For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఆరోగ్యకరంగా ఉపవాసం ఉండటానికి ఉత్తమ చిట్కాలు

|

మహా శివరాత్రి చాలా పాపులర్ అయినటువంటి హిందూ ఫెస్టివల్ . ఈ పవిత్రమైన పండుగను, చాలా భక్తి, శ్రద్దలతో జరుపుకుంటారు. ముఖ్యంగా ఈ రోజున చాలా మంది ఉపవాసం ఉంటారు. శివరాత్రి సందర్భంగా ఉపవాసం చేయడం ఎప్పటినుంచో వస్తున్న అనవాయితి. పూర్వికులు ఏర్పాటుచేసిన అనేక సంప్రదాయాలు, ఆచారాలు అన్నీ ఎంతో కొంత మానవ ఆరోగ్యంతో,ప్రాపంచిక, ప్రకృతి ధర్మాలతో ముడిపడి ఉన్నాయని అందరీకి తెలిసింది. శివరాత్రి సందర్భంగా పరమేశ్వరుడిని తలనుకొని ఆ రోజంతా ఆహారానికి దూరంగా ఉంటారు. ఉపవాసాలు హిందుమతంలోనే కాదు ఇతర మతాలలో కూడా కనిపిస్తుంటాయి. సాధారణంగా రాత్రి భోజనానికి మరుసటి రోజు ఉదయం టిఫిన్‌ కు మధ్య దాదాపు పదిగంటల వ్యవధి ఉంటుంది. ఇది ప్రతి రోజు మనం చేసే ఉపవాసమే. దీనికి దేహం సహజంగా అలవాటు పడి ఉంటుంది. చాలా మంది మహాశివరాత్రి రోజు దేవుడి అనుగ్రహం పొందడానికి శివుడుని భక్తి శ్రద్దలతో కొలిచి, ఉపవాస దీక్షలు చేస్తారు. అయితే కొంత మంది ఆహార ప్రియులు మాత్రం ఉపవాసం చేస్తూనే అల్పాహారం తీసుకుంటుంటారు.

శివరాత్రి రోజున ఉపవాసం ఉండే వారు కొంత మంది పండ్లతో రోజంతా గడుపుతారు. మరికొందరు వండిని పదార్థాలు తింటూ ఉపవాసం చేస్తారు. సంపూర్ణ ఉపవాసం ఉండే వారు పచ్చి మంచి నీళ్ళు కూడా త్రాకుండా ఉపవాసం ఉంటారు. అయితే కొంత మంది బంగాళదుంపలు, ఫ్రూట్స్, పచ్చికూరలు, క్యారెట్స్, కీరదోసక మొదలగువి మరియు పండ్ల రసాలు తీసుకుంటూ ఉపవాశం ఉంటారు. కొంత మంది సగ్గుబియ్యంతో లేదా గోధుమ పిండితో తాయారు చేసిన ఆహారాలను తీసుకుంటారు. హిందూసాంప్రదాయంలో ఉపవాసం చేసేవారు అల్పాహారం తీసుకుంటారు. అందులో ముఖ్యంగా సగ్గు బియ్యం చాలా ముఖ్యమైనది. కొంత మంది ఎటువంటి అల్పాహారం, పండ్లు, నీళ్ళు కూడా త్రాగకుండా ఉండే వారు అది క్రాస్ డైట్ అవుతుంది.

రోజంతా ఉపవాసం ఉండటంలో ఎనర్జీలెవల్స్ తగ్గిపోతుంది. దాంతో మీరు నిరుత్సాహంగా, వీక్ గా మారుతారు. మరియు ఆకలి వేస్తుంటుంది. కాబట్టి, ఆరోగ్యపరంగా ఎటుంటి సమస్యలు ఏర్పడకుండా ఆరోగ్యకరంగా ఉపవాసం ఉండాలంటే కొన్ని రకాలా హల్తీ ఫాస్టింగ్ ఫుడ్స్ ఉన్నాయి. మీరు కూడా ఈ శివరాత్రి రోజున ఉపవాసం ఉంటున్నట్లైతే ఈ ఆరోగ్యకరంగా ఎలా ఉండాలో క్రింది విధంగా తెలుసుకోండి.

రాత్రిల్లో ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి:

రాత్రిల్లో ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి:

ఉపవాసం ఉండే ముందురోజు ఎక్కువ ఆహారం తీసుకోకూడదు. ఉపవాసం ఉండే రోజు ముందు రోజు ఆరోగ్యకరమైన ఆహారాలను తీసుకోవాలి. ఇది మీకు అన్ని రకాలా జీర్ణక్రియల ఆరోగ్యానికి సహాయపడుతుంది.

కారం ఆహారాలను నివారించాలి:

కారం ఆహారాలను నివారించాలి:

ఉపవాసం ఉండే ముందు రోజు కారంగా ఉన్న ఆహారాలను తీసుకోవడం వల్ల, ఉపవాసం రోజున పొట్ట సమస్యలు ఎసిడిటి, అజీర్తి, మరియు విరేచనాలు వంటి సమస్యలను ఎదుర్కోవచ్చు. కాబట్టి, ఆరోగ్యకరమైన ఆహారాలు తీసుకోవడం ఉత్తం.

శరీరంను తేమగా ఉంచుకోవాలి

శరీరంను తేమగా ఉంచుకోవాలి

ఆరోగ్యకరంగా ఉపవాసం ఉండాలనుకొనే వారు, ఆహారం ఏమాత్రం తీసుకోకపోయినా సరే సరిపడా నీరు తీసుకోవాలి. సాధ్యమైనంత వరకూ ఎక్కువగా నీళ్ళు తీసుకోవాలి. నీరు ఎక్కువగా త్రాగడం ల్ల ఇది మన శరీరాన్ని హైడ్రేషన్ లో ఉంచి, మీ పొట్ట ఫుల్ల్ గా ఉండే లా అనుభూతిని కలిగిస్తుంది మరియు ఇది వ్యాధినిరోధకతను పెంచుతంది.

తాజా పండ్లను తీసుకోవాలి

తాజా పండ్లను తీసుకోవాలి

ఉపవాసం ఉన్న సమయంలో మీరు పండ్లను తీసుకొనేట్లైతే, తాజాగా ఉండే, పండ్లను తీసుకోవడం ద్వారా మీ శరీరానికి అవసరం అయ్యే న్యూట్రీషియన్స్ మరియు విటమిన్స్ అంధిస్తాయి. కడుపు నింపే అరటిపండ్లు మరియు పాలు వంటివి ఉపవాసం రోజున తీసుకోవచ్చు.

ఆకలి కలిగి ఉండకండి

ఆకలి కలిగి ఉండకండి

ఉపవాసం ఉండే రోజు, ఆ రోజులో ఒక పూట్ భోజనానికి అల్పాహారం తీసుకోవాలని చూస్తారు కాబట్టి, అలా ఆత్రుత పండకుండా, ఒక్క సారిగా ఎక్కువగా తినకుండా జాగ్రత్త తీసుకోవాలి. ఉపవాసం ఉండే ఒక్క సారిగా ఎక్కువ ఆహారం తీసుకోవడం వల్ల అజీర్తి లేదా బరువు పెరగడం జరగుతుంది.

 రిచ్ ఫుడ్స్ కు దూరంగా ఉండాలి

రిచ్ ఫుడ్స్ కు దూరంగా ఉండాలి

ఉపవాసం వేళ, ఫ్రై చేసిన మురియు అధిక క్యాలరీలున్న ఆహారాలను తీసుకుంటారు. హెల్తీ కుక్కింగ్ పద్దతిని అనుసరించి బరువు పెంచే ఆహారాలకు దూరంగా ఉండండి.

షుగర్ లెవల్స్ ను బ్యాలెన్స్ చేసుకోవాలి

షుగర్ లెవల్స్ ను బ్యాలెన్స్ చేసుకోవాలి

ఉపవాసం ఉన్న సమయంలో రక్తంలోని షుగర్ లెవల్స్ తగ్గిపోవడం జరుగుతుంది. షుగర్ లెవల్స్ తగ్గిపోవడంతో శరీరంలో శక్తిని కోల్పోతుంది. సాధ్యం అయితే పాలు మరియ పంచదారతో తయారుచేసే స్వీట్స్ నుతీసుకోండం మంచిది.

మీరు తీసుకొనే ఆహారం మీద ప్రత్యేక శ్రద్ద

మీరు తీసుకొనే ఆహారం మీద ప్రత్యేక శ్రద్ద

నార్త్ ఇండియన్లు ఉపవాసం ఉంటూనే ఫ్రైడ్ ఫుడ్స్, చిప్స్ మరియు పకోడా వంటి అల్పాహారాలను తీసుకుంటారు. ఫ్రైడ్ ఫుడ్స్ గ్యాస్ ను ఉప్పత్తి చేసి, కడుపు ఉబ్బరంగా ఉండేలా చేస్తాయి. కాబట్టి, మీరు తీసుకొనే ఆహారం మీద ప్రత్యేక శ్రద్ద తీసుకోవాలి.

పండ్ల రసాలు

పండ్ల రసాలు

తాజాగా ఉండే పండ్ల రాసాలను తీసుకోవాలి. ముఖ్యంగా మిల్క్ షేక్స్ తీసుకోవడం ద్వారా మీ పొట్ట నిండుగా ఉన్న అనుభూతిని కలిగిస్తూం మిమ్మిలి శక్తివంతులుగా ఉంచుతంది.

English summary

Shivratri Vrat: Tips For Healthy Fasting


 Maha Shivratri is one of the most popular Hindu festivals which is celebrated with great vigour and devotion. Devotees of Lord Shiva observe whole day fast. However, Shivratri fasts are not very strict when compared to the other ones like Navratri and Karwa Chauth.
Story first published: Thursday, February 27, 2014, 11:28 [IST]
Desktop Bottom Promotion