For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

క్యాన్సర్ అభివృద్ధి చెందే లక్షణాలు ఎలా ఉంటాయి

By Super Admin
|

క్యాన్సర్ వ్యాధిని అన్ని వ్యాధులలో చక్రవర్తి గా సూచిస్తారు. ఎందుకంటే దీని మీద విస్తృతమైన పరిశోధన మరియు అభివృద్ది జరిగిన తర్వాత కూడా క్యాన్సర్ ఇప్పటికీ ఒక ప్రమాదకరమైన వ్యాధిగా ఉంది. దీని నుండి పూర్తిగా ఉపశమనం పొందలేము. ప్రజలు ఏ వ్యాధికి భయపడనంతగా క్యాన్సర్ వ్యాధికి భయపడతారు. కనుక మీకు క్యాన్సర్ వచ్చే అవకాశాల గురించి తెలుసుకోవటానికి కొన్ని సంకేతాలు ఉన్నాయి. అప్పుడు మీరు ఖచ్చితంగా భయపడతారు.

క్యాన్సర్ అభివృద్ధి చెందే లక్షణాలు ఎలా ఉంటాయి
కానీ ఎల్లప్పుడూ మీరు క్యాన్సర్ పొందే ఆ సంకేతాలకు రెండవ కోణం ఉంటుంది. మీరు క్యాన్సర్ పొందే అవకాశాలను తెలుసుకుంటే, అప్పుడు మీరు వైద్యపరంగా మరియు మానసికంగా దాని మీద పోరాటం చేయవచ్చు.

చివరికి యాంజెలీనా జోలీ రొమ్ము క్యాన్సర్ నుండి తప్పించుకోవటానికి శస్త్రచికిత్స ద్వారా రెండు రొమ్ములను తొలగించుకొని వార్తలలోకి ఎక్కారు. ఏంజెలీనా యొక్క తల్లి మరియు అత్త ఇద్దరూ రొమ్ము క్యాన్సర్ తో మరణించారు. అందువలన ఆమె కూడా రొమ్ము క్యాన్సర్ రాకుండా జాగ్రత్త తీసుకున్నారు.

20 క్యాన్సర్ లక్షణాలు: మహిళలు ఎట్టి పరిస్థితిలో నిర్లక్ష్యం చేయకూడనవి!
మా శరీరంలో క్యాన్సర్ కణాలు ఉంటాయి. కేవలం ఈ క్యాన్సర్ కణాలు అసాధారణంగా పెరగటం మొదలు పెడితే అప్పుడు క్యాన్సర్ వస్తుంది. ఈ క్యాన్సర్ కణాలు అదుపులేకుండా గుణించడం మొదలు పెట్టుట లేదా బహిర్గతం అయ్యే దాని మీద ఆధారపడుతుంది. క్యాన్సర్ రావటానికి జన్యువులు కూడా కారణం అవుతాయి. దీనిని DNA పరీక్ష ద్వారా గుర్తించవచ్చు.

మీకు క్యాన్సర్ అభివృద్ధి చెందే అవకాశం ఉందని చెప్పటానికి కొన్ని సంకేతాలు తెలుసుకుందాము.

ఆహారంను తిరిగి వేడి చేయటం

ఆహారంను తిరిగి వేడి చేయటం

ఇటీవల జరిపిన అధ్యయనం ప్రకారం పాచిపోయిన లేదా రిఫ్రిజిరేటర్ లో నిల్వ ఉంచిన పదార్దాలు మరియు అనేక సార్లు తిరిగి వేడి చేసిన ఆహారం అనేది కడుపు క్యాన్సర్ కు ప్రముఖ కారణం అని తెలిసింది. అధ్యయనంలో ముగింపు సూచించటంలేదు. కానీ మైక్రోవేవ్ ఓవెన్ చాలా భారీగా ఆధారపడటం ఒక చెడ్డ ఆలోచన అని చెప్పవచ్చు.

ఎర్లీ మెనోపాజ్

ఎర్లీ మెనోపాజ్

సాదారణంగా మెనోపాజ్ 30 సంవత్సరాల చివర లేదా 40 సంవత్సరాల ప్రారంభంలోను వస్తుంది. అలా కాకుండా ఎర్లీ మెనోపాజ్ ఉంటే కనుక అప్పుడు మీకు క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. ఒక మహిళ యొక్క శరీరంలో మెనోపాజ్ సమయంలో అనేక రకాల హార్మోన్ల అసమతౌల్యం వలన క్యాన్సర్ కి దారి తీస్తుంది.

శస్త్రచికిత్సలు మరియు మచ్చ కణజాలం

శస్త్రచికిత్సలు మరియు మచ్చ కణజాలం

మీరు చాలా శస్త్రచికిత్సలు చేయించుకుంటారు. అప్పుడు అక్కడ మచ్చ కణజాలం అభివృద్ధి చెంది క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఈ మచ్చ కణజాలం ఒక ఆపరేషన్ సమయంలో కట్ చేసిన మీ శరీరం యొక్క ఆ పార్ట్శ్ నుండి పెరుగుతుంది.

డైట్

డైట్

మీ సాధారణ ఆహారంలో చక్కెర,పాలు మరియు ఇతర క్యాన్సర్ ను ప్రేరేపించే ఆహారాలు ఎక్కువగా ఉంటే, అప్పుడు మీకు క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఆరోగ్యకరమైన అలవాట్లు క్యాన్సర్ పెరుగుదలను నిరోధించడానికి ఉత్తమ మార్గాలలోఒకటి అని చెప్పవచ్చు.

ఎండలో

ఎండలో

సన్ స్క్రీన్ నుండి రక్షణ లేకుండా సూర్యుడు యొక్క కిరణాలు మీ మీద బహిర్గతం అయితే కూడా క్యాన్సర్ కు దారి చేయవచ్చు. ఓజోన్ పొరలోరంద్రాలు ఏర్పడుతున్నాయి. అలాగే UV రేడియేషన్ స్థాయిలు పెరుగుతున్నాయి.

మెటల్ బహిర్గతం

మెటల్ బహిర్గతం

మీరు లోహాల కర్మాగారంలో పని లేదా అటువంటి స్థలం చుట్టూ నివసిస్తూ ఉంటే, అప్పుడు మీకు క్యాన్సర్ అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది. రాతి కర్మాగారాల చుట్టూ నివసిస్తున్న ప్రజలకు తరవాతి దశలలో కాన్సర్ ప్రమాదం అగ్రగామిగా ఉన్నది.

కిరణాల బహిర్గతం

కిరణాల బహిర్గతం

మీరు పరికరాలతో పని చేస్తే రేడియేషన్ విడుదల అవుతుంది. అప్పుడు మీకు క్యాన్సర్ అభివృద్ధి ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ఉదాహరణకు,రోజంతా ఒక x-కిరణ యంత్రం దగ్గర పనిచేసే ఒక రేడియాలజిస్ట్ కు ఉంటుంది.

స్మోకింగ్

స్మోకింగ్

స్మోకింగ్ చేయని వారి కంటే స్మోకింగ్ చేసే వారిలోనే క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. స్మోకింగ్ వలన చాలా సందర్భాలలో గొంతు,ఊపిరితిత్తులు,నోరు క్యాన్సర్ వంటివి వస్తాయి.

బరువు తగ్గటం

బరువు తగ్గటం

మీరు హఠాత్తుగా ఆహార నియంత్రణ లేదా వ్యాయామం లేకుండా బరువు కోల్పోతే,క్యాన్సర్ వృద్ధి మీ శరీరంలో సంభవిస్తుందని చెప్పవచ్చు.

కుటుంబం

కుటుంబం

ఇప్పుడు క్యాన్సర్ అనేది వంశానుగత వ్యాధిగా పరిశోధనతో నిరూపితమైంది. కొన్ని రకాల క్యాన్సర్లు కుటుంబం ద్వారా వస్తాయి. చాలా సాధారణంగా రొమ్ము క్యాన్సర్ వంశపారంపర్య రుగ్మతగా చూడబడుతుంది. మీ తల్లి,అమ్మమ్మ లేదా అత్త రొమ్ము క్యాన్సర్ కలిగి ఉంటే, మీరు పొందటానికి అధిక ప్రమాదం ఉంటుంది.

English summary

Warning Signs You May Get Cancer

We all have cancer cells in our body. Only when these cancer cells start growing abnormally, do we get cancer. Whether these cancer cells start multiplying uncontrollably or not depends on what triggers we get exposed to.
Desktop Bottom Promotion