For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కండరాల తిమ్మిరి కొరకు సహజ ఇంటి నివారణలు

By Super
|

కండరాల తిమ్మిరి అనేది కండరాలను మితిమీరి వాడటం,నిర్జలీకరణ,ఒత్తిడి లేదా అలసట వలన వస్తుంది. కానీ ఈ తిమ్మిరి మీరు నిద్రిస్తున్న సమయంలో పిక్కల నొప్పి లేదా స్పష్టమైన కారణం లేకుండా కండరాలు పట్టటం జరుగుతుంది. నాడీ వ్యవస్థ నుండి ఒక తప్పు రసాయన సంకేతం రావటం వలన కండరాల క్షీణతకు మూల కారణంగా చెప్పవచ్చు. మీ కండరాల నొప్పి నుంచి ఉపశమనం కొరకు సహజమైన ఇంటి నివారణలను ప్రయత్నించండి.

How To Prevent Muscle Cramps

మీరు కండరాల తిమ్మిరి కోసం ఏమి చెయ్యగలరు

కండరాల విశ్రాంతి మరియు ప్రభావిత ప్రాంతంలో రక్త ప్రవాహాన్ని పెంచటానికి కండరాల మీద ఒక ఎలక్ట్రిక్ తాపన ప్యాడ్ లేదా వేడి వాష్ వస్త్రంను ఉంచండి. తక్కువగా ప్యాడ్ సెట్ చేసి 20 నిమిషాలు ఉంచుకోండి.

గోరువెచ్చని నీటిలో అర కప్పు ఎప్సోమ్ ఉప్పు వేసి పావు గంట సేపు కాళ్ళను అందులో ఉంచాలి. ఎప్సోమ్ ఉప్పు లో ఉన్న మెగ్నీషియం కండరాల సడలింపుకు ప్రోత్సహిస్తుంది.

కండరాల తిమ్మిరి ప్రాంతాన్ని కనుగొనేందుకు మీ బొటనవేలు,మీ చేతి యొక్క మడమ లేదా వదులైన పిడికిలితో ఆ ప్రదేశంలో ప్రెస్ చేయాలి. 10 సెకన్ల పాటు ఒత్తిడితో పట్టుకోండి. తర్వాత మళ్ళీ నొక్కండి. మీరు కొంత అసౌకర్యంగా భావిస్తే ఆవిధంగా చేయటం మానివేయాలి. కానీ మీకు వేదించే బాధ ఉండదు. అనేక సార్లు పునరావృత్తులు అయ్యాక నొప్పి తగ్గుతుంది.

ఎలెక్ట్రోలైట్స్ అని పిలిచే తక్కువ స్థాయిలో ఉండే ఖనిజాలు, పొటాషియం,సోడియం,కాల్షియం మరియు మెగ్నీషియం వంటివి కండరాల తిమ్మిరికి దోహదపడవచ్చు. మీకు బహుశా మీ ఆహారంలో సోడియం అవసరం లేదు. సంపూర్ణ ధాన్యం రొట్టెలు మరియు తృణధాన్యాలు,నట్స్ మరియు బీన్స్ లలో మెగ్నీషియం సమృద్దిగా ఉంటుంది. మీరు అరటి,నారింజ మరియు కర్బూజ వంటి పండ్లు,కూరగాయల నుండి పొటాషియంను పొందవచ్చు. అలాగే పాల ఉత్పత్తుల నుండి కాల్షియం పొందవచ్చు.

మీరు వ్యాయామం చేసే సమయంలో కండరాల తిమ్మిరి పొందే అవకాశం ఉండవచ్చు. అప్పుడు వ్యాయామం చేయటానికి రెండు గంటల ముందు కనీసం 2 కప్పుల నీరు త్రాగాలి. వ్యాయామం సెషన్స్ సమయంలో ప్రతి 15 నిమిషాలకు ఒకసారి 125-250 mL నీరు త్రాగాలి. మీకు ఎక్కువ చెమట పట్టుట వలన సోడియం మరియు ఇతర ఎలెక్ట్రోలైట్స్గ్ తగ్గిపోతాయి. వాటిని భర్తీ చేయటానికి గటోరెడ్ వంటి క్రీడల పానీయంను తీసుకోవాలి.

రాత్రి పూట పిక్క తిమ్మిరిని నివారించటానికి,మీ కాలి బొటనవేళ్ల తో ప్రయత్నించవచ్చు. బెడ్ షీట్లను చాల టైట్ గా ఉంచవద్దు. ఈ తిమ్మిరి ఉత్తేజితం మీ కాలి క్రిందికి వస్తుంది.

కండరాల తిమ్మిరి చికిత్స కోసం ఒక సహజ బూస్ట్

ఒక భాగం వింటర్ గ్రీన్ ఆయిల్,నాలుగు భాగాలు విజిటేబుల్ ఆయిల్ లను కలిపి కండరాల తిమ్మిరి ప్రాంతంలో మసాజ్ చేయాలి. వింటర్ గ్రీన్ ఆయిల్ లో మిథైల్ సలిసైలటే ఉండుట వలన ఉపశమనం మరియు రక్త ప్రవాహంలో ఉద్దీపనను కలిగిస్తుంది. ఒక రోజులో ఈ మిశ్రమంను అనేక సార్లు ఉపయోగించవచ్చు. కానీ ఒక వేడి ప్యాడ్ ఉపయోగించకూడదు. ఎందుకంటే చర్మం బర్న్ అయ్యే అవకాశం ఉంది.

రాత్రిపూట లెగ్ తిమ్మిరి నివారించడానికి విటమిన్ E తీసుకోవాలి. కొన్ని అధ్యయనాలు తక్కువ సోడియం తీసుకోవడం వలన ధమనుల ద్వారా రక్త ప్రవాహం మెరుగుపడుతుందని సూచిస్తున్నాయి.

కండరాల తిమ్మిరి తరచుగా నిర్జలీకరణ వలన జరుగుతుంది. అందువలన మీరు తరచుగా తిమ్మిరి పొందుతుంటే, ఎక్కువ నీటిని త్రాగాలి.

English summary

How To Prevent Muscle Cramps

Muscle cramps are caused by overuse of a muscle, dehydration, stress or fatigue. But if calves cramp painfully when you’re trying to sleep, or a muscle often locks up for no apparent reason, the root cause is a faulty chemical signal from the nervous system that “tells” the muscle to contract. Try these natural home remedies to relieve your muscle pain.
Desktop Bottom Promotion