For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

త్రిఫల పౌడర్ యొక్క 12 ఆరోగ్య ప్రయోజనాలు

|

మీకు త్రిఫల పొడి యొక్క ప్రయోజనాల గురించి తెలుసా? ముఖ్యంగా నేటి కలుషిత వాతావరణంలో శారీరకంగా మరియు మానసికంగా ఆరోగ్యంగా ఉండటం అనేది ఒక సులభమైన పని కాదు. మేము తినే ఆహారం మరియు మేము పీల్చే గాలి వలన అనేక సమస్యలు వస్తున్నాయి. అంతేకాక మేము త్రాగే నీరు కూడా స్వచ్ఛమైన మరియు ఆరోగ్యకరమైనది కాదు.

మా రోజువారీ జీవితంలో తగినంత ఒత్తిడి ఉంటుంది. మా శరీరాలు ఒత్తిడి మరియు విషాన్ని నిర్వహించడానికి సామర్థ్యం లేనివిగా మారుతున్నాయి. నేడు వివిధ రుగ్మతలతో బాధపడే వ్యక్తుల సంఖ్య పెరిగింది. ఇక్కడ అత్యధిక సమస్యలను తగ్గించటానికి ఒక పరిష్కారం ఉంది?

అజీర్ణం,మలబద్ధకం,వృద్ధాప్యం,తలనొప్పి మరియు చర్మం లోపాల వంటి కొన్ని సమస్యలకు మాత్రలు లేకుండా నియంత్రించబడతాయి. త్రిఫల అనేది అనేక సమస్యలకు ఒక మంచి సమాధానం. ఈ ఆయుర్వేద ఔషధంలో మీ శరీరంలోవివిధ రుగ్మతల మీద పోరాటం చేయటానికి సహాయపడే మూడు మూలికలు ఉన్నాయి.

మీ శరీరం మద్దతు ఇస్తే, అప్పుడు ఇది కొన్ని రకాల రుగ్మతలకు రోగనిరోధకంగా ఉంటుంది. ఇప్పుడు, మనం త్రిఫల పొడి యొక్క ప్రయోజనాల గురించి చర్చిద్దాం.

తలనొప్పి నివారిణి

తలనొప్పి నివారిణి

మీ జీవక్రియకు ఆటంకం కలిగినప్పుడు మరియు మీరు తలనొప్పితో బాధపడుతున్నారు. ఈ ఔషధం మీ తలనొప్పిని తొలగిస్తుంది. అలాగే మీ జీవక్రియ కార్యకలాపాలను నార్మల్ చేస్తుంది.

ఇది యాంటీ ఆక్సిడెంట్లు కలిగి ఉంటుంది.

ఇది యాంటీ ఆక్సిడెంట్లు కలిగి ఉంటుంది.

త్రిఫలలో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. అవి జీవక్రియను నియంత్రించడంలో ముఖ్య పాత్రను పోషిస్తాయి.శరీర ఫంక్షన్ లో కణాలు సక్రమంగా ఉండేలా,వృద్ధాప్య ప్రక్రియలో కొంచెం వేగాన్ని తగ్గిస్తుంది.

జీర్ణ సమస్యల నివారిణి

జీర్ణ సమస్యల నివారిణి

ఇది త్రిఫల యొక్క ప్రయోజనాలలో ఒకటి.జీర్ణక్రియ సంబంధించిన చాలా సమస్యలు త్రిఫల ద్వారా బాగా నియంత్రించబడతాయి.అంతేకాక ఇది ఒక విరేచనకారిగా పని చేస్తుంది. అంతే కాకుండా,కొవ్వు జీర్ణం కావటానికి మరింత సహాయం చేయటానికి లివర్ ని ఉద్దీపన చేస్తుంది. అలాగే జీర్ణ-ప్రేగులలో pH స్థాయిలను సరిగ్గా నిర్వహించడానికి సహాయపడుతుంది.

క్యాన్సర్

క్యాన్సర్

కొన్ని తీవ్రమైన అధ్యయనాలు త్రిఫల కొన్ని రకాల క్యాన్సర్లను నివారిస్తాయని తెలిపాయి. దీనికి తగినంత ఆధారం లేదు. అయినప్పటికీ, ప్రయత్నించండంలో తప్పు లేదు.

మలబద్ధకం నివారిణి

మలబద్ధకం నివారిణి

ఇది త్రిఫల యొక్క ప్రయోజనాలలో ఒకటి. మలబద్ధకంతో బాధపడుతున్న వారు దీనిని పొడి రూపంలో తీసుకుంటే బాగా పని చేయవచ్చు. మీ శరీరంను డెటాక్సిఫైడ్ చేయటానికి సహాయపడుతుంది.

రక్తహీనత

రక్తహీనత

ఎర్ర రక్త కణాల కౌంట్ విస్తరించేందుకు శక్తి లేక రక్తహీనతతో బాధపడుతున్న వారికి కొంత కాలం దీనిని ప్రయత్నించవచ్చు. హీమోగ్లోబిన్ సమస్యలు ఈ మార్గంలో నియంత్రించబడతాయి.

చర్మం కోసం మంచిది

చర్మం కోసం మంచిది

మీ రక్తాన్ని శుద్ది చేసి మీ చర్మం ఆరోగ్యకరముగా ఉండటానికి సహాయపడుతుంది. మీ రక్తం నుండి విషాన్ని తొలగించటం వలన మీ చర్మం మంచిగా కనపడుతుంది.

డయాబెటిస్

డయాబెటిస్

ఇది మధుమేహంతో బాధపడుతున్న వ్యక్తుల కోసం ప్రభావవంతంగా ఉంటుంది. మీ క్లోమంను ఉద్దీపన చేసి గ్లూకోజ్ స్థాయిలను సరిగ్గా నియంత్రణ చేస్తుంది.

ఊబకాయం మీద పోరాటం

ఊబకాయం మీద పోరాటం

ఇది ఊబకాయం ఉన్నవారి దగ్గర తప్పనిసరిగా ఉండవలసిన ఔషధం. క్రమం తప్పకుండా దీనిని వాడితే పేరుకుపోయిన కొవ్వు తగ్గుతుంది. కొవ్వు చేరటానికి కారణమైన కొవ్వు కణజాలంను త్రిఫల బాగా నియంత్రిస్తుంది.

శ్వాస సమస్యలు

శ్వాస సమస్యలు

త్రిఫల కొన్ని శ్వాస సమస్యలను కొంత వరకు నయం చేస్తుంది. సైనస్ మరియు ఇతర శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్న వారు దీనిని ఔషధంగా ప్రయత్నించవచ్చు.అలాగే,ఇది శ్లేష్మంలో ఉన్న బాక్టీరియాతో పోరాడుతుంది.

అంటువ్యాధులను నిరోధిస్తుంది

అంటువ్యాధులను నిరోధిస్తుంది

ఇది కొన్ని అంటువ్యాధులను నివారించడానికి మరియు మీ శరీరంలో వార్మ్ మీద పోరాటం చేయటానికి సహాయపడుతుంది. ఇది త్రిఫల యొక్క ఆరోగ్య ప్రయోజనాలలో ఒకటి. వార్మ్ స్థావరాన్ని ఏర్పరుచుకోకుండా (టేప్ పురుగులు) ఉండటానికి దీనిని ఔషధంగా ప్రయత్నించవచ్చు.

రోగనిరోధక శక్తిని పెంచుతుంది

రోగనిరోధక శక్తిని పెంచుతుంది

ఇది త్రిఫల చూర్ణం యొక్క ప్రయోజనాలలో ఒకటి. మీరు ప్రతి రోజూ త్రిఫలను ఉపయోగిస్తే మీ రోగనిరోధక వ్యవస్థకు ప్రోత్సాహాన్ని కలిగిస్తుంది. మీ శరీరంలో రోగనిరోధక వ్యవస్థ విధులను బాగా నిర్వహించటానికి మరియు వివిధ రుగ్మతల మీద పోరాడే సామర్థ్యంను పొందవచ్చు.

Story first published: Friday, January 30, 2015, 22:40 [IST]
Desktop Bottom Promotion