For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

నెక్ ఫ్యాట్(మెడ వద్ద కొవ్వును)తగ్గించే ఉత్తమ ఉపాయాలు

|

మెడ సన్నగా ఉంటేనే అందంగా నాజుగ్గా కనిపిస్తుంది. అయితే మెడ వద్ద కొవ్వు చేరిపోయి, లావుగా కనిపిస్తుంటే చూడటానికి అసహ్యంగా కబడుతుంది. అలా ఇబ్బంది పెడుతున్న నెక్ ఫ్యాట్ తొలగించుకోవడం సాధ్యమా? అవునే అంటున్నారు నిపుణులు. మీ మెడ చుట్టూ కొవ్వు చేరి ఉన్నట్లైతే, నెక్ ఫ్యాట్ ను తగ్గించుకోవడం కొంచెం ఇబ్బంది కరంగానే ఉంటుంది. మీరు అద్దంలో చూసుకొన్నప్పుడు మీ మెడ చుట్టు అధికంగా కొవ్వు చేరి అసహ్యంగా కనబడుతున్నట్లైతే, తగ్గించుకోవడానికి ప్రయత్నించాలి. ప్రస్తుత రోజుల్లో జీవన శైలిలో మార్పుల వల్ల నెక్ (మెడ)వద్ద కొవ్వు చేరడం అనేది చాలా సాధరణ సమస్యగా ఉంది. జీవనశైలిలో మార్పుల వల్ల మెడ వద్ద కొవ్వు చేరడాన్ని మన చుట్టూ ఉన్న చాలా మందిలో మనం గమనిస్తున్నాం. ప్రొసెస్ చేసిన ఆహారాలను తీసుకోవడం మరియు అధిక ఫ్యాట్ ను ఆహారాలను తీసుకోవడం అందుకు ప్రధాణ కారణం కావచ్చు.

మరి అలా మిమ్మల్ని ఇబ్బంది, మరియు అసౌకర్యానికి, అందవిహీనంగా కనిపించేలా చేసి నెక్ ఫ్యాట్ ను మీరు తగ్గించుకోవాలని నిజంగా కోరుకుంటున్నారో లేదా నిర్ణయించుకోవాలి. ఎందుకంటే ఖచ్చితంగా తగ్గించుకోవాలని నిర్ణయించుకొన, ఖచ్చితంగా కొన్ని పద్దతులను అనుసరించినట్లైతే నెక్ ఫ్యాట్ ను కరిగించుకోవచ్చు. అలా కాకుండా నెక్ ఫ్యాట్ తగ్గించుకోవడానికి కొన్ని పద్దతులను కొన్ని రోజులు మాత్రమే అనుసరించి తిరిగి మానేయడం వల్ల దీర్ఘకాలంలో మరింత ఎక్కువ సమస్యను ఎదుర్కోవల్సి వస్తుంది. మరియు నెక్ ఫ్యాట్ తగ్గించుకోవడానికి ఫిట్ నెస్ నిపుణులను సంప్రదించడం కూడా మంచిది . ఎప్పుడు కానీ హెల్త్ కేర్ ఎక్స్ పర్ట్స్ ను సంప్రదించడానికి సిగ్గు పడకూడదు.

READ MORE: శరీరంలో కొవ్వు కరిగించి.. పొట్టతగ్గించుకొనేందు పరిష్కార మార్గం!

నిజానికి, శరీరంలో వివిధ ప్రాంతాల్లో(మెడ, పొట్ట, నడుము, తొడలు, పిరుదులు, చేతులు) ఫ్యాట్ చేరుతుంటుంది. అయితే ఒక్కొక్క బాగంలో చాలా సులభంగా వేగంగా కొవ్వును కరిగించుకోవచ్చు. మరి మెడ వద్ద పేరుకొన్న కొవ్వును కరిగించుకొని, మెడను అందంగా సౌందర్యంగా మలచుకోవడానికి మీకోసం కొన్ని ఎఫెక్టివ్ చిట్కాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి...

సాఫ్ట్ డ్రింక్స్ కు నో చెప్పండి

సాఫ్ట్ డ్రింక్స్ కు నో చెప్పండి

సోడా మరియు సాఫ్ట్ డ్రింక్స్ కు దూరంగా ఉండాలి. నెక్ ఫ్యాట్ ను తగ్గించుకోవడానికి ఇది ఒక మార్గం.

ప్రొసెస్డ్ ఫుడ్స్ కు దూరంగా ఉండాలి

ప్రొసెస్డ్ ఫుడ్స్ కు దూరంగా ఉండాలి

హెల్తీ కార్బోహైడ్రేట్స్ మాత్రం తీసుకోవాలి. అనారోగ్యకరమైన వివిధ రకాల ప్రొసెస్డ్ ఫుడ్స్ కు దూరంగా ఉండాలి. త్రుణధాన్యాలతో తయారుచేసిన ఆహారాలను తీసుకోవాలి.

డైట్ లో మార్పులు

డైట్ లో మార్పులు

నెక్ ఫ్యాట్ ను ఎలా వదిలించుకోవాలి? మీరు మీ రెగ్యులర్ డైట్ లో మార్పులు చేసుకోవాలి . డైట్ ను బ్యాలెన్స్ చేసుకోవాలి . ఫ్రూట్స్ మరియు వెజిటేబుల్స్, చిరుధాన్యాలు, డైరీప్రొడక్ట్స్ మరియు లీన్ మీట్ తీసుకోవాలి.

గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్

గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్

గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ తీసుకోవడం వల్ల ఫైబర్ పుష్కలంగా అందుతుంది . ఇలాంటి పైబర్ ఫుడ్స్ తీసుకోవడం వల్ల నెక్ ఫ్యాట్ ను సులభంగా తగ్గించుకోవచ్చు.

నిటారుగా కూర్చోవాలి

నిటారుగా కూర్చోవాలి

కూర్చొనే భంగిమ కరెక్ట్ గా ఉండాలి. మీతలను ఎప్పుడూ నిటారుగా ఉంచుకోవాలి . కొత్త అలవాట్లు మార్చుకోవడం, సరైన సమయంలో పాటించడం చాలా అవసరం.

బీఫ్ కు దూరంగా

బీఫ్ కు దూరంగా

బీఫ్ లేదా రెడ్ మీట్ కు దూరంగా ఉండాలి. ఫిష్ మరియు చికెన్ ను ఎక్కువగా తీసుకోవాలి. ప్రోటీన్ రిచ్ ఫుడ్స్ ను ఎక్కువగా తీసుకోవాలి . క్యాన్డ్ ఫుడ్స్ కు దూరంగా ఉండాలి.

సోడియం(ఉప్పు)తీసుకోవడం తగ్గించుకోవాలి

సోడియం(ఉప్పు)తీసుకోవడం తగ్గించుకోవాలి

రెగ్యులర్ డైట్ లో మీరు తీసుకొనే ఉప్పు మోతాదును తగ్గించుకోవాలి. నెక్ ఫ్యాట్ తగ్గించుకోవడానికి ఇది ఒక ఉత్తమ మార్గం.

ఆకలికోరికలను తగ్గించుకోవాలి

ఆకలికోరికలను తగ్గించుకోవాలి

మంచి పౌష్టికాహారంను తీసుకోవడం వల్ల రోజు మద్యలో ఆకలి కాకుండా ఉంటుంది. అందుకు ఫ్యాట్ ఫుడ్స్ కు దూరంగా ఉండగలుగుతారు. మరియు తీసుకొనే ఆహారంను లిమిట్ గా తీసుకోవాలి .

బాడీ ఫ్యాట్ తగ్గించుకోవాలి.

బాడీ ఫ్యాట్ తగ్గించుకోవాలి.

మీలో జన్యుపరమైన మరియు ఇతర కారణాల వల్ల మీ శరీరంలో చేరే కొవ్వును తగ్గించుకోవడానికి వివిధ మార్గాలున్నాయి. శరీరంలో కనిష్టపరిమాణంలో మాత్రమే కొవ్వును కలిగి ఉండేట్లు మెయింటైన్ చేయాలి. అప్పుడు నెక్ ఫ్యాట్ ను తగ్గించుకోగలుగుతారు.

మీ శరీరానికి తగినంత తేమను అందించాలి

మీ శరీరానికి తగినంత తేమను అందించాలి

శరీరానికి అవసరం అయ్యేంత నీరు తీసుకోవాలి. మీ శరీరం తేమగా ఉండటం వల్ల జీవక్రియలు వేగవంతంగా పనిచేస్తాయి. చర్మం తేమగా ఉండటం వల్ల చర్మం సాగకుండా ఉంటుంది మరియు శరీరం నుండి టాక్సిన్స్ ను బయటకు నెట్టివేస్తుంది.

మీరు కూర్చొనే భంగిమ సరిగా ఉండాలి

మీరు కూర్చొనే భంగిమ సరిగా ఉండాలి

మీ శరీరం యొక్క భంగిమ సరిగా ఉండాలి. కూర్చొనే భంగిమ వల్ల కూడా వెన్ను యొక్క కండారాలలో మార్పులు తీసుకొస్తుంది. మెడను నిటారుగా పెట్టుకొని కూర్చోవాలి

ఫ్రూట్ జ్యూసులకు బదులుగా ఫ్రూట్స్ ను తీసుకోవాలి

ఫ్రూట్ జ్యూసులకు బదులుగా ఫ్రూట్స్ ను తీసుకోవాలి

పండ్లరసాలకు బదులుగా తాజాగా ఉండే పండ్ల రసాలను తీసుకోవాలి.

కెఫిన్ కు దూరంగా

కెఫిన్ కు దూరంగా

మీకు డిహైడ్రేషన్ కు గురిచేసే కెఫిన్ కలిగిన డ్రింక్స్ కు దూరంగా ఉండాలి.

సాచురేటెడ్ ఫ్యాట్స్ కు దూరంగా

సాచురేటెడ్ ఫ్యాట్స్ కు దూరంగా

నెక్ ఫ్యాట్ తగ్గించుకోవడానికి సాచురేటెడ్ ఫ్యాట్ నుత గ్గించుకోవాలి

నెక్ ఎక్సర్ సైజ్

నెక్ ఎక్సర్ సైజ్

నెక్ ఫ్యాట్ తగ్గించుకోవడం కోసం మెడ వ్యాయామాలు చేయాలి . కనీసం అరగంట పాటు మెడ వ్యాయామం చేయడం మంచిది. అలాగే రన్నింగ్ మరియు వాకింగ్ కూడా ఉత్తమం.

English summary

16 Ways To Get Rid Of Neck Fat

Are there ways to get rid of neck fat? If you have fat around your neck, it goes without saying that it is very tough to get rid of that. When you feel embarrassed about it the moment you see yourself in the mirror, it is better to do something about it so that you can regain your confidence again.
Desktop Bottom Promotion