For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రక్తదానం చేస్తే పొందే గొప్పప్రయోజనాలు:వరల్డ్ బ్లడ్ డోనార్ డే

|

శాస్త్రసాంకేతిక రంగాల్లో ఎంతో అభివృద్ది చెందినప్పటికీ కృత్రిమ రక్తాన్ని తయారు చేసేవీలు లేక అనసరమైన మేరకు రక్తాన్ని దానం ద్వారా మాత్రమే సేకరించే వీలు వుంది. రాష్ట్రంలో ప్రస్తుతం ఏటా ఎనిమది లక్షల యూనిట్‌ల రక్తం అవసరం కాగా అందులో 6 లక్షల యూనిట్ల రక్తాన్ని మాత్రమే 208 బ్లడ్‌బ్యాంక్‌ల ద్వారా సేకరించగలుగుతున్నారు. అవసరమైన రక్తాన్ని దాతలనుంచి సేకరించడానికి, రక్తదానం పై అవగాహన కల్పించడానికి రాష్ట్ర ప్రభుత్వం కృషిచేస్తున్నది. ఈ నేఫధ్యంలో ప్రతి సంవత్సరము జూన్‌ 14 న ' ప్రపంచ రక్తదాతల దినోత్సవాన్ని' జరుపు కుంటున్నాము . రక్తాన్ని సేకరించడానికి దాతలలో అవగాహన కల్పిస్తూ చైతన్యం తీసుకురావడానికి ప్రయత్నించడమే ఈ దినోత్సవం ముఖ్య ఉద్దేశము . తొలి వరల్డ్ బ్లడ్ డోనార్ డే ను 2004 జూన్ 14 జరపాలని తీర్మాణము జరిగినది .

'ప్రభుత్వ అనుమతిలేకుండా ఎవ్వరూ బ్లడ్‌ బ్యాంక్‌లనుంచి రక్తాన్ని సేకరించకుండా, సేకరించిన రక్తాన్ని పరిక్షించకుండా ఎవ్వరికీ మార్పిడి చేయకుండా జాతీయ బ్లడ్‌ ట్రాన్స్‌ఫ్యూషన్‌ యాక్ట్‌2008 ఇటీవల అమలు లోకి వచ్చింది. ఈ చట్టాన్ని ఉల్లఘించిన వారికి రెండులక్షల జరినామా, ఆరునెలల జైలు శిక్ష వుంటుంది. రక్త మార్పిడితో ప్రాణాంతక మైన వ్యాధులు వ్యాప్తిచెందకుండా ఈ మేరకు ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకుంది. బ్లడ్ డోనేర్ డే రోజును అనేకమంది రక్తాన్ని దానం చేస్తారు. తరుచూ బ్లడ్ డొనేట్ చేయడంవల్ల కొన్ని హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. రక్తదానం చేయడం వల్ల రక్తంగ్రహించే వారికి మాత్రమే కాదు, రక్తం ఇచ్చే వారికి కూడా గొప్ప ప్రయోజనాలున్నాయి. రక్తం ధానం చేయడం వల్ల ఇతరుల ప్రాణాలను కాపాడటంతో పాటు డోనర్స్ కూడా అనేక ప్రయోజనాలు పొందవచ్చని చాలా మందికి తెలియకపోవచ్చు.

రక్త దానం చేయడం వల్ల కలిగే మెరుగైన ఆరోగ్య ప్రయోజనాలు: క్లిక్ చేయండి

రక్తం దానం చేసిన తర్వాత మీరు అలసటగా మరియు బలహీనంగా అనిపించడం కేవలం తాత్కాలిక ఫీలింగ్ మాత్రమే., అయితే రక్తం దానం చేయడం వల్ల ముందు ముందు కొన్ని సీరియస్ హెల్త్ బెనిఫిట్స్ పొందవచ్చు. ప్రస్తుత రోజుల్లో రక్తం దానం చేస్తూ ఒకరికొకరు సహాయపడుతున్నారు. ప్రతి రోజూ బ్లడ్ బాంక్ లు కొన్ని వందల లీటర్ల బ్లడ్ ను గ్రహిస్తున్నారు. రెగ్యులర్ గా సంవత్సరానికొకసారి లేదా రెండు సార్లు డొనేట్ చేయడం వల్ల డోనర్స్ కూడా ఆరోగ్యంగా జీవించవచ్చు. కాబట్ట, ఈ బ్లడ్ డొనేషన్ రోజును మీరు ఎవరికైనీ బ్లడ్ డొనేట్ చేసి వారి లైఫ్ ను సేఫ్ చేయాలనుకుంటుంటే, డోనర్ గా మీరు పొందే కొన్ని ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఈక్రింది విధంగా ఉన్నాయి....

గుండె జబ్బులను నివారిస్తుంది

గుండె జబ్బులను నివారిస్తుంది

రక్తం దానం చేయడం వల్ల గుండె జబ్బుల నుండి మిమ్మల్ని రక్షిస్తుంది. గుండె ఆరోగ్యంగా ఉంటుంది. రక్తం దానం చేయడంవల్ల కార్డియో వ్యాస్కులార్ డిసీజెస్ నుండి మొత్తం ఆరోగ్యం మెరుగుపడుతుంది. రక్తం ఐరన్ శాతాన్ని పెంచి గుండె జబ్బులను నివారిస్తుంది.

అధిక కాలరీలను కరిగిస్తుంది

అధిక కాలరీలను కరిగిస్తుంది

రక్తంను రెగ్యులర్ బేసిస్ లో దానం చేయడం వల్ల మిమ్మల్ని మీరు ఫిట్ గా ఉంచుకోగులుగుతారు?ఒక పాయిట్ రక్తదానం వల్ల 450ml పౌండ్లు తగ్గవచ్చని అంటున్నారు. అంటే 450ml రక్తం దానం చేయడం వల్ల మీరు 650 క్యాలరీలను తగ్గించుకోవచ్చు.

క్యాన్సర్ నుండి రక్షిస్తుంది

క్యాన్సర్ నుండి రక్షిస్తుంది

రక్తం రెగ్యులర్ గా దానం చేయడం వల్ల క్యాన్సర్ రిస్క్ ను తగ్గిస్తుంది. అందులోనూ, లివర్, లంగ్స్, కోలన్, స్టొమక్ మరియు థ్రోట్ క్యాన్సర్లనుండి మనల్ని రక్షిస్తుంది.

కొత్తరక్తం ఉత్పత్తికి సహాయపడుతుంది

కొత్తరక్తం ఉత్పత్తికి సహాయపడుతుంది

రెగ్యులర్ గా బ్లడ్ డొనేట్ చేయడం ద్వారా కొత్త రక్తకణాల ఏర్పాటుకు సహాయపడుతుంది. రక్త దానం వల్ల కొత్త రక్త కణాల ఏర్పాటు వల్ల మరింత ఆరోగ్యంగా మరియు ఎఫెక్టివ్ గా ఉండటానికి సహాయపడుతుంది.

మనస్సును స్థిరంగా ఉంచతుంది

మనస్సును స్థిరంగా ఉంచతుంది

రెగ్యులర్ గా రక్తం దానం చేయడం వల్ల మనస్సు స్థిరంగా ఉంటుంది?అంటే మనస్సుకు సంతోషాన్ని కలిగిస్తుంది, ప్రశాంతతను ఏర్పరుస్తుంది.

ఎక్కువ ఐరన్

ఎక్కువ ఐరన్

ఎవరి శరీరంలోనైనా అధిక ఐరన్ తో బాధపడుతున్నప్పుడు, అటువంటి వారు రెగ్యులర్ బేస్ లో రక్తం దానం చేయడం వల్ల గుండెను రక్షించుకోవచ్చు. రెగ్యులర్ గా రక్తం దానం చేయడం వల్ల శరీరంలో అధికంగా ఉన్న ఐరన్ శాతం తగ్గుతుంది. దాంతో గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది.

హెల్త్ చెకప్ బెనిఫిట్స్

హెల్త్ చెకప్ బెనిఫిట్స్

ఏదైన ప్రమాధకర వ్యాధులు వ్యాప్తి చెందినప్పుడు రక్తంను టెస్ట్ చేస్తారు మరియు మరియు రక్తం దానం చేసే వ్యక్తికి ముందుగానే ఎటువంటి జబ్బుల బారీన పడినాడే లేదా ఇంతకు ముందే ఏవైనా టెస్ట్స్ చేయించాడా అన్న విషయాన్ని వైద్యులకు ముందే తెలియజేయాలి.

పెద్దవయస్సు వారికి

పెద్దవయస్సు వారికి

చాలా మంది పెద్దవారు, ఆరోగ్యంగా ఉన్నవారు రక్తం రెగ్యులర్ గా ధానం చేయడం వల్ల మరింత బెటర్ గా ఫీలవుతారు. సంతోషంగా, ఫిట్ గా ఉండటానికి సహాయపడుతుంది.

కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది

కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది

రెగ్యులర్ గా బ్లడ్ డొనేట్ చేయడం ద్వారా, శరీరంలో కొలెస్ట్రాల్ లెవల్స్ ను తగ్గిస్తుంది. మరియు ఎవరైనా అధిక రక్తపోటు(హై బిపి)తో బాధపడుతున్నట్లైతే వారిలో కూడా హైబిపి తగ్గిస్తుంది.

వ్యాధులను కనుగొనవచ్చు

వ్యాధులను కనుగొనవచ్చు

స్వల్పకాలిక, లేదా దీర్ఘకాలిక ఎటువంటి జబ్బులున్నా రక్తం దానం చేయడం ద్వారా తెలుసుకోవచ్చు. రక్తం ధానం చేయడానికి ముందు మీ నుండి శాంపిల్ తీసి పరీక్షించిన తర్వాత, మీ రక్తం ఫర్ ఫెక్ట్ గా ఉన్నప్పుడే, మీ రక్తాన్ని గ్రహిస్తారు.

English summary

Health Benefits Of Donating Blood Regularly

Blood Donation Day 2014 falls on June 14. To mark this day, Boldsky shares with you some of the health benefits of donating blood regularly. It not only helps those who are in need of it, but also benefits the donor. Not many are aware that donating blood to save another's life can actually save yours too.
Desktop Bottom Promotion