For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అజీర్తి-జీర్ణ సమస్యలా:ఇదిగో టాప్ 10 ఫైబర్ ఫుడ్స్

|

మీరు ప్రతి రోజు తీసుకొనే పండ్లు మరియు పానీయాలలో మీకు తెలియకుండానే పోషక విలువలు పుష్కలంగా ఉంటాయి. నిజానికి మనలో చాలా మంది ఒక మంచి జీవితంనకు కారణమయ్యే సమతుల్య ఆహారం గురించి పట్టించుకోరు. మన శరీర అవసరాలకు అనుగుణంగా ఒక సమతుల్య ఆహారం అవసరం ఎంతైనా ఉంది. ఆహారంలో ఫైబర్ చాలా ముఖ్యమైన భాగం మరియు జాగ్రత్తగా తీసుకోవలసిన అవసరం ఉంది.

ఫైబర్ రిచ్ ఆహారం మన శరీరంనకు పోషకాలను అందిస్తుంది. దీనిలో యాంటిఆక్సిడెంట్, విటమిన్లు మరియు ఫైటోకెమికల్స్ ఉంటాయి. అందువలన గుండెపోటు,క్యాన్సర్ మరియు మధుమేహం వంటి వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ఫైబర్ అధికంగా ఉన్న ఆహారం మీ జీర్ణ వ్యవస్థకు కూడా చాలా మంచిది అని చెప్పవచ్చు. అంతేకాక ఒక ఆరోగ్యకరమైన బరువు నిర్వహించడానికి సహాయపడుతుంది.

టాప్ 20 చిట్కాలతో మీ జీర్ణ సమస్యలన్నీ మాయం:క్లిక్ చేయండి

మీరు అధిక ప్రయోజనాలు పొందాలంటే మీ ఆహారంలో తప్పనిసరిగా ఫైబర్ రిచ్ ఆహారాలు ఉండాలి. కార్న్,కాయధాన్యాలు,కిడ్నీ బీన్స్,సంపూర్ణ గోధుమ పాస్తా,బ్రౌన్ బియ్యం,సంపూర్ణ గోధుమ రొట్టె మరియు బ్రోకలీ మరియు క్యాబేజీ వంటి కూరగాయలు మరియు అవకాడొలు,బేరి పండ్లు మరియు యాపిల్ వంటి పండ్లలో పీచు అధికంగా ఉంటుంది. ఫైబర్ సమృద్ధిగా ఉన్న ఆహారాలు ఒక రూపం కలిగి మరియు మీకు సరైన పోషకాహారం అందుకోవడానికి సహాయపడతాయి.

జీర్ణక్రియను మెరుగుపరుచుకోవడానికి చిట్కాలు: క్లిక్ చేయండి

ఓట్స్:

ఓట్స్:

వోట్స్ లో ఉన్న ఫైబర్ రక్తంలో కొలెస్ట్రాల్ తగ్గించుట మరియు మీ జీర్ణక్రియను సాఫీగా ఉంచుతుంది.ఇది కూడా కొలెస్ట్రాల్ స్థాయిని నియంత్రించటానికి సహాయపడుతుంది. అంతేకాక రోగనిరోధక వ్యవస్థ పనితీరును పెంచటానికి బీటా-గ్లూకాన్ కలిగి ఉంటుంది.

అవెకాడో పండు

అవెకాడో పండు

ఈ పండు ఫైబర్ యొక్క చాలా మంచి వనరుగా చెప్పవచ్చు. మొత్తం పండులో 10 గ్రాముల ఫైబర్ ఉంటుంది. ఈ పండులో క్రీమీ ఫ్లెష్ ఉండుట వల్ల కొలెస్టరాల్ తగ్గించటానికి సహాయం మరియు గుండెపోటు ప్రమాదాలను తగ్గిస్తుంది. అంతేకాక మంచి కొవ్వులు కలిగి ఉంటుంది.

వీట్ బ్రెట్:

వీట్ బ్రెట్:

ఏ ఇతర తెలుపు బ్రెడ్ కంటే సంపూర్ణ గోధుమ రొట్టె మీ ఆరోగ్యానికి పది రెట్లు మెరుగైనది. తెలుపు రొట్టె కన్నా సంపూర్ణ గోధుమ రొట్టెలో ఫైబర్ సమృద్ధిగా ఉంటుంది. సంపూర్ణ గోధుమ రొట్టె ఎల్లప్పుడూ మంచి ఆరోగ్యాన్ని అందిస్తుంది.

బ్రోకోలీ

బ్రోకోలీ

మీరు అనేక వంటకాల్లో బ్రోకలీని తప్పనిసరిగా వాడాలి. ఇది ఫైబర్ యొక్క ఒక గొప్ప మూలం మరియు క్యాన్సర్ వ్యతిరేక లక్షణాలను కూడా కలిగి ఉంటుంది.ఒక కప్పు ఉడికించిన బ్రోకలీలో 5 గ్రాముల ఫైబర్ ఉంటుంది.

బ్రౌన్ రైస్

బ్రౌన్ రైస్

అనేక మంది బ్రౌన్ బియ్యంనకు బదులుగా తెల్ల బియ్యం తినటం చూసి ఉంటారు. కానీ మీరు బ్రౌన్ బియ్యం తినటానికి కొన్ని అద్భుతమైన కారణాలు ఉన్నాయి. ఒక కప్పు బ్రౌన్ బియ్యం లో 3.5 గ్రాముల ఫైబర్ ఉంటుంది.

శనగలు

శనగలు

భారతదేశం శనగలు యొక్క అతి పెద్ద ఉత్పత్తిదారు అని మీకు తెలుసా? దీనిలో ఫైబర్ యొక్క ఒక గొప్ప వనరు ఉంది. కాబట్టి ఖచ్చితంగా దీని నుండి అన్ని ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. ఇది మధ్య తూర్పు మరియు యునైటెడ్ స్టేట్స్ లో చాలా ప్రసిద్ది.

కార్న్

కార్న్

కార్న్ చాలా ఆరోగ్యకరమైన ఆహారం మరియు ఫైబర్ అనే గొప్ప వనరు కలిగి ఉంది. ఒక అర కప్పు మొక్కజొన్న కెర్నలు లో 2 గ్రాముల ఫైబర్ ఉంటుంది. దీనిలో విటమిన్ B,ముఖ్యంగా థయామిన్ మరియు నియాసిన్ మరియు వివిధ రకాల యాంటీఆక్సిడెంట్లు వంటి చాలా మంచి వనరులు ఉన్నాయి.

బాదంపప్పులు

బాదంపప్పులు

ఒక కప్పు బాదం పాలు మరియు బాదంపప్పులతో కూడిన కేరట్ లేదా రవ్వ హల్వా వంటి వాటిని ప్రతి ఒక్కరూ తినే ఒక రుచికరమైన వంటకాలుగా ఉన్నాయి. ఈ వంటకాలకు బాదం రుచిని జోడించడమే కాకుండా ఫైబర్ మరియు ప్రోటీన్ యొక్క గొప్ప మూలం కలిగి ఉంది.

యాపిల్స్

యాపిల్స్

మీరు ఈ సామెత వినే ఉంటారు. రోజుకు ఒక ఆపిల్ తింటే డాక్టర్ అవసరం ఉండదు. ఇది కేవలం ఒక సామెత మాత్రమే కాదు. నిజానికి దీనిలో ఫైబర్ మరియు ప్రయోజనకరమైన ఫైటోకెమికల్స్ ను కలిగి ఉంది. ఒక సాధారణ పరిమాణం గల యాపిల్ లో 4.4 గ్రాముల ఫైబర్ ఉంటుంది.

బటానీలు:

బటానీలు:

బటానీలు అద్భుతమైన రుచి మరియు చవకైనవి. గొప్ప ఫైబర్ ఉన్న వనరుగా చెప్పవచ్చు. దీనిని మీరు కూరగాయల సూప్ లో జోడించవచ్చు లేదా సరళంగా ఉడకబెట్టడం చేయవచ్చు. అంతేకాక ఇతర కూరగాయలతో కలిపి చేయవచ్చు. ఒక కప్పు బటానీలో 16 గ్రాముల ఫైబర్ ఉంటుంది.

English summary

Top 10 Super Foods Highest in Fiber

Dietary fiber (dietary fibre, roughage) is an essential nutrient required for proper digestion of foods, proper functioning of the digestive tract at large, and for helping you feel full. A deficiency of fiber can lead to constipation, hemorrhoids, and elevated levels of cholesterol and sugar in the blood.
Desktop Bottom Promotion