For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

గవదబిళ్ళలు – కారణాలు, లక్షణాలు, చికిత్స

By Super
|

గవదబిళ్ళలు వైరల్ ఇన్ఫెక్షన్ వల్ల వస్తాయి, ఇది శరీరంలోని అనేక భాగాలకు తేలికగా విస్తరించి, హానికలిగిస్తాయి, కానీ ఇది ముఖ్యంగా చెవి, గవద మధ్యలో బుగ్గకు వెనుకవైపున ఉండే లాలాజలాన్ని స్రవించే గ్రందిపై ప్రభావాన్ని చూపుతుంది. లాలాజలాన్ని స్రవించే గ్రంధి నెప్పి, వాపులు గవదబిళ్ళలకు కారణాలు.

గవదబిళ్లలకు కారణాలు

గవదబిళ్లలకు ప్రధాన కారణం వైరస్, ఇది లాలాజలం, తుమ్ములు లేదా దగ్గు, ప్రభావిత వ్యక్తీ వస్తువులను వాడుకోవడం వల్ల ఒక వ్యక్తీ నుండి ఇంకొక వ్యక్తికీ తేలికగా అంటుకుంటుంది. వైరస్ అంటిన 14-18 రోజుల తరువాత సాధారణంగా ఈ లక్షణాలు కనిపిస్తాయి.

Mumps – Causes, symptoms and treatment

గవదబిళ్ళల లక్షణాలు

చాలా తక్కువ లక్షణాలు కనిపిస్తాయి, దీనితోపాటు జ్వరం, తలనొప్పి, ఆకలి వేయకపోవడం, నీరసం, నమిలేటపుడు నెప్పి లేదా బుగ్గలు ఉబ్బడం వంటి కొన్ని లక్షణాలు కనిపిస్తాయి.

గవదబిళ్ళలను గుర్తించడం

చెవుకి ముందు భాగంలో కనిపించే గవద వాపు వల్ల ఒక చిన్న పరీక్ష ద్వారా గవదబిళ్ళలను నిర్ధారించవచ్చు. కల్చర్స్ లేదా ఒక రక్త పరీక్ష చేస్తారు, ఇది కూడా రోగాన్ని నిర్ధారిస్తుంది. గవదబిళ్ళలకు వ్యతిరేకంగా రక్తంలో యాంటీ బాడీస్ ఉండడం వల్ల వైరస్ తేలికగా వైరల్ ఇన్ఫెక్షన్ అని నిర్ధారిస్తుంది.

గవదబిళ్ళలకు చికిత్స

గవదబిళ్ళలు వైరల్ ఇన్ఫెక్షన్ అయినప్పటికీ, యాంటీబయాటిక్స్ తో వీటికి చికిత్స సాధ్యం కాదు, ఇవి రెండు వారాలలో వాటంతట అవే తేలికగా నయమవుతాయి. ఇబుప్రోఫెన్ లేదా పారాసేట్మాల్ వంటి పైన్ కిల్లర్లను వాడవచ్చు, వాపు ఉన్న ప్రదేశంలో కోల్డ్ పాక్స్ కూడా సహాయపడతాయి.

నొప్పిని తగ్గించేవి, పూర్తి విశ్రాంతి, వాపు ఉన్న ప్రదేశంలో ఐస్/చల్లని గుడ్డను ఉంచడం, ఎక్కువసేపు నమలకుండా తినే ఆహరం తీసుకోవడం, ఫ్లూయిడ్స్ ఎక్కువ తీసుకోవడం, పులుపు పండ్లు తీసుకోకపోవడం వంటి గృహ వైద్యాలు రోగికి విస్తరించిన రోగాన్ని నయంచేస్తాయి.

గవదబిళ్ళలకు నివారణా చర్యలు

MMR (అమ్మవారు – గవదబిళ్ళలు – పొంగు) వాక్సినేషన్ సురక్షితమైన, గవదబిళ్ళల నివారణకు అత్యంత ప్రభావితం చేసే విధానం. ఈ వాక్సినేషన్ ముందుగా ఇవ్వకపోతే, సాధారణంగా 12-15 సంవత్సరాల వయసు వారికి, రెండవది 4-6 సంవత్సరాల వయసువారికి లేదా 11-12 సంవత్సరాల వయసు వారికి MMR రెండు డోసులు ఇవ్వాలి.

English summary

Mumps – Causes, symptoms and treatment

Mumps is a viral infection, which spreads easily and can infect many parts of the body, but mainly affects the salivary glands which are situated toward the back of each cheek in between the ear and jaw.
 
 
Story first published: Friday, February 7, 2014, 10:01 [IST]
Desktop Bottom Promotion