For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పడక గదిలో మగవారి అసమర్థతకు 10 కారణాలు

|

అందమైన జీవితాన్ని బలోపేతం చేయడంలో భార్యా భర్తల మధ్యనున్న బంధం ప్రధాన పాత్ర పోషిస్తుంది. బంధాన్ని గట్టిపరచడంలో సెక్స్ ముఖ్య పాత్ర పోషిస్తుంది. అయితే, రిలేషన్ షిప్ లోని అందాన్ని కేవలం సెక్స్ తో ముడిపెట్టడం కరెక్ట్ కాదని వాదించే వారు ఉన్నారు. అయితే సెక్స్ లో అసంతృప్తి బంధాలను తెంచే స్థాయి వరకు వెళ్ళే అవకాశాలున్నాయి.

పడగ్గదిలో పురుషుల ప్రవర్తన వారిలోనున్న ఆత్మ గౌరవ స్థాయిలను ప్రతిబింబిస్తాయి. మేల్ ఇగోకు వారి శృంగార సామర్థ్యతకు అవినాభావ సంబంధం ఉంది. అందువల్లే, సెక్స్ బాగా చేస్తే వారు ఎంతో గర్వంగా ఫీల్ అవుతారు. అలాగే, సెక్స్ లో ఫెయిల్ అయితే కొంచెం గిల్టీ గా కూడా ఫీల్ అవుతారు.

సెక్స్ లో మేల్ పెర్ఫార్మన్స్ అంటే?

ఆమెను సంతృప్తి పరచాలి

ఆమెలో భావప్రాప్తి కలిగేలా చేయాలి

ఆమెలో పిండోత్పత్తి కలిగించేంత సామర్థ్యం ఉండాలి

క్లైమాక్స్ వరకు అంగస్తంభనలను నిలబెట్టాలి

మరి మేల్ పెర్ఫార్మన్స్ ను హతమార్చేవేవి?

పడగ్గదిలో పురుషుల అసమర్థత వెనుక ఎన్నో కారణాలున్నాయి. అవేంటంటే..

1. ఉద్వేగం

1. ఉద్వేగం

వక్తలు, నటులకు మొదట్లో 'స్టేజ్ ఫియర్' తో ఇబ్బంది పడినవారే. అలాగే, కొంతమంది పురుషులు కూడా తమ సామర్థ్యంపై కొంచెం సంశయాన్ని ఏర్పరచుకుంటారు. ఈ ఉద్వేగం వెనకాల ఉండే 'ఫాల్స్ స్టాండర్డ్స్' ప్రధాన కారణం. కొంతమంది పడగ్గదిలో తమ సామర్థ్యంపైనే తమను అంచనా వేస్తారని, తమకు విలువుంటుందని నమ్ముతారు. ఈ భావన వారిలో అనవసరపు భయాలను కలిగిస్తుంది. 'అసమర్థత' అనే భయాన్ని కలిగిస్తుంది. ఇటువంటి కొన్ని అర్థం పర్థం లేని భావనలోంచి బయటకు వస్తే యాక్చువల్ గేమ్ ని ఆస్వాదించగలరు. ఈ ఆనందం అనేది రేటింగ్ కోసం కాదు అలాగే ఒక మనిషిని అంచనా వేయడం కోసం కాదు. ఇది కేవలం 'తృప్తి' కోసమనేది అర్థం చేసుకోవాలి.

2. స్మోకింగ్

2. స్మోకింగ్

స్మోకింగ్ చేస్తేనే మగాడిగా గుర్తిస్తారన్న భావన చాలా మంది పురుషులలో పెనవేసుకుపోయింది. అయితే, స్మోకింగ్ అలవాటే వారిలోనున్న మగతనాన్ని హరించి వేస్తుందన్న సంగతిని మరచిపోకూడదు. అవును, స్మోకింగ్ హరించి వేస్తుంది. మిమ్మల్ని చంపేముందు మీలోనున్న మగతనాన్ని చంపేస్తుంది. స్మోకింగ్ ను వదిలేసేందుకు మంచి అవకాశమిది. మగవారిలోని స్పెర్మ్ కౌంట్ సంఖ్యపై అలాగే అంగస్తంభనపై స్మోకింగ్ అలవాటు దుష్ప్రభావం చూపిస్తుందని ఒక అధ్యయనంలో తేలింది.

3. మద్యం

3. మద్యం

మితిమీరి మద్యాన్ని సేవించడం కేవలం మీలో మూడ్ పై దుష్ప్రభావం చూపిస్తుంది. మీతో మాటు మీ పార్టనర్ ను మీరు అసంతృప్తి పరిచే అవకాశం ఉంటుంది. మద్యం సేవించే అలవాటుని మానుకుంటే మీలోనున్న మగతనాన్ని కాపాడుకునేవారవుతారు.

4. ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్

4. ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్

మగవారిని వేధించే ముఖ్య సమస్య ఇది. ఇంటర్ కోర్స్ సమయాన్ని పొడిగించేందుకు ఎన్నో విధానాలు ఉన్నాయి. వాటిని తెలుసుకుని పాటించడం మంచిది.

5. అనుభవరాహిత్యం

5. అనుభవరాహిత్యం

ఈ 'వైల్డ్ గేమ్'కు కొత్తైన మగవారిలో అనుభవ రాహిత్యం వాళ్ళ ఏర్పడిన భయం వారిలోనున్న మగతనాన్ని బయటకు రానీయకుండా అడ్డుకుంటుంది. వాళ్ళు తమ సామర్థ్యాన్ని పెంపొందించుకోవాలనే అంశంపై దృష్టి పెడతారు. క్రమ క్రమంగా అసలు 'రహస్యాన్ని' తెలుసుకుని ఆటలో గెలుస్తారు. అయితే, కొద్ది మంది మగవారిలో 'ఫోర్ స్కిన్' టైట్ గా ఉంటుంది. వారి సామర్థ్యానికి అడ్డుకట్ట వేసే 'ఫోర్ స్కిన్' కు చికిత్సను చేయించుకుంటే సరిపోతుంది.

6. టెస్టోస్టెరోన్ లోపం

6. టెస్టోస్టెరోన్ లోపం

30 ఏళ్ళ వయసు దాటిన మగవారిలో చాలా మంది టెస్టోస్టెరోన్ లోపంతో సతమతమవుతూ ఉంటారు. మగతనానికి ప్రతీకగా నిలిచే ఈ హార్మోన్ దానిని పెంపొందించుకునేందుకు ప్రయత్నించాలి.

7. ఒత్తిడి

7. ఒత్తిడి

జీవనవిధానంలో ఒత్తిడి మగవారిని ఈ విషయంలో నిరుత్సాహపరచడంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఒత్తిడిని ఎంత జయిస్తే ఈ గేమ్ లో అంత గెలుస్తారు.

8. అంగస్థంభన సమస్యలు

8. అంగస్థంభన సమస్యలు

పురుషాంగంపై కంట్రోల్ పురుషుడికి పూర్తిగా ఉండాలి. ఒక వేల దానిపై కంట్రోల్ లేదంటే ఆ స్థితినే అంగస్థంభన సమస్యల కింద పరిగణిస్తారు. సెషన్ పూర్తయ్యేలోపు దానిపై కంట్రోల్ తప్పిపోతే అవమానంగా భావిస్తారు. అయితే, ఇది ఆరోగ్య సమస్యల వల్ల కూడా కావొచ్చు. డాక్టర్ల సహాయంతో అనారోగ్య సమస్యలను గుర్తించి చికిత్స తీసుకుంటే మంచిది. కొన్ని సార్లు ఇంతకు ముందు చెప్పినట్లు కొన్ని అవాస్తవ భావనలు మైండ్ లో కలిగి ఉండడం వల్ల కూడా ఇలా జరుగుతుంది.

9. మెడికేషన్

9. మెడికేషన్

కొన్ని రకాల మెడికేషన్స్ శృంగార జీవితంపై దుష్ప్రభావం చూపుతాయి. కొన్ని తీవ్రమైన అనారోగ్య సమస్యలకు వాడే మెడికేషన్స్ తో ఎదురయ్యే దుష్ప్రభావమిది.

10.ఆరోగ్య సమస్యలు

10.ఆరోగ్య సమస్యలు

డయాబెటిస్ వంటి కొన్ని ఆరోగ్య సమస్యలు మగవారి సామర్థ్యంపై దుష్ప్రభావం చూపుతాయి. అలాగే కొన్ని రకాల నరాల సంబంధ సమస్యలు కూడా ఇందులో ప్రధాన పాత్ర పోషిస్తాయి. అటువంటి వారు వైద్యుల సలహా తీసుకోవాలి. సహజసిద్ధమైన వయాగ్రా వంటి ఆహార పదార్థాలను తీసుకోవడం వంటివి పాటించడం కూడా ముఖ్యం.

English summary

Top 10 Reasons For Poor Male Performance In Bed

Relationships make life beautiful and sex makes relationships even more beautiful. Now, there are some people who would argue that sex is not the only thing that dictates the beauty of relationships. But quality of sex can sometimes make or break a relationship.
Story first published: Monday, December 15, 2014, 17:55 [IST]
Desktop Bottom Promotion