For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

చికెన్ తింటే ఆరోగ్యానికి లాభమా? నష్టమా

By Super
|

ఏదైనా బాగా తినాలని నోరూరినప్పుడు మనకు ముందుగా గుర్తుకు వచ్చేది చికెన్. జ్యూసీగా, టేస్టీగా ఉండే చికెన్ చంక్స్ తింటే స్వర్గానికి దరిదాపుల్లో ఉన్నంత సంతోషంగా ఉంటుంది. అవునా కాదా? కాని, చికెన్ టేస్ట్ లో ఉన్న గొప్పదనం మనల్ని కొన్ని విషయాలు ఆలోచించనీయకుండా చేస్తుంది. అసలు, చికెన్ తినడం ఆరోగ్యానికి మంచిదేనా?

ప్రతి రోజు చికెన్ ని ఆహారంలో భాగంగా చేసుకోవాలని అనుకోవడం మంచి ఆలోచన కాకపోయినా వారంలో మూడుసార్లు చికెన్ ను తీసుకోవడం ఆరోగ్యానికి మంచిదని నిపుణులు అంటున్నారు. సరైన మోతాదులో ఆహారం తీసుకుంటే వాటి ప్రభావం ఆరోగ్యంపై సానుకూలంగా ఉంటుంది. ఒకే సారి ఎక్కువ మోతాదులో ఆహారం తీసుకుంటే ఆరోగ్యంపై దుష్ప్రభావాలు ఎక్కువ. చికెన్ ను ఎంత ఇష్టపడినా ఎక్కువ మోతాదులో తీసుకోకుండా జాగ్రత్తపడాలి.

ఆహారంలో చికెన్ కు స్థానం కలిపించడం వల్ల మన ఆరోగ్యంపై చికెన్ ఏ విధమైన ప్రభావం చూపుతుందో ఇపుడు తెలుసుకుందాం. చికెన్ ను వెయిట్ లాస్ డైట్ గా పేర్కొంటారన్న విషయం మనకందరికీ తెలిసిందే. వీటితో పాటు చికెన్ ను తీసుకోవడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

ఆరోగ్యకరమైన ఎముకలు

ఆరోగ్యకరమైన ఎముకలు

బోన్ డెన్సిటీని పెంచే గుణం చికెన్ లో ఉంది. అందువల్ల సాధారణంగా సంభవించే ఆస్టియోపోరోసిస్, ఆస్టియోఆర్త్రైటిస్ అనే బోన్ డిసీస్ ల నుంచి రక్షించే కెపాసిటీ చికెన్ లో ఉంది. సరైన పోషకాలున్న చికెన్ సూప్స్ కూడా అందుబాటులో ఉంటాయి. రోగులు త్వరగా కోలుకునేందుకు వీటిని వైద్యులు సూచిస్తూ ఉంటారు కూడా.

ప్రోటీన్ లెవల్స్ ను పెంపొందిస్తుంది

ప్రోటీన్ లెవల్స్ ను పెంపొందిస్తుంది

చికెన్ లో ఎన్నో మంచి పోషకాలు ఉంటాయి. ఇందులో లభించే ఎన్నో పోషకాలు ఆరోగ్యంగా ఉండేందుకు తోడ్పడతాయి. పెరుగుదలకు అవసరమైన ఎమినో యాసిడ్స్ వంటి వివిధ రకాల ప్రోటీన్స్ చికెన్ లో పుష్కలంగా లభిస్తాయి.

మనసును చురుగ్గా ఉంచుతుంది

మనసును చురుగ్గా ఉంచుతుంది

చికెన్ ను క్రమం తప్పకుండా ఆహారంలో తీసుకునే వారి ఫిజికల్ యాక్టివిటీలు పెరిగే అవకాశాలున్నాయని తాజా అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. మనసుకు ప్రశాంతతనిచ్చి సెల్ఫ్ కంట్రోల్ ను పెంపొందించే శక్తి చికెన్ లో ఉందని అధ్యయనాలు తెలిపాయి.

పిల్లల ఎదుగుదలకు తోడ్పడుతుంది

పిల్లల ఎదుగుదలకు తోడ్పడుతుంది

పిల్లల ఆహారంలో చికెన్ కు మొదటి ప్రాధాన్యం ఇస్తారు. తల్లులు తమ పిల్లల ఎదుగుదల సక్రమంగా ఉండేందుకు వివిధ రకాల పోషకాలు పుష్కలంగా ఉన్న చికెన్ ను తమ పిల్లలకు ఆహారంగా ఇస్తారు. మెదడు ఎదుగుదలకు చికెన్ తోడ్పడుతుంది. ఎముకలను శక్తివంతం చేస్తుంది. రోగనిరోధకశక్తిని పెంపొందిస్తుంది. పిల్లల ఎదుగుదల సక్రమంగా ఉండేందుకు చికెన్ తోడ్పడుతుంది.

పెద్ద పెద్ద రోగాలను అరికడుతుంది

పెద్ద పెద్ద రోగాలను అరికడుతుంది

ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవడం ద్వారా అలాగే క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం ద్వారా ఆరోగ్యంగా ఉండవచ్చు. చికెన్ ను సరైన మోతాదులో ఆహారంలో తీసుకోవడం ద్వారా ఆరోగ్యంగా ఉండవచ్చు. డిప్రెషన్, గుండె వ్యాధులు అలాగే కొన్ని ఊపిరి సంబంధమైన వ్యాధుల బారిన పడకుండా చికెన్ రక్షిస్తుంది. రెడ్ మీట్స్ కంటే చికెన్ ఎంతో ఉత్తమం.

కండరాల నిర్మాణంలో ప్రధాన పాత్ర

కండరాల నిర్మాణంలో ప్రధాన పాత్ర

ఆరోగ్యకరమైన, ఫీట్ గా ఉన్న శరీరాన్ని పొందాలని అనుకునే వారు కచ్చితంగా చికెన్ ను సరైన మోతాదులో ఆహారంగా తీసుకోవాలి. వ్యాయామాన్ని విస్మరించకూడదు. చికెన్ ఈ విషయంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఇప్పటికైనా చికెన్ ను ఆహారంలో భాగంగా చేసుకోవడం వల్ల కలిగే లాభాలు అర్థమయ్యాయి కదా. చికెన్ ను నిర్లక్ష్యం చేయకండి మరి.

చెడు ప్రభావం

చెడు ప్రభావం

చికెన్ వల్ల కలిగే లాభాలే కాకుండా చికెన్ వల్ల కలిగే నష్టాలను కూడా పరిగణలోకి తీసుకోవాలి. అపరిశుభ్రంగా వండిన చికెన్ వల్ల అనారోగ్యానికి గురయ్యే అవకాశాలు ఎక్కువ. జీర్ణక్రియ మందగిస్తుంది. చికెన్ లో ఫైబర్ అధికంగా ఉంటుంది. అందువల్ల చికెన్ ను జీర్ణించుకోవడం కొంచెం కష్టతరమవుతుంది. చికెన్ ను జీర్ణించుకోవడం కొన్ని గంటలు పట్టవచ్చు.

హనీకరమైన బ్యాక్టీరియా

హనీకరమైన బ్యాక్టీరియా

సరైన టెంపరేచర్ లో చికెన్ ను వండాలి. చికెన్ ను వండేటప్పుడు టెంపరేచర్ ను గమనించడానికి మార్కెట్ లో కొన్ని పరికరాలు లభ్యమవుతాయి. వాటిని కొని తెచ్చుకుంటే చికెన్ ను వండేటప్పుడు టెంపరేచర్ మీ గమనించవచ్చు. వండిన 24 గంటలలో చికెన్ తో తినకపోతే హనీకరమైన బ్యాక్టీరియాకు చికెన్ నిలయమవుతుంది. పాడైన చికెన్ తింటే ఎన్నో రకాల ఆనారోగ్య సమస్యలు వెంటాడుతాయి.

హార్మోన్స్ తో ఇంజెక్ట్ చేయబడిన చికెన్

హార్మోన్స్ తో ఇంజెక్ట్ చేయబడిన చికెన్

చికెన్ కు ఉన్న హై డిమాండ్ వల్ల డిమాండ్ ను మీట్ అయ్యేందుకు కొన్ని సార్లు సరైన చికెన్ లు ప్రజలకు అందుబాటులోకి రావట్లేదు. కొన్ని సార్లు సహజసిద్ధమైన చికెన్ కు బదులు ఫాక్టరీ నుంచి కొన్ని రకాల హార్మోన్స్ తో తయారైన చికెన్ లను మార్కెట్ లోకి వదులుతున్నారు. చికెన్ ను కొనేటప్పుడు అందుకే జాగ్రత్తగా ఉండాలి.

English summary

Is Eating Chicken Good Or Bad For Health?

Chicken is the first thing in our minds when we want to eat something irresistible. Juicy, yummy taste of the chicken chunks make you feel lost in the heaven. Don't they? But we surely cannot deny the fact these diverse dishes put a question on the back of our mind - Is eating chicken good or bad for health?
Story first published: Saturday, December 20, 2014, 10:58 [IST]
Desktop Bottom Promotion