For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వెన్నునొప్పి భాదిస్తోందా? ఇవిగో ఉపమశమన మార్గాలు

|

ప్రతి మనిషి జీవిత కాలంలో ఏదో ఒక టైమ్ లో బ్యాక్ పెయిన్ కు గురైయ్యే ఉంటారు. దానికి ఎన్నో కారణాలు. కారణము ఏదైనా అది రాకుండా జాగ్రత్తలు తీసుకోవడం ఎంతో మంచిది. ప్రస్తుత జీవన శైలిలో నడుము నొప్పి లేని వారు చాలా తక్కువ మందే ఉంటారు. దీనికి కారణం మారిన జీవన శైలే ముఖ్య కారణం. ఒకప్పుడు వయసైపోయిన వారిలో కనిపించే బ్యాక్ పెయిన్, నేటి ఆధునిక యుగంలో యుక్త వస్కులను సైతం బాధింస్తుంది.

నొప్పిని అలాగే ఉంచుకొని, ఉద్యోగానికి అలాగే వెలితే వెన్నుముక మరింత దెబ్బతినే ప్రమాదం ఉంది. వెన్నెముక ముఖ్యంగా మీ వెన్నుకు సపోర్ట్ గా ఉంటుంది. అంతే కాదు శరీరం మొత్తం వ్యాపించి ఉండే చిన్న పెద్ద, అన్ని ఎముకలకు ప్రదాణం వెన్నుఎముకే. అలాంటి వెన్నెముక నొప్పికి గురైతే? పనిచేయడం కష్టం, కాలు, చెయ్యి, మాత్రమే కాదు, శరీరంలో ఏ పార్ట్ కదిలించాలన్నా కష్టంగా ఉంటుంది . వెన్ను నొప్పి తక్కువగా ఉన్నప్పుడు, లేదా అలాంటి లక్షనాలు మీరు గుర్తించగలిగితే వెంటనే కొన్ని కోల్డ్ కంప్రెసర్ చిట్కాలను ఉపయోగించడం వల్ల ఇన్ఫ్లమేషన్ మరియు బాధ తగ్గించుకోవచ్చు. అదే కాకుండా, బ్యాక్ పెయిన్(వెన్నునొప్పి) తక్షణ నివారణకు కొన్నినేచురల్ హోం రెమెడీస్ కూడా ఉన్నాయి. వాటిలో కొన్ని ముఖ్యమైనవాటిని ఈ క్రింది విధంగా మీకు అందిస్తున్నాము. వీటితో కూడా మీరు ఉపశమనం పొందకపోతే వెంటనే డాక్టర్ ను సంప్రదించాలి.

ఐస్ క్యూబ్స్

ఐస్ క్యూబ్స్

ఇన్ఫ్లమేషన్ నివారించుకోవడానికి , ఐస్ ప్యాక్ ను ఉపయోగించుకోవచ్చు. ఇది ఒక నేచురల్ హోం రెమెడీ. ఇది వెంటనే ఇన్ల్ఫమేషన్ తగ్గిస్తుంది . అందుకు కొన్ని ఐస్ క్యూబ్స్ తీసుకొని క్లాత్ లో పెట్టి నొప్పి ఉన్న ప్రదేశంలో 10-15నిముషాలో వేసుకోవాలి. కొద్ది సమయం తర్వాత తిరిగి మళ్ళీ మొదలు పెట్టాలి.

అల్లం వేర్లు

అల్లం వేర్లు

అల్లం వేరును, బ్యాక్ పెయిన్ నివారించడంలో ఇది ఒక ఉత్తమ హోం రెమెడీ. చిన్న అల్లం ముక్కను నీళ్ళలో వేసి బాగా మరిగించాలి. తర్వాత కొద్దిగా తేనె వేసి బాగా మిక్స్ చేసి త్రాగాలి . ఎందుకంటే ఇందులో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఇన్ఫ్లమేషన్ నుండి తక్షణ ఉపశమనం కలిగిస్తాయి.

స్విమ్మింగ్

స్విమ్మింగ్

బ్యాక్ పెయిన్ నివారించుకోవడానికి స్విమ్మింగ్ గ్రేట్ గా సహాయపడుతుంది. స్విమ్మింగ్ చేయడం వల్ల వెన్నులో ఉండే కండరాలను బలోపేతం చేస్తాయి. అయితే నొప్పి ఉన్నప్పుడు స్విమ్ చేయకూడదు.

విశ్రాంతి తీసుకోవాలి

విశ్రాంతి తీసుకోవాలి

శరీరంలో ఎటువంటి నొప్పి ఉన్నా, శరీరానికి తగినంత విశ్రాంతి చాలా అవసరం . నొప్పి ఉన్నప్పుడు అది కండరాలను మరింత బిగుతుగా చేస్తుంది. మీకు మెడిటేషన్ చేసే అలవాటున్నట్లైతే, మెడిటేషన్ చేయడం వల్ల కూడా నొప్పులను తగ్గించుకోవచ్చు.

చమోమెలీ

చమోమెలీ

చమోమెలీ టీ త్రాగడం వల్ల మనస్సు ప్రశాంత చెందుతుందన్న విషయం మీకు తెలుసా . చమెమోలీ టీని కొన్ని రోజుల పాటు కొన్నికప్పుల టీని త్రాగడం వల్ల తక్షణ ఉపశమనం కలిగిస్తుంది .

బాగ్ టబ్

బాగ్ టబ్

వెన్నునొప్పితో బాధపడే వారు, ఇంట్లో కనుకు బాత్ టమ్ ఉన్నట్లైతే, దాన్ని వేడినీళ్ళతో ఫిల్ చేసి, మీ అంతట మీరు 30నిముషాలు అందులో ఉండటం వల్ల ఉపశమనం కలుగుతుంది. అయితే గర్భిణీ స్త్రీలకు పొట్టలో పెరిగే బిడ్డకు ఇది అనారోగ్యకరం కాబట్టి, గర్భిణీలు ఈ పద్దతికి దూరంగా ఉండాలి.

బాగా నిద్రపోవాలి

బాగా నిద్రపోవాలి

మోకాళ్ళ క్రింది దిండు పెట్టుకొని నిద్రపోవడం వల్ల నొప్పిని తగ్గించుకోవచ్చు. బాగా నిద్రపడుతుంది. బ్యాక్ కు సపోర్ట్ గా ఉంటుంది.

పాలు త్రాగాలి

పాలు త్రాగాలి

నొప్పితో బాధపడుతున్నప్పుడు పాలు ఎక్కువగా తీసుకోవాలి. కండరాలకు మరియు ఎముకలకు క్యాల్షియం ఎక్కువగా అవసరం అవుతుంది, కాబట్టి, రెగ్యులర్ గా పాలు తీసుకోవాలి.

ఆయిల్ మసాజ్

ఆయిల్ మసాజ్

నొప్పి ఉన్న ప్రదేశంలో కొద్దిగా ఆయిల్ మసాజ్ చేయడం వల్ల తక్షణ ఉపశమనం కలుగుతుంది . మీ పార్ట్నర్ సహాయం తీసుకొని ఆయిల్ మసాజ్ చేయడం వల్ల నొప్పి బాధ వంటి వాటి నుండి తక్షణ ఉపశమనం పొందవచ్చు. వెన్నునొప్పికి తక్షణ ఉపశమనం కలిగించే వాటిలో ఇది ఒక ఉత్తమ హోం రెమెడీ.

ఎప్సమ్ సాల్ట్

ఎప్సమ్ సాల్ట్

మీ బాత్ టబ్ లో కొంత ఎప్సమ్ సాల్ట్ ను మిక్స్ చేసి, ఆ నీటిలో మీరు 20 నిముసాలు మునిగి ఉండి తర్వాత స్నానం చేయడం వల్ల నొప్పి, వాపు వంటివి తగ్గించుకోవచ్చు.

English summary

10 Home Remedies For Back Pain

You try to lift something heavy and suddenly your back gets hurt. This is how most of us hurt our backs. The pain is agonising and it never lets us carry on with any other activity. If the pain persists for a few days, it would be very tough to even get up from the bed.
Story first published: Wednesday, January 21, 2015, 11:10 [IST]
Desktop Bottom Promotion