For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

లోబిపికి భయపడాల్సిన పనిలేదు!ఇలా అదుపు చేయవచ్చు

|

సాధారణ బిపిని 120/80 mmHg అను కున్నా కూడా, ఇంకా తక్కువ బిపి (ఉదా హరణకు 110/ 70mmHg) కలవాళ్ళ కంటే వీళ్ళకు గుండె జబ్బులు, పక్షవాతం లాంటివి రావటానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. దీనికి అర్థం ఏమిటంటే బిపి సాధారణ స్థాయి (నార్మల్‌) కంటే కూడా ఇంకా తక్కువ ఉండటమే మంచిది! అయితే ఒకటి - బిపి 90/60 mmHg కంటే తక్కువ ఉండి, కళ్ళు బైర్లుకమ్మటం, కళ్ళు తిరగటం, ఒళ్ళు చల్లబడి చమటలు పోయటంలాంటి లక్షణాలు కనిపించినప్పుడు దానిని అస్వస్థత తాలూకు లోబిపి (Hypertension) కింద భావిం చవచ్చు.అయితే కొందరు వ్యక్తులకు 90/60 mmHg బిపిని కూడా సాధారణం కిందే తీసుకోవచ్చు.

అలాంటి రీడింగ్‌ వచ్చి పై లక్షణాలేవీ కనిపించక పోవటం, కూర్చుని ఉన్న పోజిషన్‌ నుంచి గభాల్న లేచి నిలబడ్డప్పుడు కళ్ళు బైర్లు కమ్మటం, స్పృహ తప్పటం లాంటివేమీ లేన ప్పుడు కూడా దానిని సాధారణం కింద తీసు కోవచ్చు. లోబీపీ లక్షణాలు గుర్తుపట్టడం కొద్దిగా కష్టం. అయితే కళ్లు తిరగడం, నీరసంగా, అలసటగా అనిపించడం వంటివి కనిపిస్తే బీపీ చెక్ చేయించుకోవడం మంచిది.గుండె, రక్తనాళాలకు సంబంధించిన సమస్యలకు దారితీసేది అధిక రక్తపోటు. రక్తపోటు అదుపులో లేకపోవడం వల్ల మెదడు రక్తనాళాల్లో కూడా సమస్యలు తలెత్తుతాయి. ఇలా గుండె, మెదడు, కిడ్నీల లాంటి ప్రధాన అవయవాలను అనారోగ్యంలో పడేసే బీపీని మ ఆహారంతోనే అదుపులో ఉంచుకోవచ్చు.

పాలకూర:

పాలకూర:

పాలకూరలో ఫోలేట్, ఐరన్, విటమిన్-సి అధికంగా ఉంటాయి. కాబట్టి పాలకూర, ఇతర ఆకుకూరలు రక్తపోటుకు మందుగా పనిచేస్తాయి.

అరటి పండ్లు:

అరటి పండ్లు:

అరటిలో ఉండే పొటాషియం రక్తపోటును అదుపు చేయడంలో కీలక పాత్ర వహిస్తుంది.

క్యాల్షియం:

క్యాల్షియం:

కాల్షియం, విటమిన్-డి ఎక్కువగా ఉండే స్కిమ్‌డ్ మిల్క్ కూడా రక్తపోటుని నియంవూతిస్తుంది.

వెల్లుల్లి:

వెల్లుల్లి:

వెల్లుల్లి రక్తపోటును అదుపులో ఉంచడమే కాకుండా రక్త నాళాలలో క్తం చిక్కబడటాన్ని, లేదా గడ్డకట్టడాన్ని అరికడుతుంది.

క్యాబేజ్:

క్యాబేజ్:

క్యాబేజీలోని పొటాషియం, క్రోమియం బీపీని నియంవూతించడం ద్వారా గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి.

టమోటో :

టమోటో :

లైకోపిన్ వంటి యాంటి ఆక్సిడెంట్లు ఉండే టమాట రక్తపోటు నియంవూతణకు ఎంతో తోడ్పడుతుంది.

సన్ ఫ్లవర్:

సన్ ఫ్లవర్:

సన్‌ఫ్లవర్ నూనె, ఆలీవ్‌నూనె, డార్క్ చాకొపూట్‌లు కూడా రక్తపోటు అదుపులో ఉండడానికి ఉపకరిస్తాయి.

సూప్ /బ్లాక్ కాఫీ:

సూప్ /బ్లాక్ కాఫీ:

లోబీపీ ఉన్నప్పుడు బ్లాక్ కాఫీ, వేడి సూప్.. వంటివి సేవించడం మంచిది.

లెమన్ వాటర్:

లెమన్ వాటర్:

ఇలాంటి వాళ్లు తేనె, నిమ్మ రసంలో కొద్దిగా ఉప్పు కలిపి తాగుతూ ఉంటే తాజా తనాన్ని ఫీలవుతారు.

నీళ్ళు:

నీళ్ళు:

శరీరం డీ హెడ్రేట్ అయినప్పుడు రక్త ప్రసరణ తక్కువగా ఉంటుంది. అందుకని రోజుకు 8-10 గ్లాసుల నీళ్లు తప్పనిసరిగా తీసుకోవాలి.

మితాహారం:

మితాహారం:

ఆహారాన్ని ఒకేసారి ఎక్కువ మోతాదులో తీసుకోకూడదు. పొట్ట ఫుల్‌గా ఉంటే బీపీ స్థాయి తగ్గుతుంది. అలాగే వేపుడు పదార్థాలు, ప్రొటీన్లు ఎక్కువ ఉన్న పదార్థాలు తీసుకుంటే త్వరగా జీర్ణం కాదు. సులభంగా జీర్ణం అయ్యే ఆహారాన్ని, రోజులో ఎక్కువసార్లు తక్కువ మోతాదులో తీసుకోవాలి.

నిద్ర:

నిద్ర:

లోబీపీ ఉన్నవారు నిద్రించినప్పుడు సడెన్‌గా లేస్తే తల తిరగడం, గుండెదడగా అనిపించడం జరుగుతుంది. అందుకని నెమ్మదిగా లేవాలి.

ఎత్తై ప్రదేశాలు

ఎత్తై ప్రదేశాలు

ఎత్తై ప్రదేశాలు ఎక్కుతున్నప్పుడు, పై నుంచి కిందకు చూడటం వంటి సందర్భాలలో గుండె దడ వస్తుంది. అందుకని ముందే జాగ్రత్తలు తీసుకోవడం అవసరం.

English summary

Natural ways to get rid of Low Blood Pressure

Low blood pressure is also referred as hypotension. It is caused due to shortage of oxygen in blood and also due to blood loss. Although, low blood pressure is not consider as a big medical problem but it can affect daily life of a person and if the blood pressure becomes extremely low, person may faint.
Story first published: Monday, April 21, 2014, 16:51 [IST]
Desktop Bottom Promotion