For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

నిద్రించే ముందు మనస్సును ప్రశాంత పరచుకోవడం ఎలా

|

ప్రస్తుత ఫాస్ట్ అండ్ బీజీ ప్రపంచంలో, ఏ కాస్త విరామ సమయం దొరికినా సంతోషిస్తారు. ఎందుకంటే, రోజంత పనితో ఒత్తిడి మరియు బాధలను రోజు మాత్రమే కాకుండా రాత్రి సమయాలకు కూడా అలాగే నింద్రించే వరకూ కూడా తీసుకెళుతారు కొందరు. దాంతో నిద్రించే ముందు మనస్సును ప్రశాంతంగా ఉంచుకోవడం కష్టం అవుతుంది.

ఇక పసిపిల్లలు ఉంటే మరింత కష్టం అవుతుంది. ఎందుకంటే మనం పనిచేసే ప్రదేశంలో ఒత్తిడితో కూడిన పని, మరియు వ్యక్తుల మద్య సంబంధాలు మరియు ఆర్ధిక స్థితిగతులు ఎన్నిఉన్నా ఫలితం మాత్రం ఒకేలా ఉంటుంది. కాబట్టి నిద్రించడానికి ముందు మనస్సును విశ్రాంతి పరచుకోవడం చాలా అసరం.

ఆరోగ్యకరంగా జీవించడానికి మన మనస్సును ప్రశాంతంగా ఉంచుకోవడానికి ఆరోగ్యకరమైన మార్గాలను కనుక్కోవడం చాలా అవసరం. నిద్రలేమి అనే వివిధ అనారోగ్యాలకు దారితీస్తుంది, గుండె జబ్బులు, ఆందోళనలు, స్ట్రోక్, మెటబాలిజం తగ్గడం మరియు మధుమేహం వంటి వ్యాధులను ఎదుర్కోవల్సి వస్తుంది . అది వ్యాధినిరోధకతమీద, మనస్సు, మూడ్ మరియు వెయిట్ కంట్రోల్ మీద ప్రభావం చూపుతుందని అనేక అధ్యయానాలు కూడా రుజువు చేశాయి. గాఢంగా నిద్రపోవడం వల్ల అనేక ప్రయోజనాలను పొందవచ్చు. ఆరోగ్య ప్రయోజనాలను మాత్రమే కాదు, బ్యూటీ బెనిఫిట్స్ ను కూడా అనేకం పొందవచ్చు.

పడకమీద చేరగానే నిద్రముంచుకొచ్చేస్తే అందమైన డ్రీమ్స్ ను వస్తాయి. అలాంటి నిద్రపొందాలంటే, బెడ్ మీదకు వెళ్ళడానికి ముందు మీ మనస్సును ప్రశాంతంగా ఉంచుకోవడం చాలా అవసరం..

సెట్టింగ్ క్రియేట్ చేసుకోవాలి:

సెట్టింగ్ క్రియేట్ చేసుకోవాలి:

ఏపాటి చిన్న శబ్దం మరియు వెలుతురు ఉన్నా నిద్రకు భంగం కలుగుతుంది. కాబట్టి, బెడ్ మీదకు వెళ్ళడానికి ముందు ఇటువంటివి లేకుండా చూసుకోవాలి. డిమ్ లైట్స్, సెంటెడ్ క్యాండిల్స్, తక్కువ వాయిస్ తో సాఫ్ట్ మ్యూజిక్, కాఫీ షీట్స్ వంటివాటిని అరేంజ్ చేసుకోవడం వల్ల ప్రశాతంమైన నిద్రను పొందవచ్చు.

రొటీన్:

రొటీన్:

మీరు రొటీన్ గా చేయాల్సింది?చిన్నతనంలో నిద్రించే ముందు ఒక గ్లాసు వెచ్చని పాలు మరియు ఏదా చిన్న కథలు చెబుతుంటే నిద్రపోతుంటారు. కానీ పెరిగే కొద్ది ఆ రొటీన్ పనులు బోరింగ్ గా భావిస్తారు. అందువల్ల రొటీన్ గా చేసే వాటిలో కాస్త మార్పులు చేసుకోవాలి. ఏదైనా పుస్తకం చదవాలనుకొన్నప్పుడూ పూర్తిగా కూర్చొని చదవకుండా పడుకొని చదవితే కొస్తా రిలాక్స్అవుతారు. నిద్ర త్వరగా పడుతుంది. అలాగే నిద్రించే ముందు మంచి సువాషన కలిగిన సోప్స్ లేదా షాంపులు, లోషన్ ను తో స్నానం చేయడం వల్ల మనస్సు ఫ్రెష్ గా ప్రశాంతంగా ఉంటుంది. దాంతో నిద్రబాగా పడుతుంది.

ప్లగ్స్ తీసేయండి:

ప్లగ్స్ తీసేయండి:

గాడ్జెట్స్ (ఎలక్ట్రానికి వస్తువులు(కంప్యూటర్స్, ల్యాంప్ టాప్స్, వీడియోగేమ్స్, మొబైల్స్ )యొక్క ప్లగ్స్ ను తొలగించి తర్వాత నిద్రపోవడానికి ప్రయత్నించాలి. కంప్యూటర్లు, ల్యాప్ టాప్ ల వల్ల నిద్రలేమి దాంతో హార్మోనుల ప్రభావం వల్ల మనస్సు మీద ఒత్తిడి ఎక్కువ అవుతుంది. కాబట్టి, మొదట ఒత్తిడి తగ్గించుకోవాలంటే, రాత్రి సమయంలో సాధ్యమైనంత త్వరగా గాడ్జెట్లకు గుడ్ నైట్ చెప్పండి.

వ్యాయామం -అయితే త్వరగా చేయాలి:

వ్యాయామం -అయితే త్వరగా చేయాలి:

మనస్సును ప్రశాంత పరచుకోవడానికి మరో ఆరోగ్యకరమైన మార్గం. వ్యాయామం ఒత్తిడి మరియు ఆందోళను తగ్గిస్తుంది. దాంతో మెదడుకు ఎండోర్ఫియన్ ను విడుదల చేస్తుంది. శారీరక శ్రమ కూడా మనస్సును ప్రశాంత పరుస్తుంది. అయితే ఎక్కువ వ్యాయామం చేయకండి.

కాఫీ త్రాగకూడదు:

కాఫీ త్రాగకూడదు:

కాఫీలో ఉండే కెఫిన్ నిద్రపట్టకుండా చేస్తుంది. కాబట్టి ప్రశాంతంగా నిద్రపోవాలనుకొనే వారు కాఫీని రాత్రి సమయంలో నివారించండి.

English summary

Healthy Ways To Relax The Mind Before Bed

In our fast and busy world, it’s hard to find a little quiet ‘me’ time. We carry the stress and madness of our day into our nights and bed as well. It becomes impossible to find ways to relax the mind before bed, and wind down.
Story first published: Tuesday, May 20, 2014, 16:26 [IST]
Desktop Bottom Promotion