For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కరవేపాకే కదా....అనకండి అందులోని గొప్ప ఔషధ గుణాలు చూడండి...

|

కరివేపాకు లేని తాలింపు ఉండదంటే అతిశయోక్తి లేదు. ఉప్మాలోనూ, పులిహోరలోనూ కరివేపాకు లేకపోతే రుచే రాదు. అయితే కరివేపాకు వల్ల వంటకాలకు రుచి, సువాసన తప్ప ఎలాంటి ఉపయోగం లేవనుకోవడం పెద్ద పొరపాటు.‘కూరలో కరివేపాకులా తీసిపారేశారు' అంటూ వాపోయేవారు, ‘కరివేపాకే కదా' అంటూ చిన్నచూపు చూసేవారు ఇప్పుడు ఆలోచనలో పడక తప్పదు. కూరైనా, సాంబారు అయినా, ఉప్మా, రసం దేనిలోనైనా కరివేపాకు వేస్తే వచ్చే రుచే వేరు. అయితే కూరకి రుచి అంటగానే చక్కగా ఆకుని కాస్తా ఏరిపారేస్తారు. కరివేపాకు మంచిదని అందరికీ తెలుసు. కానీ, ఇష్టంలేకో లేక అలవాటులో పొరపాటో... కరివేపాకుని తినకపోవడానికి సవాలక్ష కారణాలు. కానీ, కరివేపాకు ప్రాశస్త్యం తెలిస్తే చక్కగా అన్ని వంటల్లో ఇంత కరేపాకు ఏరిపారేయడానికి వీలు లేకుండా ఎలా వేయొచ్చో తప్పకుండా ఆలోచిస్తారు.

కరివేపాకులో శరీరానికి ఎంతో అవసరమైన కాల్షియం, ఫాస్ఫరస్, ఐరన్, యాంటీ ఆక్సిడెంట్లూ, బి విటమిన్, కెరోటిన్ పుష్కలంగా ఉండటమే కాదు.. తాజా కరివేపాకు నుంచి ప్రొటీన్లు, కొవ్వు పదార్ధాలు, పిండి పదార్ధాలు, పీచు పదార్ధాలు, ఖనిజ లవణాలు, క్యాలరీలు కూడా లభిస్తాయి. ఇలా పౌష్టిక విలువలలో ఏ కూరకీ ఏమాత్రం తీసిపోని కరివేపాకుని కేవలం రుచి గురించి మాత్రమే వాడతాం మనం. పూర్వమయితే కరివేపాకు పొడులు, కరివేపాకు పచ్చడి అంటూ కరివేపాకు వినియోగం కొంచెం ఎక్కువగానే వుండేది. కానీ, ఫాస్ట్‌ఫుడ్ కల్చర్‌లో కరివేపాకు వెనుకబడిపోయింది. మనం ఎవరి ఫాస్ట్‌ఫుడ్స్‌ని అలవాటు చేసుకుని కరివేపాకుకి దూరమవుతున్నామో వారు మాత్రం కరివేపాకుని భారీగా వినియోగిస్తారంటే నమ్ముతారా! మన దేశం నుంచి సుమారు 900 టన్నుల వరకు కరివేపాకు విదేశాలకు ఎగుమతి అవుతోందిట. గల్ఫ్ దేశాలలో మన కరివేపాకుకి బోలెడంత డిమాండ్. ఐరోపా వాసులైతే ఎండబెట్టిన కరివేపాకు ఆకుల పొడి వాడతారుట. అసలు కరివేపాకుని ఎందుకు తినాలి? అందులో బోల్డన్ని పౌష్టిక విలువలు ఉండబట్టేనని చెప్పుకున్నాం. అంతేనా.. దానిలో ఔషధ గుణాలు కూడా ఎక్కువే....మరి అవి ఏమిటో ఒకసారి చూద్దామా..

అజీర్ణం:

అజీర్ణం:

కరివేపాకు జీర్ణక్రియ ఇబ్బందులను పోగొట్టే గుణముంది. జీర్ణక్రియ సమస్యతో బాధపడేవారు కరివేపాకు ఆకులను, జీలకర్రతో కలిపి బాగా నూరి, అలా నూరగా వచ్చిన పొడిని పాలలో కలుపుకుని తాగిలే సమస్య నుండి ఉపశమనం కలుగుతుంది.

అధిక కొలెస్టరాల్:

అధిక కొలెస్టరాల్:

కరివేపాకు ముద్దను నిత్యం టీస్పూన్ మోతాదుగా తీసుకుంటూ ఉంటే క్రమంగా టోటల్ కొలెస్ట్రరాల్ తగ్గటంతోపాటు హానికరమైన ఎల్.డి.ఎల్. కూడా గణనీయంగా తగ్గుతుంది.

స్థూలకాయుల్లో కనిపించే మధుమేహం:

స్థూలకాయుల్లో కనిపించే మధుమేహం:

కరివేపాకును ముద్దగా నూరి మోతాదుకు టీ స్పూన్ చొప్పున మజ్జిగతోగాని నీళ్లతోగాని రెండుపూటలా తీసుకుంటుంటే స్థూలకాయం తగ్గి తద్వారా మధుమేహం నియంత్రణలోకి వస్తుంది.

బ్లడ్ ప్రెజర్:

బ్లడ్ ప్రెజర్:

అధిక రక్తపోటులో కనిపించే ఉపద్రవాలు: కరివేపాకు పళ్లను లేదా కరివేపాకు చెట్టు బెరడును కషాయంగా కాచి తీసుకుంటే అధిక రక్తపోటు వల్ల వచ్చే రుగ్మతలు తగ్గుతాయి.

శ్వాసకోశ వ్యాధులు:

శ్వాసకోశ వ్యాధులు:

కరివేపాకు, మిరపకాయలు, ఉప్పు, ఉల్లిపాయలను కలిపి రోటి పచ్చడి మాదిరిగా చేసుకొని ఆహారంగా తీసుకుంటే జలుబు, దగ్గు, ఉబ్బసం వంటి వ్యాధుల్లో హితకరంగా ఉంటుంది.

మూత్ర పిండాల సమస్యలు:

మూత్ర పిండాల సమస్యలు:

కరివేపాకు వేరు రసాన్ని ప్రతిరోజూ రెండు పూటలా పూటకు టీస్పూన్ మోతాదుగా తీసుకుంటూ ఉంటే మూత్ర పిండాల సమస్యల్లో హితకరంగా ఉంటుంది. కరివేపాకు ప్రతిరోజూ క్రమం తప్పకుండా ఆహారంలో స్వీకరిస్తే మూత్ర సంబంధిత వ్యాధులు తొలగిపోతాయి. దీని చెట్టువేళ్లతో కషాయం చేసి ప్రతిరోజూ నెలరోజుల పాటు తీసుకుంటే మూత్రపిండాల్లో రాళ్లు కరిగిపోతాయి.

మధుమేహం:

మధుమేహం:

వంశపారంపర్యంగా వచ్చే మధుమేహానికి కూడా కరివేపాకు పనిచేస్తుంది. ప్రతి రోజూ పది ముదురు కరివేపాకు ఆకులను బాగా నమిలి మింగాలి. అలా మూడు నెలల పాటు క్రమం తప్పకుండా చేస్తే మధుమేహాన్ని నియత్రించుకోగలుగుతారు.

దురదలు:

దురదలు:

ఎండబెట్టిన కరివేపాకును, పసుపును సమపాళ్లలో తీసుకొని పొడిమాదిరిగా నూరి, వస్తగ్రాళితం పట్టి ఒక శుభ్రమైన గాజు సీసాలో నిల్వచేసుకొని ప్రతిరోజూ ఒక టీ స్పూన్ మోతాదులో కనీసం మండలంపాటు తీసుకుంటే దురదలు తగ్గుతాయి.

గర్భిణీ వాంతులు, మార్నింగ్ సిక్‌నెస్, పైత్యపు వాంతులు:

గర్భిణీ వాంతులు, మార్నింగ్ సిక్‌నెస్, పైత్యపు వాంతులు:

కరివేపాకు రసాన్ని పూటకు రెండు టీ స్పూన్ల మోతాదులో, అరకప్పు మజ్జిగకు చేర్చి రెండుపూటలా తీసుకుంటుంటే వికారం, వాంతులు వంటివి తగ్గుతాయి. లేదా తాజా కరివేపాకు రసం ఒక టీ స్పూన్, నిమ్మరసం ఒక టీ స్పూన్, పంచదార ఒక టీ స్పూన్ కలిపి రోజుకు రెండుసార్లు తీసుకుంటుంటే వేవిళ్లలో ఉపశమనం కలుగుతుంది.

కాలిన గాయాలు:

కాలిన గాయాలు:

చర్మంపైన కాలి బొబ్బలెక్కిన సందర్భాల్లో కరివేపాకు ఆకులను మెత్తగానూరి నెయ్యిని గాని లేదా వెన్ననుగాని కలిపి బాహ్యంగా ప్రయోగించాలి. ఇలా చేయటంవల్ల గాయాలు త్వరితగతిన మచ్చలు పడకుండా మానుతాయి.

ఎముకల బలహీనత

ఎముకల బలహీనత

ఎముకల బలహీనత ఉన్నవారు, అస్ట్రియో పోరోసిస్‌ వ్యాధిగలవారు రీజూ ఆహారం ద్వారా కరివేపాకు తీసుకుంటే మంచిది.

డయేరియా:

డయేరియా:

ఇక డయేరియా వంటి వాటికి రెండు టీస్పూన్ల కరివేపాకు రసం బాగా పనిచేస్తుందిట. అలాగే మజ్జిగలో కాసిన్ని కరివేపాకుల్ని నలిపి లేదా రసం తీసి వేస్తే కడుపులోని బాధలు ఏవైనా తగ్గుతాయిట. అలాగే ఒట్టి కరివేపాకుని వేయించిగానీ, ఎండబెట్టిగానీ పొడిచేసి పెట్టుకుని రోజూ ఓ స్పూన్ తేనెతో ఓ స్పూన్ కరివేపాకు పొడిని కలిపి తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మంచిది.

జుట్టు సంరక్షణకు:

జుట్టు సంరక్షణకు:

ఆరోగ్యానికే కాదు.. అందానికీ కరివేపాకుని వాడతారు. కురులకి ఈ ఆకు ఎంతో మంచిదట. కరివేపాకు వేసి కాచిన నూనెని తలకి మర్ధన చేస్తే శిరోజాలు ఆరోగ్యంగా మెరుస్తాయి. పెరుగుతాయి కూడా. అంతేనా... జుట్టు తెల్లబడటం తగ్గి, కురులు నల్లదనాన్ని సంతరించుకుంటాయిట కూడా. ఇలా ఆరోగ్యానికి, అందానికి ఎంతో మంచిది అని నిపుణులు గట్టిగా చెబుతున్న కరివేపాకుని తరచూ ఏదో ఒక రూపంలో తప్పక తీసుకోవాలి అన్న నిర్ణయానికి వచ్చేశారా? మరింకేం.. కమ్మటి పచ్చడి, టేస్టీ పొడి లేదా పూర్వంలా మజ్జిగలో కరివేపాకు వేసి తాగడం వంటివి మొదలుపెట్టండి.

చుండ్రు:

చుండ్రు:

కరివేపాకు, నిమ్మ పండ్లపై నుండే తోలు, శీకాయ, మెంతులు, పెసలు... వీటిని సమభాగాలు తీసుకొని మెత్తని పొడి రూపంలో నూరి, నిల్వచేసుకొని షాంపూ పొడిగా వాడితే చుండ్రు నుంచి ఉపశమనం లభిస్తుంది. కురుల ఆరోగ్యానికి తల నూనె: కరివేపాకును ముద్దగా నూరి, ఒకటిన్నర రెట్లు కొబ్బరి నూనె కలిపి, చిన్న మంట మీద మరిగించి, వడపోసుకొని నిల్వచేసుకోవాలి. దీనిని రోజువారీగా తల నూనెగా వాడుకుంటుంటే జుట్టు నల్లగా నిగనిగలాడుతుంది. ఆరోగ్యంగా పెరుగుతుంది.

సౌందర్య సమస్యలు చర్మసంబంధ సమస్యలు:

సౌందర్య సమస్యలు చర్మసంబంధ సమస్యలు:

కరివేపాకు, వేపాకులు సమపాళ్లలో తీసుకొని ముద్దగా నూరి ప్రతిరోజూ రెండుపూటలా పూటకు ఒక టీ స్పూన్ మోతాదుగా, అర కప్పు మజ్జిగతో తీసుకుంటుంటే చర్మసంబంధ సమస్యల్లో హితకరంగా ఉంటుంది. కంటి కింద వలయాలు: కరివేపాకు రసాన్ని పెరుగుతో గాని లేదా వెన్నతోగాని కలిపి కళ్లకింద చర్మంమీద రాస్తుంటే క్రమంగా కంటి కింద వలయాలు తగ్గుతాయి.

English summary

Top 15 Health Benefits Of Curry Leaves

The curry leaf plant claims its origin in India. Since ancient times, it was used as a taste enhancer with the good old spices. The classic 'tadka' is incomplete without curry leaves. Though the claims of its origins in India are debatable, what isn't arguable are the various health benefits of curry leaves.
Story first published: Wednesday, December 3, 2014, 15:39 [IST]
Desktop Bottom Promotion