For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఏజ్ 30 క్రాస్ అవుతోందా?మరి మీకు ఈ వైద్యపరీక్షలు తప్పనిసరి

By Super
|

సహజంగా ప్రతి ఒక్కరూ 20-30ఏళ్ళ వరకూ ఎటువంటి అనారోగ్యాలు లేకుండా ఆరోగ్యంగా ఉంటారు. 30ఏళ్ళు వచ్చేసరికి ఎప్పుడు ఎటువంటి జబ్బు బారిన పడని వాళ్ళు కూడా ఏదో ఒక జబ్బును ఎదుర్కుంటున్నారు. అందుకు ప్రధానకారణం, ఆహారపు అలవాట్లు, బిజీ లైఫ్, జీవనశైలిలో మార్పులు. ఈ బిజీ లైఫ్ లో వ్యాయామం చేయడానికి, ఏలేదా డ్యాన్స్ నేర్చుకోవడానికి లేదా స్కైడైవింగ్ వంటివి ఏవైనా కొత్తవి నేర్చుకోవాలన్నా.... చివరకు వైద్యపరీక్షలు చేయించుకోవాలన్నాటైమ్ లేదని గడిపేస్తుంటారు!

కానీ మీరు మెడికల్ టెస్ట్ చేయించుకోవాలని అనుకుంటున్నప్పుడు ఏఏ వైద్య పరీక్షలు చేయించుకోవాలో బహుషా మీకు తెలిసుండకపోవచ్చు. అందుకు ఆందోలన పడాల్సిన అవసరం లేదు, డాక్టర్ ద్వానికా కపాడియా మరియు డాక్టర్ ప్రకాష్ లుల్లా లు మనం 30ఏళ్ళ వయస్సులో ఏఏ వైద్యపరీక్షలు చేయించుకోవాలో మనకు ఈ క్రింది విధంగా వివరించారు.

30ఏళ్ళ వయస్సులో స్త్రీ మరియు పురుషులు చేయించుకోవల్సిన వైద్యపరీక్షలు

బేసిక్ బ్లడ్ టెస్ట్:

బేసిక్ బ్లడ్ టెస్ట్:

మన రక్తంలో బ్లడ్ కౌట్ స్థాయిలు ఎమాత్రం ఉన్నాయో, హీమోగ్లోబిన్ మరియు బైట్ బ్లడ్ సెల్స్ కౌట్ తెలుసుకోవడానికి ఈ బేసిక్ బ్లడ్ టేస్ట్ చేయించుకోవడం చాలా అవసరం. ఈ బ్లడ్ టెస్ట్ వల్ల ఏవైనా పోషకాల(విటమిన్ బి12 లేదా డి3) లోపం ఉన్నా తెలుసుకోవచ్చు.

బ్లడ్ షుగర్ టెస్ట్ :

బ్లడ్ షుగర్ టెస్ట్ :

బ్లడ్ షుగర్ టెస్ట్ వల్ల డయాబెటిస్ ను గుర్తించవచ్చు. రక్తంలో గ్లైకేషన్ హీమోగ్లోబిన్ (రక్తంలో ప్లాస్మా గ్లూకోజ్ )స్తాయిలను గుర్తించవచ్చు.ఈ ప్లాస్మా గ్లూకోజ్ హీమోగ్లోబిన్ హార్ట్ మరియు డయాబెటిస్ సంబంధం కలిగి ఉంటుంది.

యూరిన్ టెస్ట్ :

యూరిన్ టెస్ట్ :

ఏటువంటి ఇన్ఫెక్షన్స్ అయినా ఈ యూరిన్ టెస్ట్ ద్వారా తెలుసుకోవచ్చు.

యూరిక్ యాసిడ్ టెస్ట్:

యూరిక్ యాసిడ్ టెస్ట్:

ప్రత్యేకంగా జాయింట్ పెయిన్స్ తో బాధపడేవారు. హైలెవల్ యూరిక్ యాసిడ్ వల్ల గౌట్ (జాయింట్ ఇన్ఫ్లమేషన్), పెయిన్ వంటివి ప్రతి సాధారణ మనిషి ఎదుర్కొనే సమస్యలను గుర్తించవచ్చు.

లివర్ అండ్ కిడ్నీ ఫ్రొఫైల్:

లివర్ అండ్ కిడ్నీ ఫ్రొఫైల్:

మనశరీరంలో జీవక్రియలన్నీ ఆరోగ్యంగా పనిచేస్తున్నాయా లేదా అని తెలుసుకోవడానికి ఈ రెండు టెస్టులు చేయించుకోవడం చాలా అవసరం. ఇది మీ శరీరంలో హార్మోన్లు మరియు ఎంజైమ్స్, పనిచేసే స్థాయిల గురించి తెలుపుతుంది.

క్రియాటినిన్ లెవల్స్:

క్రియాటినిన్ లెవల్స్:

మీ కిడ్నీలు ఆరోగ్యంగా పనిచేస్తున్నాయా లేదా అని తెలుసుకోవడానికి ఈ టెస్ట్ లు చేయించుకోవడం చాలా అవసరం. బ్లడ్ టెస్ట్ తోనే క్రియాటినిన్ టెస్ట్ కూగా పూర్తి చేయించుకోవచ్చు.

లిపిడ్ ప్రొఫైల్/ఇసిజి:

లిపిడ్ ప్రొఫైల్/ఇసిజి:

మీరు ఫిజికల్ గా యాక్టివ్ గా లేనట్లైతే లిపిడ్ ప్రొఫైల్ టెస్ట్ ను చేయించుకోవచ్చు . రెగ్యురల్ గా చెయించుకోవడం వల్ల ట్రై గ్లిజరైడ్స్ మరియు కొలెస్ట్రాల్ లెవెల్స్ నుఎప్పటికప్పుడు ట్రాక్ చేయడం వల్ల హార్ట్ సంబంధించిన సమస్యలను భవిష్యత్తులో నిర్మూలించవచ్చు . ఇసిజి(ఎకోకార్డియో గ్రామ్) మీ శరీరం ఎక్కువ అలసట, చెమటలు పట్టడం, ఆందోళ, చెస్ట్ పెయిన్ , వంటి లక్షణాలు కనిపించినప్పుడు ఇసిజిని చేయించుకోమని సలహాలిస్తుంటారు .

జనరల్ ఫిజికల్ ఎక్సామినేషన్ :

జనరల్ ఫిజికల్ ఎక్సామినేషన్ :

బ్లడ్ ప్రెజర్ మరియు బరువు తెలుసుకోవడానికి ఉపయోగించే మరో ప్యారమీటర్స్ ను ఉపయోగిస్తుంటారు.

ముఖ్యంగా మహిళలు చేయించుకోవల్సిన మెడికల్ టెస్ట్:

థైరాయిడ్ టెస్ట్ :

థైరాయిడ్ టెస్ట్ :

మహిళల్లో థైరాయిడ్ చాలా సాధారణ సమస్య. థైరాయిడ్ గ్రంథులు సరిగా పనిచేయకపోవడం వల్ల మరియు సరిపడా హార్మోనులను విడుదల చేయకపోవడం వల్ల థైరాయిడ్ వ్యాధులు వస్తాయి. ఇది సడెన్ గా బరువు పెరగడం లేదా బరువు తగ్గడానికి కారణం అవుతుంది. దీంతో పాటు అలసట మరియు ఆందోలణ లక్షణాలు కనిపించినప్పుడు మీరు ఖచ్చితంగా థైరాయిడ్ టెస్ట్ చేయించుకోండి.

సోనోగ్రఫీ:

సోనోగ్రఫీ:

సోనోగ్రఫీ వల్ల మీశరీరంలో లివర్, కిడ్నీ, ఓవరీస్ మరియు యూట్రస్ లు సరిగా పనిచేస్తున్నాయో లేదో అని తెలుపుతుంది. అలాగే ఎంజైమ్స్ అన్నీ సరిగా పనిచేస్తున్నాయో లేదా అని కూడా తెలుపడానికి సహాయపడుతుంది.

English summary

MUST DO MEDICAL TEST AT 30

You are nearing the big 3-O and that checklist of things to do before you hit 30 is looming large. On it are things you never found time for…finally taking that holiday, learning a dance style, sky diving… and medical tests! But when you think of medical tests, you don’t know which ones you need to take.
Desktop Bottom Promotion