చాలా మంచిది: ఉడికించిన గుడ్డులో సల్ఫర్ ఎక్కువగా ఉంటుంది మరియు విటమిన్ డి కి ఇది ఒక మంచి మూలం. ఉడికించిన గుడ్డులో విటమిన్ డితో పాటు మినిరల్స్, యాంటీ ఆక్సిడెంట్స్, పుష్కలంగా ఉండి, గోళ్ళు పెరుగుదలకు బాగా సహాయపడుతుంది.

ఉడికించిన గుడ్లు: గొప్ప ఆరోగ్యప్రయోజనాలు

ఉడికించిన గుడ్లు: గొప్ప ఆరోగ్యప్రయోజనాలు

మొదడుకు : గుడ్డుసొనలో 300 మైక్రోగ్రాములు కోలిన్‌ అనే పోషక పదార్థం ఉంది. ఇది మెదడు కణాల ఆరోగ్యాన్ని కాపాడుతుంది. మెదడులో సమాచార రవాణాన్ని మెరుగుపరుస్తుంది, మెదడు నుండి సంకేతాలు వేగంగా చేరవేయడంలో కూడా కోలిన్‌ ప్రాత్ర వహిస్తుసంది.

ఉడికించిన గుడ్లు: గొప్ప ఆరోగ్యప్రయోజనాలు

ఉడికించిన గుడ్లు: గొప్ప ఆరోగ్యప్రయోజనాలు

బరువు తగ్గడానికి : బరువు తగ్గేందుకు గుడ్డు పనికొస్తుంది. అందులో ఉన్న నాణ్యమైన ప్రోటీన్ల వల్ల గుడ్డు తీసుకోగానే కడుపు నిండినట్టుగా అవుతుంది. ఎక్కువ ఆహారం తీసుకోనివ్వదు... అందువల్ల పరిమిత ఆహారం తీసుకొని బరువును నియంత్రించుకోగలుగుతారు. గుడ్డు తక్కువ క్యాలరీలు శక్తిని ఇస్తుంది సాధారణ సైజు గుడ్డు 80 క్యాలరీలు శక్తిని అందిస్తుంది కాబట్టి డైటింగ్‌లో ఉన్నవారు కూడా గుడ్డును తీసుకోవచ్చు.

ఉడికించిన గుడ్లు: గొప్ప ఆరోగ్యప్రయోజనాలు

ఉడికించిన గుడ్లు: గొప్ప ఆరోగ్యప్రయోజనాలు

ఎముకల బలానికి: శరీరంలోని అస్థిపంజరం నిర్మాణానికి ముఖ్యమైన పోషకాలు గుడ్డులోని పచ్చసోనలో అధికంగా ఉంటాయి. ఎముకలకు కాల్షియం ముఖ్యం. దీన్ని గ్రహించడానికి విటమిన్‌-డి, ఎముకల్లో జరిగే జీవ రసాయనిక ప్రతి క్రియలన్నింటిలో మెగ్నీషియం చాలా అవసరం. విటమిన్‌-కె, ఫోలిక్‌ యాసిడ్‌, బి6, బి12 గుడ్డులో అధికంగా ఉంటాయి.

ఉడికించిన గుడ్లు: గొప్ప ఆరోగ్యప్రయోజనాలు

ఉడికించిన గుడ్లు: గొప్ప ఆరోగ్యప్రయోజనాలు

రక్తంకు మంచిది : చాలా రోజుల నుండి మీరు గుడ్డు అధిక కొలెస్ట్రాల్ కలిగినినదని, ఇది గుండె ఆరోగ్యానికి మంచిది కాదని మీరు వింటూనే ఉంటారు. అయితే, గుడ్డు పచ్చసొనలోని, ప్రోటీన్స్ రక్తం గడ్డకట్టడాన్ని నివారిస్తుంది.

ఉడికించిన గుడ్లు: గొప్ప ఆరోగ్యప్రయోజనాలు

ఉడికించిన గుడ్లు: గొప్ప ఆరోగ్యప్రయోజనాలు

బ్రెస్ట్ కు చాలా మేలు చేస్తుంది: ముఖ్యంగా మహిళలకు ఇది చాలా మేలు చేస్తుంది. గుడ్డులోని పచ్చసోనలో అనేక యాంటి యాక్సిడెంట్లు ఉన్నాయి. విటమిన్‌-ఎ, కెరోటిన్‌ ద్వారా లూమీప్లేమిన్‌, లూమీక్రోమిన్‌ అనే యాంటి యాక్సిడెంట్లు ద్వారా రొమ్ము క్యాన్సర్‌ను నివారించొచ్చు. లూటిన్‌, జియాక్సాంథిన్‌ ద్వారా చర్మ క్యాన్సర్‌ను నిరోధించొచ్చు. గుడ్డు పచ్చ సోనలోని విటమిన్‌-ఇ క్యాన్సర్‌ కణాలను క్షీణించేలా చేస్తుంది.

ఉడికించిన గుడ్లు: గొప్ప ఆరోగ్యప్రయోజనాలు

ఉడికించిన గుడ్లు: గొప్ప ఆరోగ్యప్రయోజనాలు

కొలెస్ట్రాల్: గుడ్డులోని పచ్చసోనలో శరీర సౌష్టవాన్ని కాపాడే విటమిన్‌-డి, అనవసరమైన కొవ్వును కరిగించే కోలిన్‌ అనే ధాతువు, సెలీనియం, బి12 పుష్కలంగా ఉంటాయి. వారానికి మూడు సార్లు రెండు గుడ్ల చొప్పున ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌గా తీసుకుంటే ఊబకాయం తగ్గుతుందని అనేక పరిశోధనలు తెలియజేస్తున్నాయి.

ఉడికించిన గుడ్లు: గొప్ప ఆరోగ్యప్రయోజనాలు

ఉడికించిన గుడ్లు: గొప్ప ఆరోగ్యప్రయోజనాలు

కేశ సంరక్షణకు: గుడ్డు పచ్చసొన వలన శిరోజాల ఆరోగ్యం మెరు గవుతుంది. గుడ్డులో ఉన్న సల్ఫర్‌, పలురకాల విటమిన్లు, లవణాల వల్ల శిరోజాలకు మంచి పోషణ లభిస్తుంది. మనుషుల గోళ్ళకు మంచి ఆరోగ్యాన్ని గుడ్డు అందిస్తుంది.

ఉడికించిన గుడ్లు: గొప్ప ఆరోగ్యప్రయోజనాలు

ఉడికించిన గుడ్లు: గొప్ప ఆరోగ్యప్రయోజనాలు

టెస్టోస్టిరాల్ లెవల్స్ పెంచుతుంది: గుడ్డు పచ్చసొనలో జింక్ పుష్కలంగా ఉంటుంది. గుడ్డులో పుష్కలమైన మినిరల్స్ ఉంటాయి. ఈ మినిరల్స్ ఇతర ఆహార పదార్థాల్లో లభ్యం కావు. కాబట్టి, గుడ్డు పచ్చ సొన తినడం వల్ల పురుషుల్లో మేల్ హార్మోన్స్ పెరుగుతాయి.

English summary

Health Benefits Of Boiled Eggs

A boiled egg might be small, but it is a super food packed with essential vitamins and minerals. A boiled egg has potassium, iron, zinc, vitamin E and folate present in it. According to research, a boiled egg has around 6.29 grams of protein and 78 calories.
Desktop Bottom Promotion