For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

త్వరగా బరువు తగ్గడం వల్ల ఎదుర్కొనే ఆరోగ్య సమస్యలు

By Super
|

వేగంగా బరువు తగ్గాలి అనేది ప్రతిఒక్కరి మదిలోనూ ఉండే రహస్యమైన కోరిక. డిసెంబర్ లో సరదాలన్నీ తీరాక, అదనపు బరువు తగ్గాలనే కొత్త సంవత్సరపు తీర్మానం చేసుకోగానే మీకు "30 రోజుల్లో బరువు తగ్గండి" అనే పెద్ద పోస్టరు హఠాత్తుగా కనపడుతుంది. వేగంగా బరువు తగ్గడం అనే వాగ్దానం ప్రలోభ పెట్టేదే కానీ మీరేం కోల్పోతున్నారు? సత్వర పరిష్కారాలు మీ ఆరోగ్యంపై తీవ్రమైన దుష్ప్రభావాలు చూపిస్తాయి.

శారీరక హాని పక్కన పెడితే దానివల్ల మానసిక వత్తిడి, నిస్పృహ కూడా కలుగుతాయి, అందువల్ల వేగంగా బరువు కోల్పోవడానికి సలహాలు వినేముందు ఒక్క క్షణం ఆగి దానివల్ల వచ్చే 10 ప్రమాదాల గురించి తెలుసుకోండి.

వేగంగా బరువు కోల్పోవడం శాశ్వత పరిష్కారం కాదు:

వేగంగా బరువు కోల్పోవడం శాశ్వత పరిష్కారం కాదు:

ముంబై కి చెందిన ప్రియ అనే పౌష్టికాహార నిపుణురాలి ప్రకారం: "వేగంగా బరువు కోల్పోయే పద్ధతులు అనుసరించే ముందు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. దానివల్ల మీరు కొంత బరువు తగ్గినా, ఆ ఫలితాలు ఎక్కువ కాలం నిలబడవు. తాత్కాలిక మార్పులకు మీ శరీరం అలవాటు కాదు కాబట్టి, ఈ మార్పులకు అనుగుణంగా అది మారకపోగా మీరు కోల్పోయిన బరువంతా తిరిగి పొందుతారు."

వేగంగా బరువు కోల్పోవడం అంటే తేమను కోల్పోవడం:

వేగంగా బరువు కోల్పోవడం అంటే తేమను కోల్పోవడం:

వేగంగా బరువు కోల్పోయే పద్ధతులలో ఒకటి నిర్జలీకరణ విధానం. శరీరం బరువులో ఎక్కువ భాగం నీరు ఉంటుంది కనుక బరువు తగ్గడానికి చాలామంది నీరు తాగకుండా ఉంటారు. ఈ పద్ధతి అవాస్తవికమే కాకుండా ప్రమాదకరమైనది కూడా. నీటికి దూరంగా ఉండడం మీ ఆరోగ్యానికి ఎంతమాత్రం మంచిది కాదు. దానివల్ల స్పృహ తప్పడం, కళ్ళు తిరగడం, గుండె దడదడ లాడడం లాంటి తీవ్రమైన ఆరోగ్య సమస్యలు ఉత్పన్నమౌతాయి, కొన్నిసార్లు అది కండరాల క్షీణతకు, మృత్యువుకు దారితీయవచ్చు. పైగా శరీరం సహజంగా ద్రవాలను పునరుద్దరించు కుంటుంది కాబట్టి మీరు మళ్ళీ బరువెక్కుతారు.

నిద్రలేమి :

నిద్రలేమి :

వేగంగా బరువు కోల్పోవడం మిమ్మల్ని త్వరగా, తరచుగా నీరసపడేలా చేస్తుంది. బరువు తగ్గే ప్రణాళిక పాటిస్తున్నప్పుడు చాలా మంది కొవ్వును కరిగించే బదులు కాలరీల మోతాదు తగ్గించుకుంటారు. తక్కువ కాలరీలు తీసుకుంటే జీవక్రియ వేగం మందగించి మరింత శక్తి కోల్పోయి, నీరసం వస్తుంది.

 పిత్తాశయంలో రాళ్ళు పడడం :

పిత్తాశయంలో రాళ్ళు పడడం :

పిత్తాశయం మీ పొత్తికడుపులో వుంటుంది. కాలేయం క్రింద చిన్న తిత్తి లాంటి భాగమిది. శరీరానికి అవసరం అయ్యేదాకా ఇది కొవ్వును నిల్వ వుంచుతు౦ది. వేగంగా బరువు కోల్పోతే పిత్తాశయంలో రాళ్ళు చేరతాయని ప్రియ చెప్తున్నారు. పిత్తాశయంలో రాళ్ళు అంటే చూడ్డానికి రాళ్ళలా వుండే గట్టి పడ్డ కొలెస్టరాల్ కణాలు. పిత్తాశయం నుంచి చిన్న ప్రేవు లోకి బైల్ ప్రవాహాన్ని అడ్డుకుని ఈ చిన్న చిన్న రాళ్ళు ఆరోగ్యానికి ప్రమాదకరమైన ఇన్ఫెక్షన్ కలిగిస్తాయి.

పౌష్టికాహార లోపం :

పౌష్టికాహార లోపం :

సత్వర బరువు తగ్గుదల ప్రణాళిక పాటిస్తుంటే, మీరు కొన్ని రకాల ఆహారాలు తినకుండా నియంత్రి౦చుకుంటారు. దీని వల్ల మీ శరీరాన్ని బలంగా ఉంచడానికి అవసరమయ్యే పోషకాలను కూడా మీరు దూరం చేసుకుంటున్నట్టే.

 మీ వత్తిడి స్థాయిని పెంచుకుంటున్నారు :

మీ వత్తిడి స్థాయిని పెంచుకుంటున్నారు :

వేగంగా బరువు కోల్పోవడం కోసం కొన్ని ఆహారాలు మానివేయడం, మిమ్మల్ని మీరు మాడ్చుకోవడం లాంటివి మీ శరీరంలో జీవక్రియ మందగించేలా చేసి, వత్తిడికి కారణమయ్యే కార్టిసాల్ అనే హార్మోన్ ను మరింత పెంచుతుంది. ఈ హార్మోన్ వల్ల మీరు మానసికంగా, శారీరికంగా, భావోద్వేగాల పరంగా వత్తిడిని అనుభవించి బాధ పడతారు.

జుట్టు ఊడిపోవడం:

జుట్టు ఊడిపోవడం:

వేగంగా బరువు కోల్పోయే ప్రయాణం మొదలు పెట్టినప్పుడు, మిమ్మల్ని మీరు పోశాకాలకు దూరం చేసుకుంటున్నారు. బాగా పెరిగి ఆరోగ్యంగా ఉండాలంటే మీ జుట్టుకు మాంసకృత్తులు కావాలి. కానీ మీ ఆహార ప్రణాళిక వల్ల మీరు మాంసకృత్తులు తీసుకోవడం తగ్గింది. దీంతో మీ జుట్టు పొడిగా, పెళుసుగా మారుతుంది, చివరికి జుట్టు రాలిపోవడానికి దారి తీస్తుంది.

కొవ్వు నిలవ ఉంచడం :

కొవ్వు నిలవ ఉంచడం :

మీరు వేగంగా బరువు తగ్గడానికి నిరాహారంగా ఉంటుంటే, మీ శరీరం ఆ సంకేతాన్ని అందుకుని ఆహారాన్ని నిలవ చేస్తుంది. ఈ సమస్య వల్ల, మీరు మామూలు ఆహారానికి రాగానే మీరు కోల్పోయిన బరువు తిరిగి చేరడమే కాదు, పైగా మరిన్ని అదనపు కిలోలు, కొవ్వు కూడా తోడౌతాయి.

జీవక్రియకు అంతరాయం :

జీవక్రియకు అంతరాయం :

వేగంగా బరువు కోల్పోయే ప్రక్రియలో వుంటే, మీ శరీరం ఆ సంకేతాన్ని అందుకుని, బతికి వుండడం కోసం జీవక్రియ వేగాన్ని తగ్గిస్తుంది. మళ్ళీ మీరు మీ సాధారణ ఆహారానికి తిరిగి రాగానే, మీరు మందగించిన జీవక్రియ వల్ల తిరిగి బరువెక్కుతారు.న్ని అధిగమించడానికి మీరు మళ్ళీ కఠినమైన ఆహార ప్రణాళికకు మళ్లుతారు, దీంతో మీ శరీరం బరువు కోల్పోవడం, తిరిగి సాధించడం అనే చక్రంలో పడిపోతుంది. తరచుగా జరిగే ఈ మార్పులు మీ జీవక్రియ స్థాయికి, మీ శరీరానికి అంతరాయం కలిగిస్తుంది.

ఇతర ఆరోగ్య సమస్యలు :

ఇతర ఆరోగ్య సమస్యలు :

మీ శరీరానికి వివిధ అత్యవసర పోషకాలు అవసరమైన మోతాదులో అందకపోతే దానివల్ల కండరాల బలహీనత, రక్త హీనత, మలబద్ధకం లాంటి అనేక ఆరోగ్య సమస్యలు చేరువౌతాయి. ఈ లక్షణాలకు వెంటనే చికిత్స చేయించుకోక పొతే మీ ఆరోగ్యానికి తీవ్రమైన హాని కలుగవచ్చు.

Story first published: Thursday, October 16, 2014, 13:38 [IST]
Desktop Bottom Promotion