For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఆరెంజ్ అండ్ బనానా ఫీల్ లోని తెలియని ఆశ్చర్యకర ఆరోగ్య ప్రయోజనాలు...

|

తాజా పండ్లు ఆరోగ్యానికి ఏవిధంగా సహాయపడుతాయో మనందరికి తెలిసిన విషయమే . మన శరీరానికి అవసరం అయ్యే పూర్తి పోషకాలు, విటమిన్స్, న్యూట్రీషియన్స్, మినిరల్స్ అన్నీ తాజా పండ్లు, కూరగాయల ద్వారానే మన శరీరం పొందగోరుతుంది. అయితే పండ్లు మాత్రమే కాదు, పండ్ల యొక్క తొక్కలలో కూడా ఆరోగ్యానికి ప్రయోజనాలందించే లక్షణాలు కూడా పుష్కలంగా ఉన్నాయి?పండ్లలో ముఖ్యంగా ఆరెంజ్, అరటి తొక్కలలో ఎక్కువ ప్రయోజనాలు ఉన్నాయంటున్నారు పోషకాహార నిపుణులు. కాబట్టి, ఈ పండ్ల తొక్కల్లోని అపారమైన లాభాలను గుర్తించిన తర్వాత ఈ తొక్కలను ఎప్పటికి తొలగించాలని లేదా పారవేయాలని అనుకోరు.

ఈ పండ్లును ఉపయోగించే ముందు శుభ్రంగా కడగడం వల్ల ఆరోగ్యానికి హాని కలిగించే ప్రభావంను తగ్గించుకోవచ్చు. పండ్ల పెంపకానికి, నిల్వ చేసే క్రమంలో వాటికి ఉపయోగించే పెస్టిసైడ్స్(పురుగుల మందులు)ఆరోగ్యానికి హాని కలిగిస్తాయి కాబట్టి, వినియోగించడానికి ముందు బాగా కడిగి తుడిచి తర్వాత తినాల్సి ఉంటుంది. లేదా సేంద్రియ మందులు వాడని ఆర్గానిక్ ఫుడ్స్ ను ఎంపిక చేసుకోవచ్చు.

పండ్ల తొక్కల్లో అత్యంత అద్భుతమైన పోషకాలు కలిగి ఉన్నాయి. ఆరెంజ్ మరియు అరటి తొక్కల్లో మనకు తెలియని అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నాయి . కాబట్టి, ఈ చౌకైన పండ్ల యొక్క తొక్కని వినియోగించుకొని ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.

ఆరెంజ్ తొక్కను అంతర్గతంగాను మరియు బహిర్గతంగాను ఉపయోగించుకోవచ్చు. ఆరెంజ్ తొక్కను ఎండబెట్టి పౌడర్ చేసి గ్లాసు వేడి నీటిలో మిక్స్ చేసి త్రాగడం వల్ల అనేక శారీరక రుగ్మతలను తగ్గించుకోవచ్చు. మరియు ఆరెంజ్ పీల్ బాత్ వల్ల స్ట్రెస్ మరియు నిద్రలేమి సమస్యను నివారించుకోవచ్చు.

మరి ఆరెంజ్ అండ్ బనానా ఫీల్ లోని తెలియని ఆశ్చర్యకర ఆరోగ్య ప్రయోజనాలేంటో తెలుసుకుందాం...ఆరోగ్యాన్ని కాపాడుకుందాం....

 వికారం మరియు అజీర్తిని నివారిస్తాయి:

వికారం మరియు అజీర్తిని నివారిస్తాయి:

ఆరెంజ్ తొక్క తినడానికి కొద్దిగా పుల్లగా ఉంటుంది. ఈ పుల్లటి గుణాల వల్లే ఆయుర్వేదంలో అనేక ఆరోగ్యప్రయోజనాలను గుర్తించారు . ఎండిన ఆరెంజ్ తొక్కను పౌడర్ లా చేసి, ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో ఒక చెంచా పౌడర్ మిక్స్ చేసి త్రాగడం వల్ల అజీర్తి , వికారం, హార్ట్ బర్న్, స్టొమక్ అప్ సెట్, మరియు గ్యాస్ వంటి సమస్యల నుండి ఉపశమనం కలుగుతుంది .

ఛాతీ మంటను మరియు దగ్గును నివారిస్తుంది:

ఛాతీ మంటను మరియు దగ్గును నివారిస్తుంది:

ఛాతీ రద్దీ సమయంలో ఆరెంజ్ పౌడర్ మిక్స్ చేసి నీటిని త్రాగడం వల్ల ఛాతీలో ఇబ్బందులను తగ్గిస్తుంది. ఈ పానీయం వల్ల గొంతులో మింగుడుపడుతుంది. శ్వాసమార్గము క్లియర్ అవుతుంది. దాంతో శ్వాస సమస్యలుండవు. ఈ పద్దతిలోనే ఆరెంజ్ పీల్ తోనే శ్వాశకోశ నాళము యొక్క ఇన్ఫెక్షన్స్ ను తగ్గించుకోవడానికి ఉపయోగించుకోవచ్చు . డ్రైడ్ ఆరెంజ్ పీల్ తో ఇది ఒక హెల్తీ బెనిఫిట్.

కొలెస్ట్రాల్ లెవల్స్ తగ్గిస్తుంది:

కొలెస్ట్రాల్ లెవల్స్ తగ్గిస్తుంది:

ఆరెంజ్ తొక్క ట్రై గ్లిజరైడ్స్ కరిగించడం వల్ల శరీరంలోని కొలెస్ట్రాల్ తగ్గించడానికి సహాయపడుతుందని కొన్ని పరిశోధన ద్వారా వెల్లడించడం జరిగింది. ఆరెంజ్ తొక్క నార్మల్ లివర్ ఫంక్షన్స్ ను ప్రోత్సహిస్తుంది.

కోలన్ క్యాన్సర్

కోలన్ క్యాన్సర్

కోలన్ క్యాన్సర్ ను నివారించడంతో పాటు, చికిత్సను అందిస్తుంది: ఆరెంజ్ తొక్కలో ఫ్లెవనాయిడ్ పుష్కలంగా ఉన్నాయి . ఆరెంజ్ తొక్కలో ఉండే హెస్పిరిడియన్, కోలన్ క్యాన్సర్ కు వ్యతిరేఖంగా పోరాడుతుందని, అదేవిధంగా ఓస్టిరియోఫోసిను నివారిస్తుంది.

స్ట్రెస్ మరియు ఆందోళనను తగ్గిస్తుంది:

స్ట్రెస్ మరియు ఆందోళనను తగ్గిస్తుంది:

ఆరెంజ్ తొక్కలో ఉండే ఎసెన్షియల్ ఆయిల్స్ నాడీకణాల్లోని రిలాక్సింగ్ ఎఫెక్ట్ ను కలిగిస్తుంది . ఆరెంజ్ పీల్ బాత్ వల్ల విశ్రాంతిగా నిద్రపొందడానికి సహాయపడుతుంది. ఆరెంజ్ తొక్కలో ఉండే ఆరోమా వాసన మూడ్ మార్చుతుంది మరిు నిద్రలేమిని నివారిస్తుంది.

 దంతాలు వైట్ గా మార్చడానికి :

దంతాలు వైట్ గా మార్చడానికి :

బానానా పీల్ లోపలి వైపు బాగంను దంతా మీద రుద్దడం వల్ల రెండు నిముషాల్లో దంతాలు తెల్లగా మారుతాయి . రెగ్యులర్ గా చేస్తుంటే దంతాలు మెరుస్తుంటాయి.

స్కిన్ వ్రాట్స్ ను నివారిస్తుంది:

స్కిన్ వ్రాట్స్ ను నివారిస్తుంది:

అరటి తొక్కను ఉపయోగించి స్కిన్ వ్రాట్స్ ను నివారించుకోవచ్చు . ఇది వ్రాట్స్ ను తగ్గించడం మాత్రమే కాదు , తిరిగి ఎప్పుడు రాకుండా నివారిస్తుంది. బనానా పీల్ ను వ్రాట్స్ మీద అప్లై చేసి రాత్రంతా అలాగే ఉంటే మంచి ఫలితం ఉంటుంది. ఇలా కొద్ది రోజుల పాటు క్రమం తప్పకుండా చేస్తే మంచి ఫలితం ఉంటుంది .

 చర్మంలోపల ఏదైనా గుచ్చుకున్నప్పుడు

చర్మంలోపల ఏదైనా గుచ్చుకున్నప్పుడు

చర్మంలోపల ఏదైనా గుచ్చుకున్నప్పుడు వాటిని సున్నితంగా తొలగించడానికి అరటి తొక్కను చర్మం మీద కొద్దిసమయం అలాగే ఉంచి తర్వత సూదితీ తీస్తే స్మూత్ గా వచ్చేస్తాయి.

తలనొప్పి నివారిస్తుంది:

తలనొప్పి నివారిస్తుంది:

తలనొప్పి నివారించడానికి అరటితొక్కను ఫోర్ హెడ్ మీద అప్లై చేయాలి. దీన్ని తల మీద కొద్ది సమయం అలాగే ఉంచితే మంచి ఫలితం ఉంటుంది. తలనొప్పి నుండి ఉపశమనం కలిగిస్తుంది.

English summary

10 Health Benefits Of Orange And Banana Peels

Fruits, as we all know are good for our health in every way. Do you know that peels also have many beneficial properties for your health? Among them are orange and banana peels. These mighty peels have many health benefits. Now you will never throw the peels away after knowing their immense benefits.
Story first published: Wednesday, November 18, 2015, 18:24 [IST]
Desktop Bottom Promotion