For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బరువు తగ్గాలన్నా తగ్గలేకపోతున్నారా?అందుకు ముఖ్య కారణాలివే.!

By Super
|

మీరు అతిగా బరువు పెరిగిపోతున్నారా? ఆహారాన్ని జాగ్రత్తగా తీసుకున్నా అధిక బరువు సమస్యను అధిగమించలేకపోతున్నారా? అసలు సమస్య ఆహారాన్ని తీసుకోవడంలో ఉండకపోవచ్చు. మీ ఆరోగ్య సమస్యే అధిక బరువుకు కారణం అయి ఉండవచ్చు. ఈ సమస్యను అధిగమించడానికి కొన్ని సులభమైన పరిష్కారాలు ఇప్పుడు తెలుసుకుందాం.

తగినంత నిద్ర

తగినంత నిద్ర

మీరు నిద్రకు తగినంత సమయం కేటాయించకపోతే మీ శరీరంలోని హార్మోన్స్ సరిగ్గా పనిచేయవు. దాంతో జీవక్రియ దెబ్బతింటుంది. సరైన నిద్ర లేకపోతే ఆహారం జీర్ణమవడం కష్టమని అందుకే డాక్టర్స్ చెప్తూ ఉంటారు. దీంతో పాటు, నిద్రలేమితో సతమతమవుతున్నవారు మెలకువగా ఉన్నంత సేపూ ఏదో ఒకటి తింటూ ఉంటారు. తద్వారా అధిక బరువు సమస్యతో సతమతమవుతూ ఉంటారు. అలాగే, కాఫీ, టీలు ఎక్కువగా తీసుకోవడం కూడా అధిక బరువు సమస్యకు మూలం.

డిప్రెషన్

డిప్రెషన్

ఇక్కడ ప్రాబ్లం రెండు వైపులా ఉంది. ఆహారంతో ఎమోషనల్ రిలేషన్ షిప్ ను పెంచుకునేవారు డిప్రెషన్ కు గురైనప్పుడల్లా ఎక్కువ తినడాన్ని అలవాటు చేసుకుంటారు. డిప్రెషన్ నుండి బయటకు రావడానికి వాడే యాంటీడిప్రజంట్స్ ఆకలిని ప్రేరేపిస్తాయి. ఇది కూడా అధిక బరువు పెరగడానికి కారణం.

 ఒత్తిడికి లోనైతే

ఒత్తిడికి లోనైతే

శరీరంలోని ఎడ్రేనలైన్ అనే ఒత్తిడికి చెందిన హార్మోన్ అధికమైతే శరీరంలో కర్టిసాల్ ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. కర్టిసాల్ ఆకలిని ఎక్కువగా కలిగిస్తుంది. ఒత్తిడికి గురైనప్పుడు ఆకలి బాగా పెరగడంతో ఏదో ఒక అనారోగ్యకరమైన ఆహారాన్ని తినడానికి సిద్ధమవుతారు. ఆల్కహాల్, హై కేలరీ స్నాక్స్ వంటివి తీసుకుంటారు. ఇవన్నీ అధిక బరువు సమస్యను అధికం చేసేవే. ఒత్తిడిని తగ్గించుకోవడానికి ప్రయత్నిస్తే అధిక బరువు సమస్యను అధిగమించవచ్చు.

థైరాయిడ్ సమస్య

థైరాయిడ్ సమస్య

హైపోథైరాయిడిజం లేదా యాక్టివ్ గా లేని థైరాయిడ్ శరీరంలోని జీవ క్రియను మందగింపచేస్తుంది. అందువల్ల, చాలా మంది బరువు పెరిగిపోతారు. ఈ సమస్యను సరైన సమయానికి డయాగ్నొస్ చేయకపోతే సమస్య మరింత జటిలంగా మారే అవకాశముంది. చికిత్సతో ఈ థైరాయిడ్ సమస్యను పరిష్కరించవచ్చు. మళ్ళీ సాధారణ స్థాయికి బరువు చేరుకుంటుంది.

PCOS సిండ్రోమ్

PCOS సిండ్రోమ్

పోలీసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ లేదా PCOS సమస్య వల్ల చాలా మంది మహిళలు అధిక బరువు సమస్యతో సతమతమవుతున్నారు. డయాబెటిస్ సమస్య ఉన్నవారిలాగే వీరికి కూడా ఇన్సులిన్ ప్రతిఘటన సమస్య ఉంటుంది. అదే PCOS సమస్య ఉన్నవారిలో టెస్టోస్టెరోన్ అనే మేల్ హార్మోన్ ను ఒవరీస్ లోని ఫిమేల్ హార్మోన్ ఈస్ట్రోజెన్ గా మార్చేందుకు కష్టంగా ఉంటుంది. టెస్టోస్టెరోన్ శాతం ఎక్కువగా ఉన్నప్పుడు శరీరం అధిక బరువు సమస్యతో సతమతమవుతూ ఉంటుంది. ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల శరీరం కేలరీలను పూర్తిగా సద్వినియోగపరచుకోవకపోవడం వల్ల అధిక బరువు సమస్య ఏర్పడుతుంది.

రాత్రివేళ అకాల భోజనం

రాత్రివేళ అకాల భోజనం

నిద్రపోవడానికి ముందు ఒక గంట ముందు లేదా రెండు గంటల ముందు భోజనం చేసినవాళ్ళు నిద్రకు కనీసం నాలుగైదు గంటల ముందే భోజనం ముగించినవారికంటే అధిక బరువు సమస్యతో ఇబ్బంది పడతారు. మీరు యాక్టివ్ గా లేరన్న విషయాన్ని మీ శరీరం అర్థం చేసుకుంది. అందువల్ల కేలరీలను ఫ్యాట్ రూపంలో మీ శరీరం భద్రపరుస్తుంది. ఈ ఫ్యాట్ ఎనర్జీగా కన్వర్ట్ అవడానికి చాలా సమయం పడుతుంది.

పిండి పదార్థాలను తగ్గించడం

పిండి పదార్థాలను తగ్గించడం

ఆరోగ్యం కోసం సమతుల్యమైన ఆహారం తీసుకోవలసిన అవసరముందని మనకందరికీ తెలిసిన విషయమే. కాని, పిండి పదార్థాలను ఆహారంలో తీసుకోవడం తగ్గించినంత మాత్రాన అధిక బరువు సమస్య తగ్గదన్న విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. బరువు తగ్గడం కోసం, మన శరీరానికి అవసరమైన వాటిని ఆహారం నుంచి నిర్మూలించడం సరైన పద్దతి కాదు. శరీరంలోని శక్తిని పుట్టించడానికి పిండి పదార్థాలు ప్రధాన పాత్ర పోషిస్తాయి.

English summary

Trying to lose weight, but cannot? Here are 7 reasons that could be getting in the way.

Do you keep piling on the kilos, no matter how many diets you try? The problem may have more to do with your general health than with your food. Here are simple solutions that can help you beat the bulge.
Story first published: Saturday, December 27, 2014, 16:57 [IST]
Desktop Bottom Promotion