For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పీరియడ్స్ సమయంలో 10 పరిశుభ్రత చిట్కాలు

By Super
|

ప్రతి స్త్రీ ముఖ్యంగా పీరియడ్స్ సమయంలో సరైన పరిశుభ్రత నిర్వహించాలని గుర్తుంచుకోవాలి. నెలలో ఈ సమయంలో ప్రతి మహిళకు నీరసం మరియు అసౌకర్యంగా అనిపిస్తుంది. మీరు కింద ఉన్న పద్దతులను అనుసరిస్తే, మిమ్మల్ని మీరు ఇన్ఫెక్షన్స్ రాకుండా కాపాడుకోవచ్చు.

పీరియడ్స్ సమయంలో పరిశుభ్రతకు కొన్ని చిట్కాలు ఉన్నాయి. వీటి మీద ప్రతి స్త్రీ శ్రద్ద పెట్టాలి. ఈ చిట్కాలు మీ 'ఎరియా' లో ఫౌల్ వాసన మరియు ఇతర అంటువ్యాధులు రాకుండా నిరోధిస్తుంది. UTI తో బాధపడుతున్న మహిళలు పీరియడ్స్ సమయంలో అదనపు జాగ్రత్తలు తీసుకోవాలి. మీ పిరియడ్ సమయంలో UTI సంక్రమణ అభివృద్ధి ఉంటే, అప్పుడు మీకు చాలా ఎక్కువ నొప్పి మరియు ఆందోళన ఉండవచ్చు.

పిరియడ్ సమయంలో పాటించాల్సిన ఈ చిట్కాలను Boldsky మీతో షేర్ చేసుకుంటుంది. ఈ ముఖ్యమైన పరిశుభ్రతకు చిట్కాలు మహిళలు ఆరోగ్యంగా ఉండటానికి దోహదం చేస్తాయి.

అందమైన మహిళలకు అంకితం చేసిన ఈ చిట్కాల మీద ఒక లుక్ వేయండి.

1. సెపరేట్ అండర్వేర్ ను కొనసాగించండి

1. సెపరేట్ అండర్వేర్ ను కొనసాగించండి

మీరు మీ పిరియడ్ సమయంలో ప్రత్యేక లోదుస్తులను కలిగి ఉండాలని నిర్ధారించుకోండి. ప్రతి రోజు మీ లోదుస్తులను మార్చాలి. మీరు శుభ్రం చేసుకున్నప్పుడు, కేవలం వేడి లేదా గోరు వెచ్చని నీటిని ఉపయోగించండి. ఏవైనా మరకలు ఉంటే, వాటిని తొలగించటానికి కొద్దిగా బ్లీచింగ్ పౌడర్ లేదా నిమ్మను జోడించండి.

2. బెడ్ షీట్స్ మార్చండి

2. బెడ్ షీట్స్ మార్చండి

మీ పిరియడ్ సమయంలో బెడ్ షీట్స్ మార్చటం అనేది మరొక సాధారణ పరిశుభ్రత చిట్కా. మీరు అనుసరించడానికి ఇది రెండవ స్టెప్.

3. సానిటరీ నేప్కిన్ చిట్కాలు

3. సానిటరీ నేప్కిన్ చిట్కాలు

సానిటరీ నాప్కిన్ అనేవి గుర్తుపెట్టుకోవలసిన ముఖ్యమైన విషయం. మూడు నియమాలు: ప్రతి మూడు గంటలకు ఒకసారి మార్చాలి. తేలికపాటి కాటన్ నాప్కిన్స్ వాడాలి. ఎటువంటి చర్మ దద్దుర్లు రాకుండా ఉండటానికి, మీ ప్యాంటీ యొక్క లైనింగ్ లో సరిగా ప్యాడ్ ను ఉంచండి.

4. వ్యాయామం తర్వాత

4. వ్యాయామం తర్వాత

మీ పీరియడ్స్ సమయంలో వ్యాయామం తర్వాత అదనపు శుభ్రతను పాటించాలి. మీ శరీరం మీద చెమట పడుతుంది. అప్పుడు మీరు చేయవలసిన మొదటి విషయం ఏమిటంటే స్నానం చేయుట మరియు నాప్కిన్ మార్చుట చేయాలి. నిర్లక్ష్యం చేస్తే, చెమట ఒక బాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కు దారి తీయవచ్చు.

5. ఆ సమయంలో స్నానం చేయడం

5. ఆ సమయంలో స్నానం చేయడం

ముఖ్యమైన చిట్కా ఏమిటంటే మీ పిరియడ్ సమయంలో రోజులో రెండు సార్లు స్నానం చేయాలి. ఇది మీరు శుభ్రంగా ఉన్నారని నిర్ధారిస్తుంది. మీ యోని ప్రాంతంలో బాక్టీరియాను దూరంగా ఉంచుతుంది. అలాగే సంక్రమణ రాకుండా నిరోధిస్తుంది.

6. పొడిగా ఉంచండి

6. పొడిగా ఉంచండి

స్నానం చేసిన తర్వాత, మీరు మరియు ప్రైవేట్ ప్రాంతంలో నీరు లేకుండా పొడిగా ఉండాలని నిర్ధారించుకోండి. ఇది చెమటతో కలిస్తే ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం పెరుగుతుంది.

7. జాగ్రత్తగా ఉండండి

7. జాగ్రత్తగా ఉండండి

మీ పిరియడ్ సమయంలో ప్రాథమిక ఆరోగ్య చిట్కాలను ఉపయోగించేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. ఆ ప్రాంతంలో ఎటువంటి తేలికపాటి సబ్బు లేదా ఎటువంటి పెర్ఫ్యూమ్ ను వాడకండి. మీ ప్రాంతంలో స్వచ్చమైన నీటిని ఉపయోగించి కడగటం మంచిది. ఈ ఉత్పత్తులు క్యాన్సర్ కు కారణం అని తెలుస్తోంది. మీ లోదుస్తులకు ఎటువంటి క్రీమ్స్ రాయకూడదు.

8.సరైన వాషింగ్ టెక్నిక్ ఉపయోగించండి

8.సరైన వాషింగ్ టెక్నిక్ ఉపయోగించండి

మీ యోని ప్రాంతంలో సరైన వాషింగ్ టెక్నిక్ ఉపయోగించండి. ముందు నుండి వెనుకకు కడగటం మరియు విరుద్దంగా చేయకూడదు. వ్యతిరేక దిశలో వాషింగ్ చేయుట వలన పాయువు నుంచి బ్యాక్టీరియా యోనిలోకి వెళ్ళటానికి కారణమవుతుంది.

9.బాత్ రూమ్ కి వెళ్ళినప్పుడు

9.బాత్ రూమ్ కి వెళ్ళినప్పుడు

మీ యోని ప్రాంతంను కేవలం సాదా నీటితో మాత్రమే కడగాలి. మీరు ఏటువంటి సబ్బు ఉపయోగించకూడదని నిర్ధారించుకోండి. మూత్రవిసర్జన తర్వాత ఆ ప్రాంతంలో శుభ్రంగా కడగాలని గుర్తుంచుకోండి.

10.మీ చేతివ్రేళ్ళను శుభ్రం చేసుకోండి

10.మీ చేతివ్రేళ్ళను శుభ్రం చేసుకోండి

మీరు ఎల్లప్పుడూ మీ సానిటరీ నాప్కిన్ మార్చినప్పుడు ముందు మరియు తర్వాత కూడా చేతులను శుభ్రంగా కడుక్కోవాలి. ఇది మీ పిరియడ్ సమయంలో ఉన్నప్పుడు ఒక మంచి చిట్కా.

English summary

10 Hygiene Tips When On Your Period

Maintaining a proper hygiene is one of the things every woman should keep in mind, especially when on a period. At this time of the month a woman feels eeky and uncomfortable as well. When you follow step by step methods of keeping yourself clean you will in no way be blessed with any infection.
Desktop Bottom Promotion