For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

జీర్ణక్రియను మెరుగుపరుచుకోవడానికి చిట్కాలు

|

మీరు అస్తమానం త్రేన్పులతో, గ్యాస్ లేదా అపానవాయువు, కడుపు ఉబ్బరం మరియు ఇతర జీర్ణ సమస్యలతో ఇబ్బంది పడుతున్నారా!

ఈ సమస్యలలో చాలాభాగం రోగనిర్ధారణ చేయతగినవి కావు ఎందుకంటే ఇవి అంత తీవ్రమైనవి కావు, కాని ఇవి దీర్ఘకాలంలో కనిపిస్తే ముందుముందు మీ ఆరోగ్యం దెబ్బతింటుంది. వీటివలన అల్సర్ సమస్యలు రావొచ్చు మరియు కొన్నిసార్లు మొత్తం స్టమక్ దెబ్బ తినవొచ్చు.

మీ జీవితంలో ఈ ప్రతికూల ప్రభావాలను దూరం చేయడానికి, మంచి జీర్ణక్రియ కోసం ఈ సాధారణ చిట్కాలు అనుసరించండి:

ఫైబర్ ఫుడ్ అధికంగా తీసుకోండి

ఫైబర్ ఫుడ్ అధికంగా తీసుకోండి

చెర్రీలు, ద్రాక్ష, గంట మిరియాలు, తృణధాన్యాలు మరియు గింజలు వంటి ఫైబర్ రిచ్ ఆహారాలతో మీరు తినే ప్లేట్ ను నింపండి. ఈ ఆహారాలు తీసుకోవడం వలన మీ జీర్ణక్రియ పెరుగుతుంది మరియు వీటిని క్రమం తప్పకుండ తీసుకోండి.

ఆరోగ్యకరమైన బరువును పాటించండి

ఆరోగ్యకరమైన బరువును పాటించండి

ఊబకాయం లేదా అధిక బరువు కూడా గుండెమంట మరియు వాయువు జీర్ణ సమస్యలకు దారితీస్తుంది. అందువలన, మీ వైద్యుడి చేత పరీక్షలు జరిపించుకోండి మరియు ఆరోగ్యకరమైన బరువును కొనసాగించండి.

బాగా నమిలి తినాలి

బాగా నమిలి తినాలి

మీరు ఆహారం చిన్నచిన్న ముద్దలుగా తీసుకొని, బాగా నమిలి నిదానంగా మరియు స్థిరంగా తీసుకోవాలి. ఈ టెక్నిక్ మీ నోటిలో కార్బోహైడ్రేట్ జీర్ణం అవటానికి సహాయపడుతుంది మరియు ఏమేలేస్ ఉత్పత్తికి సహాయపడుతుంది - సరైన జీర్ణక్రియ పెంచే జీర్ణ ఎంజైమ్ ఉత్పత్తి చేస్తుంది.

ఎక్కువ నీరు త్రాగండి

ఎక్కువ నీరు త్రాగండి

ఇది జీర్ణ సమస్యల చికిత్సకు మరొక ఉత్తమ పరిష్కారం. రోజుకు 8-10 గ్లాసుల నీరు తీసుకోవటం వలన మీకు మలం విసర్జించటం సులభమవుతుంది మరియు జీర్ణ కోశం కడిగినట్లవుతుంది.

గోరువెచ్చని వెచ్చని నీరు త్రాగండి

గోరువెచ్చని వెచ్చని నీరు త్రాగండి

మీకు ఆహారం జీర్ణం కాకపొతే, అప్పుడు నులివెచ్చని నీరు త్రాగండి. ఉదయం వేళలో వెచ్చని నీరు త్రాగుతే, కనీసం భోజనానికి 30 నిముషాల ముందు త్రాగుతే, మీ మీ జీర్ణ వ్యవస్థను శుభ్రపరుస్తుంది మరియు మీ కడుపులో జఠర రసము యొక్క ఉత్పత్తిని పెంచుతుంది.

క్రమపద్ధతిలో తినండి

క్రమపద్ధతిలో తినండి

భోజనాల సమయంలో, అజీర్ణం నివారించేందుకు ఆహార పిరమిడ్ ఏర్పాటు చేసుకోండి. ముందు సులభంగా జీర్ణమయ్యే పదార్థాలతో భోజనం ప్రారంభించి, నెమ్మదిగా క్లిష్టమైన ఆహారపదార్థాలతో ముందుకెళ్ళండి. మొట్టమొదట భోజనాన్ని పండ్లు లేదా రసాలతో ప్రారంభించి, మాంసం లేదా గ్రుడ్లు మొదలైనవాటితో ముగించండి. ఈ విధంగా చేస్తే అమితఆహారాన్ని మరియు జీర్నసమస్యలను నివారించవొచ్చు. ఎప్పుడూ కూర్చుని భోజనం చేయండి. మీరు భోజనం తీసుకునే విధానం కూడా మీ జీర్ణక్రియ మీద ప్రభావం చూపుతుంది. అందువలన, మీరు విశ్రాంతిగా కూర్చుని భోజనం చేయండి. మనం కూర్చుని భోజనం తీసుకున్నప్పుడు మన కడుపు ఒక రిలాక్స్డ్ భంగిమను పొంది, జీర్ణక్రియ విస్తరించేందుకు సహాయపడుతుంది.

నిమ్మరసం కొద్దిగా తీసుకోండి

నిమ్మరసం కొద్దిగా తీసుకోండి

మీకు ఉదయాన్నే వెచ్చని నీరు త్రాగటం ఇష్టం లేదు, అప్పుడు ఒక గ్లాసు నీళ్ళలో కొద్దిగా నిమ్మరసం పిండుకొని త్రాగండి. ప్రతిరోజూ ఇలా చేయతంవలన మీ జీర్ణకోశం కదిగినట్లయి, వ్యర్థపదార్థాలు బయటకు వెళ్ళిపోతాయి మరియు ఎక్కువగా ఉన్న ఆసిడ్ కూడా తొలగింపబడుతుంది.

కొవ్వు పదార్ధాలు తీసుకోవటం మానుకోండి

కొవ్వు పదార్ధాలు తీసుకోవటం మానుకోండి

కొవ్వు పదార్ధాలు జీర్ణం అవటానికి చాలా సమయం పడుతుంది, అందువలన ఈ పదార్థాలను తీసుకోవటం వలన మలబద్ధకం మరియు ఇతర జీర్ణ సమస్యలు ఏర్పడతాయి. వీటిని తీసుకోవటం పూర్తిగా మానవొద్దు, ఈ కొవ్వు పదార్థాలు మీ శరీరం యొక్క సరైన కార్యాచరణకు అవసరం. ఏదిఏమైనా నియంత్రణ అనేది తప్పకూడదు. వీటిని ఇతర ఆరోగ్యకరమైన ఆహారపదార్తాలతో తీసుకోవటం మీ కడుపుకు మంచిది.

మీ ఆహారంలో మసాలా దినుసులను జోడించండి

మీ ఆహారంలో మసాలా దినుసులను జోడించండి

అల్లం, నల్ల మిరియాలు, సైంధవ లవణం లేదా కొత్తిమీర వంటి పలు సుగంధ ద్రవ్యాలను జోడించడం ద్వారా మీ ఆహారం రుచిగా ఉంటుంది. ఇవి మీకు రుచిని ఒక్కటే ఇవ్వవు, మీ జీర్ణక్రియకు కూడా తోడ్పడతాయి.

విటమిన్ 'C' ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకోండి

విటమిన్ 'C' ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకోండి

బ్రోకలీ, టొమాటోలు, కివి పండ్లు మరియు స్ట్రాబెర్రీస్ వంటి విటమిన్ సి సమృద్ధిగా ఉన్న ఆహారాలను తీసుకోండి. మీ మలబద్ధకం పోవాలంటే రంగురంగుల పండ్లు మరియు కూరగాయలు ఎక్కువగా తీసుకోండి.

English summary

Top 10 tips for good digestion


 Most of these problems go undiagnosed because they are not that serious, but if they appear in the long run, they can damage your health badly. They may create ulcer problems and some times total stomach damage too.
Story first published: Sunday, January 26, 2014, 12:40 [IST]
Desktop Bottom Promotion