For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

భోజం చేసేప్పుడు మధ్యలో నీరు త్రాగడం ఆరోగ్యానికి మంచిదేనా

|

రోజు శరీరానికి సరిపోయేన్ని నీటిని త్రాగటం ఆరోగ్యానికి మంచిదే, శరీరానికి చాలా అవసరం కూడా. నీరు లేకుండా మానవ మనుగడ లేదు, సరైన మొత్తంలో నీరు త్రాగకపోవటం వలన కూడా ఆరోగ్యంగా ఉండలేము. కావున ఆరోగ్యంగా ఉండటానికి, మానవులు జీవనం కొనసాగించుటకు నీరు తప్పని సరి అని చెప్పవచ్చు. భోజన మధ్యలో నీరు త్రాగవచ్చా? ఈ ప్రశ్న చాలా మందిని ఇబ్బంది పెడుతుంది. నిపుణులు కూడా వీటి పైన చర్చలు జరుపుతున్నారు. భోజన సమయంలో నీరు త్రాగటం ఆరోగ్యానికి హానికరమా! లేదా ఉపయోగకరమా! అనేది అందరిని ఆలోచింప చేస్తున్న ప్రశ్న.....

అంతేకాకుండా తినేటపుడు నీటికి బదులుగా ఇతర ద్రావణాలు అందుబాటులో లేవు అని చెప్పవచ్చు, ఈ విషయం ఇప్పటికి కూడా చర్చలలో ఉంది. భోజన సమయంలో నీరు త్రాగటం వలన జీర్ణాశయానికి హనికారమా! లేదా నష్టమా! అనేది ప్రస్తుతం కొనసాగుతున్న చర్చ. భోజన సమయంలో ఎక్కువ నీరు త్రాగటం వలన జీర్ణక్రియను నష్టపరిచే ప్రక్రియ అని కొంతమంది అభిప్రాయం, కావున సరైన మోతాదులో నీరు త్రాగటం వలన జీర్ణక్రియ కూడా మెరుగుపడే అవకాశం ఉంది.

భోజన సమయంలో ఎక్కువ నీరు త్రాగటం వలన జీర్ణాశయంలో విడుదల అయ్యే హార్మోన్, ఆమ్లాల గాడతలు తగ్గిపోయే అవకాశం ఉంది, కావున శక్తివంతంగా ఈ రసాయనాలు జీర్ణక్రియను కొనసాగించలేవు లేదా జీర్ణక్రియను ఆలస్యం చేసే అవకాశం ఉంది. జీర్ణక్రియ నెమ్మదిగా అవటం వలన కలిగే నష్టం ఏమి లేదు కానీ, జీర్ణక్రియ ఆలస్యం అవటం వలన మీరు తినే ఆహరంలో విషపదార్థాల స్థాయిలు అధికం అయ్యే అవకాశం ఉంది.

Is Drinking Water While Eating Good For You?

రోజు మొత్తం మీ శరీరాన్ని హైడ్రేటేడ్'గా ఉంచుకోవటానికి ప్రయత్నించండి. అంతేకాకుండా, భోజనం 30 నిమిషాల ముందు, భోజనం తరువాత నీరు త్రాగటం వలన మీ శరీరం హైడ్రేటేడ్'గా ఉంటుంది. జీర్ణక్రియ కూడా ఎలాంటి సమస్యలు లేకుండా కొనసాగే అవకాశం ఉంది. కావున, భోజన సమయంలో నీరు త్రాగటం అనేది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది, కానీ భోజనానికి ముందు మరియు తరువాత నీరు త్రాగటం వలన మీకు చాలా ఉపయోగాలు ఉన్నాయని నిపుణుల అభిప్రాయం.

ఆహరం తినేటపుడు ఆల్కహాల్ లేదా కార్బోనేటేడ్ ద్రావణాలను తాగటం వలన ఇవి లాలాజల గ్రంధులను పొడిగా చేసి, ఆహారం జీర్ణం అవటాన్ని ఇబ్బందులకు గురి చేస్తుంది.
ఏం చేయాలి?
ఆహారం తినేటపుడు నీరు త్రాగటం వలన మీరు ఎక్కువ సమయం ఆకలిగా అనిపించకుండా ఉంటారు. భోజన సమయంలో నీరు త్రాగటం అనేది మీ లింగత్వం పైన, హైడ్రేటేడ్ స్థాయిలు, మీరు నిర్వహించే పనులు, తినే ఆహారాల పైన ఆధారపడి ఉంటుంది.

భోజనానికి ముందు ఒక గ్లాసు వేడి నీటిని త్రాగటం వలన మీ జీర్ణక్రియ స్థాయిలను మెరుగుపడుతుంది. దీనికి బదులుగా ఆహరం తినేటపుడు కాకుండా భోజనానికి 30 నిమిషాల ముందు మరియు తిన్న 30 నిమిషాల తరువాత నీరు త్రాగటం అనేది మంచి పద్దతి అని చెప్పవచ్చు. ఇలా చేయటం వలన మీరు మంచి ఫలితాలను పొందినట్లయితే దీనిని అనుసరించండి లేదా భోజనం మధ్యలో నీరు తాగటాన్ని అనుసరించండి. కానీ చల్లటి నీరు కన్నా వేడి నీరు తాగటం చాలా మంచిది అని చెప్పవచ్చు.

సూచన: భోజనం చేసేటపుడు నీరు త్రాగటం వలన జీర్ణక్రియ మెరుగుపడుతుంది. ఆహరం మింగటానికి మరియు జీర్ణమవటానికి సహాయపడుతుంది. చల్లటి నీరు మరియు ఆల్కహాల్'ను సేవించకండి.
భోజన సమయంలో ఎక్కువ నీరు తాగటాన్ని తగ్గించండి.

English summary

Is Drinking Water While Eating Good For You?

Adding a little more water to your diet isn’t a bad thing. Drinking during your meals helps you swallow, supports your digestive tract and makes you feel fuller so you eat less. How much water you should be drinking depends on your gender and activity level, but typically if you feel thirsty, you’re not getting enough.
Story first published: Monday, September 22, 2014, 16:51 [IST]
Desktop Bottom Promotion