For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మీరు సొమ్మసిల్లి పడిన వెంటనే చేయవలసిన ముఖ్యమైన విషయాలు

|

ఎండాకాలంలో పిల్లలు, పెద్దలు ఎదుర్కొంటున్న ఒక సాధారణ సమస్య స్పృహ తప్పి పడిపోవటం..తక్కువ రక్తపోటు లేదా నిర్జలీకరణ, మీరు స్పృహ తప్పి పడిపోవడానికి ప్రధానకారణం కావొచ్చు.

స్పృహ తప్పి పడిపోయిన తర్వాత మీరేమి చేయాలి? మీరు ఈ తాత్కాలిక స్పృహ తప్పటం అన్న సమస్య నుండి ఉపశమనానికి మీకు ఐదు అవసరమైన విషయాలను బోల్ద్స్కై మీతో పంచుకుంటున్నారు.. మీరు ఎప్పుడూ స్పృహ తప్పి పడిపోతున్నట్లయితే ఈ సంరక్షణ చిట్కాలు ఎల్లప్పుడూ మనస్సులో ఉంచుకోండి. (క్రమం తప్పకుండా స్పృహ తప్పి పడిపోవడం అన్నది ఒక తీవ్రమైన సమస్య, కాబట్టి వెంటనే డాక్టరును సంప్రదించటం ఉత్తమం)

సాధారణంగా స్పృహ కోల్పోయిన తరువాత, రోగికి సమీపంలో ఉన్న వ్యక్తి శరీరం చల్లబడటానికి బాధితుడి ముఖం మీద నీటిని చిలకరించాలి. స్పృహ తప్పి న తరువాత మీరు బాధితుడు సులభంగా శ్వాస తీసుకుంటున్నారని నిర్ధారణ చేసుకోవాలి మరియు పూర్తి స్పృహ రావటానికి మంచినీరు త్రాగించండి. వైద్య పరంగా, మెదడుకు జరిగే రక్త సరఫరాలో ఒక చిన్న నిలుపుదల కలగటం వలన ఈ తాత్కాలిక స్పృహ తప్పటం కలుగుతుంది. మీరు స్పృహ కోల్పోయిన తరువాత, మరింత రక్తం మెదడుకు చేరటంవలన మీకు మళ్లీ పూర్తి స్పృహ రావటానికి సహాయపడుతుంది.

మీరు స్పృహ తప్పిన తర్వాత ఏమి చేయాలి? స్పృహ తప్పిన తర్వాత సులువుగా అనుసరించే ఐదు :సంరక్షణ చిట్కాలు ఇస్తున్నాము.

Important Things To Do After You Faint

ఎప్పుడు నిలబడవొద్దు
ఒకసారి మీరు తిరిగి స్పృహలోకి వొచ్చిన తరువాత, మీరు కూర్చుని ఉండటం లేదా పడుకోవటం మంచిది. స్పృహ వొచ్చిన వెంటనే నించోవటం వలన మెదడుకు రక్తసరఫరా తక్కువగా జరుగుతుంది. అందువలన మీరు తిరిగి స్పృహ కోల్పోవొచ్చు. మీరు స్పృహలోకి వొచ్చిన వెంటనే మీరు గుర్తుంచుకోవలసిన ముఖ్యమైన విషయం ఇది

ఉప్పు ఉన్న ఆహారం తీసుకోండి
స్పృహలోకి వొచ్చిన తరువాత ఉప్పు ఉన్న ఆహారం తీసుకోవటం వలన మీ తక్కువ రక్తపోటు సాధారణ స్థితిలోకి వొస్తుంది. ఒక చిటికెడు ఉప్పు మీ నాలుక మీద వేసుకున్నట్లయితే మీకు స్పృహ వొచ్చిన తరువాత సాధారణ స్థితి పొందుతారు.

సులభంగా శ్వాస తీసుకోండి
మీరు స్పృహ కోల్పోయినప్పుడు తగినంత ఆక్సిజెన్ అందేట్లుగా చూసుకోండి. మీ ఛాతీ మీద మరియు మీ ఉదరం చుట్టూ బిగుతుగా ఉన్న దుస్తులను సదలించండి. ఈ రకంగా చేయటంవలన సులభంగా శ్వాస తీసుకుంటారు.

నెమ్మదిగా నీరు త్రాగండి
స్పృహ రావటానికి తీసుకునే ముఖ్యమైన జాగ్రత్తలలో ఒకటి మంచినీరు నెమ్మదిగా త్రాగించటం. మీరు స్పృహ కోల్పోవటానికి కారణం మీరు నిర్జలీకరణ పొందటం. అందువలన మీరు మంచినీరు త్రాగటంవలన మీరు మంచి అనుభూతి చెందుతారు మరియు సులభంగా శ్వాస పీల్చగలుగుతారు.

సిట్రిక్ బూస్ట్
మీకు స్పృహ వొచ్చిన గంట తర్వాతగాని లేదా ఎక్కువ సమయం తరువాతగాని పుల్లటి పండ్ల పానీయం త్రాగండి. నారింజ, నిమ్మ మరియు పైనాపిల్ వంటి పుల్లటి పండ్లు తినవచ్చు.

Desktop Bottom Promotion