For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

స్మోకింగ్ వల్ల వచ్చే దగ్గు: నివారించే ఉత్తమ చిట్కాలు

|

ధూమపానం: దీర్ఘకాలపు దగ్గుకు అతి ప్రధాన కారణం ధూమపానం. సిగరెట్లు తాగేవారిలో కనిపించే నుసిదగ్గు (స్మోకర్స్ కాఫ్) ఎంపైసిమా అనే ప్రమాదకరమైన సరిచేయలేని ఊపిరితిత్తుల వ్యాధికి సూచన. సిగరెట్ పొగకు పరోక్షంగా గురికావటం వల్ల కూడా ఊపిరితిత్తుల వ్యాధులు, దానిని అనుసరించి దగ్గూ వచ్చే రిస్క్ ఉంటుంది. ధూమపానం చేసేవారికి కోద్దో గొప్పో దగ్గు ఉంటుంది. పొడిదగ్గు వారి జీవితంలో ఒక భాగంగా ఉండిపోతుంది. దగ్గు లేదంటూనే దగ్గడం వారికి పరి పాటి. దీనిని స్మోకర్స్‌ కాఫ్‌ అంటారు. వరుసగా మూడు నెలల పాటు కనీసం రెండు సంవత్సరాలుగా ఉన్నవారికి క్రానిక్‌ బ్రాంకైటిస్‌ ఉన్నట్లుగా వ్యవహరిస్తారు.

స్మోక్(ధూమపానం) చేసే వారిలో కొన్ని భయంకరమైన లక్షణాలు కనిపిస్తాయి. ముఖ్యంగా నోరు, ముక్కు మరియు ఊపిరితిత్తుల మీద నేరుగా ప్రభావం చూపుతుంది. స్మోకర్స్ గొంతుకు సంబంధించి సమస్యను చాలా సాధారణంగా ఎదుర్కొంటారు. ముఖ్యంగా గొంతులో ఇన్ఫెక్షన్ అయ్యి దగ్గు విపరీతంగా వస్తుంటుంది. పగలూ రాత్రీ అదేపనిగా దగ్గుతుంటారు దగ్గుతో శ్లేష్మం (కళ్లె) కూడా విపరీతంగా పడుతూ ఉంటుంది. ఒక్క సారి దగ్గు ప్రారంభమైతే అంత త్వరగా వదలదు.

పొడి దగ్గు నుండి తక్షణ ఉపశమనం కలిగించే బెస్ట్ టిప్స్ తెలుసుకోవాలంటే క్లిక్ చేయండి

స్మోకర్స్ దగ్గు చాలా పొడిగా ఉంటుంది. ఎక్కువగా స్మోక్ చేయడం వల్ల దగ్గుతో పాటు శ్లేష్మం ఉత్పత్తి అవుతుంది. ఇది తెల్లగా లేదా పసుపుగా లేదా పచ్చకలర్ లో ఉంటుంది. ఈ ధూమపానం త్రాగే వారిలో దగ్గు చాలా చిరాకు పరుస్తుంది ముఖ్యంగా ఉదయం నిద్రలేవగానే ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది.

ధూమపానం చేసేవారిలో వచ్చే దగ్గను నేచురల్ గా తగ్గించడానికి అనేక మార్గాలున్నాయి. కానీ ముఖ్యంగా, ధూమపానం ప్రియలు సిగరెట్ త్రాగడం మానేస్తేనే మంచిది. మీరు ఎంత ఎక్కువగా సిగరెట్స్ త్రాగితే, గొంతు అంత వరెస్ట్ గా తయారవుతుంది. సిగరెట్ మానేయడం వల్ల ఊపిరితిత్తులు శుభ్రపడుతాయి, ఎయిర్బోర్న్ ఇన్ఫెక్షన్స్ నుండి రక్షింపబడుతారు. స్మోకర్స్ కాఫ్ ను నివారించడానికి ఇక్కడ కొన్ని చిట్కాలున్నాయి...

సిగరెట్ త్రాగడం మానేయాలి

సిగరెట్ త్రాగడం మానేయాలి

స్మోకింగ్ వల్ల సీలియా అనే విషం వల్ల చిన్న కణాలను స్తంభింపజేస్తుంది. దాంతో వాపుకు దారితీస్తుంది మరియు ఊపిరితిత్తులకు హాని కలగజేస్తుంది. కాబట్టి కణజాలాలను మరియు కణాలను దహనం చేయడం మానేయండి.

టీ విత్ హనీ

టీ విత్ హనీ

స్మోకర్స్ కఫ్ నివారించడంలో చాలా సింపుల్ హోం రెమెడీ ఇది. తులసి ఆకులను ఉపయోగించి, హేర్బల్ టీ తయారుచేయాలి. తర్వాత అందులో తేనె మిక్స్ చేసి తీసుకోవాలి. తేనెలో యాంటీఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉన్నాయి. ఇది గొంతును శుభ్రం చేస్తుంది మరియు దగ్గు నుండి ఉపశమనం కలిగిస్తుంది.

వేడినీళ్ళతో గార్గల్ చేయాలి

వేడినీళ్ళతో గార్గల్ చేయాలి

స్మోకర్స్ కఫ్ నివారించడానికి గార్గిలింగ్(నోట్లో నీళ్ళు పోసుకొని పుక్కలించడం, గొంతువరకూ పోనిచ్చి గరగరమని శబ్దం చేయడం). గోరు వెచ్చని నీళ్ళు గొంతును క్లియర్ చేస్తుంది మరియు గొంతునొప్పిని నివారిస్తుంది.

ఊపిరితిత్తులను డిటాక్స్ చేయడం

ఊపిరితిత్తులను డిటాక్స్ చేయడం

మంచి ఆరోగ్యం పొందడానికి మరియు గొంత సమస్యలను నివారించుటకు డిటాక్స్ చాలా బాగా సహాయపడుతుంది.

డీప్ బ్రీతింగ్

డీప్ బ్రీతింగ్

లోతుగా ఉశ్చ్వాస, నిశ్చ్వాసల వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. ఇది ఊపిరితిత్తులను శుభ్రం చేస్తుంది మరియు శ్వాసక్రియను బలోపేతం చేస్తుంది.

లెమన్ జ్యూస్

లెమన్ జ్యూస్

స్మోకర్స్ కాఫ్ ను నివారించుటకు లెమన్ జ్యూస్ ఒక ఉత్తమ హోం రెమెడీ. ప్రతి రోజూ ఉడయం గోరువెచ్చని లెమన్ వాటర్ ను త్రాగడం వల్ల, ఉదయం వచ్చే దగ్గును నివారిస్తుంది.

వెల్లుల్లి తినాలి

వెల్లుల్లి తినాలి

బాగా కాగిన పాలలో వెల్లుల్లితురుము వేసి బాగా మరిగించి , తర్వాత అందులో పంచదార లేదా తేనె వేసి మిక్స్ చేసి, దీన్ని రోజుకు రెండు సార్లు త్రాగితే మంచి ఫలితం ఉంటుంది.

యూకలిప్టస్ మరియు పుదీనా

యూకలిప్టస్ మరియు పుదీనా

యూకలిప్టస్ ఆకులు మరియు పుదీనా రెండింటిని నీళ్ళలో వేసి ఉడికించాలి . తర్వాత ఈ నీటిని వడగట్టి తీసుకోవాలి. ఇది స్మోకర్స్ కాఫ్ ను నివారిస్తుంది.

English summary

Treat Smoker's Cough With Remedies

Smoking has its own side effects on the throat. The effects of smoking on your health are disastrous. But the smoker's throat symptoms are particularly scary. Your throat, mouth, nose and lungs are the four parts that come in direct and close contact with the poisonous smoke. One of the most common throat problems smokers face is cough.
Desktop Bottom Promotion