For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అనారోగ్య హెచ్చరిక సంకేతాలివిగో. మీరు ప్రమాదం లో ఉన్నారేమో చూసుకోండి

By Staff
|

మన శరీరం ఒక్కోసారి లోపల ఉన్న వ్యాధి లేదా ఇబ్బంది గురించి కొన్ని హెచ్చరిక సంకేతాలని పంపిస్తుంటుంది. మీరు మీ శరీరం పంపే సంకేతాలని గమనిస్తున్నారా లేదా?? కింద పేర్కొనపడ్డ కొన్ని సంకేతాలని అస్సలు విస్మరించరాదు.

భుజాలు,చేతుల్లో తిమ్మిరి:

భుజాలు,చేతుల్లో తిమ్మిరి:

హార్ట్ స్ట్రోక్ వచ్చిన మనిషికి చెయ్యి, భుజాలలో తిమ్మిరి గా అనిపిస్తుంది. ఇంకా మాట్లాడలేకపోవడం,అకస్మాత్తుగా వ్జ్వరం రావడం, సంతులనం తపప్డం లాంటివి హార్ట్ స్ట్రోక్ లక్షణాలు. బిగుసుకుపోయిన రక్త నాళాలవల్ల రక్తం లో ఒత్తిడి ఏర్పడి అది హార్ట్ స్ట్రోక్ లేదా రక్తం గడ్డ కట్టడానికి దారితీయవచ్చు.

గుండెల్లో నెప్పి,వాంతులు,చెమట పట్టడం:

గుండెల్లో నెప్పి,వాంతులు,చెమట పట్టడం:

ఈ లక్షణాలు పురుషులలో కంటే స్త్రీలలో హార్ట్ ఎటాక్ సమయం లో కనిపిస్తాయి.బాగా అలసిపోయినట్లుండటం,గుండెల్లో బాగా ఒత్తిడి అనిపించడం,శ్వాస అందకపోవడం, బాగా చెమటపట్టడం,ఆందోళన గా అనిపించవచ్చు స్ట్రోక్ వచ్చినప్పుడు.ఈ నెప్పి దవడలు, మెడ లేదా ఎడమ భుజంలోకి పాకితే కనుక ప్రమాదం. ఒక్కోసారి ఊపిరితిత్తులలో గడ్డ కట్టిన రక్తాన్ని రోగి దగ్గు రూపం లో బయటకి పంపినప్పుడు శ్వాస తీసుకోవడంలో తీవ్ర ఇబ్బంది ఎదురవ్వవచ్చు.

కంటిచూపు కోల్పోవడం:

కంటిచూపు కోల్పోవడం:

కంటి చూపు మసకగా ఉండటం, కళ్ళల్లో మంట,తీవ్ర తలనెప్పి,లేదా దైనందిన కార్యక్రమాలు చేసుకునేటప్పుడు కళ్ళు నెప్పి పుట్టడం,వికారం,వాంతులు..ఇవన్నీ గ్లకోమా లక్షణాలు. కంటి నరాలు దెబ్బతిని చూపు కోల్పోవడాన్ని గ్లకోమా అంటారు.సాధారణంగా దీనికి ముందస్తు సూచికలేమీ ఉండవు,గ్లకోమా మెల్లిగా లోపల వృద్ధి చెందుతుంటుంది.చూపు దెబ్బతింది అని రోగి తెలుసుకునేటప్పటికి నష్టం పూడ్చలేనిదిగా ఉంటుంది.

అతి దప్పిక మరియు మూత్ర విసర్జన:

అతి దప్పిక మరియు మూత్ర విసర్జన:

డయాబెటిక్ రోగులలో ఈ లక్షణాలు సర్వసాధారణం.డయాబెటిక్ రోగులలో వారి శరీరం రక్తం లో చక్కెర శాతాన్ని నియంత్రించే ఇన్సులిన్ ని తగినంత ఉత్పత్తి చెయ్యలేదు.డయాబెటిస్ మెల్లిగా మూత్రపిండ,గుండె,కంటిచూపు,నాడీ వ్యవస్థ కి సంబంధించిన వ్యాధులకి దారి తీస్తుంది.

తీవ్ర వెన్ను నెప్పి:

తీవ్ర వెన్ను నెప్పి:

అనేక రకాల రుగ్మతలవల్ల ఈ వెన్ను నెప్పి రావచ్చు: పెరాలిసిస్ లేదా పక్షవాతం:తీవ్ర వెన్ను నెప్పితో పాటు కాళ్ళల్లో సత్తువ లేకపోవడం,మూత్రాశయ,పెద్ద పేగులు సరిగా పని చెయ్యట్లెదంటే నరాలలో ఏదో తేడా ఉందని అది పక్షవాతానికి దారితీస్తుందని గుర్తు.

ఫ్రాక్చర్:

ఫ్రాక్చర్:

యాక్సిడెంట్ జరిగిన తరువాత తీవ్ర వెన్ను నెప్పి వస్తోందంటే అది విరిగిన ఎముకకి సంకేతం.

ఆస్టీయోపోరోసిస్:

ఆస్టీయోపోరోసిస్:

ఎముకల,కండరాల బరువు తగ్గిపోవడం వల్ల ఆస్టియోపోరోసిస్ వస్తుంది.ఈ వ్యాధి ఎముకలని బాగా బలహీనపరుస్తుంది. ఆందువల్ల ఆస్టీయోపోరోసిస్ రోగులు చాలా జాగ్రత్త గా ఉండాలి.దీని లక్షణాలు తీవ్ర వెన్ను నెప్పి,వాపు మరియు కీళ్ళ నెప్పులు.

అకస్మాత్తుగా వచ్చే తీవ్ర తలనెప్పి

అకస్మాత్తుగా వచ్చే తీవ్ర తలనెప్పి

ఎవరికైనా అకస్మాత్తుగా భరించలేని తలనెప్పి వస్తోందంటే దానికి కారణాలనేకం. • ఇన్ఫెక్షన్ • హామరేజ్(రక్త స్రావం) వల్ల వచ్చే స్ట్రోక్ • గ్లకోమా • పుర్రెకి దెబ్బ తగలడం • విషప్రయోగం • మైగ్రెయిన్ • క్లస్టర్ తలనెప్పి(కొన్ని వారాలపాటు తలలో ఒక వైపు మాత్రమే వచ్చే నెప్పి)

పక్కటెముకల్లో నెప్పి:

పక్కటెముకల్లో నెప్పి:

మొలభాగం, వీపు కింది భాగం లో లేదా పొత్తికడుపులో తీవ్ర నెప్పి వస్తోటే మూత్ర పిండాల్లో సంస్య ఉన్నట్టు.వీటితోపాటు వికారం, వాంతులు, మూత్ర విసర్జన సమయంలో రక్తస్రావం అవుతోంటే మూత్ర పిండాలలో రాళ్ళు ఉన్నాయని సంకేతం.ఒక వేళ యూరినరీ ట్రాక్(మూత్ర మార్గం) ఇన్ ఫెక్షన్ అయితే రోగికి చలి, జ్వరం తో పాటు తరచూ మూత్రానికి వెళ్ళాల్సిరావడం, మూత్ర విసర్జన సమయం లో నెప్పి గా అనిపించవచ్చు

దీర్చకాలిక దగ్గు:

దీర్చకాలిక దగ్గు:

దగ్గు కనుక నెల రోజుల పైగా వస్తోంటే అది దీర్ఘకాలిక దగ్గు కిందే లెక్క. దీర్ఘకాలికం గా దగ్గు వస్తోంటే శ్వాస కోశ వ్యవస్థ లో ఏదో ఇబ్బంది ఉన్నదని సంకేతం.ఒకవేళ రోగి దగ్గినప్పుడు రక్తం పడుతున్నట్లయితే అది మరింత ప్రమాదకరం. గురక,గుండెల్లో నెప్పిగా అనిపించడం లాంటివి ఊపిరితిత్తుల రుగ్మత కి చిహ్నాలు.

వైద్య సహాయం:

వైద్య సహాయం:

పైన పేర్కొనపడ్డ లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించి జబ్బేమిటో నిర్ధారించుకోవాలి.చాలా జబ్బులని ముందస్తుగా గుర్తిస్తే చాలావరకూ నయం చేయవచ్చు.

జాగ్రత్తలు:

జాగ్రత్తలు:

మన శరీరం ఒక క్లిష్టమైన వ్యవస్థ. లోపల ఏదైన తేడా వస్తే వెంటనే సంకేతాలు పంపిస్తుంది.ఈ సంకేతాలొచ్చాయంటే మనం ప్రమాదం లో ఉన్నట్లే.అందుకే మన శరీరం పంపించే సంకేతాలని జాగ్రత్తగా గమనిస్తే జరగబోయే అనర్ధాలని అరికట్టవచ్చు.


English summary

12 Health Warning Symptoms – Are You At Risk?: Health Tips in Telugu

12 Health Warning Symptoms – Are You At Risk?: Health Tips in Telugu, Body sends warning signals indicating a symptom of a disease or ailment. Are you listening to your body? Following are some medical symptoms that you should never ignore.
Desktop Bottom Promotion