For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

స్కిన్ అలర్జీ లేదా చర్మం దురదను నివారించే హోం రెమెడీస్

By Super
|

చర్మం దురద పెట్టడాన్ని వైద్యపరంగా ప్రూరిటస్(కండూతి)అంటారు. చర్మం దురద పెట్టడానికి ముఖ్య కారణం అలర్జీ, ఇతర స్కిన్ డిసీజ్ లు, డ్రై స్కిన్, హెచ్ఐవిఎస్, శరీరంలో పేలు, తామర, తట్టు, చర్మంపై ఫంగల్, ఇన్ఫెక్షన్, డ్రైపర్ రాషెష్, ఎరువుల పాయిజనింగ్, ఫుడ్ అలర్జీ, డ్రగ్ అలర్జీ మరియు కీటకాలు కాటు మొదలైనవన్నీ కూడా చర్మం దురదకు కారణం అవుతాయి. ఇలాంటి సమయంలో చర్మంను తదేకంగా గోకటం లేదా అతిగా స్ర్కబ్ చేయడం వల్ల సున్నితమైన చర్మం గాయపడుతుంది. అంతే కాదు, చర్మయొక్క అంటువ్యాధులు ఎక్కువగా గోకడం వల్ల ఇన్ఫెక్షన్స్ ఇతర భాగాలకు కూడా వ్యాప్తి చెందుతుంది . అదృష్టవశాత్తూ, చర్మం దురద నివారించడం కోసం సమర్థవంతమైన హోం నివారణలు ఉన్నాయి.

చర్మం దురుద వల్ల మరింత చికాకు కలిగిస్తుంది మరియు రోజువారీ కార్యకలాపాల నుండి మన దృష్టిని డిస్ట్రాక్ (మరల్చుతుంది). చర్మం దురద పెట్టడానికి ఇతర తీవ్రమైన కారణాలు హైపటీటిస్, పిత్తం, అడ్వాన్డ్స్ డయాబెటిస్, మూత్రపిండాల వ్యాధులు ఉండవచ్చు. ఈ సందర్భంలో మీరు అంతర్గతంగా వచ్చే ఇలాంటి సమస్యను నివారించడానికి తప్పనిసరిగా డాక్టర్ ను సంప్రదించాలి. అంతర్గత కారణాల వల్ల వచ్చే అనారోగ్యాల వల్ల వచ్చే చర్మ ఇన్ఫెక్షన్స్ వెంటనే నివారించుకోవాల్సి ఉంటుంది .

అంతర్గత ఆరోగ్య సమస్యలు కారణం కాకుండా చర్మం వల్ల మాత్రమే చర్మం దురదకు కారణం అవుతుంటే మాత్రం చాలా సింపుల్ గా నేచురల్ గా ఉండే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని కొన్ని హోం రెమెడీస్ ను ఉపయోగించుకోవచ్చు. ఇవి చర్మం దురద నుండి ఉపశమనం కలిగిస్తాయి . టోపికల్ మెడికల్ క్రీమ్స్ ఉపయోగించడం వల్ల వాటి వల్ల కొన్ని సైడ్ ఎఫెక్ట్ కలిగి ఉండవచ్చు . కాబట్టి, నేచురల్ పద్దతులను ఎందుకు అనుసరించకూడదు????????

READ MORE: చర్మం దురద తగ్గించటానికి సులభమైన హోం రెమిడీస్

శరీరం మీద చర్మం దురదను ఎలా నివారించాలి? అందుకు బోల్డ్ స్కై.డాట్. కామ్ కొన్ని ఉత్తమ హోం రెమెడీలను మీకోసం పరిచయం చేస్తున్నది..అవేంటో ఒకసారి ఈ క్రింది స్లైడ్ ద్వారా పరిశీలించండి...సమస్యను నివారించుకోండి...

కొబ్బరి నూనె:

కొబ్బరి నూనె:

డ్రై స్కిన్ , డైపర్ రాషెష్ లేదా కీటకాలు కుట్టడం ద్వారా చర్మం దురద పెడుతుంటే కొబ్బరినూనెను ఉపయోగించుకోవచ్చు . చికాకు కలిగించే చర్మానికి ఉపశమనం కలిగిస్తుంది మరియు దురదను నివారిస్తుంది. కాబట్టి, దురదగా ఉన్న ప్రదేశంలో గోరువెచ్చగా ఉన్న కొబ్బరినూనెను అప్లై చేసి సున్నితమైన మసాజ్ చేయాలి. ఇది చర్మానికి మాయిశ్చరైజ్ గా పనిచేసి దురదను నివారిస్తుంది.

తులసి:

తులసి:

ఈ తులసి ఆకులు ఔషధగుణాలు ఎక్కువ. ముఖ్యంగా కార్పూరం మరియు థైమోల్ వంటివి దురద నుండి తక్షణ ఉపశమనం కలిగిస్తాయి . ఇంకా ఇందులో యాంటీసెప్టిక్ లక్షణాలు చర్మంలోని ఇన్ఫెక్షన్ ను నాశనం చేస్తుంది . దురద పెట్టే చర్మం మీద తులసి ఆకులతో చేసిన పేస్ట్ ను అప్లై చేయాలి.

వేపాకు:

వేపాకు:

దురద కలిగించే చర్మంకు ఇది ఒక బెస్ట్ నేచురల్ హోం రెమెడీ. ఇందులో యాంటీ సెప్టిక్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి మరియు ఇది బ్యాక్టీరియా, వైరల్, మరియు ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ను నాశనం చేస్తుంది. అంతే కాదు, దురదను మరియు చికాకు, ఇన్ఫ్లమేషన్ చాలా ఎఫెక్టివ్ గా నివారిస్తుంది . అంతే కాదు ఇది చర్మానికి చల్లదనాన్ని అందిస్తుంది. వేపనూనెను దురద ఉన్న ప్రదేశంలో అప్లై చేసి తక్షణ ఉపశమనం పొందవచ్చు.

నువ్వుల నూనె

నువ్వుల నూనె

దురదగా ఉన్న చర్మంకు తక్షణ ఉపశమనం కలిగిస్తుంది మరియు సన్ బర్న్ నివారిస్తుంది. చర్మం మీద రాషెస్ ను నివారించి చర్మానికి పోషణ అందిస్తుంది. నువ్వుల నూనెతో దురదగా ఉన్న ప్రదేశంలో మర్దన చేయాలి. ఇది ఒక ఎఫెక్టివ్ నేచురల్ హోం రెమెడీ.

పుదీనా

పుదీనా

పుదీనాలో యాంటి సెప్టిక్ లక్షణాలు ఎక్కువగా ఉండటం వల్ల ఇది స్కిన్ ఇన్ఫెక్షన్స్ ను నివారిస్తుంది . మరియు వాటి ద్వారా వచ్చే దురదను కూడా అరికడుతుంది. ఇంకా వాపు మరియు చికాకును తగ్గిస్తుంది . పుదీనా రసాన్ని దురద ఉన్న ప్రదేశంలో అప్లై చేస్తే నొప్పి మరియు దురద వాపును నివారిస్తుంది. చర్మానికి కూలింగ్ ఎఫెక్ట్ ను కలిగిస్తుంది.

నిమ్మరసం:

నిమ్మరసం:

నిమ్మకాయలో విటమిన్ సి, సిట్రిక్ యాసిడ్ మరియు ఎసిటిక్ యాసిడ్ పుష్కలంగా ఉండటం వల్ల ఇది ఇరిటేషన్, ఇన్ఫ్లమేషన్ మరియు చర్మం మీద దద్దుర్లును నివారిస్తుంది . ఇంకా దురద వల్ల వచ్చే ఇన్ఫెక్షన్ నివారిస్తుంది. చర్మ దురదగా ఉన్న ప్రదేశంలో నిమ్మరసం అప్లై చేయాలి . ఇది ఒక బెస్ట్ ట్రీట్మెంట్ .

మెంతులు:

మెంతులు:

మెంతుల్లో కూడా ఔషధగుణాలు మెండుగా ఉన్నాయి. చర్మంలోని బ్యాక్టీరియల్, ఫంగల్ ఇన్ఫెక్షన్ ను నివారిస్తాయి. మెంతులు అనేక రకాల వ్యాధులను నివారించడానికి సహాయపడుతుంది. చర్మం మీద కాలిన గాయలు మరియు బాయిల్ యొక్క నొప్పిని నివారిస్తుంది . చర్మ దురదను నివారించడంలో ఇది ఒక ఉత్తమ హోం రెమెడీ . మెంతులు పెరుగు మిక్స్ చేసి పేస్ట్ లా చేసి దురద ఉన్న చర్మం మీద అప్లై చేయాలి.

బాదం ఆయిల్:

బాదం ఆయిల్:

ఇది దురద కలిగించి చర్మానికి ఉపవనం కలిగిస్తుంది. డ్రై స్కిన్ నివారిస్తుంది. చర్మానికి పోషణను అందిస్తుంది. చర్మాన్ని తగినంత తేమను అందిస్తుంది. బాదం ఆయిల్ ను దురదగా ఉన్న ప్రదేశంలో అప్లై చేసి మసాజ్ చేస్తే ఇరిటేషన్ తగ్గుతుంది.

తేనె:

తేనె:

తేనె యాంటీసెప్టిక్ గా పనిచేస్తుంది. ఇది బ్యాక్టీరియా మరియు ఫంగల్ ఇన్ఫెక్షన్ ను నాశనం చేస్తుంది. ఇదే కాకుండా చర్మానికి పోషణను మరియు మాయిశ్చరైజర్ ను అందిస్తుంది. దురదను నివారిస్తుంది . ఇది డ్యామేజ్ మరియు డ్రై స్కిన్ నివారిస్తుంది. ముఖ్యంగా కీటలకు కుడితే ఉపశమనం కలిగిస్తుంది తేనెను నిమ్మరసంను మరియు ఆలివ్ ఆయిల్ ను మిక్స్ చేసి అప్లై చేస్తే దురద క్రమంగా తగ్గుతుంది.

కలబంద

కలబంద

కలబందలో అనేక ఆరోగ్య ప్రయోజనాలున్న విషయం మనకు తెలిసిందే. ఇది చర్మం యొక్క చిరాకును దురదను నివారించి, చర్మానికి కూలింగ్ ఎఫెక్ట్ ను కలిగిస్తుంది. ఇంకా స్కిన్ రాషెస్, స్కిన్ బర్న్, మొటిమలను నివారిస్తుంది. దురద కలిగించే చర్మం మీద కలబందను అప్లై చేయాలి.

ఆలివ్ ఆయిల్

ఆలివ్ ఆయిల్

చర్మంయొక్క దురదను నివారిస్తుంది మరియు చర్మం మీద మొటిమలు మరియు రాషెస్ ను అరికడుతుంది. ఇది చరమం యొక్క దురద ను నివారించి మాయిశ్చరైజ్ గా పనిచేస్తుంది. స్కిన్ ఇరిటేషన్ తగ్గిస్తుంది.

బేకింగ్ సోడ

బేకింగ్ సోడ

ఇది బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ ను నివారిస్తుంది. స్కిన్ ఇరిటేషన్ మరియు దురదను నివారిస్తుంది. బేకింగ్ సోడా కొద్దిగా వాటర్ తీసుకొని, పేస్ట్ లా తయారుచేసి దురదకు కారణం అయ్యే మొటిమలున్న ప్రదేశంలో అప్లై చేయాలి. దీన్ని తెగిన గాయలమీద, పుండ్ల మీద, మరియు సెన్నిటివ్ స్కిన్ మీద అప్లై చేయకూడదు.

పెట్రోలియం జెల్లీ:

పెట్రోలియం జెల్లీ:

ఇది చర్మానికి మాయిశ్చరైజ్ గా పనిచేస్తుంది . స్కిన్ ఇరిటేషన్ మరియు దురదను నివారిస్తుంది . రాషెస్ కారణం అయ్యే ఇరిటేషన్ ను నివారిస్తుంది . దీన్ని చర్మానికి అప్లైచేసినప్పుడు చర్మం యొక్క డ్రైనెస్ మరియు రాషెస్ మరియు దురదను నివారిస్తుంది.

English summary

Top 13 Home Remedies For Itchy Skin

Itchy skin is medically known as pruritus. Causes of itchy skin are skin allergy, any skin diseases, dry skin, hives, body lice, eczema, measles, fungal infection on skin, diaper rash, fertiliser poisoning, food allergy, drug allergy and insect bite etc.
Desktop Bottom Promotion