For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పెద్ద ప్రేగు, జీర్ణాశయంను శుభ్రం చేసే 10 ఉత్తమ హోం రెమెడీస్

By Super
|

పెద్ద ప్రేగుకు వచ్చే ప్రధానమైన సవుస్య కోలన్ క్యాన్సర్. దీనిపై అందరికీ అవగాహన అవసరం. ఏటా ప్రపంచవ్యాప్తంగా 5 లక్షల వుందిని బలితీసుకుంటున్న ఈ వ్యాధిని ముందే పసిగడితే నివారించడం పూర్తిగా సాధ్యం. అందరూ 50 ఏళ్లు దాటాక విసర్జక అలవాట్లలో ఏవైనా మార్పులు కనిపించినప్పుడు వెంటనే పరీక్షలు చేయించినా, 50 ఏళ్ల వయుసు దాటాక ఏ లక్షణాలు కనిపించకపోయినా ప్రతి ఐదేళ్లకోసారి ‘ప్రివెంటివ్ స్క్రీనింగ్ కార్యక్రమం' కింద క్రమం తప్పకుండా పరీక్షలు చేయించుకున్నా తప్పనిసరిగా నివారించతగ్గ వ్యాధే కోలన్ క్యాన్సర్. అందునా గతంలో కుటుంబ సభ్యుల్లో ఎవరికైనా కోలన్ క్యాన్సర్ వచ్చిన కుటుంబ చరిత్ర ఉన్నా పరీక్షలు చేయించడం తప్పనిసరి.

కోలన్ క్యాన్సర్ లక్షణాలు: మలవిసర్జన సమయుంలో రక్తం పడుతున్నా, మలబద్ధకం తీవ్రంగా ఉన్నా లేదా ఆగకుండా నీళ్లవిరేచనాలు అవుతున్నా, ఈ రెండు సమస్యలూ ఒకదాని తర్వాత మరొకటి కనిపిస్తున్నా, రక్తహీనత, కడుపులో నొప్పి, మలవిసర్జన తర్వాత కూడా ఇంకా అక్కడ కొంత మిగిలే ఉన్నట్లు అనిపించడం, బరువు తగ్గడం... ఈ లక్షణాలు అన్నీ లేదా వీటిల్లో కొన్ని కనిపించినప్పుడు డాక్టర్‌ను తప్పనిసరిగా సంప్రదించాలి.

పెద్ద ప్రేగును ప్రక్షాళన (శుభ్రం)చేసుకోవడం చాలా ముఖ్యం. ఇది చర్మానికి కూడా మేలు చేస్తుంది. పెద్దప్రేగు శుభ్రపడటం వల్ల శరీరంలోని మలినాలు మరియు విషాలు శరీరం నుండి బయటకు స్రవించబడుతుంది. దాంతో డిటాక్సిఫికేషన్ వల్ల చర్మం అందం పెరుగుతుంది. పెద్దపేగు సరిగా పనిచేయనట్లైతే మీరు మలబద్ధకం మరియు జీర్ణ మరియు పొట్టకు సంబంధించిన రోగాల భారీన పడేలా చేస్తుంది. కాబట్టి పెద్దపేగు సక్రమంగా పనిచేయాలన్నా.. మలబద్దకం మరియు జీర్ణ సమస్యలను నివారించాలన్నా ఫైబర్ రిచ్ ఫుడ్స్ బాగా సహాయపడుతాయి. వీటితో పాటు కొన్ని కోలన్ క్లీనింగ్ రిచ్ ఫుడ్స్ ను మీ రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవాలి.ఈ ఫుడ్స్ తో పాటు కొన్ని హోం రెమెడీస్ కూడా అనుసరించాలి . కోలన్ శుభ్రపరచడం వల్ల చిన్న ప్రేగులో ఆరోగ్యకరమైన బ్యాక్టీరియాను ప్రోత్సహిస్తుంది . ఇది ఎనర్జీ ని అందిస్తుంది. కాబట్టి కోలన్ శుభ్రపరచాలనుకుంటే, డాక్టర్ ను సంప్రదించాలి. అంతకు ముందుగా మనం అనుసరించాల్సిన 10 హోం రెమెడీస్...

నీళ్ళు:

నీళ్ళు:

కోలన్ (ప్రేగు)ను శుభ్రపరచడంలో నీరు అద్భుతంగా సహాయపడుతుంది. కాబట్టి, రోజుకు కనీసం 10-12 గ్లాసుల నీళ్ళు త్రాగాలి. దీని వల్ల శరీరంలో ఉన్న టాక్సిన్స్ మరియు మలినాలను బయటకు నెట్టివేస్తుంది .

 ఆపిల్ జ్యూస్:

ఆపిల్ జ్యూస్:

కోలన్ శుభ్రం చేయడంలో ఆపిల్ జ్యూస్ ఒక ఉత్తమ హోం రెమెడీ. రెగ్యులర గా ఆపిల్ జ్యూస్ త్రాగడం వల్ల బౌల్ మూమెంట్ ను ఫ్రీగా ఉంటుంది. టాక్సిన్స్ ను బ్రేక్ చేస్తుంది మరియు లివర్ మరియు జీర్ణ వ్యవస్థ యొక్క ఆరోగ్యంను రక్షిస్తుంది.

1. ప్రతి రోజూ ఒక గ్లాస్ ఆపిల్ జ్యూస్ తీసుకోవాలి.

2. అరగంట తర్వాత ఒక గ్లాసు నీళ్ళు త్రాగాలి.

3. ఇలా ప్రతిరోజూ చేయాలి. రోజులో రెండు మూడు సార్లు చేస్తుండాలి. ఇలా చేస్తున్నప్పుడు సాలిడ్ ఫుడ్స్ ను నివారించాలి.

నిమ్మరసం

నిమ్మరసం

నిమ్మరసంలో యాంటీఆక్సిడెంట్స్ మరియు విటమిన్ సి పుష్కలంగా ఉండటం వల్ల ఇది కోలన్ శుభ్రం చేయడంలో గ్రేట్ గా సహాయపడుతుంది.కాబట్టి, ప్రతి రోజూ ఉదయం నిద్రలేవగానే గోరువెచ్చని నీటిలో నిమ్మరం పిండి, తేనె మిక్స్ చేసి తీసుకోవాలి.

పచ్చికూరగాయలు:

పచ్చికూరగాయలు:

కోలన్ శుభ్రం చేయడానికి ప్రొసెస్ చేసిన మరియు వండిన పదార్థాలను ఒకటి లేదు రెండు రోజులు తీసుకోకూడదు. సాలిడ్ ఫుడ్ కాకుండా, తాజా వెజిటేబుల్ జ్యూస్ ను ఒక రోజులో పలు సార్లు తీసుకోవాలి. క్లోరిఫిల్ కలిగిన గ్రీన్ వెజిటేబుల్స్ తీసుకోవడం వల్ల శరీరంలో టాక్సిన్స్ ను తొలగిస్తుంది. మరియు మినిరల్స్, విటమిన్స్, అమినో ఆసిడ్స్ మరియు ఎంజాయ్స్ ఉన్న ఈ కూరలు తీసుకోవడం వల్ల శరీరం ఆరోగ్యం ఉంటుంది. అలాగే మీరు హేర్బల్ టీ తీసుకోవాలి.

ఫైబర్ రిచ్ ఫుడ్స్ :

ఫైబర్ రిచ్ ఫుడ్స్ :

కోలన్ శుభ్రం చేయడానికి ఫైబర్ రిచ్ ఫుడ్స్ అధికంగా తీసుకోవాలి. ప్రేగులోని హానికరమైన టాక్సిన్స్ తొలగించడానికి ఫైబర్ రిచ్ ఫుడ్స్ రెగ్యులర్ డైట్ లో తీసుకవాలి . ఇది స్టూల్ సాఫ్ట్ గా అవ్వడానికి మరియు బౌల్ మూమెంట్ మెరుగుపరచడానికి సహాయపడుతుంది. మొత్తానికి శరీరంలోని వ్యర్థాలను శరీరం నుండి బయటకు విసర్జించడానికి ఇవి గ్రేట్ గా సహాయపడుతాయి.

పెరుగు:

పెరుగు:

రెగ్యులర్ డైట్ లో పెరుగును చేర్చుకోవడం వల్ల కోలన్ ను హెల్తీగా ఉంచుతుంది. ప్రోబయోటిక్ ఫుడ్, పెరుగు తీసుకోవడం వల్ల ప్రేగులో మంచి బ్యాక్టీరియాను ప్రోత్సహిస్తుంది మరియు జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది . మరియు ఇన్ఫ్లమేటరీ బౌల్ డిసీజ్ ను తగ్గిస్తుంది . మరియు వీటిలో ఉండే క్యాల్షియంకోలన్ యొక్క సెల్ లైనింగ్ ను తగ్గిస్తుంది.

ఫ్లాక్స్ సీడ్స్:

ఫ్లాక్స్ సీడ్స్:

ఫ్లాక్సీడ్స్ ల ఓమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ , యాంటీఆక్సిడెంట్స్ మరియు నేచురల్ ఫైబర్ అధికంగా ఉంటుంది. అందువల్ల వీటిని రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం ఒక ఉత్తమ మార్గం. ఫ్లాక్ సీడ్స్ నీటిని గ్రహించి కోలన్ ను విస్త్రుతపరుస్తుంది. దాంతో టాక్సిన్ మరియు మ్యూకస్ ను శరీరం నుండి బయటకు నెట్టేస్తుంది. దాంతో పాటు, క్యాన్సర్, గుండె జబ్బులను మరియు డయాబెటిస్ ను నివారిస్తుంది.

సీ సాల్ట్ :

సీ సాల్ట్ :

ఒక గ్లాసు వేడి నీళ్ళలో సీ సాల్ట్ మిక్స్ చేసి త్రాగాలి. 2. ఉదయాన్నేఈ నీటిని గోరువెచ్చగా లేదా చల్లగా త్రాగవచ్చు .3. కొన్ని నిముషాలు అలాగే ఉండి తర్వాత పడుకొని పొట్టను నిధానంగా మసాజ్ చేసుకోవాలి . ఇది మీ బౌల్ మూమెంట్ ను క్రమబద్దం చేస్తుంది. మరియు ఇది హానికరమైన టాక్సిన్స్ ను తొలగిస్తుంది. ఇలా నెలలో 5లేదా 6సార్లు చేస్తుండాలి.

కలబంద:

కలబంద:

అలోవెరలో డిటాక్సిఫైయింగ్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి మరియు లాక్సేటివ్ గా పనిచేస్తుంది మరియు ఇది కోలన్ క్యాన్సర్ మీద ఎక్కవ ప్రభావంతంగా పనిచేస్తుంది. మరియు ఇది ఇతర ఆరోగ్యసమస్యల మీద తలనొప్పి, స్కిన్ ఇన్ఫెక్షన్, డయోరియా, గ్యాస్ట్రిక్ మరియు మలబద్దకం మీద పనిచేస్తుంది.

1. ఒక నిమ్మకాయ రసంలో కొద్దిగా కలబంద రసాన్ని వేసి బాగా బ్లెండ్ చేసి, ఫ్రిజ్ లో పెట్టి రెండు మూడు గంటల తర్వాత రోజులో అప్పుడప్పుడు త్రాగుతుండాలి.

అల్లం:

అల్లం:

అల్లం, మన ఇంట్లోరెడీమేట్ గా అందుబాటులో ఉండే పదార్థం. ఇది కడుపు ఉబ్బరాన్ని తగ్గిస్తుంది. కోలన్ వ్యవస్థను క్రమబద్దం చేస్తుంది. ప్రేగుల్లో వ్యర్థాలు మరియు టాక్సిన్స్ లేకుండా ఫ్రీచేస్తుంది . తగినన్ని ఆమ్లరసాలను ఉత్పత్తి చేసి జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.

1. అల్లంను తురిమి, జ్యూస్ చేసి తీసుకోవడం వల్ల ప్రేగులు శుభ్రపడుతాయి.

2. రెండు కప్పుల నీటిలో ఒక చెంచా అల్లం రసం , కొద్దిగా నిమ్మరసం మిక్స్ చేసి తీసుకోవాలి . అవసరం అయితే తేనె కూడా జోడించుకోవచ్చు .

Desktop Bottom Promotion