For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వేసవికాలంలో ఆరోగ్యానికి మేలుచేసే మరియు హానికలిగించే ఆహారాలు

By Super
|

సీజన్ బట్టి కొన్ని ఆహారాలు మనకు అందుబాటులో ఉంటాయి. అయితే ఆ సీజన్ లో వాతావరణాన్ని బట్టి మనం తీసుకొనే ఆహారం ఎంపిక చేసుకోవాలి. ముఖ్యంగా వేసవి కాలంలో కొన్ని ఆహారాలు నివారించాల్సి ఉంటుంది. వీటికి బదులుగా వేసవిలో మన శరీరంను చల్లబరిచే మరింత ఉత్తమమైన ఆహారాలను ఎంపిక చేసుకోవాలి . మన ఇండియాలో వేసవిలో ఎండలు ఎక్కువగా ఉండటం వల్ల శరీరంను నేచురల్ గా చల్లబరచుకోవడానికి కొన్ని ప్రత్యేకమైన ఆహారాలను నివారించాలి.

ఆరోగ్యానికి మేలు చేసే పండ్లు బొప్పాయి, పైనాపిల్ మరియు అవొకాడోలు శరీరంలో వేడిని పుట్టిస్తాయి. వీటిని తిన్నా, శరీరంలో వేడిగా అనిపిస్తుంది. కాబట్టి వీటిని వేసవికాలంలో తినడం వల్ల శరీరంలో వేడి కలిగిస్తుంది. ఈ కారణం చేత మొటిమలు మరియు చర్మ మీద వేడికి చెమటకాయలు అనే చర్మ సమస్యలు మొదలవుతాయి.

అందువల్ల, ఈ సమస్యలను నివారించాలంటే, ఇలాంటి ఆహారాలకు వేసవికాలంలో దూరంగా ఉండాలి.

మరో ప్రక్క, వేసవిలో ఆరోగ్యానికి మేలు చేసే వాటర్ మెలోన్, కీరదోసకాయ, జామకాయలు, మరియు మరికొన్ని పండ్లు మన శరీరానికి అవసరం అయ్యే నీటిని అందిస్తాయి. కాబట్టి, ఈ రోజు ఈ వేసవి సీజన్ లో ఏలాంటి ఆహారాలు తీసుకోవాలి, ఏ ఆహారాలను నివారించాలన్న విషయం బోల్డ్ స్కై మీకు అందిస్తున్నది. మరి అవేంటో తెలుసుకుందాం...

 మజ్జిగ :

మజ్జిగ :

మజ్జిగ వేసవికాలంలో తీసుకోవల్సిన బెస్ట్ ఫుడ్స్ లో ఇది ఒకటి. రోజులో తగినంత ఎక్కువ సార్లు మజ్జిగ త్రాగుతుంటే, ఇది శరీరంను చల్లగా ఉంచతుంది. మరియు ఇది శరీరంలో బ్యాక్టీరియాను నాశనం చేసి, సాధారణ జలుబు మరియు దగ్గును నివారిస్తుంది.

వాటర్ మెలోన్:

వాటర్ మెలోన్:

వేసవిలో తీసుకోవల్సిన ఆహారాల్లో మరో బెస్ట్ ఫుడ్ వాటర్ మెలోన్. ఈ రెడ్ కలర్ జ్యూస్ ఫ్రూట్ లో 90శాతం నీళ్ళు 10శాతం ఫ్లెష్ ఉంటుంది . వేసవిలో ఈ పండు తినడం వల్ల మీ శరీరంను పూర్తిగా హైడ్రేషన్ లో ఉంచుతుంది.

మస్క్ మెలోన్:

మస్క్ మెలోన్:

వేసవికి మరో బెస్ట్ ఫుడ్ మస్క్ మెలోన్ . వేసవికాలంలో మీ డైలీ డైట్ లో తప్పనిసరిగా చేర్చుకోవల్సిన మరో ఆహారం ఇది. మస్క్ మెలోన్ లో ఉండే వాటర్ కంటెంట్ మీకు చెమట పట్టకుండా నివారిస్తుంది.

జామకాయ:

జామకాయ:

జామకాయలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది మరియు జామకాయలో మరికొన్ని యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు కూడా ఉన్నాయి . వీటిని వేసవికాలంలో తీసుకోవడం వల్ల మిమ్మిల్ని హెల్తీగా మరియు ఎనర్జిటిక్ గా ఉంచుతాయి. జామకాలో ఉండే ప్రోటీనులు మీకు ఎక్కువ శక్తిని అందిస్తాయి.

కొబ్బరి బోండాం:

కొబ్బరి బోండాం:

కొబ్బరి బోండాంలోని నీరు తీసుకోవడం వల్ల వేసవికాలంలో శరీరంను చల్లగా ఉంచుతుంది . కాబట్టి, కోకనట్ వాటర్ వేసవికాలంలో తప్పనిసరిగా తీసుకోవాలి. కొబ్బరి నీళ్ళు మీ చర్మం చూడటానికి అందంగా ఫ్రెష్ గా మరియు సాఫ్ట్ గా కనబడేలా చేస్తుంది . మరియు ఇది శరీరంలోని టాక్సిన్స్ నివారిస్తుంది.

ఆరెంజ్ :

ఆరెంజ్ :

వేసవికాలంలో ఆరెంజ్ పండ్లు తినడం చాలా అవసరం. ఎందుకంటే శరీరానికి వ్యాధి నిరోధక శక్తిని పెంచే విటమిన్ సి వీటిలో పుష్కలంగా దొరుకుతుంది . ఆరెంజ్ లో కూడా అధిక మొత్తంలో ప్రోటీన్స్ కలిగి ఉండి, మన శరీరానికి అవసరం అయ్యే ఎనర్జీని అందిస్తుంది . రోజంతా యాక్టివ్ గా ఉండేందుకు సహాయపడుతుంది.

టమోటోలు:

టమోటోలు:

వేసవిలో తినాల్సిన మరో ఫ్రూట్ టమోటో. ఎందుకంటే టమోటోల్లో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది శరీరంలోని క్రిములను నాశనం చేస్తుంది . కాబట్టి, టమోటోలను మీ రెగ్యులర్ డైట్ లో తప్పనిసరిగా చేర్చుకోవాలి . మీలోని వ్యాధినిరోధక శక్తిని పెంచుతుంది.

కారం ఉన్న ఆహారాలు:

కారం ఉన్న ఆహారాలు:

వేసవికాలంలో కారం తగ్గించాలి . వేసవిలో కారం ఎక్కువగా తినడం వల్ల , అది మీ శరీరానికి వేడి కలుగచేస్తుంది . అది మీ శరీరం యొక్క మెటబాలిజం రేటు కూడా పెంచుతుంది . వేసవి కాలంలో ఎక్కువ కారం తినడం అంత మంచిది కాదు.

మాంసాహారం :

మాంసాహారం :

ప్రోటీన్స్ అధికంగా ఉండటం వల్ల మాంసాహారం తీసుకోవడం మంచిదే అయినా, వేసవిలో తీసుకోవడం ఆరోగ్యానికి అంత మంచిది కాదు. మీట్ మరియు మటన్ వంటివి శరీరానికి ఎక్కువ వేడిని కలిగిస్తాయి . ఇవి శరీరానికి అంత మంచిది కాదు.

జంక్ ఫుడ్ :

జంక్ ఫుడ్ :

జంక్ ఫుట్ ప్రతి ఒక్కరికి ఫేవరెంట్ ఫుడ్ . వేసవిలో నివారించాల్సిన ఆహారాల్లో ఇది ఒకటి .ఎందుకంటే వీటిలో ఆర్టిఫిషియల్ ప్రొపర్టీస్ ఎక్కువగా ఉపయోగించి ఉంటారు . ఇవి మిమ్మల్ని మరింత బద్దకస్తులుగా మార్చేస్తాయి. అంతే కాదు శరీరంలో మెటబాలిజం రేటును తగ్గించే క్యాలరీలను పెంచేస్తాయి.

ఆయిల్ ఫుడ్ :

ఆయిల్ ఫుడ్ :

చాలా వరకూ ఇండియన్ ఫుడ్స్ లో ఆయిల్ ఎక్కువగా కలిగి ఉంటుంది. ఆయిల్ ఫుడ్ తీసుకోవడం వల్ల వేసవికాలంలో మిమ్మల్ని మరింత లేజీగా మరియు డ్రౌజీగా మార్చేస్తుంది.

సాస్ ఉన్న ఆహారాలు:

సాస్ ఉన్న ఆహారాలు:

సాస్ రిలేటెడ్ ఫుడ్స్ మీ పొట్ట నిండేలా చేయడం మాత్రమే కాదు, మిమ్మల్ని మరింత నిదానపరుస్తుంది . కాబట్టి, వేసవిలో బార్బెక్యు చికెన్, చీజ్ డిప్ సాస్ మరియు మరికొన్నింటిని వేసవిలో తప్పనిసరిగా నివారించాల్సి ఉంటుంది.

కాఫీ:

కాఫీ:

చాలా మంది చలికాలంలో కాఫీని ఎక్కువ ఇష్టపడుతారు. ఎందుకంటే చలికాలంలో శరీరం వెచ్చగా ఉంచుకోవడం కోసం. వేసవిలో కాఫీని నివారించి గ్రీన్ టీ ఎక్కువగా తీసుకోవడం వల్ల లేదా సింపుల్ ఛాయ్ తీసుకోవాలి . వేసవిలో వీటిని తీసుకోవడం వల్ల శరీరానికి మరిన్ని ప్రయోజనాలు అందుతాయి.

తేనె:

తేనె:

తేనె మీ శరీరంకు వేడి పుట్టిస్తుందన్న విషయం మీకు తెలుసా. వేసవిలో నివారించాల్సిన ఆహారాల్లో అత్యంత ముఖ్యమైనది తేనె. మీ గ్రీన్ టీలో తేనె మిక్స్ చేయాలనుకుంటే మీరు తప్పనిసరిగా అందులో నిమ్మరసం మిక్స్ చేయాలి.

Desktop Bottom Promotion