For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మిమ్మల్ని బాధపట్టే సాధారణ జబ్బులు-సహజ నివారణోపాయాలు

By Super
|

సహజంగా మీరు తీసుకొనే ఆహారాల వల్ల శరీరానికి అవసరం అయ్యే మినిరల్స్, విటమిన్స్, మరియు న్యూట్రీషియన్స్ అందుతాయి. కానీ కొన్ని ఆహారాల మాత్రము కొన్ని రకాల సమస్యలకు దారితీస్తాయి. అందులో ముఖ్యంగా ఎక్కిళ్ళు మరియు ఎగ్జిమా వంటి చర్మం దురద పెట్టడం వంటి సమస్యలు సాధారణంగా ఉంటాయి.

కాబట్టి, ముఖ్యంగా గుర్తుంచుకోవల్సిన విషయం ఆహారాలను తీసుకొనే ముందు వాటి ప్రయోజనాలను తెలుసుకొని మరీ తీసుకోవల్సి ఉంటుంది. అంతే కాకుండా ఆరోగ్యపరంగా చిన్న చిన్న అనారోగ్య సమస్యలను నివారించ గలిగే ఆహారపదార్థాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. వాటిలో కొన్ని మీకోసం..

మెనుష్ట్రువల్ క్రాంప్స్(రుతుక్రమంలో వచ్చే తిమ్మెరెలను)నివారించడం:

మెనుష్ట్రువల్ క్రాంప్స్(రుతుక్రమంలో వచ్చే తిమ్మెరెలను)నివారించడం:

2వేల సంవత్సరాల నుండి అల్లంను ఒక చైనీ ట్రెడిషిలన్ ఔషదంగా ఉపయోగిస్తున్నారు . అల్లం మన రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం వల్ల ఇది రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది మరియు ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది. ముఖ్యంగా మహిలల్లో కండరాల్లో బాధాను నివారిస్తుంది. యూట్రస్ వద్ద తిమ్మెరలను అరికడుతుంది . పీరియడ్స్ పెయిన్ నివారించడానికి అల్లం ఒక ఐబ్యూఫిన్ గా పనిచేస్తుంది. కాబట్టి, మీ రెగ్యులర్ డైట్ లో అల్లం చేర్చండి మరియు అల్లం టీని రెగ్యులర్ గా తీసుకోండి.

యూరినరీ ట్రాక్ హెల్త్ కోసం క్రాన్ బెర్రీస్:

యూరినరీ ట్రాక్ హెల్త్ కోసం క్రాన్ బెర్రీస్:

క్రాన్ బెర్రీస్ లో ప్రోఆంథోసైలయనిడిన్స్ ఉండటం వల్ల ఇది యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ నివారించడంలో సహాయపడుతుంది. ముఖ్యంగా బ్లాడర్ వాల్స్ కు సోకే ఇన్ఫెక్షన్స్ ను నివారించడంలో క్రాన్ బెర్రీలోని ఇకోలి గ్రేట్ గా సహాయపడుతుంది. మీరు ఇదివరకే యూటిఐ సమస్యతో బాధపడుతున్నట్లైతే క్రాన్ బెర్రీ పనిచేయకపోవచ్చు. అయితే క్రాన్ బెర్రీ రెగ్యులర్ గా తీసుకోవడ వల్ల భవిష్యత్తుల మరే ఇతర ఇన్ఫెక్షన్స్ సోకకుండా నిరోధిస్తుంది. యూటిఐ సమస్య ఉన్నవారు రెండు గ్లాసుల క్రాన్ బెర్రీ జ్యూస్ ను త్రాగడం వల్ల సమస్యను నివారించవచ్చు.

పియంఎస్ కోసం క్యాల్షియం రిచ్ ఫుడ్స్ ఎక్కువగా తీసుకోవాలి:

పియంఎస్ కోసం క్యాల్షియం రిచ్ ఫుడ్స్ ఎక్కువగా తీసుకోవాలి:

పీరియడ్స్ మొదలు కాకముందు మహిళలల్లో వచ్చే ఆంధోళన, మనస్సలో గందరగోళం, తరచూ మనస్సు మారుతుండటం , చీరకుగా ఉండటం వంటి సమస్యలను నివారించబడుతుంది . అందుకు ఒక మంచి పౌషికాహారం తీసుకోవడం వల్ల ఇటువంటి లక్షణాలను నివారించుకోవచ్చు . పియంఎస్ లేనివారి కంటే, పియంఎస్ కలిగి ఉన్నవారిలో క్యాల్షియం లెవల్స్ చాలా తక్కువగా ఉంటాయి. కాబట్టి, ఈ లోటును పోగుట్టుకోవాలంటే, రోజుకు 1000 మిల్లీ గ్రాముల క్యాల్షియం ఫుడ్స్ తీసుకోవాలని ది నేషనల్ ఇస్టిస్ట్యూట్ ఆఫ్ హెల్త్ వారు సూచిస్తున్నారు. డైరీప్రొడక్ట్స్ లో క్యాల్షియం పుష్కలంగా ఉంటుంది . ఇంకా, బాదం, బ్రొకోలీ, గ్రీన్ లీఫ్ మరియు సారిడిన్స్ లో కూడా క్యాల్షియం అధికంగా ఉంటుంది.

చర్మం సమస్య(దురద లేదా ఎగ్జిమా):

చర్మం సమస్య(దురద లేదా ఎగ్జిమా):

ఉదయం తీసుకొనే కొన్ని బ్రేక్ ఫాస్ట్ ఆహారాల వల్ల తరచూ చర్మం దురదపెట్టడం, లేదా చర్మం మీద పొట్టు పొట్టుగా రాలడం, లేదా మంట లేదా బాధగా అనిపించడం జరుగుతుంటుంది. ఓట్ మీల్ రాషెష్ ను నయం చేస్తుంది. ఎందుకంటే వీటిలో ఫైటో కెమికల్స్ పుష్కలంగా ఉండి, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి . అలాగే 1/3కప్పు ఓట్ మీల్ ను పౌడర్ గా చేసి, ఈ పౌడర్ ను గోరువెచ్చని నీటిలో వేసి మీ ముఖానికి మరియు కాళ్ళు చేతులకు పట్టించి తర్వాత స్నానం చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.

డ్రై స్కిన్ కొరకు సీసాల్ట్:

డ్రై స్కిన్ కొరకు సీసాల్ట్:

మోకాళ్ళు, మోచేతులు మరియు పాదాలు చర్మం మీద పొడిబారడం లేదా చర్మం గరుకుగా మారినట్లైతే అందుకోసం ఖరీదైన స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ కొనుగోలు చేయాల్సిన అవసరం లేదు . సీసాల్ట్ స్రబ్బింగ్ వల్ల మంచి ఫలితం ఉంటుంది . సీసాల్ట్ ఒక మంచి ఎక్స్ ఫ్లోయేట్. ఇడి డ్రై స్కిన్ నివారిస్తుంది. ఇంకా చాలాసున్నితమైన ప్రదేశాలు అంటే ముఖం మరియు చేతుల వెనుకభాగం సీసాల్ట్ స్ర్కబ్బింగ్ చేయడం వల్ల రఫ్ నెస్ మాయం అవుతుంది. ఎక్కువ ఎక్స్ ఫ్లోయేట్ చేయడం వల్ల చర్మం కఠినంగా మారవచ్చు.

కళ్ళు ఉబ్బును నివారించే కీరదోసకాయ:

కళ్ళు ఉబ్బును నివారించే కీరదోసకాయ:

చల్లగా ఉండే కీరదోసకాయ ముక్కలను కళ్ళమీద ఉంచుకోవడం, ఇది ఒక పాతకాలపు సౌందర్య చిట్కా , నిజంగానే ఇది అద్భుతంగా సహాయపడుతుంది. కీరదోసకాయలో 95%నీరు ఉండటం వల్ల చర్మానికి ఒక కూలింగ్ ఎఫెక్ట్ ను అందిస్తుంది. రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది మరియు ఇన్ఫ్లమేషన్ ను తగ్గిస్తుంది .ఇంకా చెప్పాలంటే ఐస్ క్యూబ్స్ కంటే మరింత బెటర్ గా పనిచేస్తుంది. కేవలం 10నిముషాలు పెట్టుకుంటే చాలు చాలా ఫ్రెష్ గా కనిపిస్తారు.

మలబద్దకానికి ప్రూనే:

మలబద్దకానికి ప్రూనే:

ఎండని ప్లమ్ ఫ్రూట్ లో సోలబుల్ ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇందులోని న్యూట్రీషియన్స్ మలబద్దకాన్ని నివారించడంలో అద్భుతంగా సహాయపడుతాయి . ఇన్ సోలబుల్ ఫైబర్ నీటిలో కరిగదు, మరియు చాలా వరకూ వ్యర్థాలను ఉత్పత్తి చేసి డైజెస్టివ్ సిస్టమ్ లోకి నెట్టుతుంది. కాబట్టి రోజుకు ఒక ప్రూనే ఫ్రూట్ తీసుకోవాలి. ఫలితం కనిపించనట్లైతే రెండు ఫ్రూనేలు తీసుకోవచ్చు.

ఎక్కిళ్ళకు పంచదార:

ఎక్కిళ్ళకు పంచదార:

ఎక్కిళ్ళు వచ్చినప్పుడు ఒక చెంచా పంచదారను నాలుకు మీద వేసుకోవడం వల్ల ఎక్కిళ్లు ఆగిపోతాయి . ఈ స్వీట్ సెన్షేన్ చాలా స్ట్రాంగ్ గా ఫలితాన్ని అందిస్తాయి. ఎక్కిళ్ళకు కారణం అయ్యే పొట్టలోని డయాప్రగమ్ ను కంట్రోల్ చేస్తాయి. కాబట్టి ఎక్కిళ్ళు తగ్గే వరకూ పంచదారను నాలుకమీద ఉంచుకోవాలి. తర్వాత మింగేయాలి.

గుండెలో మంటకు ఆపిల్స్ :

గుండెలో మంటకు ఆపిల్స్ :

హార్ట్ బర్నింగ్ సెన్షేషన్ ఉన్నట్లైతే సోడా, హై ఫ్యాట్ బీఫ్, వంటి అసిడిక్ రిఫ్లెక్షన్ కు కారణం అయ్యే ఆహారాలను సాధ్యమైనంత వరరకూ నివారించాలి . ముఖ్యంగా మీ రెగ్యులర్ డైట్లో ఆపిల్స్ తీసుకోవాలి. ఎందుకంటే, వీటిలో ఉండే పెక్టిన్ అనే పోషకాంశం ఇది ఒక సోలబుల్ ఫైబర్ దీని వల్ల స్టొమక్ యాసిడ్స్ తో షోషణ చెందుతాయి.

ఇన్ఫెక్షన్స్ ను నివారించే పసుపు:

ఇన్ఫెక్షన్స్ ను నివారించే పసుపు:

పసుపును పురాతన కాలం నుండి ఇక ఔషధవస్తువుగా ఉపయోగిస్తున్నారు. ముఖ్యంగా గాయాలను మరియు ఇన్ఫెక్షన్స్ ను నివారించడంలో చాలా గొప్పగా సహాయపడుతుంది . పసుపులో ఉండే కర్కుమిన్ బలమైన యాంటీ ఇన్ఫ్లమేటరి మరియు యాంటీఆక్సిడెంట్స్ లక్షణాలు కలిగి ఉండి, క్లెన్సింగ్ మరియు గాయాలను మాన్పడంలో గొప్పగా సహాయపడుతుంది. ఏదైనా చిన్న గాయాలు అయినప్పుడ మందులు అందుబాటులో లేనప్పుడు ఇటువంటి చిట్కాలు చాలా గ్రేట్ గా సహాయపడుతాయి.

English summary

Natural-born soothers

You already know that consuming the right foods can boost your intake of minerals, vitamins, and nutrients. But there are a few out there that could also alleviate some of your most pesky daily problems, like hiccups or even rashes like eczema.
Desktop Bottom Promotion