For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

నవ్వు వల్ల కలిగే ఆరోగ్యానికి ఉపయోగాలు

By Super
|

నవ్వుకి ఖరీదు లేదు. నవ్వు నాలుగు విధాల గ్రేటు. మానసికంగా, శారీరకంగా ఆరోగ్యంగా ఉండేందుకు నవ్వు నాలుగు విధాలా తోడ్పడుతుంది. సుదీర్ఘకాల ఆరోగ్యకరమైన జీవితానికి నవ్వు ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఫేక్ స్మైల్ తో కొన్ని కండరాలు మాత్రమే ముడిపడి ఉంటాయి. అదే మనస్ఫూర్తిగా నవ్వే నవ్వులో ఎక్కువ కండరాలు ముడిపడి ఉంటాయి. నవ్వు అనేది జీవితంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఇతరులతో స్నేహ పూర్వక వాతావరణాన్ని కలిగించడంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది.

ఆరోగ్యానికి నవ్వే ఆయుధం

1. హార్ట్ రేట్ ని తగ్గించి శరీరం ఉపశమనం పొందేందుకు తోడ్పడుతుంది

నవ్వు అనేది ఆరోగ్యకరమైన వ్యాయామం. బ్లడ్ ప్రెషర్ ను తగ్గించడంలో నవ్వు ప్రధాన పాత్ర పోషిస్తుంది.

Health Benefits of Smiling

2. ఒత్తిడిని తగ్గిస్తుంది

ఆధునిక జీవన విధానంలో ఒత్తిడితో ఎంతో మంది సతమతమవుతున్నారు. ఎన్నో రకాల శారీరక, మానసిక సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు. నవ్వడం వల్ల ఎండోర్ఫిన్స్ విడుదలవుతాయి. ఇవి ఒత్తిడిని తగ్గించడానికి తోడ్పడతాయి.

3. మూడ్ ను మెరుగుపరుస్తుంది

నవ్వు వల్ల విడుదలయ్యే ఎండోర్ఫిన్స్ వల్ల మూడ్ లిఫ్ట్ అవుతుంది

Health Benefits of Smiling

4. ఉత్పత్తి పెరుగుతుంది

నవ్వడం వల్ల హాయిగా ఉంటాం. పని చురుగ్గా చేసుకోగలుగుతాం. తద్వారా ఉత్పత్తి పెరుగుతుంది. ఇంటర్నెట్ లో హాయిగా నవ్వుతున్న చిన్నపిల్లల ఫొటోస్, ముద్దు ముద్దు జంతువుల ఫొటోస్ చూడడం వల్ల ఆనందంగా ఉంటుంది. హాయిగా నవ్వుకోవచ్చు.

5. నమ్మకం పెరుగుతుంది

వ్యక్తుల మధ్య నమ్మకాన్ని పెంపొందించడానికి నవ్వు ఉపయోగపడుతుంది. మనిషి సంఘజీవి. నవ్వు వల్ల సంఘంతో సత్సంబంధాలు ఏర్పడతాయి. ఆనందం వెల్లివిరుస్తుంది. నమ్మకం పెంపొందించబడుతుంది. నిజాయితీ లేని నవ్వుని ఇట్టే గుర్తుపట్టేస్తారు. కాబట్టి హాయిగా మనస్ఫూర్తిగా నవ్వండి.

Health Benefits of Smiling

6. ఎంపతీ లభిస్తుంది

నవ్వు వల్ల మనుషుల మధ్య మనస్పర్థలు తొలగిపోతాయి. దానివల్ల స్నేహపూర్వక వాతావరణం ఏర్పడుతుంది. ఇతరుల ఆలోచనలకూ గౌరవం ఇవ్వడం వల్ల వారేం అనుకుంటున్నారు అనే దానిపై దృష్టి సారించగలుగుతాము.

7. చింత తగ్గుతుంది

నవ్వకుండా ఉన్నపుడు చింత ఏర్పడుతుంది. హాయిగా నవ్వితే చింత తొలగిపోతుంది.

8. నొప్పిని తగ్గిస్తుంది

హాయిగా నవ్వడం సహజసిద్ధమైన పెయిన్ కిల్లర్ గా పనిచేస్తుంది. ఒత్తిడి స్థాయిని నిర్మూలిస్తుంది.

Health Benefits of Smiling

9. ఏకాగ్రతను పెంపొందిస్తుంది

హాయిగా నవ్వడం వల్ల ఏకాగ్రత కుదురుతుంది. మల్టీ టాస్క్ కూడా చేయగల శక్తి లభిస్తుంది. మన అంతఃచేతనంపై అలాగే గ్రహణశక్తిపై కంట్రోల్ లభిస్తుంది.

10. వ్యాప్తి చెందుతుంది

మనం నవ్వగానే ఇతరులు కూడా నవ్వేస్తారు. ఒకరినుంచి ఒకరికి నవ్వు సులభంగా సంక్రమిస్తుంది. మనఃస్పూర్తిగా నవ్వే నవ్వు ఆరోగ్యకరమైన వాతావరణాన్ని సృష్టిస్తుంది. నవ్వు సులభంగా ఒకరి నుంచి ఒకరికి వ్యాప్తి చెందుతుంది.

11. ఆకర్షిస్తుంది

నవ్వు ఆకర్షిస్తుంది. నవ్వుతూ ఉండే ఆడవారికే పురుషులు ఎక్కువగా ఆకర్షింపబడతారు.

Health Benefits of Smiling

12. గెలుపు

ఆత్మవిశ్వాసం, ధీమా కలిగిన నవ్వు గెలుపుకి సోపానం. వీటి వల్ల డబ్బు సులభంగా సంపాదించవచ్చు.

13. యవ్వనం

నవ్వు యవ్వనంగా ఉండడానికి తోడ్పడుతుందని అధ్యయనాలు తెలుపుతున్నాయి.

14. దీర్ఘాయువు

ఎప్పుడూ నవ్వుతూ ఉండేవారు నవ్వని వారికంటే 7 ఏళ్ళు ఎక్కువగా జీవిస్తారట.

15. రోగనిరోధకశక్తిని పెంపొందిస్తుంది

నవ్వడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. శరీరం ఒత్తిడి నుంచి ఉపశమనానికి గురవుతుంది.

English summary

Health Benefits of Smiling

A smile is free and it improves your health, your mood and helps in giving you a longer and healthier life. A fake smile involves fewer muscles while a genuine smile involves a greater number of muscles. To smile is very important because it creates a bond with the person who receives it.
Desktop Bottom Promotion