For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

స్త్రీలలో వచ్చే ఆస్టియోపోరోసిస్ కి తీసుకోవాల్సిన 10 మంచి ఆహార పదార్ధాలు

By Super
|

ఆస్టియోపొరోసిస్ అంటే ఏమిటి? ఆస్టియోపొరోసిస్ కి అసలు అర్ధం “ఎముకలు బోలు” గా అవ్వడం. ఇది ఎముకలలో సామర్ధ్యం, సాంద్రత తగ్గడం వల్ల వచ్చే ఎముకల జబ్బు. ఎముకలు పెళుసుగా తయారయి దాని ఫలితంగా ఎముకలు విరిగిపోయే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. స్త్రీలలో కొంత వయసు మళ్ళిన తరువాత ఆస్టియోపొరోసిస్ అనేది రావడం చాలా సహజ౦. ఎముకల బలహీనత మనకు తెలీకుండా, క్రమంగా జరుగుతుంది, మొదట ఎముకలు విరిగే వరకు మీరు ఆస్టియోపొరోసిస్ తో బాధపడుతున్నారనే విషయం ఎప్పటికీ తెలియదు.

ఆస్టియోపొరోసిస్ అనే వ్యాధి పురుషులతో పోల్చుకుంటే స్త్రీలలో చాలా సాధారణంగా సంభవిస్తుంది, ఎందుకంటే స్త్రీల ఎముకలు పురుషుల ఎముకల కంటే చాలా బలహీనంగా ఉంటాయి. స్త్రీలలో ఎముకలను ఈస్త్రోజేన్ అనే హార్మోన్ సంరక్షిస్తుంది, ఇది ఎముకలు బలహీనానికి కారణమయ్యే మేనోపాస్ కి చేరినపుడు అది గణనీయంగా తగ్గుతుంది. స్త్రీ చాలా వరకు ఈ ఆస్టియోపొరోసిస్ ని అరికట్టడానికి మంచి ఆహారంతోపాటు మేనోపాస్ కి చేరుకోవడం లాగా ఆస్టియోపొరోసిస్ పెరిగే అవకాశం ఉంది.

ప్రజలు ఆస్టియోపొరోసిస్ అనేది వయసు మీదపడడం వల్ల వస్తుందని అనుకుంటారు. నేడు ఈ వ్యాధిని ఎలా నిర్మూలించడం, కనుగొనడం, చికిత్స చేయడం అనేది చాలా తెలిసుకోవచ్చు. స్త్రీలు ఈ ఆస్టియోపొరోసిస్ సమస్యతో బాధపడుతుంటే దాని చికిత్సకు వివిధ రకాల సహజ చికిత్సలను ఉపయోగించవచ్చు. మీరు ఎముకలపై శ్రద్ధ చూపించడానికి చిన్నవారో, పెద్దవారో కానఖ్ఖరలేదు. ఈ ఆస్టియోపొరోసిస్ వ్యాధిని అధిగమించడానికి అనేక మంచి ఆహార పదార్ధాలు ఉన్నాయి. ఆస్టియోపొరోసిస్ నిర్మూలనకు సరైన జీవన శైలి అలవాట్లను, తీసుకునే ఆహారాన్ని అనుసరిస్తే చాలు, మీరు మీ ఎముకలను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. బలమైన, దట్టమైన ఎముకల అభివృద్ధికి తగినంత కాల్షియం, విటమిన్ D అవసరం.

ప్రాణాంతకమైన ఈ ;వ్యాధి నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి ప్రతి స్త్రీ తీసుకోవాల్సిన కొన్ని ముఖ్యమైన ఆహార పదార్ధాల గురించి చర్చిద్దాం.

పాల పదార్ధాలు

పాల పదార్ధాలు

ఆస్టియోపొరోసిస్ కి మంచి అత్యున్నత ఆహార పదార్ధాలు కాల్షియం అలాగే ప్రోటీన్ అధిక శాతం కలిగి ఉండి ప్రధాన పాత్రను పోషించే పాలు, పెరుగు, చీజ్ వంటి పాల పదార్ధాలు.

గుడ్లు

గుడ్లు

గుడ్లలో కాల్షియం, విటమిన్ B6, B12, ఫోలేట్ అధికంగా ఉంటాయి. ఎముకల ఆరోగ్యానికి గుడ్లు చాలా మంచివి, ఆస్టియోపొరోసిస్ నిర్మూలనకు సూచించే ఆహారపదార్ధాలలో ఇదొకటి.

బలవర్ధకమైన పండ్లరసాలు

బలవర్ధకమైన పండ్లరసాలు

ఆస్టియోపొరోసిస్ కి ఆపిల్, ఆరంజ్, పియర్, అరటిపండు, నిమ్మ, పలకూర్, అల్లం మొదలైనవి చాలామంచి ఆహార పదార్ధాలు. సమతుల్య కాల్షియం పదార్ధాల కోసం రోజు మర్చి రోజు ఈ రసాలను తీసుకోండి.

తృణధాన్యాలు

తృణధాన్యాలు

అన్ని గింజలు, త్రుణధాన్యాలలో మీకు అవసరమయ్యే అద్భుతమైన పీచుపదార్ధం ఉంటుంది, ఇది జీర్ణ వ్యవస్ధ ద్వారా ఆహారాన్ని కదుపుతుంది. వాటిలో ఎముకల ఆరోగ్యానికి సరిపడే మినరల్స్, మెగ్నీషియం బాగా ఉంటుంది, అందువల్ల ఆస్టియోపొరోసిస్ నిర్మూలనకు వీటిని కూడా ఒక మంచి ఆహారంగా తీసుకోవచ్చు.

బీఫ్ లివర్

బీఫ్ లివర్

గొడ్డు కాలేయం లో విటమిన్ A అధికంగా ఉంటుందని చెప్తారు. ఒక ముక్క గొడ్డు మాంసం ప్రతిరోజూ తీసుకుంటే పెద్దవాళ్ళలో 400 శాతానికి పైగా విటమిన్ A ని పుష్కలంగా అందిస్తుంది. గొడ్డు కాలేయం లో అవసరమైన మినరల్స్, కాపర్ తోపాటు ఫాస్పరస్, సేలేనియం, జింక్, ఐరన్ కూడా సమృద్ధిగా ఉంటాయి. ఈ మినరల్స్ ఎముకల ఆరోగ్యానికి తోడ్పడతాయి.

చేపలు

చేపలు

సాల్మన్, మాకేరెల్, టున వంటి కొవ్వు కలిగిన చేపలు ఆస్టియోపొరోసిస్ కి మంచి ఆహరం. వీటిలో కాల్షియం సమృద్ధిగా ఉంటుంది, వీటిని ప్రతిరోజూ తినటం వల్ల ఎముకల ఆరోగ్యం మెరుగుపడుతుంది.

ఆకుపచ్చని ఆకుకూరలు

ఆకుపచ్చని ఆకుకూరలు

మీరు ప్రతిరోజూ ఐదు రకాల ఆకుకూరలు తినాలి వాటిలో ఆకుకూరలు తప్పనిసరిగా ఉండాలి. కోల్లర్డ్స్, కాలే లో ప్రధానంగా కాల్షియం ఎక్కువగా ఉంటుంది, ఇది మీ పళ్ళను, ఎముకలను గట్టిపరచడానికి, ఆస్టియోపొరోసిస్ వల్ల వచ్చే మొత్తం ప్రమాదాలను తగ్గించడానికి సహాయపడుతుంది.

డ్రై ఫ్రూట్స్

డ్రై ఫ్రూట్స్

గింజలు, విత్తనాలు అనేక విధాలుగా మీ ఎముకలు ఆరోగ్యంగా ఉండేట్లు చేస్తాయి. వాల్ నట్స్, ఫ్లాక్స్-విత్తనాలలో ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు సమృద్ధిగా ఉంటాయి. వేరుసెనగ, బాదం లో పొటాషియం ఉంటుంది, ఇది మూత్రంలో కాల్షియం లోపాన్ని తగ్గించి రక్షిస్తుంది.

బీన్స్

బీన్స్

ఎండిన బీన్స్, బఠాణీలు, పప్పుధన్యాలు వంటి మొక్క పదార్ధాలు అద్భుతమైన ప్రోటీన్, కాల్షియం కలిగి ఉండడం వల్ల ఎముకల ఆరోగ్యానికి సహాయపడతాయి.

చిక్కుళ్ళు

చిక్కుళ్ళు

చిక్కుళ్ళు, సోయాబీన్స్ స్త్రీలలో ఎముక ఖనిజ సాంద్రతను మెరుగుపరిచి, ఆస్టియోపొరోసిస్ సమస్యను తగ్గిస్తాయి.



Desktop Bottom Promotion