For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

చలికాలంలో ఇబ్బంది కలిగించే బ్రాంకైటిస్ కు ఉత్తమ హోం రెమెడీస్

|

చలికాలంలో తరచుగా ఇబ్బంది కలిగించే వ్యాధి బ్రాంకైటిస్‌. వాతావరణంలో మార్పు లేదా వాతావరణంలో తేమ ఎక్కువగా ఉండటం వంటి మార్పులతో కొందరికి ఊపిరి సక్రమంగా అందదు. ఊపిరితిత్తుల్లోని శ్వాసకోశవాహికల్లోని లోపలి పొరలో సంభవించే ఇన్‌ఫ్లమేషన్ (వాపు) వల్ల శ్వాసకోశనాళాలు సన్నబడతాయి. దాంతో ఊపిరితీసుకోడానికి ఇబ్బంది కలుగుతుంది. ఈ జబ్బునే వైద్యపరిభాషలో ‘బ్రాంకైటిస్' అంటారు.

ఈ వ్యాధి మెల్లగా పొడి దగ్గుతో మొదలయి కొద్ది రోజులకి కఫం చేరుతుంది. తెమడ తెల్లరంగుతో తక్కువ మోతాదులో అప్పుడుప్పుడు దగ్గుతో పాటు పడుతుంటుంది. రెండు, మూడు రోజులకి వృద్ధిచెంది పసుపు పచ్చ రంగులోకి మారుతుంది. గొంతులో మంటతోపాటు గరుకుగా, తడారిపోయినట్లుగా అనిపిస్త్తుంది. బ్రాంకైటిస్‌ సోకడానికి గల కారణాలు వాతావరణంలో ఎక్కువగా ఉండే రైనో వైరస్‌, కొరోవైరస్‌, ఇన్‌ఫూవినెజా మొదలైనవి గాలిగొట్టాలలో జారబడి వాటియుెెక్క సున్నితమైన పొరల్ని దెబ్బతీస్తాయి. దానివల్ల గాలిగొట్టాలు ఉబ్బిపోయి. వాటి నుంచి ద్రవాలు స్రవిస్తాయి. ఈ దశలో పొడిదగ్గు రావటం, కొద్దిగా కఫం రావటం జరుగుతుంది.

బ్రాంకైటిస్‌ వల్ల దగ్గు, అలసట, చెస్ట్ పెయిన్, శ్వాసలో ఇబ్బందులు, జ్వరం మరియు కండరాల నొప్పులకు దారిస్తుంది . క్రోనిక్ బ్రాంకైటిస్ కూడా వివిధ రకాలుగా బాధకు గురిచేస్తుంది. కాబట్టి, ఈ సమస్యలన్నింటిని నివారించాలంటే బ్రాంకైటిస్ ప్రారంభదశలోనే తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అందుకు నేచురల్ రెమెడీస్ బాగా సహాయపడుతాయి. మరియు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. మరి బ్రాంకైటిస్ ను నివారించే హోం రెమెడీస్ ఏంటో, ఏవిధంగా ఉపయోగించాలో చూద్దాం...

1. నిమ్మరసం:

1. నిమ్మరసం:

బ్రాంకైటిస్ నివారణకు నిమ్మరసం అద్భుతంగా సహాయపడుతుంది. మ్యూకస్ ను క్లియర్ చేస్తుంది మరియు గొంతు నొప్పి నుండి ఉపశమనం కలిగిస్తుంది.

2. వెల్లుల్లి:

2. వెల్లుల్లి:

వెల్లుల్లి ఒక మంచి యాంటీబయోటిక్ ఔషదం అని మనందరికీ తెలిసిన విషయమే . మరియు ఇది యాంటీ వైరల్ లక్షణాలను కూడా కలిగి ఉంటుంది. అందువల్ల వెల్లుల్లి, బ్రాంకైటిస్ కు ఒక ఉత్తమ హోం రెమెడీగా ఉపయోగిస్తున్నారు. రెండు మూడు వెల్లల్లి రెబ్బలను కట్ చేసి పాలలో వేసి మరిగించాలి. గోరువెచ్చని ఈ పాలను నిద్రించడానికి ముందుగా త్రాగితే ఉత్తమ ఫలితం ఉంటుంది.

3. అల్లం:

3. అల్లం:

బ్రాంకైటిస్ కు ఒక అద్భుత హోం రెమెడీ. అల్లం దగ్గును తగ్గిస్తుందన్న విషయం మనందరికీ తెలిసిన విషయమే. మొదటి ఇది వాపును తగ్గిస్తుంది మరియు వ్యాధినిరోధకతను పెంచుతుంది. బ్రాంకైటిస్ తో పోరాడుతుంది. అల్లం, లేదా అల్లం పౌడర్ వేసి టీ తయారుచేసి, పంచదారకు బదులుగా తేనె మిక్స్ చేసి రోజుకు రెండు సార్లు తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.

4. ఆవాలు:

4. ఆవాలు:

బ్రాంకైటిస్ కు ఆవాలు కూడా ఉత్తమ నివారణ ఔషదం. ఆవాలు మెత్తగా పేస్ట్ చేసి, కొంత వద్ద ప్యాక్ లా వేసుకోవాలి. బ్రాంకైటిస్ లక్షణాలను కూడా ఇది దరిచేరనివ్వదు.

5. యూకలిప్టస్ ఆయిల్:

5. యూకలిప్టస్ ఆయిల్:

యూకలిప్టస్ ఆయిల్ ఒక అద్భుతమైన హోం రెమెడీ. ఇందులో యాంటీబ్యాక్టీరియల్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. ఇది శ్వాసనాళాలను గ్రహించేలా చేస్తుంది. కొద్దిగా నీళ్ళు మరిగించి అందులో ఈ నూనె వేసి ఆవిరి పట్టడం ద్వారా తక్షణ ఉపశమనం కలుగుతుంది.

6. సావరీ:

6. సావరీ:

బ్రాంకైటిస్ నివారణకు ఇది ఒక ఉత్తమ హేర్బల్ హోం రెమెడీ . ఈ మూలికను సావరీ అంటారు. ఇది ఊపిరితిత్తుల్లోని మ్యూకస్ ను క్లియర్ చేస్తుంది. అయితే దీన్ని ఎక్కువగా ఉపయోగించకూడా. వేడినీళ్ళలో అర టీస్పూన్ వేసి మరిగించి, గోరువెచ్చగా తీసుకోవాలి.

7. పసుపు:

7. పసుపు:

బ్రాంకైటిస్ నివారణకు పసుపు కూడా ఒక మంచి నేచురల్ యాంటీఇన్ఫ్లమేటరీ ఏజెంట్. మొదట ఇది దగ్గును తగ్గిస్తుంది. తర్వాత శ్వాసనాళం వాపు, మరియు మ్యూకస్ ను నివారిస్తుంది. ఒక చెంచా పసుపును పాలలో వేసి బాగా మరిగించి తర్వాత కాలీ కడుపుతో ఈ పాలను తీసుకోవడం ద్వారా ఉత్తమ ఫలితాలను పొందవచ్చు . అల్సర్, గాల్ బ్లాడర్ స్టోన్స్, కామెర్లు మరియు ఎసిడి ఉన్నవారు, ఈ చిట్కాను ఉపయోగించకూడదు.

8.సాల్ట్ వాటర్:

8.సాల్ట్ వాటర్:

బ్రాంకైటిస్ నుండి తక్షణ ఉపశమనం పొందడానికి కొద్దిగా ఉప్పును వేడి నీళ్ళలో వేసి నోట్లో పోసుకొని పుక్కలించి ఊసేయాలి. ఇలా రోజులో మూడు నాలుగు సార్లు చేస్తే ఉపశమనం కలుగుతుంది.

9. ఉల్లిపాయలు:

9. ఉల్లిపాయలు:

బ్రాంకైటిస్ కు మరో ఉత్తమ రెడీ. లాలాజం మింగ్రడానికి కష్టంగా ఉన్నప్పుడు, ఉదయం నిద్రలేవగానే ఉల్లిపాయ పేస్ట్ ను ఒక చెంచా తీసుకోవడం వల్ల ఉపశమనం కలుగుతుంది.

10. ఎప్సమ్ సాల్ట్:

10. ఎప్సమ్ సాల్ట్:

గోరువెచ్చని నీటిలో ఎప్సమ్ సాల్ట్ మిక్స్ చేసి, తీసుకోవాలి. ఇలా వారానికి రెండు సార్లు తీసుకోవడం ద్వారా ఉత్తమ ఫలితాలను పొందవచ్చు.

11. నీళ్ళు త్రాగాలి:

11. నీళ్ళు త్రాగాలి:

ఇటువంటి డిజార్డర్ ఉన్నప్పుడు నీరు త్రాగడం మర్చిపోకూడదు. మీకు అవసరం అయినన్ని నీరును త్రాగాలి . మీ శరీరాన్ని ఎల్లప్పుడు తేమగా ఉంచుకోవాలి.

12. బిర్యానీ ఆకు:

12. బిర్యానీ ఆకు:

బిర్యానీ ఆకు కూడా ఒక ఉత్తమ ఇంటి నివారిణి. వేడినీళ్ళలో బిర్యానీ ఆకును డిప్ చేసి, ఆకు ను చెస్ట్ మీద కొద్దిసేపు పెట్టుకోవాలి. కొన్ని నిముషాల తర్వాత తిరిగి అలా చేయవచ్చు.

13. తేనె:

13. తేనె:

దగ్గను కంట్రోల్ చేయడంలో తేనె గొప్పగా సహాయపడుతుంది. ఎందుకంటే తేనెలో యాంటీ బ్యాక్టీరియల్ మరియు యాంటీ వైరల్ లక్షణాలు ఉండటం వల్ల వ్యాధినిరోధకతను పెంచుతుంది. దాంతో బ్రాంకైటిస్ ను నివారించుకోవచ్చు. టీలో తేనె మిక్స్ చేసి త్రాగండి చాలు.

14. బాదం :

14. బాదం :

బ్రాకైటిస్ కు మరో హోం రెమెడీ బాదం. బాదంలో మెగ్నీషియం, క్యాల్షియం, మరియు పొటాసియం పుష్కలంగా ఉండటం వల్ల రెస్పిరేటరీ సమస్యలను నివారిస్తుంది.

15. నువ్వులు:

15. నువ్వులు:

నువ్వులు మరో ఉత్తమ హోం రెమెడీ. నువ్వుల్లో కొద్దిగా తేనె మరియు ఉప్పు చేర్చి నిద్రించే ముందు తీసుకుంటే ఉపశమనం కలుగుతుంది.

English summary

15 Home Remedies For Bronchitis

Are there any remedies for bronchitis? Well, bronchitis occurs due to the inflammation of bronchial tubes. They are the tubes that connect the lungs to the nose. When they swell due to an infection or any reason, breathing can become difficult. These tubes can get irritated due to bacteria or virus or even certain other particles.
Desktop Bottom Promotion