For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

యూరిన్ ఇన్ఫెక్షన్ ను నివారించే ఉత్తమ హోం రెమెడీస్

|

మన శరీరంలో కిడ్నీలు చాలా ముఖ్యమైన అవయవమన్న విషయం మనందరికీ తెలిసినదే . మన శరీరంలో టాక్సిన్స్ ను ఫిల్టర్ చేయడానికి హానికరమైన టాక్సిన్స్ ను శరీరం నుండి యూరిన్ రూపంలో తొలగించడానికి సహాయపడుతుంది.

అదే విధంగా, మనం తీసుకొన్ని ఆహారపదార్థాల ద్వారా మన శరీరంలో పునశ్హోషణము అనే ప్రక్రియ ద్వారా గ్రహించిన పొటాషియం, మినిరల్స్, విటమిన్స్, సోడియం, గ్లూకోజ్ మరియు ఇతర పదార్థాలు మూత్రం నుండి బయటికి పోకుండా చేస్తుంది. ఇవి మన శరీరం నుండి మనకు ఉపయోగకరమైన పదార్థాలు తొలగింపును నిరోధించడానికి సహాయపడుతుంది.

కిడ్నీలు కూడా కార్టిసోల్, అడ్రెనిలిన్ మొదలగు ముఖ్యమైన హార్మోనులను కలిగి ుంటుంది. ముఖ్యంగా ఆ రెండు, కిడ్నీలో పైభాగంలో అడ్రినలిన్ గ్రంథులను కనుగొనడం జరిగింది.

యూరిన్ ఇన్పెక్షన్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కు కారణం అవుతుంది. దాంతో బ్యాక్ పెయిన్, విసర్జన సమయంలో మూత్రంలో మంట, మరియు జ్వరం లక్షణాలు ఉంటాయి. యూరిన్ ఇన్ఫెక్షన్ కు మరో లక్షణం, చాలా త్వరగా యూరిన్ పోవాలనుకోవడం, అలసట, కాళ్లవాపులు, చేతులు, పాదాలు, లేదా మోచేతులు, రక్తంలో యూరిన్ లేదా మూత్రం విసర్జణలో కష్టం, కడుపు ఉబ్బరం, కళ్ళ ఉబ్బు, ఫింగర్ నెయిల్స్ వాపు, చర్మ సమస్యలు, వికారం మరియు వాంతులు, నోరు మెటాలిక్ టేస్ట్ కలిగి ఉండటం జరుగుతుంది.

MOST READ: ఉదయాన్నే పరగడుపున రాగి పాత్రలోని నీళ్ళు తాగితే పొందే అద్భుత ప్రయోజనాలు..!!MOST READ: ఉదయాన్నే పరగడుపున రాగి పాత్రలోని నీళ్ళు తాగితే పొందే అద్భుత ప్రయోజనాలు..!!

యూరిన్ ట్రాక్ ఇన్ఫెక్షన్ కంట్రోల్ కాకపోతే, కిడ్నీ వ్యాధులకు దారితీస్తుంది. కిడ్నీ వ్యాధులకు సకాలంలో చికిత్సను అందివ్వకపోతే కిడ్నీ ఫెయిల్యూర్ లేదా రీనల్ ఫెయిల్యూర్ కు కారణం అవుతుంది. మహిళల్లో యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ చాలా సాధారణ సమస్య. ప్రతి పది మంది మహిళల్లో ఏడు, లేదా ఎనిమిది మంది ఈ సమస్యతో బాధపడుతుంటారు. అందుకు ముఖ్యకారనం క్లోజ్డ్ ప్రాక్జిమిటి యురెత్ర, వైజినా, మరియు ఆనస్ వల్లే ఇన్ఫెక్షన్స్ కు కారణం అవుతుంది.మరి ఇలా యూరినరీ ఇన్ఫెక్షన్స్ కు కొన్ని ఎఫెక్టివ్ హోం రెమెడీస్ ఈ క్రింది విధంగా ఉన్నాయి....

పార్ల్సే జ్యూస్:

పార్ల్సే జ్యూస్:

యూరినరీ ఇన్ఫెక్షన్స్ నివారించడంలో ఇది ఒక ఎఫెక్టివ్ హోం రెమెడీ. ఫార్ల్సే జ్యూస్ శరీరంలోని టాక్సిన్స్ ను బయటకు నెట్టివేయడానికి సహాయపడుతుంది . ఎందుకంటే వీటిలో ఎక్కువ విటమిన్స్, న్యూట్రీషియన్స్, పొటాషియం, సోడియం, కాపర్, థైమిన్, మరియు రిబోఫ్లిన్ ఉంటుంది . పార్లేను నీళ్ళలో వేసి బాగా మరిగించి తర్వాత వడగట్టి చల్లార్చి త్రాగాలి.

అల్లం:

అల్లం:

అల్లం చాలా పాపులర్ హెర్బ్. అనేక వ్యాధులను నయం చేసే గుణాలు ఇందులో పుష్కలంగా ఉన్నాయి . ఇందులో జింజరోల్ అనే యాంటీ బ్యాక్టీరియల్ ఏజెంట్, బ్యాక్టీరియా కిడ్నీలో వ్యాప్తి చెందకుండా నివారిస్తుంది. మరియు ఇది కిడ్నీ ఇన్ఫెక్షన్ ను నివారిస్తుంది . అందుకు అల్లం టీ రెగ్యులర్ గా తీసుకోవాలి.

పెరుగు:

పెరుగు:

పెరుగులో ప్రోబయోటిక్స్ మంచి బ్యాక్టీరియా అధికంగ3ా ఉండటం వల్ల ఇది కిడ్నీ మరియు యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ నివారించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది . పెరుగు ప్రేగుల ఆరోగ్యాన్ని పొట్టసమస్యలను నివారించడంలో చాలా గ్రేట్ గా సహాయపడుతుంది. కిడ్నీ స్టోన్స్ నివారిస్తుంది.

వెల్లుల్లి:

వెల్లుల్లి:

యూరినరీ ఇన్ఫెక్షన్ నివారించడంలో పచ్చివెల్లుల్లి గ్రేట్ గా సహాయపడుతుంది. ఎందుకంటే ఇందులో యాంటీ ఫంగల్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. కాబట్టి, పచ్చిగా తీసుకోవచ్చు. నురుగా తినలేని వారు గార్లిక్ క్యాప్స్యూల్స్ తీసుకోవచ్చు.

MOST READ:కీర్తి ప్రతిష్టలు, సిరిసంపదలు పొందాలంటే వారంలో ఒక్కో రోజు పాటించాల్సిన నియమాలు..!MOST READ:కీర్తి ప్రతిష్టలు, సిరిసంపదలు పొందాలంటే వారంలో ఒక్కో రోజు పాటించాల్సిన నియమాలు..!

ఆపిల్ సైడర్ వెనిగర్:

ఆపిల్ సైడర్ వెనిగర్:

తేనె మరియు ఆపిల్ సైడర్ వెనిగర్ కిడ్నీ రిలేటెడ్ ఇన్ఫెక్షన్స్ కు చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. వీటి రెండింటిని మిక్స్ చేసి ఉపయోగించినప్పుడు మరిన్ని ఎక్కువ ప్రయోజనాలను అందిస్తుంది. ఒక టేబుల్ స్పూన్ తేనెతో ఒక టేబుల్ స్పూన్ ఆపిల్ సైడర్ వెనిగర్ ను మిక్స్ చేసి ప్రతి రోజూ తీసుకోవాలి.

 హెర్బల్ టీ:

హెర్బల్ టీ:

హెర్బల్ టీ ఆరోగ్యానికి అన్ని విధాల మేలు చేస్తుంది. హెర్బల్ టీ డ్రింక్ చేయడం వల్ల కిడ్నీ ఇన్ఫెక్షన్స్ ను చాలా ఎఫెక్టివ్ గా నివారిస్తుంది . చమోమెలీ టీ, మార్షమల్లో టీ, పార్స్లే టీ మరియు గోల్డెన్ రాడ్ టీలలో ఏదోఒకదాన్ని తీసుకోవడం వల్ల కిడ్నీ ఇన్ఫెక్షన్స్ ను నివారించుకోవచ్చు. ఈ టీని రోజులో ఒకటి రెండు సార్లు త్రాగాల్సి ఉంటుంది.

కలబంద:

కలబంద:

అలోవెర చాలా అద్భుతమైన మూలిక. దీన్ని ప్రతి రోజూ కొద్దికొద్దిగా తీసుకొన్నట్లైతే ఇది యూరిన్ ఇన్ఫెక్షన్ ను నివారిస్తుంది ఇది మూత్రపిండాలను చాలా ఎఫెక్టివ్ గా శుభ్రం చేసి శరీరంలోని టాక్సిన్స్ ను తొలగిస్తుంది.

విటమిన్ సి:

విటమిన్ సి:

యూరినరీ ట్రాక్స్ ఇన్ఫెక్షన్స్ ను నివారించడంలో ఇది చాలా అద్భుతంగా సహాయపడుతుంది. ఇది కిడ్నీలలో అసిడిక్ లెవల్స్ ను తొలగిస్తుంది . కాబట్టి ప్రతి రోజూ ఆరెంజ్ ను తీసుకోవడం వల్ల మంచి ఫలితాలను పొందవచ్చు.

 బేకింగ్ సోడ:

బేకింగ్ సోడ:

బేకింగ్ సోడా చాలా ఎఫెక్టివ్ హోం రెమెడీ . ఇది కిడ్నీలో బైకార్బోనేట్ లెవల్స్ ను కిడ్నీలో నింపడానికి చాలా సమర్థవంతంగా పనిచేస్తుంది. నీటిలో ఒక టేబుల్ స్పూన్ బేకింగ్ సోడాను నీళ్ళలో వేసి ప్రతి రోజూ త్రాగడం వల్ల యూరిన్ ఇన్ఫెక్షన్ ను తగ్గిస్తుంది.

MOST READ:బెల్లీ ఫ్యాట్ కరగకపోవడానికి గల 6 ముఖ్య కారణాలుMOST READ:బెల్లీ ఫ్యాట్ కరగకపోవడానికి గల 6 ముఖ్య కారణాలు

క్రాన్ బెర్రీ జ్యూస్:

క్రాన్ బెర్రీ జ్యూస్:

బ్రాన్ బెర్రీ జ్యూస్ త్రాగడం వల్ల యూరినరీ బ్లాడర్ బ్యాక్టీరియాను నివారిస్తుంది . అందువల్ల యూటిఐ ఇన్ఫెక్షన్ కు చాలా ఎఫెక్టివ్ గా నివారించడానికి క్రాన్ బెర్రీ జ్యూస్ ను రెగ్యులర్ గా తీసుకోవాలి.

పసుపు:

పసుపు:

పసుపు నేచురల్ రెమెడీ. ఇది యూరిన్ ఇన్ఫెక్షన్ నివారిస్తుంది. మరియు ఇది చాలా త్వరగా కోలుకొనేలా చేస్తుంది. పసుపులో ఉండే కుర్కుమిన్ వంటి బలమైన యాంటా బ్యాక్టీరియల్, యాంటీఇన్ఫ్లమేటరీ మరియు యాంటీ ఫంగల్ లక్షణాలను కలిగి ుంటుంది . ఇది మైక్రోబ్స్ అభివ్రుద్ది మరియు వ్యాప్తి చెందకుండా నివారిస్తుంది. కాబట్టి పాలలో కొద్దిగా పసుపు మిక్స్ చేసి తీసుకోవాలి.

ఆలివ్ ఆయిల్ :

ఆలివ్ ఆయిల్ :

ఆలివ్ ఆయిల్ చాలా ఎఫెక్టివ్ ప్రొడక్ట్స్ . ఇది కిడ్నీ స్టోన్ మరియు యూరిన్ ఇన్ఫెక్షన్స్ నివారించడంలో చాలా గ్రేట్ గా సమాయపడుతుంది. ఇది ఫ్లేవర్ మరియు బ్లాస్డ్ ఎసిడిటిని కలిగి ఉన్నది. ఎక్స్ ట్రా వర్జిన్ ఆలివ్ ఆయిల్ లూబ్రికేట్స్ ను విస్తరించి లివర్, కిడ్నీ మరియు బ్లాడర్ నుండి టాక్సిన్స్ బయటకు నెట్టివేయడానికి సహాయపడుతుంది.

జూనిపర్ బెర్రీస్:

జూనిపర్ బెర్రీస్:

ప్రతి రోజూ మనం తీసుకొనే నీరు, ఎలాంటి సమస్య లేకుండా బయటకు విసర్జింపుటకు సహాయపడుతుంది. కిడ్నీలను శుభ్రం చేయడంలో జూనిపర్ బెర్రీస్ చాలా గ్రేట్ గా సహాయపడుతాయి.

బర్డక్ రూట్:

బర్డక్ రూట్:

ఇది కిడ్నీ ఇన్ఫెక్షన్స్ నివారిస్తుంది, కిడ్నీల నుండి టాక్సిన్స్ లెవల్స్ ను పెంచి, యూరిన్ ఎక్కువగా పోవడానికి సహాయపడుతుంది.

ఆల్ఫాల్ఫా:

ఆల్ఫాల్ఫా:

ఆల్ఫాల్పా కిడ్నీల యొక్క జీవక్రియలను మెరుగుపరుస్తుంది . ముఖ్యమైన పని బ్యాక్టీరియ మరియు టాక్సిన్స్ ను శరీరం నుండి తొలగించడమే దీని యొక్క ప్రధాణ పని.

రోజ్ హిప్:

రోజ్ హిప్:

రోజామొగ్గలో యాంటీబయోటిక్స్ ఎక్కువగా కలిగి ఉంటాయి . యూరిన్ ఇన్ఫెక్షన్స్ నివారించడంలో చాలా గ్రేట్ గా సహాయపడుతుంది . దీన్ని యాటీ బయోటిక్ గా కొన్ని రోజులు తీసుకొన్నట్లైతే యూరినరీ ఇన్ఫెక్షన్ తగ్గించుకోవచ్చు .

MOST READ:ఆధ్యాత్మిక అఘోర సాధువులు గురించి 10 వింత నిజాలుMOST READ:ఆధ్యాత్మిక అఘోర సాధువులు గురించి 10 వింత నిజాలు

ఎచినాచియా:

ఎచినాచియా:

ఎచినాచియా ప్లాంట్ లేదా హెర్బ్ బ్లాడర్ ఇన్ఫెక్షన్స్ ను నివారించడానికి చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది . బ్లడ్ స్ట్రెమ్ ఇన్ఫెక్షన్స్, ఫ్లూ మరియు చాలా ఇతర బాడీ ఇన్ఫెక్షన్స్ ను నివారించడంలో ఇది గ్రేట్ గా సహాయపడుతుంది . ఇందులో యాంటీబ్యాక్టీరియల్ మరియు యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి .

మార్షమలో

మార్షమలో

మార్షమలో ప్లాంట్ యొక్క వేర్లు, మరియు కాండం దగ్గు , గొంతునొప్పి, చర్మ సమస్యలు తగ్గించడానికి సహాయపడుతుంది . చిన్న చిన్న గాయాలను మాన్పుతుంది . అంతే కాదు కిడ్నీ ఇన్ఫెక్షన్స్ ను చాలా ఎఫెక్టివ్ గా నివారిస్తుంది. ఒక టేబుల్ స్పూన్ ఎండిన మరియు సన్నగా తరిగిన వేర్లు మరియు ఆకులను చల్లటి నీటిలోవేసి 8గంటలపాటు ఉంచి తర్వాత వడగట్టి ప్రతి రోజూ త్రాగడం వల్ల కిడ్నీ ఇన్ఫెక్షన్ మరియు నొప్పి తగ్గిస్తుంది.

నీళ్ళు త్రాగడం :

నీళ్ళు త్రాగడం :

ప్రతి రోజూ శరీరానికి అవసరం అయ్యే నీరును తీసుకోవడం వల్ల శరీరంను హైడ్రేషన్ లో ఉంచుకోవచ్చు. అంతే కాదు నీళ్ళు మూత్రంలో కలిసిపోయి కిడ్నీ స్టోన్స్ ఏర్పడకుండా, నివారిస్తుంది. మరియు కిడ్నీలలో ఉండే టాక్సిన్స్ ను బయటకు ఫ్లష్ చేస్తుంది.

పెయిన్ కిల్లర్స్ ను తగ్గించాలి:

పెయిన్ కిల్లర్స్ ను తగ్గించాలి:

ఒంట్లో ఏ ఒక్క చిన్న సమస్య వచ్చినా పెయిన్ కిల్లర్స్ ను తీసుకుంటుంటారు ఇది కిడ్నీల మీద దుష్ప్రభావంను చూపుతుంది. ఇది నిధానంగా కిడ్నీలను డ్యామేజ్ చేస్తుంది, కాబట్టి, ఆస్పిరిన్, ఐబ్యూఫిన్, నప్రొక్సిన్ మిరయు పారాసెటమోల్ వంటి టీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్ ను ఎక్కువగా ఉపయోగించడం వల్ల కిడ్నీలకు హానికలిగిస్తుంది.

English summary

Top 20 Home Remedies For Urine Infections: Health Tips in Telugu

Top 20 Home Remedies For Urine Infections: Health Tips in Telugu, As we all know kidneys are one of the most important organs of our body. In our body they have been assigned the work of filtering and removing harmful and toxic substances from the blood through urine.
Desktop Bottom Promotion