For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

సెల్ ఫోన్ రేడియేషన్ వల్ల ఆరోగ్యంపై దుష్ప్రభావాలు

|

మొబైల్ ఫోన్ వాడకం ద్వారా ప్రమాదకరమైన రేడియో ధార్మిక దుష్ప్రభావాలకు గురయ్యే అవకాశం ఉంది . ప్రజల దైనందిన జీవితాలలో సెల్ ఫోన్లు ముఖ్యమైన ఉపకరణముగా ఈరోజు మారాయి. సెల్ ఫోన్లు మానవ శరీరానికి రోగాలని కలగచేసే లేదా మన ఆరోగ్యానికి హాని కలగచేసే సూక్ష్మ తరంగాలని ప్రసరిస్తాయి.

పిల్లలో సెల్-ఫోన్‌ ప్రభావము :
మన దేశంలో సెల్ ఫోన్ ల వినియోగం రోజురోజుకీ పెరుగుతోంది. రింగ్ టోన్లు, కాలర్ ట్యూన్లు, ఎస్ ఎం ఎస్ లు అంటూ ఎన్నో రకాలుగా సెల్ ఫోన్ ల వాడకం పెరిగిపోతుంది. ఇది బాగానే ఉందిగాని, ఈ సెల్ ఫోన్ల వల్ల వచ్చే అనార్థల గురించి ఎవరూ పట్టించుకోక పోవడం విచారకరమని అంతర్జాతీయ ఆరోగ్య సంస్థ హెచ్చరిస్తోంది. ముఖ్యంగా ఈ సెల్ ఫోన్ల పిల్లలు ఎక్కువగా అనారోగ్యం పాలు అవుతున్నారని వారు పేర్కొంటున్నారు. గేమ్స్ ఆడడం, పాటలు వినడం , సినిమాలు చూడడంలో పిల్లలు సెల్ ఫోన్స్ ని ఎక్కువగా వాడుతున్నారు. మూడు సంవత్సరాల వయసు కన్నా తక్కువ వయసు ఉన్న పిల్లలకి సెల్ ఫోన్స్ ని దూరంగా ఉంచడం చాలా మంచిదని నిపుణులు, డాక్టర్లు చెబుతున్నారు.

Health Effects Of Mobile Phones Radiation

సెల్ ఫోన్ లు రిసీవ్ చేసుకునే సిగ్నల్స్ కారణంగా రేడియో ధార్మికత వల్ల చిన్న పిల్లల్లో మెదడుకి సంబంధించిన వ్యాధులు వచ్చే అవకాలు ఎక్కువగా ఉన్నాయి. వారి ఆలోచనా శక్తి క్రమేపీ మోద్దుబారే ప్రమాదం ఏర్పడుతోందని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. ఓ బ్రిటీష్ శాస్త్రవేత్త ఈ సెల్ ఫోన్ల్ వల్ల వస్తున్న అనర్థాల గురించి కొన్ని హెచ్చరికలు చేసారు. ముఖ్యంగా వైర లెస్, సెల్ ఫోన్ లు, విల్ ఫోన్ లు నుంచి విడుదలయ్యే రేడియో ధార్మిక కిరణాలు సున్నితమైన మెదడు కణజాలాన్ని నాశనం చేస్తున్నాయని, చిన్న పిల్లల్లో ఇది బాగా ఎక్కువగా ఉందని ఆందోళన వ్యక్తం చేసారు. బ్రిటన్ హెల్త్ ప్రొడక్షన్ ఏజన్సీకి చెందినా సర్ విలియం స్టీవార్డ్ ఫిన్క్ష్లన్ద్లొ జరిపిన పరిశోధనలో పాలు విభ్రాంతికరమైన సంగతులు వెలుగు చూశాయి.

సెల్ ఫోన్ లు బాగా వాడే యువకుల రోజువారీ ప్రవర్తనను పరిశీలించిన బృందం వారు తీవ్రమైన మానసిక వత్తిడికి, చిరాకుకీ గురవుతున్నారని తెల్సింది. సెల్ ఫోన్ ల ప్రభావం వల్ల చిన్న పిల్లలు వత్తిడికి గురవ్వడంతో పాటు సరిగా చదవలేక పోతున్నారని, తలనొప్పికి గురవుతున్నట్లుగా కూడా వెల్లడైంది. సెల్ ఫోన్ లతో పాటు మ్యూజిక్ సిస్టమ్స్ వల్ల కూడా ఇలాంటి ఇబ్బందులు తలెత్తుతున్నాయని ఆయన వెల్లడించారు. ముభావంగా ఉండడం, ఆకలి మందగించడం, ఎక్కువసేపు మెలకువగా ఉండడం, సరిగా చదవలేకపోవడం, చదివింది గుర్తుంచుకోకపోవడం వంటి లక్షణాలు చిన్నారుల్లో కనిపించినట్లు స్టీవార్డ్ తన పరిశోధన ఫలితాలు వివరించారు.

అందుకే ఆస్ట్రేలియా మెడికల్ అసోసియేషన్, పాఠశాలల్లో మ్యూజిక్ సిస్టమ్స్, సెల్ ఫోన్ వాడకాన్ని నిషేదించాలని సూచించింది. ఆస్ట్రేలియా, చైనా అమెరికాలోనూ చిన్నారుల్లో ఇలాంటి లక్షణాలు అధికంగా నమోదవుతున్నాయి. భారత్ లో ఈ అనారోగ్య లక్షణాలు మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే మన దేశంలో వివిధ సెల్ ఫోన్ కంపెనీలు అందిస్తున్న ఆఫర్ల వలలో మధ్యతరగతి ప్రజలు ఎక్కువగా చిక్కుకుంటున్నారు. క్రమేపీ మనదేశంలో కూడా చిన్నారుల ఆరోగ్యాన్ని ఈ సెల్ ఫోన్ రేడియో ధార్మికత కబళించే ప్రమాదం ఉందన సంస్థలు హెచ్చరిస్తున్నాయి. అందుకే సెల్ ఫోన్ లు మీ చిన్నారులకు అందుబాటులో లేకుండా చూసుకుంటే వారి ఆరోగ్యానికి ఎంతో మంచిది.

పెద్దవారిలో-- మొబైల్ ఫోన్ రేడియేషన్ వల్ల కలిగే అనారోగ్యాలు : - హై బ్లడ్ ప్రెజర్, తలనొప్పులు, మెదడు వాపు వ్యాధి, ఆల్జీమెర్, క్యాన్సర్, మరియు అంతకన్నా ఎక్కువ ఆరోగ్య సమస్యల్ని కలగచేస్తాయని అధ్యయనాలు తెలుపుతున్నాయి. అయినా, సెల్ ఫోన్ ఉపయోగం , కలిగే హాని గురించి పూర్తిగా ఏ ఒక్కరికీ తెలియదు.

ఇక్కడ ఇచ్చిన కొన్ని చిట్కాల్ని చూడండి:
1. వీలైనంత వరకు చాలా తక్కువగా వికరణాలకి మాత్రమే గురికావాలి. దీని అర్థం ఏమిటంటే తెలివిగా వీలైనంత తక్కువ ఫోన్ లో మాట్లాడడము, అతి దీర్ఘమైన సంభాషణల్ని జరగకుండా మీరు ప్రయత్నించడం. రెండు నిమిషాల కాల్ తరువాత, మెదడు యొక్క ఎలక్ట్రికల్ ఏక్టివిటీస్/పనితీరు ఒక గంటవరకు మార్పుచేస్తుందని కనుగొన్నారు.
2. సెల్ ఫోన్ ని అత్యవసర పరిస్థితులలో మాత్రమే పిల్లలు ఉపయోగించడాన్ని అనుమతించాలి.
3. మీ మొబైల్ ఫోన్ని ఉపయోగించనప్పుడు, వీలైనంతవరకు మీ శరీరానికి దూరంగా ఉంచాలి. కొంతమంది సెల్ ఫోన్ ఉన్నవారు సెల్ ఫోన్ పనిచేస్తూ ఉండగా తమ పేంటు జేబులో పెడతారు. మానవ శరీరము యొక్క క్రింది భాగము, పై భాగము కన్నా చాలా త్వరగా వికరణాలని లీనం చేసుకుంటుంది.
4. హెడ్ ఫోన్లని ఉపయోగించాలని అనుకున్నట్లైతే, వైర్డు హెడ్ సెట్ల కన్నా వైర్ లెస్ హెడ్ సెట్లని వాడండి. వైరు వికరణాన్ని ప్రసరించడమే కాకుండా ఏంటీనాలా కూడా పనిచేసి చుట్టుప్రక్కల ఉన్న ఎలక్ట్రోమేగ్నెటిక్ ఫీల్డులను (EMFs) ఆకర్షిస్తుంది. హెడ్ సెట్ లేకుండా మీరు సెల్ ఫోన్ ఉపయోగించినప్పుడు, మీ చెవి దగ్గరికి తీసుకునే ముందు కాల్ వచ్చే వరకు వేచి చూడాలి.
5. మీరు సెల్ ఫోన్, హోల్ సేల్ లేదా ఒకొక్కరిగా అమ్మే వారి దగ్గర కొనేటప్పుడు తక్కువ ఎస్ ఎ ఆర్ (నిర్దుష్టమైన విలీన రేటు) ఉన్నది చూసుకుని ఎంచుకోవాలి.ఇన్సట్రక్షన్ మేన్యువల్ లో ఇచ్చిన ఎస్ ఎ ఆర్ నంబరుని చూడండి ఎంత తక్కువ ఎస్ ఎ ఆర్ విలువ ఉంటే అంత మంచిది.
6. ఎలివేటర్లు/ లిఫ్టులు లేదా వాహనాలు వంటి, మూసివేసిన మెటల్ స్పేసులలో వికరణం ఉధృతంగా ఉంటుంది కాబట్టి కాల్స్ ని తీయకుండా ఉండండి.

English summary

Health Effects Of Mobile Phones Radiation

Radiation is energy travelling through space in the form of waves or particles. It occurs naturally and has always been around, we've evolved with it and we're bombarded with it in one form or another every day of our lives - from the earth, from space and even within our own bodies. Despite extensive research on the subject, there has been no conclusive evidence that using a mobile phone causes long term harmful effects in humans.
Story first published: Tuesday, March 11, 2014, 18:28 [IST]
Desktop Bottom Promotion