For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఓరల్ క్యాన్సర్(నోటి క్యాన్సర్)నివారించడం ఎలా

By Super
|

నోటి కుహరంలో పెదవులు,చెంప లైనింగ్,లాలాజల గ్రంథులు,మృదు అంగిలి,హార్డ్ అంగిలి,కొండనాలుక, చిగుళ్ళు,టాన్సిల్స్,నాలుక మరియు నాలుక కింద ప్రాంతం ఉంటాయి. నోటి కుహరంలో ఏ ప్రాంతంలో క్యాన్సర్ వచ్చిన దానిని నోటి క్యాన్సర్ అని అంటారు. ఈ ప్రదేశాలలో శరీర కణాల అసాధారణ పెరుగుదల వలన నోటి క్యాన్సర్ వస్తుంది.

నోటి క్యాన్సర్ అభివృద్ధి చెందటానికి వయస్సును ఒక కారణంగా చెప్పవచ్చు. ఇదేకాక క్యాన్సర్ అభివృద్ధిని పెంచే ఇతర హానికరమైన కారకాలు ఉన్నాయి. ఈ ప్రమాద కారకాల నుండి దూరంగా ఉంటే కనుక నోటి క్యాన్సర్ నిరోధించడానికి సహాయం చేస్తుంది.

పొగాకు వినియోగం

పొగాకు వినియోగం

పొగాకును సిగరెట్లు,సిగార్లు,పైపులు లేదా పొగాకు నమలటం ఏ రూపంలో తీసుకున్న నోటి క్యాన్సర్ కు కారణమవుతుంది. సిగరెట్లు కాల్చటం వలన వచ్చే పొగ వలన నోటి క్యాన్సర్ అభివృద్ధి ప్రమాదం పెరుగుతుంది. మీరు స్మోకింగ్ మానివేయుట ద్వారా ప్రమాదాన్ని తగ్గించవచ్చు.

మద్యం వినియోగం

మద్యం వినియోగం

మద్యం వినియోగం అనేది నోటి క్యాన్సర్ అభివృద్ధి ప్రమాదాన్ని గణనీయంగా పెంచుతుంది. మీరు రోజు మద్యం తీసుకోవటం ఎక్కువగా ఉంటే ప్రమాదం కూడా పెరుగుతుంది. మద్యం త్రాగని వారిలో కంటే త్రాగే వారిలో నోటి క్యాన్సర్ ప్రమాదం మూడు రెట్లు అధికంగా ఉంది.

సూర్యరశ్మి

సూర్యరశ్మి

సూర్యరశ్మి వల్ల చర్మ క్యాన్సర్ వంటి క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని చెప్పుతారు. ఇది నోటి క్యాన్సర్ అభివృద్ధి ప్రమాదాన్ని పెంచుతుంది. ముఖ్యంగా పెదవులకు క్యాన్సర్ వస్తుంది. మీరు ఎక్కువగా ఎండ ఉన్నప్పుడు బయటకు రావటం మానుకోండి. ఒకవేళ వస్తే మీ పెదవుల మీద ఒక సన్ స్క్రీన్ లోషన్ రాయటం మర్చిపోకండి.

నోటి ఆరోగ్యం నిర్వహణ

నోటి ఆరోగ్యం నిర్వహణ

ఒక ఆరోగ్యకరమైన నోరు నోటి కుహరం చుట్టూ వచ్చే శక్తివంతమైన క్యాన్సర్ల వృద్ధి మీద పోరాడటానికి సహాయపడుతుంది. మీరు ప్రతి రోజు బ్రష్ ఉపయోగించి పళ్ళు మరియు నాలుకను శుభ్రం చేయండి.

క్రమం తప్పకుండా వ్యాయామం

క్రమం తప్పకుండా వ్యాయామం

క్రమం తప్పకుండా వ్యాయామం చేయుట వలన క్యాన్సర్ వృద్ధికి వ్యతిరేకంగా పోరాటం చేస్తుంది. అలాగే మీ నిరోధక వ్యవస్థను బలోపేతం చేయటానికి సహాయం చేస్తుంది.

ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి

ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి

టమోటాలు,అవిసె గింజలు,బీన్స్,క్రుసిఫెరోస్ కుటుంబానికి చెందిన కూరగాయలు,ఆకు పచ్చని ఆకుకూరలు, గ్రీన్ టీ వంటి ఆహారాలు క్యాన్సర్ నివారణలో ఒక ప్రధాన పాత్రను పోషిస్తాయి. మీరు మీ రోజువారీ ఆహారంలో ఇటువంటి ఆరోగ్యకరమైన ఆహారం ఉండేలా చూసుకోండి.

English summary

How to Prevent Oral Cancer

The oral cavity comprises of lips, cheek lining, salivary glands, soft palate, hard palate, uvula, gums, teach, tonsils, tongue and the area under the tongue. When cancer strikes any of these parts of the oral cavity it is termed as oral cancer.
Desktop Bottom Promotion