For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ద్రాక్ష రసంలోని అద్భుతమైన ఆరోగ్యప్రయోజనాలు

|

ఆరోగ్యానికి తాజా పండ్లు ఎంతో మంచివన్న విషయం అందరికీ తెలిసిందే. ద్రాక్షని ఆహారంలో తీసుకోవడ వల్ల కలిగే లాభాలు ఎన్నో. అత్యంత ఫోషక విలువలు కలిగి ద్రాక్ష ఆరోగ్యాన్ని అంధించడంలో ప్రముఖ పాత్ర పోషిస్తుంది. ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలని నిర్మూలించడంలో ద్రాక్ష్ పండు ప్రధాన పాత్ర పోషిస్తుందనడంలో ఎటువంటి సందేహం లేదు.

సాధారణ అజీర్తి నుంచి కంటి సమస్యల దాకా ఎన్నో రకాల జబ్బుల నివారణలో కీలక పాత్ర వహిస్తాయి. అందుకే చక్కని రుచితో పాటు ఆరోగ్యాన్నీ అందించే ద్రాక్షలను వీలైనంత ఎక్కువగా తీసుకోవాలంటున్నారు పోషకాహార నిపుణులు. ద్రాక్షలంటే విటమిన్ సి గుర్తు వస్తుంది. కానీ సి-విటమిన్‌తో పాటుగా విటమిన్ ఎ, బి6, ఫోలిక్ ఆమ్లం కూడా వీటిలో పుష్కలంగా ఉన్నాయి. పొటాషియం, కాల్షియం, ఇనుము, ఫాస్ఫరస్, మెగ్నీషియం, సెలీనియం లాంటి ఎన్నో రకాల ఖనిజలవణాలు ద్రాక్షల్లో సమృద్ధిగా లభిస్తాయి. అంతేకాదు.. ఫ్లేవినాయిడ్స్ లాంటి శక్తివంతమైన యాంటి ఆక్సిడెంట్లు ఉండటం వల్ల ఫ్రీ రాడికల్స్ బారి నుంచి రక్షిస్తాయి. వయసు వల్ల కలిగే ముడతలను తగ్గిస్తాయి. ద్రాక్ష మాత్రమే కాదు ఎండు ద్రాక్ష కూడా అద్భుత ప్రయోజనాలు కలవు

గర్భిణీ స్త్రీలు ద్రాక్ష ఎందుకు తినకూడదు? దుష్ప్రభావాలేంటి: క్లిక్ చేయండి

100 గ్రాముల ద్రాక్ష నుంచి 69 క్యాలరీల శక్తి అందితే కొలెస్ట్రాల్ జీరో శాతం ఉంటుందన్నారు. పైపెచ్చు. విటమిన్ సి, విటమిన్ ఎ, కెరోటిన్, రాగి, మెగ్నీషియం, బీకాంప్లెక్స్ విటమిన్లతో పాటు ప్రధాన ఎలక్ట్రోలైట్ అయిన పొటాషియం అధికంగా ఉంటుంది. ద్రాక్ష పండ్లను అలాగే తినవచ్చును లేదా వాటి నుండి పానీయాలు, సలాడ్లు, మరియు వైన్ తయారుచేయవచ్చును. ద్రాక్ష వల్ల ఎసిడిటిని చాలా సులభంగా తగ్గించుకోవచ్చు , బరువు తగ్గించుకోవాలనుకొనే వారు ఈ సిట్రస్ ఫ్రూట్ డైటర్స్ కోసం ఒక హెల్తీ డ్ర్రింక్.

నల్ల ద్రాక్ష తింటే డయాబెటీస్ తగ్గుతుందా?: క్లిక్ చేయండి

ద్రాక్షరసం వల్ల ఆరోగ్యం ప్రయోజనం మాత్రమే కాదు చర్మ సౌందర్యానికి కూడా చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఒక గ్లాసు దాక్ష రసం త్రాగడం వల్ల ఒక అందమైన, ప్రకాశవంతమై చర్మాన్ని నేచురల్ గా అందిస్తుంది. అయితే, ద్రాక్షను ఎంపిక చేసుకోవడం ముఖ్యం. తాజాగా ఉన్న గ్రేప్స్, మంచి కలర్ ఉన్న గ్రేప్స్ ను ఎంపిక చేసుకోవాలి. మరి ఈ తాజా ద్రాక్షజ్యూస్ లోని ఆరోగ్యా ప్రయోజనాలేంటో చూద్దాం...

1. గుండె ఆరోగ్యానికి

1. గుండె ఆరోగ్యానికి

ఈ ద్రాక్షల్లో ఫ్లేవనాయిడ్స్ అధికం. ఇవి గుండె ఆరోగ్యాన్ని కాపాడతాయి. ద్రాక్షలో ఉండే ఔషధ గుణాలు ఆస్తమాను అదుపులో ఉంచేందుకు ఉపయోగపడతాయి. ద్రాక్షపండ్లలో టీరోస్టిల్‌బీన్ అనే పదార్థం ఉంటుంది. ఇది రక్తంలో కొలెస్ట్రాల్ మోతాదును తగ్గిస్తుంది. ద్రాక్ష పొట్టులో ఉండే సెపోనిన్లు కొలెస్ట్రాల్‌కు అతుక్కుని దాన్ని శరీరం గ్రహించకుండా నివారిస్తాయి. అంతేకాకుండా ద్రాక్షపండ్లు రక్తంలో నైట్రిక్ ఆక్సైడ్ మోతాదును పెంచుతాయి. నైట్రిక్ ఆక్సైడ్ రక్తం గడ్డలుగా ఏర్పడకుండా ఇది నివారిస్తుంది. తద్వారా గుండెపోటు అవకాశం తగ్గుతుంది. ద్రాక్షలకు ఉన్న యాంటి ఆక్సిడెంట్ లక్షణాలు ఎల్‌డిఎల్ కొలెస్ట్రాల్ ఆక్సీకరణ చర్యలను నివారించడంలో తోడ్పడుతాయి. దాని వల్ల రక్తనాళాల్లో అడ్డంకులు ఏర్పడే అవకాశం తగ్గుతుంది.

2. బ్రెస్ట్ క్యాన్సర్

2. బ్రెస్ట్ క్యాన్సర్

నల్లద్రాక్షల రసం రొమ్ము క్యాన్సర్ నివారణకు ఉపయోగపడుతుందని ఇటీవలి అధ్యయనాలు తెలుపుతున్నాయి. ద్రాక్షల్లోని రిస్ చూపించే యాంటి ఇన్‌ఫ్లమేటరీ ప్రభావం అంతా ఇంతా కాదు. పెద్దపేగు క్యాన్సర్‌తో పాటు ఇతర జీర్ణవ్యవస్థ సంబంధిత క్యాన్సర్లు, రొమ్ము క్యాన్సర్ల నివారణలో రిస్ బాగా పనిచేస్తుంది. ఆంథ్రోసయనిన్లు, ప్రోఆంవూథోసయనిన్లు యాంటి ప్రొలిఫరేటివ్ లక్షణాలను కలిగివున్నాయి. అంటే క్యాన్సర్ కారక పదార్థాల పెరుగుదలను ఇవి నిరోధిస్తాయి. అందుకే ద్రాక్షరసం క్యాన్సర్‌ను అణిచివేయడమేకాదు.. క్యాన్సర్ కణాల వ్యాప్తిని కూడా అరికడుతుంది. ద్రాక్షలోని ఈ పదార్థాలు మొత్తం శరీర వ్యాధి నిరోధక వ్యవస్థనే బలోపేతం చేస్తాయి.

3. అసిడిటి

3. అసిడిటి

చాలా మంది అసిడిటితో బాధపడుతుంటారు. ఈ సమస్య ఉన్నవారు, ఒక గ్లాసు తాజా ద్రాక్షరసంను ప్రతి రోజూ త్రాగడం వల్ల ఇది అసిడిటిని తగ్గిస్తుంది. తిన్న ఆహారం అరగకుండా అజీర్ణంతో చీకాకు కలిస్తుంటే ద్రాక్ష రాసాన్ని కానీ లేదా ద్రాక్షపండ్లను కానీ తీసుకోవడం వల్ల అజీర్తిని అరికట్టడానికి సహాపడుతుంది.

4. బ్లడ్ ప్రెజర్ తగ్గిస్తుంది

4. బ్లడ్ ప్రెజర్ తగ్గిస్తుంది

ద్రాక్షరసం త్రాగడం వల్ల మరో అదనపు ప్రయోజనం రక్తపోటు తగ్గిస్తుంది. బ్లడ్ ప్రెజర్ స్థిరంగా ఉండేందుకు సహాయం చేస్తుంది.

5. మలబద్దకం నివారిస్తుంది

5. మలబద్దకం నివారిస్తుంది

ద్రాక్షలో సెల్యులోజ్,ఆర్గానిక్ ఆసిడ్ మరియు షుగర్ వంటివి మలబద్దకాన్ని నివారించడంలో అద్భుతంగా పనిచేస్తాయి. అందువల్ల మలబద్దకంతో బాధపడేవారు ద్రాక్షను తినడం వల్ల చాలా మేలు జరగుతుంది. ద్రాక్ష రసం కడుపులోని ప్రేగులను శుభ్రపరచడంతో పాటు దీర్ఘకాలంగా ఉన్న మలబద్దక సమస్యను నివారిస్తుంది.

6. మైగ్రేన్

6. మైగ్రేన్

మైగ్రేన్ తలనొప్పిని తగ్గించడానికి అత్యంత ప్రభావవంతంగా ద్రాక్ష పనిచేస్తుంది. మైగ్రేన్ తలనొప్పి తరచూ వస్తుంటే కనుక ప్రతి రోజూ ఉదయాన్నే ద్రాక్షరసాన్ని పరకడుపున తీసుకోవాలి. అయితే అందులో నీళ్ళు కలపకూడదు.

7. హెయిర్ ఫాల్ ను తగ్గిస్తుంది

7. హెయిర్ ఫాల్ ను తగ్గిస్తుంది

జీవం కోల్పోయిన జుట్టుకు ద్రాక్ష గింజలు చక్కని ఔషధంలా పనిచేస్తాయి. వాటిల్లోని ఫ్యాటీ ఆమ్లాలు శిరోజాలకు పోషణను అందించి జుట్టు రాలే సమస్యను తగ్గిస్తాయి. ఇందులోని యాంటీఆక్సిడెంట్స్ రక్తప్రసరణను పెంచుతుంది దాంతో శిరోజాలకు మంచి నిగారింపు వస్తుంది.

8. చర్మ సౌందర్యానికి

8. చర్మ సౌందర్యానికి

చర్మ సంరక్షణకు ద్రాక్ష పండ్లు ఎంతగానో ఉపకరిస్తాయి. అందుకే వీటిని స్క్రబ్‌, మాయిశ్చరైజర్‌ తయారీలో ఉపయోగిస్తున్నారు. తాజా ద్రాక్షలను గుజ్జులా చేసి మసాజ్‌ చేసుకుంటే మంచి ఫలితం కనిపిస్తుంది. ఉపయోగాలున్నాయని అతిగా తినడం, సౌందర్య పోషణకు వినియోగించడం మంచిది కాదు. తగిన మోతాదు వాడకంతోనే అన్ని విధాలా ఆనందం.

9.బరువు తగ్గడానికి

9.బరువు తగ్గడానికి

అధిక బరువుతో బాధపడుతున్నావారు తమ శరీర బరువును తగ్గించుకునేందుకు రకరకాల ప్రయోగాలు చేస్తుంటారు. కాని ద్రాక్షపండ్ల రసం తాగితే బరువు తగ్గి నాజూకుగా తయారవుతారంటున్నారు ఆరోగ్య నిపుణులు. పండ్లరసం తాగాలనిపించినప్పుడల్లా ద్రాక్షరసం తాగటం మంచిది. ఈ పండ్ల రసంలో మిగిలిన పండ్లకన్నా తక్కు వ కాలరీలు ఉంటాయి. ద్రాక్ష రసంలో పంచదార వేసుకోకుండా తాగటం ఎంతో మంచిది. ఇందులో ఉన్న పీచుపదార్థం ఈ రసాన్ని ఎక్కువసేపు కడుపులో నిలిపి ఉంచుతుంది. దీంతో ఆకలి తగ్గి ఆహారం ఎక్కువగా తినలేరు. ద్రాక్షలో ఉండే పీచుపదార్థం వలన శరీరంలో కొవ్వును చేరనివ్వదు. వీటిలో ఉండే ఫైటోకెమికల్స్‌ కొలెస్టరాల్‌ని శరీరంలోకి చేరనివ్వవు. దీంతో శరీరం నాజూకుగా తయారవుతుంది.

10. మతిమరుపు

10. మతిమరుపు

అల్జీమర్స్ వ్యాధితో బాధపడుతున్న వారిలో అమైలాయిడల్ బీటా పెప్టైడ్స్ మోతాదును తగ్గిస్తాయి. ద్రాక్షల్లో ఉండే రిస్ అనే పాలీఫినాల్ ఇందుకు తోడ్పడుతుంది. మెదడు చురుకుదనాన్ని పెంచడంలో ద్రాక్షలు కీలకపాత్ర వహిస్తాయి. న్యూరోజనరేటివ్ వ్యాధుల నివారణకు ద్రాక్షలు బాగా పనిచేస్తాయని అధ్యయనాలు తెలుపుతున్నాయి.

11. కిడ్నీ ఆరోగ్యానికి

11. కిడ్నీ ఆరోగ్యానికి

ద్రాక్షలు యూరిక్ ఆమ్లం సాంద్రతను తగ్గిస్తాయి. తద్వారా ఆమ్లం మోతాదు తగ్గుతుంది. అందువల్ల కిడ్నీలపై పనిభారం కూడా తగ్గిపోతుంది. కాబట్టి ద్రాక్షలు తీసుకోవడం ద్వారా కిడ్నీల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.

12. ఆస్త్మా నివారిస్తుంది

12. ఆస్త్మా నివారిస్తుంది

ద్రాక్షలో ఆస్త్మాను నయం చేసే సామర్థ్యం కలిగిన లక్షణాలు చాలా ఉన్నాయి. ఆస్త్మాతో బాధపడేవారు ఎండు ద్రాక్ష తినడం వల్ల ఆస్త్మాను తగ్గించుకోవచ్చు.

English summary

Health Benefits Of Grape Juice

While Mangoes are known as the 'King of Fruits', grapes are popularly called as the 'Queen of Fruits'. The small juicy grapes are categorised into three varieties based on colours; green, red and black/blue. So are there any health benefits in grapes?
Desktop Bottom Promotion