For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పసుపు రంగు దంతాలను నివారించే ఉత్తమ పదార్థాలు

|

ముఖంలో కళ్ళు, పెదాలు, అందమైన ప్రదేశం దంతాలు. దంతాలు తెల్లగా మిళమిళ మెరుస్తుంటే మీరు ఎవరినైనా సరే ఆకర్షణీయంగా, ఆరోగ్యకరంగా మరియు యవ్వనంగా కనబడుతారు. చాలా మంది ప్రజలు పబ్లిక్ లో ఉన్నప్పుడు నవ్వడం మానేస్తుంటారు. దానికి ప్రధాన కారణం వారి దంతాల యొక్క పూర్ కలర్ కలిగి ఉండటమే.

ముఖ్యంగా ఇలా దంతాలు అందాన్ని కోల్పోవడానికి లేదా దంతాలు తెల్లగా లేకపోవడానికి ప్రధాన కారణం, వయస్సు మీదపడటం, హైడ్రేటింగ్ ఫ్యాక్టర్స్, దంత సంరక్షణ సరిగా అనుసరించకపోవడం లేదా అధికంగా టీ, కాఫీ, టుబ్యాకో మరియు సిగరెట్స్ తీసుకోవడం. దంతాలు నాణ్యత మరియు అందం కోల్పోవడానికి వీటితో పాటు అధిక మోతాదున్న యాంటీబయోటిక్స్, వాతావరణ మార్పులు, ఇన్ఫెక్షన్స్ మరియు అపక్రమ మెటబాలిజం ఇవన్నీ కూడా దంతాల యొక్క కలర్ తగ్గడానికి ప్రధాన కారణం కావచ్చు.

దంతాలు తెల్లగా మిళమిళ మెరవాలంటే 20 చిట్కాలు: క్లిక్ చేయండి

చాలా మంది తరచుగా దంతాలను తెల్లగా మార్చుకోవడానికి ప్రొఫిషినల్ ట్రీట్మెంట్ తీసుకుంటారు. అయితే ఆ ట్రీట్మెంట్స్ కొంత సమయం తీసుకుంటుంది మరియు అది ఖర్చుతో కూడిన పనై ఉంటుంది. కాబట్టి, మీరు కూడా ఈ సమస్యతో బాధపడుతుంటే, ఎల్లో టీత్ (పసుపు దంతాలను)నివారించుకోవాలనుకుంటే, కొన్ని బెస్ట్ నేచురల్ హోం రెమెడీస్ ను ఉపయోగించండి. మీరు తెల్లని మెరిసేటి దంతాలతో అందంగా నవ్వడానికి ఉపయోగపడే కొన్ని వంటిగది పదార్థాలు ఇక్కడ మీకోసం అందిస్తున్నాం. కాబట్టి, వీటిని ఉపయోగించి అందాన్ని పునరుద్దరించుకోండి.

పాత దంతాలకు గుడ్ బై చెప్పి కొత్త దంతాలను పొందండి..:క్లిక్ చేయండి

స్ట్రాబెర్రీ:

స్ట్రాబెర్రీ:

స్ట్రాబెర్రీస్ లో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది దంతాలను తెల్లగా మార్చడంలో అద్భుతంగా సహాయపడుతుంది.

*కొన్ని స్ట్రాబెర్రీలను మెత్తగా పేస్ట్ లా చేసి, ఆ పేస్ట్ ను తీసుకొని దంతా మీద నిధానంగా సున్నితంగా రుద్దాలి . ఇలా ప్రతి రోజూ రెండు సార్లు, కొన్నివారాల పాటు చేయడం వల్ల మీ దంతాల మీద ఉన్న పసు వర్నం అదృశ్యమవుతుంది.

ఆపిల్స్:

ఆపిల్స్:

రెగ్యులర్ గా ఆపిల్స్ తినడం వల్ల ఇది మీ దంతాల మీద టూత్ బ్రష్ లా పనిచేస్తుంది మరియు వాటిని వైట్ గా మార్చుతుంది.

*ప్రతి రోజూ ఒకటి లేదా రెండు ఆపిల్స్ ను తినడం వల్ల మీరు మీ దంతాల మీద ఎల్లో మరకలను నివారించవచ్చు.

బేకింగ్ సోడా:

బేకింగ్ సోడా:

ఎల్లో టీత్ నివారించడానికి బేకింగ్ సోడా ఒక బెస్ట్ హోం రెమెడీ. ఇది దంతా మీద ఉన్న పాచిని తొలగించి దంతాలు తెల్లగా మిళమిళలాడే విధంగా ఉండేందుకు సహాయపడుతాయి.

*మీరు రోజూ ఉపయోగించే టూత్ పేస్ట్ లో చిటికెడు బేకింగ్ సోడా వేసి బ్రష్ చేసి, గోరువెచ్చని నీటితో నోటిని కడుక్కోవడం వల్ల ఎల్లో టీత్ ను నివారించవచ్చు. ఈ పద్దతిని వారంలో ఒకటి లేదా రెండు సార్లు ఉపయోగించవచ్చు.

తులసి:

తులసి:

తులసి దంతాలను తెల్లగా మార్చే లక్షణాలు కలిగి ఉంది. ఇది చిగుళ్ళకు, చిగుళ్ళ నొప్పి వ్యాధి నివారించడానికి ఒక ఆధునిక రూపంగా పళ్ళును కాపాడుతుంది.

*కొన్ని చుక్కలు తులసి ఆకులు తీసుకొని ఎండలో పెట్టాలి. ఈ ఆకలు ఎండిన తర్వాత వాటిని మెత్తగా పౌడర్ చేసుకోవాలి. ఈ పౌడర్ ను రెగ్యులర్ టూత్ పేస్ట్ తో మిక్స్ చేసి తర్వాత బ్రష్ చేసుకోవాలి.

చార్కోల్:

చార్కోల్:

బొగ్గు, బాగా తెలిసినటువంటి ఒక ఉత్తమ హోం రెమెడీ. బొగ్గులో పవర్ ఫుల్ క్రిస్టల్ బేస్డ్ కెమికల్స్ ఉంటాయి. ఇవి ఎల్లో టీత్ కు బెస్ట్ హోం రెమెడీగా పని చేసి దంతాలను తెల్లగా మార్చుతాయి. ఇలా ప్రతి రోజూ చేయడం వల్ల మీ దంతాలను తెల్లగా మార్చుకోవచ్చు.

హైడ్రోజన్ పెరాక్సైడ్:

హైడ్రోజన్ పెరాక్సైడ్:

ఒక నాణ్యమైన బ్లీచింగ్ ఎఫెక్ట్ కలిగినది హైడ్రోజెన్ పెరాక్సైడ్. ఇది ఎల్లో టీత్ ను తెల్లగా మార్చడానికి సహాయపడుతుంది.

*హైడ్రోజన్ పెరాక్సైడ్ ను నోట్లో వేసుకొని పుక్కలించాలి లేదా గార్గిలింగ్ చేయాలి. అయితే హైడ్రోజన్ పెరాక్సైడ్ ను ఏ మాత్రం మింగకుండా జాగ్రత్త తీసుకోవాలి.

నిమ్మరసం:

నిమ్మరసం:

నిమ్మలో బ్లీచింగ్ ఏజెంట్స్ పుష్కలంగా ఉన్నాయి. ఇవి దంతాలు పసుపురంగులో పాలిపోయినట్లు ఉన్నదాన్ని వదిలించడానికి సహాయపడుతుంది. నిమ్మరసంను పుక్కలించడం లేదా నిమ్మ తొక్కతో దంతాల మీద రుద్దడం వల్ల మీ దంతాలను తెల్లగా మార్చడానికి ఇది ఒక ఉత్తమ మార్గం.

* కొన్ని చుక్కల నిమ్మరసం మరియు ఉప్పు మిక్స్ చేసి ఈ మిశ్రమాన్ని మరకలు పడ్డ దంతాల మీద రుద్దాలి. దంతాలు మరియు చిగుళ్ళ మీద బాగా రుద్ది కొన్ని నిముషాలు అలాగే ఉంచాలి. తర్వాత చల్లటి లేదా గోరవెచ్చని నీటితో నోటిని శుభ్రం చేసుకోవాలి. ఇలా ప్రతి రోజూ రెండు సార్లు, కొన్నివారాల పాటు చేస్తే మంచి ఫలితం ఉంటుంది.

వేప:

వేప:

వేపపులను ఉపయోగించి మీ దంతాలను తెల్లగా మరియు ఆరోగ్యకరంగా మార్చుకోవచ్చు . ఈ వేపపుల్లలో ఉండే యాంటీసెప్టిక్ మరియు యాంటీ ఆస్ట్రిజెంట్ లక్షణాలు దంతా మీద ఎఫెక్టివ్ గా పనిచేసి దంతక్షయాన్ని నివారిస్తాయి. అలాగే చెడు శ్వాసను కూడా నివారిస్తాయి.

*వేపపుల్లను ఉపయోగించి దంతాలను రుద్దుకోవాలి. వేపపుల్లను నమలడం వల్ల దంత సమస్యలు నివారించడానికి మరియు దంతా మీద ఎల్లో డిస్ కలర్ ను నివారించడానికి సహాయపడుతాయి.

ఆరెంజ్ తొక్క:

ఆరెంజ్ తొక్క:

ఎల్లో టీత్ ను శుభ్రం చేయడానికి తాజాగా ఉండే ఆరెంజ్ తొక్కతో రుద్దాలి. ఇలా రెగ్యులర్ గా చేయడం వల్ల దంతాల మీద పసుపు వర్ణంను తొలగిస్తుంది.

*మీరు ప్రతి రోజూ నిద్రించే ముందు దంతాల మీద ఆరెంజ్ తొక్కతో బాగా రుద్దాలి. ఆరెంజ్ తొక్కలో ఉండే విటమిన్ సి మరియు క్యాల్షియం వంటివి రాత్రి సమయంలో దంతాల మీద సూక్ష్మజీవులను ఎదుర్కోవడానికి సహాయపడుతుంది. ఇలా కొన్ని వారాల పాటు చేయడం వల్ల మంచి ఫలితాలను చూడవచ్చు.

ఉప్పు:

ఉప్పు:

ఉప్పు ఒక ఫండమెంటల్ డెంటల్ క్లీనింగ్ ఏజెంట్. ఉప్పును దంతసంరక్షణ కోసం కొన్ని దశాద్దాలుగా ఉపయోగిస్తున్నారు.ఇది దంతాల్లో కోల్పోయిన ఖనిజాలను తిరిగి పొందడానికి సహాయపడుతుంది మరియు ఇది దంతాలు తెల్లగా మార్చడానికి సహాయపడుతుంది.

*మీరు సాధారణంగా ఉపయోగించే ఉప్పును టూత్ పౌడర్ తో చేర్చి దంతాలను బ్రష్ చేసుకోవాలి. లేదా చార్కోల్(బొగ్గు)ను ఉపయోగించి కొద్దిగా ఉప్పు చేర్చి దంతాలను రుద్దడం వల్ల దంతాలు తెల్లగా మారుతాయి. అలాగే కామన్ సాల్ట్ ను, బేకింగ్ సోడాతో మిక్స్ చేసి నిదానంగా రుద్దాలి.

English summary

Top Ten Home Remedies for Yellow Teeth

Teeth may gradually become yellow due to aging, hereditary factors, poor dental hygiene, or excessive consumption of tea, coffee, tobacco and cigarettes. In addition, high doses of antibiotics, climatic conditions, infection and improper metabolism can contribute to discoloring of teeth.
Desktop Bottom Promotion