For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

శరీరంలో రక్త ప్రసరణ సరిగా లేదని తెలిపే సంకేతాలు....

|

మన శరీరానికి ఆయువు రక్తం. వాహనాన్ని నడిచేందుకు ఇంధనం ఎంత ముఖ్యమో.. శరీరానికి రక్తం అంతే ముఖ్యం. శరీరంలోని అవయవాలు సక్రమంగా పని చేయాలంటే రక్త ప్రసరణ వ్యవస్థ పనితీరు బాగుండాలి. ఈ ప్రసరణ వ్యవస్థలో ఏమాత్రం తేడా వచ్చినా ఏదో ఒక సమస్యకు లోనయ్యే అవకాశాలు పుష్క‌లం.

రక్త ప్రసరణ వల్ల శరీరంలోని అవయవాలకు రక్తం ప్రసరించడం వల్ల జీవక్రియలు పనిచేయడానికి , అవయవాలకు అవసరం అయ్యే న్యూట్రీషియన్స్, మరియు విటమిన్స్ అందిస్తుంది. మరియు హార్మోనుల ఉత్పత్తికి మరియు శరీర ఉష్ణోగ్రతలు క్రమబద్దం చేయడానికి రక్తప్రసరణ ఎంతో అవసరం.

శరీరంలో రక్తప్రసరణ జరగుతున్నదా లేదా అని కనిపెట్టడం కష్టం ఎందుకంటే, ఇది సైలెంట్ నేచర్ కలిగి ఉంటుంది. రక్త ప్రసరణ సరిగా జరగకపోతే, ఆ విషయాన్ని గుర్తించకపోతే అనేక ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవల్సి వస్తుంది . కాబట్టి, రక్తప్రసరణ స్థితిగతులను తెలసుకోవడం చాలా ముఖ్యం. రక్తప్రసరణ బలహీనంగా ఉన్నదన్న విషయాన్ని ప్రారంభంలో గుర్తించినట్లైతే వెంటనే చికిత్సను అందివ్వొచ్చు . ఈ ఆర్టికల్ మీ శరీరంలో రక్త ప్రసరణ చాలా బలహీనంగా ఉన్నది తెలపడానికి కొన్ని లక్షణాలు తెలపడం జరిగింది.

శరీరంలో రక్తప్రసరణ సరిగా జరగకపోవడం అనేది అన్ని వయస్సుల వారిలోను ఉన్న సమస్య. సమయానికి గుర్తించి వెంటనే చికిత్సను అందివ్వకపోతే బ్రెయిన్, హార్ట్, లివర్, కిడ్నీ మరియు లింబ్స్ డ్యామేజ్ అయ్యే తీవ్ర ప్రమాధం ఉన్నది. . ఇది పెద్దవారిలో చాలా సాధారణం అయినా, ఏవయస్సు వారైనా ఈ సమస్యను సీరియస్ గా తీసుకోవడం మంచిది.

రక్తనాళాల్లో ఫలకం ఏర్పడటం వల్ల మరియు ఇతర కారణాల వల్ల రక్తప్రసరణ వేగాన్ని తగ్గిస్తుంది. దాంతో హార్ట్, చేతులకు, కాళ్ళకు, మరియు శరీరంలోని మరికొన్ని ముఖ్యమైన అలవాయాలకు రక్తప్రసరణ తగ్గిపోతుంది.

ముఖ్యంగా ధూమపానం, వ్యాయామం, ఎక్కువ సమయం కూర్చోవడం, ఆహారపు అలవాట్లు మంచిగా లేకపోవడం, మరియు కొన్ని వైద్యపరిస్థితులు వంటి కొన్ని జీవనశైలిలోని మార్పులు మరియు అలవాట్ల వల్ల ఒక వ్యక్తి ఈ సమస్యలను లోనయ్యే అవకాశం ఉంది. ప్రెగ్నెన్సీ మరియు బరువు పెరగడం కూడా బలహీనమైన రక్తప్రసరణకు కారణం అవుతుంది.

మరి లక్షణాలు ఎలా గుర్తించాలి? పూర్ బ్లడ్ సర్క్యులేషన్ కు కొన్ని వార్నింగ్ సైన్స్ క్రింది విధంగా ...

చేతులు మరియు కాళ్ళు చల్లబడుతాయి లేదా చల్లగా ఉంటాయి:

చేతులు మరియు కాళ్ళు చల్లబడుతాయి లేదా చల్లగా ఉంటాయి:

సరైన రక్తప్రసరణ నార్మల్ బాడీ టెంపరేచర్ ను మెయింటైన్ చేయడానికి సహాయపడుతుంది. అందువల్ల, బలహీనమైన బ్లడ్ సర్క్యులేషన్ వాంఛనీయ స్థాయి నుండి శరీర ఉష్ణోగ్రత తగ్గిపోవడానికి కారణం అవుతుంది. దాంతో ఫీవర్, చలి, జ్వరం, కాళ్ళు మరియు చేతులు చల్లబడటం జరుగుతుంది.

పాదాలు మరియు చేతుల్లోవాపులు:

పాదాలు మరియు చేతుల్లోవాపులు:

బలహీనమైన రక్తప్రసరణ వల్ల కిడ్నీస్ మీద ప్రభావం చూపుతుంది. దాంతో పాదాలు మరియు చేతులు వాపులకు కారణం అవుతుంది. దీన్నే ఓడీమా అని పిలుస్తారు . పాదాల్లో మరియు చేతుల్లో నీరు చేరుతుంది. దాంతో ఉబ్బుకొని ఉండటం వల్ల అసౌకర్యంగా మార్చుతుంది.

అలసట:

అలసట:

బలహీనమైన రక్తప్రసరణ వల్ల శరీరంలో అవయవాలకు తక్కువ ఆక్సిజన్ మరియు పోషకాలు సప్లై అవుతాయి . దాంతో అలసిపోయినట్లు అనుభూతి కలుగుతుంది . పూర్ బ్లడ్ సర్క్యులేషన్ వల్ల శ్వాస, గొంతు కండరాలు సలుబు మరియు రోజువారి కార్యకలాపాల్లో ఆసక్తి తగ్గుతుంది.

అంగస్తంభన లోపాలు:

అంగస్తంభన లోపాలు:

పునరుత్ప్తి అవయవాలకు రక్తప్రసరణ సరిగాల జరగకపోతే అంగస్తంభనకు కారణం అవుతుంది . లైంగిక సామర్థ్యం తగ్గడంతో పాట్నర్ తో హాపీగా గడపలేరు.

జీర్ణ సమస్యలు:

జీర్ణ సమస్యలు:

బలహీనమైన రక్తప్రసరణ వల్ల శరీరం మొత్తానికి రక్త శుద్ది తక్కువగా ఉంటుంది. గ్యాస్ట్రోఇన్టెషనల్ కూడా బలహీనమైన రక్తప్రసరణ వల్ల జీర్ణక్రియ తగ్గుతుంది మరియు మలబద్దక సమస్యలకు దారితీస్తుంది.

 బ్రెయిన్ ఫంక్షన్స్ చురుగ్గా ఉండవు:

బ్రెయిన్ ఫంక్షన్స్ చురుగ్గా ఉండవు:

బ్రెయిన్ ఫంక్షన్స్ చురుగ్గా ఉండాలంటే, రక్తప్రసరణ మెరుగ్గా ఉండాలి . రక్తప్రసరణ మెరుగ్గా లేనట్లైతే అలసటకు గురిచేస్తుంది. ఏకాగ్రత ఉండదు మరియు మతిమరుపు వంటి లక్షణాలు ఎదుర్కోవల్సి వస్తుంది.

 వ్యాధినిరోధకశక్తి తగ్గుతుంది:

వ్యాధినిరోధకశక్తి తగ్గుతుంది:

శరీరం మొత్తం సరిగా రక్తప్రసరణ జరగకపోతే, జీవక్రియల్లో మార్పులు చేసుకోవడం వల్ల వ్యాధినిరోధకశక్తి తగ్గిపోతుంది. దాంతో వివిధ రకాల వ్యాధులు చుట్టుముడుతాయి.

ఆకలి ఉండదు:

ఆకలి ఉండదు:

బలహీనమైన బ్లడ్ సర్క్యులేషన్ వల్ల కాలేయం ఆకలి సంకేతాలను బ్రెయిన్ కు పంపడం నివారిస్తుంది. దాంతో ఆకలి లేకపోవడం వల్ల చాలా తక్కువగా తినడం లేదా తినకుండానే ఉండటం వల్ల బరుతు తగ్గడానికి కారణం అవుతుంది.

చర్మ రంగులో మార్పులు:

చర్మ రంగులో మార్పులు:

శరీరంలోని కణాలకు రక్తంతో పాటు ఆక్సిజన్ సరిగా సరఫరా కాకపోతే చర్మం రంగులో మార్పులు వస్తాయి. రక్తం సరిగా సరఫరా కాని ప్రదేశంలో చర్మం పర్పుల్ గా లేదా పర్ఫుల్ గా మారుతుంది.

. గోళ్లు మరియు జుట్టు బలహీనపడుతుంది:

. గోళ్లు మరియు జుట్టు బలహీనపడుతుంది:

బలహీనమైన రక్త ప్రసరణ వల్ల శరీరంలో కొన్ని అవయవాలకు సరిగా రక్త ప్రసరణ జరగదు. అది జుట్టు, చర్మం, మరియు గోళ్లకు సరియైన విటమిన్స్ మరియు మినిరల్స్ అందక హెయిర్ ఫాల్, డ్రై హెయిర్, డ్రై స్కిన్, గోళ్లు పెలుసుగా మారడం వంటి సమస్యలు ఎదుర్కోవల్సి ఉంటుంది.

వీరికోస్ వీన్స్ (అనారోగ్యకరమైన సిరలు):

వీరికోస్ వీన్స్ (అనారోగ్యకరమైన సిరలు):

బలహీనమైన బ్లడ్ సర్క్యులేషన్ వల్ల వీన్స్(సిరల్లో)ప్రెజర్ పెరుగుతుంది. ఫలితంగా కాళ్లలో వాపు మరియు మడమల వద్ద చర్మం క్రింద పోగులుగా ఏర్పడుతుంది. ఎక్కువ సమయం కూర్చోవడం వల్ల కూడా ఇలా జరగవచ్చు.

లెగ్ అల్సర్:

లెగ్ అల్సర్:

రక్తప్రసరణ సరిగా జరగనప్పుడు చర్మంలోపల సన్నగా సలపడం లేదా చర్మం మీద రాషెష్ ఏర్పడటం జరుగుతుంది. ఇంకా డ్రై రెడ్ ప్యాచెస్ కు కూడా కారణం అవుతుంది.

English summary

12 Early Signs Of Poor Blood Circulation/health tips in Telugu/శరీరంలో రక్త ప్రసరణ సరిగా లేదని తెలిపే సంకేతాలు....

12 Early Signs Of Poor Blood Circulation, Do you know that your body works continuously to circulate more than five liters of blood through your body? Blood circulation helps the body organs to function, transport nutrients and hormones and regulate body temperature etc.
Story first published: Friday, November 20, 2015, 18:23 [IST]
Desktop Bottom Promotion