For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

డ్రైవింగ్ వల్ల తలెత్తే ఈ హెల్త్ రిస్క్ లను విస్మరించకండి

By Super
|

మీకు స్వంత వాహనం ఉంటే రాకపోకలు చాలా సులభం. వేరే రవాణా వ్యవస్థలపై అధారపడవలసిన అవసరం ఉండదు. మీరు వెళ్లాలనుకునే ప్రదేశానికి దర్జాగా స్వంత వాహనంపై వెళ్ళవచ్చు. సమయం మీ చేతుల్లోనే ఉంటుంది. వేరే వాహనాలపై డిపెండ్ అవకుండా స్వంత వాహనంపై స్వతంత్రంగా వెళ్ళవచ్చన్న భావన ఆనందాన్ని కలిగిస్తుంది. అయితే, సెల్ఫ్ డిపెండింగ్ అనే ఈ బెనిఫిట్ వల్ల కూడా కొన్ని ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి.

డ్రైవింగ్ తో రిస్క్స్ ఏంటి? అని మీరు ఆశ్చర్యపోవచ్చు. స్టీరింగ్ చేతులలో మన కంట్రోల్ లో ఉండగా తప్పు ఎలా జరుగుతుందని మీరు అనుకోవచ్చు. అయితే ఇక్కడ గమనించవలసిన అంశం ఏంటంటే యాక్సిడెంట్స్ చెప్పి జరగవు.

దీంతో పాటు, ప్రతి యాక్సిడెంట్ వెనుక మీ తప్పే ఉండాలని లేదు. ఎదుటి వారి తప్పు వల్ల కూడా యాక్సిడెంట్స్ జరగవచ్చు. ఏదేమైనా, ఇరు పార్టీలు యాక్సిడెంట్ వల్ల ఇబ్బంది పడతారు.

డ్రైవింగ్ వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ను ముందుగానే గమనించకపోతే తీవ్రమైన ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. డ్రైవింగ్ వల్ల తలెత్తే సైడ్ ఎఫెక్ట్స్ ను గుర్తించి అందుకు తగ్గ జాగ్రత్తలు తీసుకోవడం ఉత్తమం. మరి అవేమిటో తెలుసుకుందామా?

Health Risks Of Driving You Shouldn't Ignore

యాక్సిడెంట్స్ : వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ రిపోర్ట్ ప్రకారం 2010లో కేవలం రోడ్డు ప్రమాదాల వల్లే ప్రపంచ వ్యాప్తంగా 1.24 మిలియన్లమంది ప్రాణాలు విడిచారు. ఇంతకు మించి డ్రైవింగ్ వల్ల సంభవించే యాక్సిడెంట్స్ తీవ్రత గురించి ఇంకేం చెప్పగలం?

డ్రైవర్ల నిర్లక్ష్యం : మీరు డ్రైవింగ్ ను చాలా నిబద్దతతో చేస్తూ ఉండవచ్చు. అయితే ప్రతి ఒక్కరూ అదే నిబద్దతతో వ్యవహరిస్తామని చెప్పలేం కదా. కొంత మంది డ్రైవింగ్ లో నిర్లక్ష్య ధోరణి ప్రదర్శిస్తారు. వారి వల్లే ఎక్కువగా యాక్సిడెంట్స్ చోటు చేసుకుంటున్నాయి. వేరొకరి నిర్లక్ష్యం వల్ల జరిగే యాక్సిడెంట్స్ కు అమాయకులు బలవుతున్నారు.

మగతలో డ్రైవ్ చేయడం: పెరిగిన వర్క్ లోడ్, నిద్రలేమి ఇవన్నీ మగత డ్రైవింగ్ కు ముఖ్య కారణాలు. ఇటువంటి పరిస్థితులలో డ్రైవ్ చేస్తున్నప్పుడు మీకు తెలియకుండానే మత్తు ముంచుకు వచ్చేస్తుంది. ఆ మత్తు కేవలం కొన్ని క్షణాలే ఉండవచ్చు. అయితే ఫ్రీవే, హైవే లాంటి ప్రదేశాలలో రెప్పపాటు కాలం నూరేళ్ళ జీవితాన్ని నిర్దేశిస్తుంది. కొద్ది క్షణాల మత్తే జీవితాల్ని అల్లకల్లోలం చేసిన సంఘటనలు ఎన్నో.

ఒత్తిడి: ఎక్కువ వర్క్, మానసిక ఒత్తిడి, ఆర్ధిక సమస్యలు ఇలా ఎన్నో జీవితంలో ఒత్తిడికి కారణాలు. ఒత్తిడితో డ్రైవింగ్ చేస్తే డ్రైవింగ్ పై ఏకాగ్రత కుదరదు. తద్వారా అనుకోని సంఘటనలు జరిగే ప్రమాదముంది. ప్రతి రోజు, హెవీ ట్రాఫిక్ లో ఒత్తిడితో డ్రైవింగ్ చేస్తే కచ్చితంగా ఆరోగ్యాన్ని పణంగా పెట్టినవారవుతారు.

నడుం నొప్పి: నడుం నొప్పి, ఎక్కువసేపు డ్రైవింగ్ చేసే వారిలో ఎక్కువగా కనిపించే సమస్య. మోటార్ బైక్ ను డ్రైవ్ చెసే వారు కూడా ఈ సమస్యతో సతమతమవుతారు. నడుంకు సపోర్ట్ ఉండదు కాబట్టి ఎక్కువగా మోటార్ బైక్ ను డ్రైవ్ చెసే వారు ఈ సమస్యతో బాధపడతారు.

డిమ్ లైట్: అప్పుడప్పుడూ డ్రైవర్స్ కు ఎదురయ్యే ప్రతికూల పరిస్థితిది. మంచుతో దారంతా కప్పబడడం వంటి పరిస్థితులు డ్రైవర్స్ కు ఇబ్బందిని కలిగిస్తాయి. దారి సరిగ్గా కనబడదు. ఇలాంటి పరిస్థితులలో అనుకోని ఇబ్బందులు మీకోసం ఎదురుచూస్తూ ఉంటాయి.

పాదచారులు: కొన్ని సార్లు పాదచారుల వల్ల కూడా డ్రైవ్ చెసే వారికి ఇబ్బందులు తలెత్తుతాయి. ట్రాఫిక్ రూల్స్ ను పాటించకుండా సడెన్ గా రోడ్డు దాటేసే వారి వల్ల ప్రాబ్లెమ్స్ వస్తాయి. అనుకోకుండా మన వాహనం ముందుకు వచ్చే వారివల్ల మన వాహనాన్ని కంట్రోల్ చేయడం మన చేతులలో ఉండకపోవచ్చు. పాదచారుల తప్పైనా, ఏదైనా జరిగితే, డ్రైవర్ నే నిందిస్తారు.

కాలుష్యం : డ్రైవ్ చేసేటప్పుడు మీ వాహనంలోని విండోస్ ను మూసి ఉంచడం వల్ల ఇతర వాహనాల నుంచి వచ్చే కాలుష్యం నుంచి మీరు తప్పించుకోవచ్చు. అదే విండోస్ మూసి ఉంచని కార్ ని డ్రైవ్ చేస్తున్నప్పుడు, మోటార్ బైక్ ను డ్రైవ్ చేస్తున్నప్పుడు ఈ కాలుష్యానికి గురైతే ఇబ్బందులు తప్పవు. ఇవి డ్రైవింగ్ చేసేటప్పుడు సంభవించే ఆరోగ్యపరమైన సమస్యలకు మూలం.

English summary

Health Risks Of Driving You Shouldn't Ignore

If you have your own vehicle, then commuting becomes a lot easier. You do not have to depend upon any other means of transport to get to your destination. Your time is in your hands and this feeling of independence brings about a positive feeling in you. But with this benefit of self-dependence come some health risks of driving.
Story first published: Thursday, December 18, 2014, 10:03 [IST]
Desktop Bottom Promotion