For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పీరియడ్స్ సమయంలో పొట్టనొప్పి, వెన్ను నొప్పులను నివారించే ఉత్తమ హోం రెమెడీలు!

By Staff
|

మహిళలను వేధించే సమస్య పిరియడ్‌ ప్రాబ్లమ్‌... ప్రతినెల నెలసరి సమయంలో తప్పకుండా వచ్చే కడుపు నొప్పి తట్టుకోలేక విలవిలాడుతారు. ఏవేవో చిట్కాలు పాటిస్తుంటారు. ఆ మూడు రోజులు ఏ పని చేయలేరు. చాలా అవస్థపడతారు.. ఆడపిల్లల్లో 21 ఏళ్లదాకా శారీరక ఎదుగుదల కొనసాగుతూ ఉంటుంది. అలాగే ఎత్తు, బరువు, శరీరఛాయ, శరీరాకృతి అనేవి జన్యుపరంగా నిర్ధారించబడి ఉంటాయి.

కొంత మందికి నెలసరికీ నెలసరికీ మధ్యలోనూ రక్తస్రావం అవుతుంది. నెలసరి సమయంలో గానీ లేదా అంతకు ముందు గానీ తీవ్రమైన కడుపు నొప్పి వస్తుంది. కొంతమందిలో నెలసరి ఈ నొప్పి మరింత తీవ్రదశలో ఉంటుంది.ఋతువు ప్రారంభానికి ఒక రోజు ముందు పొత్తికడుపులో కండరాలు ఎవరో గట్టిగా పట్టుకుని సలుపుతు ఉన్నట్లుగా మొదలై అది ఋతు సమయంలో మరింత ఎక్కువగా ఏర్పడుతుంది. దీనితో పాటే కడుపులో వికారం, సొమ్మసిల్లిపోవడం వంటి లక్షణాలు ఏర్సడుతాయి. ఇవి ఎపుడైతే ఏర్పడుతాయో అపుడే మీరు ఈ నొప్పి చాలాతీవ్రంగావుంది అని గ్రహించాలి. వెంటనే తగు చికిత్స కోసం వైద్యులను సంప్రదించాలి.

మహిళలకు వచ్చే నెలసరి రుతుక్రమంలో ఈస్ట్రోజన్, ప్రొజెస్టిరోన్ స్ధాయిలు తగ్గుతాయి. ఈ సమయంలో వీరికి కడుపులో నొప్పులు, కోపతాపాలు అధికమవుతాయి. ఎంతో చికాకుగా వుంటారు. క్షణ క్షణానికి మూడ్ మారుతూంటుంది. దీనికి కారణం హార్మోన్లలో వచ్చే మార్పులు. హాయిని కలిగించే సెరోటోనిన్ తగ్గిపోవటం. ఎండార్ఫిన్లు మాయమవటం. తీవ్ర మనోవేదన కలిగి వుంటారు. మరి వీరి పరిస్ధితిని అదుపులో వుంచి ఆనందపరచాలంటే...కొన్ని చిట్కాలు చూడండి.

ఈ అంశంపై విదేశాల్లో సైతం పరిశొధనలు జరిగాయి. తాజాగా నిర్వహించిన సర్వేలో నెలసరి నొప్పిని తట్టుకోవడానికి, బాధ నుంచి ఉపశ మనం ఇంట్లో ఉన్న వస్తువులతోనే పొందవచ్చు అన్న విషయం స్పష్టమైంది. నొప్పిని ఎదుర్కోవడానికి మహిళలు ఉపయోగిస్తున్న చిట్కాలు వారికి త్వరగా ఉపశమనం కలిగిస్తున్నాయని పరిశోధకులు వివరిస్తున్నారు. మరి ఆ చిట్కాలు ఏంటో చూద్దాం...

అరటి ఆకు:

అరటి ఆకు:

పీరియడ్స్ సమయంలో ఇది చాలా మంచి ఆహారం. ఎవరైతే ఎక్కువ నొప్పి మరియు బ్యాక్ పెయిన్ మరియు స్టొమక్ పెయిన్ తో బాధపడుతుంటారో అలాంటి వారు అరటి ఆకును కొద్దిగా నూనెలో వేసి ఉడికించి, తర్వాత ఆకును పెరుగులో మిక్స్ చేసి తీసుకోవాలి . మెనుష్ట్రువల్ క్రాంప్ కు ఇది ఒక బెస్ట్ నేచురల్ ట్రీట్మెంట్ .

క్యారెట్ :

క్యారెట్ :

పీరియడ్స్ ను క్రమబద్దం చేస్తుంది . ఒక గ్లాస్ క్యారెట్ జ్యూస్ ను తీసుకోవడం వల్ల ఇది ఎనర్జీని అందివ్వడంతో పాటు, బ్యాక్ పెయిన్ మరియు క్రాంప్స్ ను నివారిస్తుంది.

వైల్డ్ యామ్(రతలు):

వైల్డ్ యామ్(రతలు):

మెనుష్ట్రువల్ పెయిన్ నివారించడానికి ఇది ఒక బెస్ట్ హోం రెమెడీ. ఇది ఒక గ్రేట్ పెయిన్ రిలీవర్ . ఇందులో యాంటీసెప్టిక్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. ఇది బ్యాక్ అండ్ లోయర్ అబ్డోమినల్ పెయిన్ ను నివారిస్తాయి.

 ధనియాలు:

ధనియాలు:

ఈ హోం రెమెడీ వివిధ రకాల నొప్పులను నివారిస్తుంది. అదనపు రక్తస్రావంను నివారిస్తుంది. ఒక చెంచా ధనియాలను గ్లాసునీళ్ళలో వేసి ఉడికించాలి . నీళ్ళు సగానికి వచ్చే వరకూ మరిగించి, తర్వాత క్రిందికి దింపుకొని, గోరువెచ్చగా అయిన తర్వాత తీసుకోవాలి.

 ఫ్లాక్స్ సీడ్స్:

ఫ్లాక్స్ సీడ్స్:

ఇది ప్రోస్ట్ గ్లాండ్స్ ను తగ్గిస్తుంది. దాంతో శరీరంలో క్రాంప్స్ మరియు పెయిన్ నివారించబడుతుంది. రెండు చెంచాల ఫ్లాక్స్ సీడ్స్ ను ప్రతి రోజూ తీసుకోవాలి, ఫ్లాక్స్ సీడ్స్ ను ప్రతి రోజూ తీసుకోవడం వల్ల మెనుష్ట్రువల్ పెయిన్ నివారించబడుతుంది.

అలోవెరా జ్యూస్ :

అలోవెరా జ్యూస్ :

తేనెతో అలోవెరా జ్యూస్ మిక్స్ చేసి తీసుకోవాలి . ఇది రక్తస్రావాన్ని అరికట్టి నొప్పిని నివారిస్తుంది. కలబంద రసాన్ని తీసుకొని అందులో తేనె మిక్స్ చేసి బ్రేక్ ఫాస్ట్ తీసుకోవడానికి ముందు తీసుకోవాలి.

పార్సలే :

పార్సలే :

మెనుస్ట్రువల్ క్రాంప్ నివారించడంలో ఇది ఒక ఎఫెక్టివ్ నేచురల్ హోం రెమెడీ. పీరియడ్స్ లో మహిళలు కడుపు ఉదరంలో నిప్పి నివారించడానికి పార్సలే జ్యూస్ లో క్యారెట్ జ్యూస్ మిక్స్ చేసి తీసుకోవాలి . ఇలా చేయడం వల్ల రక్తప్రసరణ బాగుంటుంది మరియు నార్మల్ గా ఉంటుంది.

పసుపు:

పసుపు:

అపక్రమ పీరియడ్స్ ను క్రమబద్దం చేస్తుంది. హార్మోనులను సమతుల్యం చేస్తుంది . మెనుస్ట్రువల్ ఫ్లో తగ్గిస్తుంది . ముఖ్యంగా ఇందులో ఉండే యాంటీస్పాస్మోడిక్ మరియ యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు మెనుష్ట్రుట్ పెయిన్ నివారిస్తుంది.

బొప్పాయి:

బొప్పాయి:

పీరియడ్స్ కు ముందు బొప్పాయి తినడం మంచిది. బొప్పాయిలో పెపైన్ అనే ఎంజైమ్ ఉండటం వల్ల ఇది రక్త ప్రసరణ రెగ్యులేట్ చేస్తుంది. మెనుస్ట్రువల్ పెయిన్ తగ్గిస్తుంది.

 హాట్ వాటర్ బ్యాగ్:

హాట్ వాటర్ బ్యాగ్:

వేడి నీళ్లు ఒక సంచిలో పోసి దానితో వెన్ను, కడుపు చుట్టూ పెట్టడంవల్ల నొప్పి వల్ల కలిగే అసౌకర్యాన్ని దూరం చేయడంలో సహాయపడుతుంది.

ఆయిల్ మసాజ్:

ఆయిల్ మసాజ్:

మసాజ్‌ వెన్ను మర్దన వల్ల వెన్ను, కడుపు నొప్పి చాలా వరకు తగ్గుతుంది. ల్యావెండర్ ఆియల్ లేదా ఆముదంతో మసాజ్ చేయడం వల్ల క్రాంప్స్ 10నుండి 15నిముషాల్లో తగ్గుతుంది.

హెల్తీ డైట్:

హెల్తీ డైట్:

పీరియడ్స్ సమయంలోనే కాదు, ఎప్పుడు హెల్తీ డైట్ గీసుకోవాలి. తాజా పండ్లు మరియు కూరగాయలు ఆరోగ్యానికి చాలా మంచిది మరియు శరీరాన్ని హైడ్రేట్ చేస్తాయి. పీరియడ్స్ క్రమంగా వస్తాయి.

ఓమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్:

ఓమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్:

కొన్ని పరిశోధనల ప్రకారం విటమిన్ ఇ, ఓమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ మరియు థైమిన్ పుష్కలంగా ఉండే ఆహారాలను తీసుకోవడం మంచిది, సాల్మన్, తున మరియు కోల్డ్ వాటర్ పిష్ వంటివి తీసుకోవాలి.

క్యాల్షియం మరియు జింక్:

క్యాల్షియం మరియు జింక్:

కడుపు ఉబ్బరం, క్రాంప్ మరియు ఇతర లక్షణాలను నివారిస్తుంది. మెగ్నీషియ కండరాలనొప్పులను నివారిస్తుంది , అయితే దీని ప్రభావం ఎక్కువ సమయం ఉంటుంది.

అల్లం:

అల్లం:

అల్లంను ప్రతి రోజూ మీ డైట్ లో చేర్చుకోవడం వల్ల ఇది కండరాలను స్టిఫ్ గా ఉంచడంతో పాటు కీళ్ళ వాపులను తగ్గిస్తుంది. ఇది పచ్చి అల్లంలో ఉండే జింజరోల్స్ వల్ల ఇలా నొప్పినివారిస్తుంది. కాబట్టి మీ రెగ్యులర్ డైట్ లో అల్లంను తప్పనిసరిగా ఉండేవిధంగా చూసుకోవాలి.

 నువ్వులు:

నువ్వులు:

నువ్వులు మెనుస్ట్రువల్ సైకిల్ రెగ్యులేట్ చేస్తుంది. హార్మోనులను బ్యాలెన్స్ చేస్తుంది. ఇందులో ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటుంది, ఇవి హార్మోనుల ఉత్పత్తి చేస్తుంది

.దాల్చిన చెక్క :

.దాల్చిన చెక్క :

మెనుస్ట్రువల్ సైకిల్ ను రెగ్యులేట్ చేస్తుంది మరియు మెనుస్ట్రువల్ క్రాంప్ ను నివారిస్తుంది. క్రాంప్ నివారించడానికి వేడి వేడి టీ , దాల్చిన చెక్కతో తయారుచేసి టీని తీసుకోవాలి. ఇది ఒక వండర్ఫుల్ హేర్బల్ హోం రెమెడీ.

వ్యాయామం:

వ్యాయామం:

కొన్ని యోగా భంగిమలు కమలాసనం, సీతాకోకచిలుక ఆసనం వంటివి పీరియడ్‌వల్ల కలిగేనొప్పిని, అసౌకర్యాన్ని దూరం చేస్తాయి.

English summary

18 Home Remedies For Menstrual Cramps And Pain

Almost every women suffer from menstrual cramps during their menstrual cycles. This pain radiates from lower back, thighs, cramps in lower abdomen, sometimes followed by nausea and vomiting. Luckily there are some best home remedies for menstrual cramps.
Desktop Bottom Promotion